


Nail Care
19 February 2026 న నవీకరించబడింది
ఆసక్తికరంగా, వైబ్రంట్‌గా ఉండే డిజైన్స్ కోసం మనం ఆతృతగా ఎదురుచూస్తున్నాం. ఈ వసంతకాలంలో మీ మేకప్ లుక్ మార్చేందుకు కావాల్సిన బ్యూటీ సప్లైస్‌ని వెతకాల్సిన సమయం ఇది. మీ గోళ్ల శుభ్రతను కాపాడుకుంటూ, ఫ్యాషనబుల్‌గా కనిపించేందుకు ఇటీవల ట్రెండింగ్‌లో ఉన్న నెయిల్ డిజైన్స్ గురించి తెలుసుకొని మిమ్మల్ని మీరు అప్‌డేటెడ్‌గా ఉంచుకోండి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: పర్ఫెక్ట్ నైట్-టైమ్ మేకప్ కోసం సులువైన 8 బ్యూటీ టిప్స్
టాప్ 10 నెయిల్ ఆర్ట్ డిజైన్స్ గురించి తెలుసుకోండి.
మీకు నెయిల్ పెయింట్ బ్రష్‌తో ప్రావీణ్యం లేకపోతే, నెయిల్ ఆర్ట్ క్రేజ్‌ను ఫాలో అవడానికి ఈ కాంటెంపరరీ కలర్ స్కీమ్ ఉపయోగపడుతుంది. గోర్లను వివిధ రంగులతో పెయింట్ చేసి అందంగా కనిపించేలా చేయొచ్చు. కలర్ చార్ట్‌లో ఒకవైపు ఉన్న రంగుల్ని ఎంచుకుంటే కలర్ క్లాష్ కాకుండా జాగ్రత్తపడొచ్చు.
టై-డై నెయిల్ ఆర్ట్ డిజైన్ ప్రతీ రంగుతో బాగుంటుంది. అందంగా ఉంటుంది కూడా. మీకు మీరే ఈ డిజైన్ వేసుకోవడం సులువు. ముందుగా వైట్ బేస్ కలర్ వేయాలి. ఆ తర్వాత బేస్ కలర్ తడిగా ఉన్నప్పుడే వేగంగా మీకు కావాల్సిన కలర్స్ డాట్ చేయాలి. ఆ తర్వాత రంగులను కలపడానికి ప్లాస్టిక్ కంటెయినర్‌తో ప్రెస్ చేయాలి. టూత్ పిక్‌తో పాలిష్‌పై డ్రాగ్ చేయడం ద్వారా మరిన్ని డిజైన్స్ చేయొచ్చు. అయితే పాలిష్ ఎండిపోకుండా మీరు చాలా వేగంగా చేయాల్సి ఉంటుంది. లేకపోతే డిజైన్ పాడవుతుంది. పాలిష్ ఎండిపోయిన తర్వాత ట్రాన్స్‌పరెంట్ టాప్‌కోట్ వేస్తే టై-డై ఎఫెక్ట్ అందంగా ఎక్కువ రోజులు ఉంటుంది.
రెయిన్‌బో నెయిల్స్‌ని ఓంబ్రే నెయిల్ ఆర్ట్ డిజైన్‌తో విభిన్నంగా మార్చేయొచ్చు. సరైన టూల్స్ ఉంటే ఈ డిజైన్స్ చేయడం చాలా సులభం. మీరు కోరుకున్న నెయిల్ పెయింట్ కలర్స్, ఫింగర్‌నెయిల్ టేప్, చవకగా లభించే మేకప్ స్పాంజ్‌లు ఉంటే చాలు. మీ చర్మంపై పెయింట్స్ వేసుకోకుండా ఉండేందుకు అన్ని వేళ్లకు టేప్ చుట్టాలి. ఆ తర్వాత కలర్‌ను స్పాంజ్‌పైన అప్లై చేయాలి. ఆ తర్వాత వాటితో మీ గోళ్లపై పెయింట్ వేయాలి. వార్నిష్ వేసి, అంచుల్ని చక్కదిద్ది పెయింటింగ్ పూర్తి చేయాలి. నేక్డ్ ఫౌండేషన్‌పై కేవలం ఒకే కలర్ ఉపయోగించి సింపుల్‌గా పెయింట్ చేయండి చాలు. ప్రత్యామ్నాయంగా మీరు బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్ చేసేందుకు రకరకాల కలర్స్‌ని బ్లెండ్ చేయొచ్చు.
ఈ ఫ్రెంచ్ మానిక్యూర్ ఒరిజినల్ లాగానే ఉంటుంది. ట్రెడిషనల్ ప్యారలల్ లైన్స్‌తో నెయిల్ టిప్స్‌ని ఆకట్టుకునేలా చేస్తుంది. ప్రతీ గోరుకు వేర్వేరు రంగులతో, ఒకే కలర్ పెద్ద బ్లాక్‌లాగా డిజైన్ వేసి, మ్యాటీ ఫినిష్ ఇస్తే డిజైన్ కాంటెంపరరీగా ఉంటుంది.
లైన్ ఆర్ట్‌లో ఆబ్జెక్ట్స్ ఔట్‌లైన్స్ గురించి అర్థం చేసుకోవడానికి చాలా టాలెంట్ అవసరం. నెయిల్ డిజైన్‌కు లైన్ ఆర్ట్ చేయడం ద్వారా కళ్లు చెదిరే డిజైన్ చేయొచ్చు. ఈ ఎఫెక్ట్ రావాలంటే, ఫైన్ పెయింట్ బ్రష్‌తో మృదువుగా పెయింట్ చేయాలి. ఆ తర్వాత నలుపు రంగుకు వ్యతిరేకంగా ఉండే కలర్‌ను జోడించండి.
పువ్వులు, చెట్ల కంటే ఈ ప్రకృతిలో మరేవీ అద్భుతంగా ఉండవు. న్యూట్రల్‌గా ఉండే బేస్ కలర్, పువ్వులు, ఆకుల్ని ఉపయోగించి ప్రకృతిని స్ఫూర్తిగా తీసుకుని వేసే సింపుల్ నెయిల్ ఆర్ట్ డిజైన్స్ అద్భుతంగా ఉంటాయి. ఏ కలర్ స్కీమ్ ఎంచుకున్నా అందుకు తగ్గ పువ్వు అందుబాటులో ఉండాలి. ఒక పుష్పగుచ్ఛం ఎలా సమతుల్యంగా అద్భుతంగా ఉంటుందో, అలా మెత్తటి పచ్చని ఆకులు చక్కని రూపాన్ని అందిస్తాయి. ఇవన్నీ తెలిసినా సరిగ్గా పెయింట్ చేయగల నైపుణ్యం మీకు ఉండాలి. లేదా ఓ టెంప్లేట్ ఉపయోగించాలి. లేదా నెయిల్ డెకల్స్ లాంటివి ఉపయోగించాలి.
ఈ కలర్ కాంబినేషన్ కాలానికి అతీతమైనా, కాంటెంపరరీ నెయిల్ ఆర్ట్‌లో ఉపయోగించడం లాజికల్‌గా ఉంటుంది. ఈ స్టైల్ చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా లేఅవుట్స్‌లో పనిచేస్తుంది. తెల్లని చేతికి ఉన్న ప్రతీ గోరుకు సన్నని బ్లాక్ లైన్స్ డ్రా చేయాలి. ఆ తర్వాత జిగ్‌జాగ్స్ లేదా బ్లాక్ అండ్ వైట్‌ని ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తూ నెయిల్ ఆర్ట్ వేయండి. కొన్ని గోళ్లకు సాలిడ్ కలర్‌ని వేసి మరింత ఆకట్టుకోవచ్చు. మీ ఫ్యాన్సీ గోళ్లపై స్ట్రైప్స్ లాంటి డిజైన్ ఉంటే పైన చెప్పినట్టు చేయొచ్చు.
సూటిగా, సుత్తిలేకుండా ఉంటుంది డాట్ నెయిల్ ఆర్ట్. ఈ డిజైన్ సులభంగా ఉండటం ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి. మీరు అన్ని వేళ్లకు ఒకే బేస్ కలర్‌తో ఒకే షేడ్ ఎంచుకోవచ్చు. లేదా ఒక్కో వేలుకి రంగులు వేస్తూ కలైడస్కోప్‌లా మార్చొచ్చు. ఆ తర్వాత, ప్రతీ వేలికి విరుద్ధంగా ఉండే రంగుతో పెద్ద డాట్ పెట్టొచ్చు. రోజువారీ దుస్తులకు ఇది చాలా సూటబుల్‌గా ఉంటుంది. ఇంట్లోనే సులభంగా భిన్నమైన స్టైల్ క్రియేట్ చేయొచ్చు.
ట్రెడిషనల్ ఫ్రెంచ్ మానిక్యూర్‌కు వైట్, బేర్ నెయిల్ డిజైన్‌తో కొత్త వేరియేషన్ ఇవ్వొచ్చు. వృత్తాకారం, దీర్ఘవృత్తాకారం, గింజల ఆకారాలతో ఈ ప్యాటర్న్ ట్రై చేయొచ్చు. ప్రతీ గోరుపై న్యూడ్, వైట్ కలర్స్ వేస్తూ, హైలైట్ రంగును మారుస్తూ మరింత ఆకర్షణీయంగా చేయొచ్చు. నెయిల్ ఆర్ట్ కిట్స్‌లో వచ్చే స్టెన్సిల్ ఉపయోగించి సర్కిల్స్‌ని తీర్చిదిద్దొచ్చు. అస్థిరంగా ఉండే లైన్ వర్క్‌తో ఇంప్రెషన్ మార్చొచ్చు.
ఫ్లోరల్ నెయిల్ డిజైన్ వీకెండ్ ఔటింగ్ కోసం అద్భుతంగా ఉంటుంది. ప్రత్యేకంగా తీర్చిదిద్దడానికి ఏదైనా ఒక పువ్వు, కలర్ ఎంచుకోవాలి. మీరు నైపుణ్యం గల మానిక్యురిస్ట్ అయితే, ఆ టాలెంట్ ఉంటే ఎలాంటి ఫ్లవర్ టైప్ అయినా పెయింట్ చేయొచ్చు. ఈ ప్యాటర్న్ డ్రా చేయడం రాకపోతే డెకాల్స్, టెంప్లేట్స్ లాంటివి ఉపయోగించవచ్చు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గోళ్ల సంరక్షణకు 5 ఉత్తమ చిట్కాలు
గోళ్లకు పెయింట్స్ వేసుకోవడం అనేది సంతోషకరమైన సందర్భం. ఫ్యాషన్‌గా ఉండేందుకు ఉపయోగపడటంతో పాటు అమ్మాయిల మూడ్ మెరుగుపరుస్తుంది. ఈ అందమైన డిజైన్స్ గురించి చదివిన తర్వాత, ఈరోజే ఇందులో ఓ డిజైన్ ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాం!
Yes
No

Written by
Dhanlaxmi Rao
Get baby's diet chart, and growth tips











ప్రసవానంతర స్టెరిలైజేషన్: విధానం & సమస్యలు

మీరు గర్భవతి కావడానికి ఫర్టిలిటీ సప్లిమెంట్లను తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి (Before You Take Fertility Supplements to Get Pregnant in Telugu)?

శిశువు అభివృద్ధి లో మైలురాళ్ళు: 3 నెలలు (Baby Developmental Milestone - 3 Months)

గర్భధారణ ప్రారంభ దశలో తక్కువ హెచ్‌సిజి స్థాయిలకు కారణం ఏమిటి మరియు ఆహారం ద్వారా గర్భధారణ సమయంలో హెచ్‌సిజి స్థాయిలను ఎలా పెంచాలి

బరువు తగ్గించే టీ నిజంగా బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుందా? (Does Weight Loss Tea Helps You in Losing Weight in Telugu?)

గర్భవతులు మొబైల్ ఫోన్ వాడచ్చా? ఇది పుట్టబోయే బిడ్డపై ఎంత వరకు ప్రభావం చూపుతుంది?