

Pregnancy
16 February 2026 న నవీకరించబడింది
ప్రస్తుత లైఫ్ స్టయిల్ చాలా మోడరన్ గా మారింది. ఈ క్రమంలో మొబైల్ ఫోన్ కూడా నిత్యావసర వస్తువుగా మారిపోయింది. వాటర్ బాటిల్ ని అయినా మర్చిపోతున్నారేమో గాని, మొబైల్ ఫోన్ ను తీసుకువెళ్లడం మాత్రం తప్పని సరిగా చేస్తున్నారు. దానికి తోడు ఇటీవల ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రతి పనికి మొబైల్ ఫోన్ పైనే ఆధార పడుతున్నారు.
ఒకప్పుడు కేవలం దూరంగా ఉన్న మరొక వ్యక్తితో మాట్లాడుకోవడం కోసమే మొబైల్ ఫోన్ ను వినియోగించేవారు. కానీ, ప్రస్తుత కాలంలో న్యూస్ పేపర్ చదవడం నుంచి ఇంటికి కావాల్సిన సరుకులు తెచ్చుకోవడం, బిల్స్ కట్టడం అన్నిటికి మొబైల్ ఫోన్ ఆధారం అయిపొయింది. అయితే.. గర్భవతిగా ఉన్న సమయంలో కూడా చాలా మంది అవసరమైన విషయాలను తెలుసుకోవడం కోసం మొబైల్ ఫోన్ ను వినియోగిస్తున్నారు. కానీ గర్భవతిగా ఉన్న సమయంలో మొబైల్ ఫోన్ ను ఎక్కువ సేపు వినియోగించవచ్చా?
మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడడం అనేది ఆరోగ్యానికి హానికరం అని మనం ఎప్పటినుంచో వింటున్నాం. గర్భవతులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారంటే ఎక్కువ సేపు మొబైల్ వాడడం అనేది పుట్టబోయే బిడ్డల ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. ఎక్కువ మొత్తంలో మొబైల్ రేడియేషన్ కు గురి అవడం వలన శిశువులు జీవితకాలం పాటు ప్రవర్తన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.
మొబైల్ మాత్రమే కాదు లాప్ టాప్, టాబ్, లేదా ఏ విధమైన వైర్ లెస్ వైఫై పరికరాలను ఉపయోగించినా వాటి నుంచి విద్యుదయస్కాంత రేడియో తరంగాలు విడుదల అవుతూ ఉంటాయి. ఈ తరంగాలు శరీరంలోని డీఎన్ఏ ను దెబ్బ తీస్తాయి. ఇవి కడుపులో ఉండే పిండం డీఎన్ఏ పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. గర్భవతులు ఆహరం, వ్యాయామం వంటి విషయాలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో.. మొబైల్ విషయంలో కూడా అలానే జాగ్రత్తగా ఉండాలి.
అధిక సమయం మొబైల్ వాడడం వలన ఉత్పన్నమయ్యే రేడియో ధార్మికత తల్లి బిడ్డల జ్ఞాపక శక్తిపై ప్రభావం చూపిస్తుంది. అంతేకాకుండా డెలివరీకి ముందు, డెలివరీ అయిన తరువాత పిల్లలలో రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. కాలక్రమంలో ఈ సమస్య పెరగడమే కాకుండా పిల్లల భాష, ప్రవర్తనపై కూడా ఈ ప్రభావం ఉంటుంది. అందువల్ల ఈ కింది జాగ్రత్తలు తీసుకోండి.
గర్భిణీ స్త్రీలు సహజంగానే ఆహార విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. పుట్టబోయే తమ సంతానంపై ఎటువంటి ఒత్తిడి లేదా ఇబ్బంది కలగకుండా ఉండాలని భావిస్తారు. అయితే.. చాలా మంది మొబైల్ ఫోన్ వాడకం విషయంలో మాత్రం అశ్రద్ధ వహిస్తారు. అందుకే గర్భిణీ స్త్రీలు మొబైల్ ఫోన్ వాడకం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Yes
No

Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips







గర్భవతిగా ఉన్నప్పుడు కొబ్బరి తినొచ్చా?: ప్రయోజనాలు, అపోహలు | Coconut in Pregnancy: Benefits & Myths in Telugu

4-7 నెలల చిన్నారిలో దంతాలు వస్తున్నప్పుడు ఊహించవలసిన పరిణామాలు (Teething What To Expect In Your 4 To 7 Month Old in Telugu)

1 వ వారంలో ప్రెగ్నెన్సీ లక్షణాలు (1st Week of Pregnancy Symptoms in Telugu)

9 వారాల గర్భధారణలో అల్ట్రాసౌండ్: ఏమి ఊహించాలి మరియు చెడు శకునాలు ఏంటి? (9 Week Ultrasound: What to Expect & What are the Red Signals in Telugu?)

చనుమొన డిశ్చార్జ్కి సంభావ్య కారణాలు: కాన్సర్ కలిగించేవి - కాన్సర్ కానివి (Reasons for Nipple Discharge - Cancer & Non Cancer in Telugu)

గర్భధారణ సమయంలో కేక్ తరచుగా తినడం సురక్షితమేనా?