

Baby Care
23 February 2026 న నవీకరించబడింది
సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించడానికి, తప్పనిసరిగా పాప/బాబు కోసం కారు సీటు ఉండాల్సిన అవసరం ఉంది. కానీ మీరు షాపింగ్ ప్రారంభించే ముందు, మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ రకాల కారు సీట్ల గురించి అర్థం చేసుకోవడం ముఖ్యం. మీ చిన్నారి వయస్సు, అలాగే బరువు ఆధారంగా వివిధ రకాల కారు సీట్ల వర్గీకరణ ఉంటుంది. నవజాత శిశువుల కోసం, వారు కూర్చోవడానికి సౌకర్యంగా ఉండేలా, అదే విధంగా వారి భద్రతను దృష్టిలో ఉంచుకొని శిశువుల కారు సీట్లు రూపొందించబతాయి.
మీ బిడ్డ వయస్సు పెరిగేకొద్దీ మీకు 3 ఇన్ 1 కారు సీటు వంటి సర్దుబాటు చేయగల కారు సీటు అవసరం అవ్వవచ్చు. ఈ రకమైన సీటు, సాధారణంగా మీ బిడ్డకు 4 - 5 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు అవసరం. ఈ 3 ఇన్ 1 కారు సీటు, మీకు అంతర్గత హార్నెస్, బ్యాక్‌లెస్ బూస్టర్, హై బ్యాక్ బూస్టర్‌తో భవిష్యత్తులో ఉపయోగపడే ఫీచర్‌ను అందిస్తుంది.
కారు సీటును ఎంచుకునేటప్పుడు, కారు సీటు ధర, కారు పరిమాణం, కారు సీటు అందించే ఫీచర్‌ల వంటి అంశాలను మీరు పరిగణించాల్సి ఉంటుంది. కారు సీట్లు మూడు రకాలుగా అందుబాటులో ఉన్నాయి, వీటిలో ఫార్వర్డ్ ఫేసింగ్, రియర్ ఫేసింగ్ మరియు బూస్టర్ సీట్లు ఉన్నాయి. ఫార్వర్డ్ ఫేసింగ్, పేరు సూచించినట్లుగా ఇది ఒక చిన్నారి రియర్ ఫేసింగ్ కారు సీటుకు తగిన వయస్సును అధిగమించినప్పుడు మాత్రమే ఉపయోగించబడుతుంది. హార్నెస్ మద్దతును కలిగి ఉండే ఫార్వర్డ్ ఫేసింగ్ సీటును చిన్నారి కోసం ఉపయోగించవచ్చు.
రియర్ ఫేసింగ్ కారు సీటు అనేది సెమీ-రిక్లైన్డ్, రియర్ ఫేసింగ్ స్థానాన్ని కలిగి ఉంటుంది. ఇది 2 నుండి 18 కిలోల మధ్య బరువు ఉండే శిశువులకు ఉపయోగించబడుతుంది. అందువల్ల దీనిని శిశువుల కారు సీటుగా పిలుస్తారు. పెద్దల భుజం సీటు బెల్ట్, పిల్లలకు సరిగ్గా సరిపోయే విధంగా బూస్టర్ సీటు పిల్లలను పైకి ఎత్తుతుంది. అయితే అలాంటి సీటును ఉపయోగించాలంటే, సీటు బెల్ట్ సరిగ్గా సరిపోయేలా, పిల్లలు ఎదిగే వరకు మీరు వేచి ఉండాలి. కారు సీటును కొనుగోలు చేసే ముందు ఎత్తు, బరువు, వయో పరిమితిని తనిఖీ చేయడానికి లేబుల్స్‌ను చదివడం మర్చిపోకండి. అలాగే అది మీ పిల్లలకు సరైన ఎంపిక అవుతుందా లేదా అనేది నిర్ధారించుకోండి. మీరు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినట్లయితే, ఉత్పత్తి వివరణ బాక్స్‌లో సంబంధిత సమాచారాన్ని మీరు కనుగొనవచ్చు. భద్రత, సౌకర్యాన్ని కల్పించడానికి మీ చిన్నారి కోసం వయసుకి తగిన కారు సీటును ఎంచుకోండి.
When is a good time to buy a car seat for your baby in Telugu, Choosing a car seat in Telugu, When is a good time to buy a car seat for your baby in English, When is a good time to buy a car seat for your baby in Hindi, When is a good time to buy a car seat for your baby in Tamil, When is a good time to buy a car seat for your baby in Bengali.
Yes
No

Written by
Dhanlaxmi Rao
Get baby's diet chart, and growth tips











గర్భధారణలో రక్తంలో చక్కెర స్థాయిల గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలేమిటి?

గర్భధారణ సమయంలో హై వెయిస్టెడ్ (నడుము సగం వరకు వచ్చేవి) ప్యాంటీలను ఎక్కువ సమయం ధరించడం సురక్షితమేనా?

బొడ్డు తాడు యొక్క వెలమెంటస్ ఇన్సర్షన్ అంటే ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ప్రెగ్నెన్సీ సమయంలో రక్తస్రావం? దీని అర్థం ఏమిటి? మీరు వైద్యుడిని సంప్రదించాలా?

మీరు రాత్రిపూట మెటర్నిటీ లెగ్గింగ్స్ ధరించవచ్చా? (Can You Wear Maternity Leggings at Night in Telugu?)

మీ చంటిబిడ్డ స్వతంత్రంగా (తనకు తానుగా) నిద్రించేలా ఎలా ప్రోత్సహించాలి ( How to Encourage Your Toddler to Sleep Independently in Telugu?)