


Baby Sleep Management
20 February 2026 న నవీకరించబడింది
మీ చంటిబిడ్డ స్వతంత్రంగా (తనకు తానుగా) నిద్రించేలా ఎలా ప్రోత్సహించాలి చంటిబిడ్డను నిద్రపుచ్చడానికి చాలా శ్రమించాల్సి ఉుంటుంది. ఒక వేళ మీ చంటి బిడ్డ ఒంటరిగా నిద్రించడాన్ని తిరస్కరిస్తున్నా, ఒంటరిగా నిద్రించే అలవాటును చేసుకోలేకపోతున్నా, రాత్రి పూట ఎదురయ్యే గోలను, కేకలను డీల్ చేయడానికి సిద్ధమై ఉండండి. అదృష్టవశాత్తూ మీ బిడ్డ ఈ అలవాటును మాన్పించి, స్వతంత్రంగా నిద్రించేందుకు ప్రోత్సహించవచ్చు. దాన్ని ఎలా సాధించవచ్చో కొన్ని మార్గాలను ఇప్పుడు చూద్దాం.
టెలివిజన్లు, మొబైల్ ఫోన్లు, ఐపాడ్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను మీ చిన్నారి గది నుంచి తొలగించి ప్రశాంతంగా నిద్ర వచ్చే వాతావరణాన్ని ఏర్పాటు చేయండి. టీవీ స్క్రీన్, కంప్యూటర్ వెలుతురు నిద్ర వచ్చే పరిస్థితిని ఆటంకపరుస్తాయి. తక్కువ లైటింగ్ తో ప్రశాంతమైన వాతావరణం గదిలో ఉండేలా చూడండి.
వేడి నీళ్లతో స్నానం, పైజామాలు ధరించడం, పళ్లు తోముకోవడం, పుస్తకాలు చదవడం ఇవన్నీ మంచి బెడ్ టైమ్ రొటీన్ కు ఉదాహరణలు. ఈ కార్యక్రమాలను సరిగ్గా షెడ్యూల్ చేసుకోవడం ద్వారా మీ బిడ్డ ప్రశాంతంగా నిద్రకు చేరుకుంటాడు. రాత్రి పూట ఆందోళనను తగ్గించడంంలో మీ బిడ్డకు ఇవి సైకొలాజికల్ గా ఉపయోగపడతాయి.
మీరు లేరనే ఆలోచన లేదా బెడ్ కింద దెయ్యం ఉందనే ఆలోచన మీ బిడ్డకు రాత్రిపూట నిద్ర సరిగా రానివ్వకుండా చేస్తుంది. ఏదైనా వస్తువు, బొమ్మ లేదా దుప్పటి వల్ల అలాంటి భయాలు కలగకుండా చూడండి. ప్రశాంతమైన వాతావరణాన్ని అక్కడ ఏర్పాటు చేయండి.
క్రమం తప్పకుండా సరైన నిద్రవేళ షెడ్యూల్ ను పాటించండి. ఒక వేళ మీ బిడ్డ అర్ధరాత్రి మీ దగ్గరకు వస్తే, వారి బెడ్ వరకు తోడుగా వెళ్లి నిద్రపోయేలా చూడండి. ప్రతిసారి ఇదే చేయండి. వారు మీ దగ్గరకు వస్తే భయపడవద్దని చెప్పి ఆందళన తగ్గించండి.
రాత్రిపూట ఏం ధరించాలి, అతను/ఆమెకు ఉదయాన్నే ఇష్టమైన సీరియల్ ఏమిటి అనే విషయాలను బిడ్డే ఎంచుకునేలా చూడండి. రాత్రిపూట ప్రవర్తను వారు దానికి అన్వయించి రివార్డు పొందేలా చేయవచ్చు. జీవితాంతం స్వతంత్రంగా బతికేందుకు నేర్పించే తొలి అడుగుల్లో చంటిబిడ్డను ఒంటరిగా నిద్రించేలా సాయం చేయడం కూడా ఒకటి. ఆ సమయంలో వారికి మద్దతును ఇచ్చి ప్రోత్సహించేలా చేయాలి.
Sleeping independantly in telugu, Toddler sleeping in telugu, Encourage your toddler to sleep independently in telugu, How toddlers sleep independently in telugu, How to Encourage Your Toddler to Sleep Independently in English, How to Encourage Your Toddler to Sleep Independently in Hindi, How to Encourage Your Toddler to Sleep Independently in Tamil, How to Encourage Your Toddler to Sleep Independently in Bengali.
Yes
No

Written by
Swetha Rao
Get baby's diet chart, and growth tips











మీరు ఎగ్ డోనర్ ప్రక్రియను గురించి ఎప్పుడు పరిగణలోనికి తీసుకోవాలి? (When Should You Consider an Egg Donor in Telugu?)

టాప్ 10 అత్యంత ప్రజాదరణ పొందిన నెయిల్ ఆర్ట్

ప్రసవానంతర స్టెరిలైజేషన్: విధానం & సమస్యలు

మీరు గర్భవతి కావడానికి ఫర్టిలిటీ సప్లిమెంట్లను తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి (Before You Take Fertility Supplements to Get Pregnant in Telugu)?

శిశువు అభివృద్ధి లో మైలురాళ్ళు: 3 నెలలు (Baby Developmental Milestone - 3 Months)

గర్భధారణ ప్రారంభ దశలో తక్కువ హెచ్‌సిజి స్థాయిలకు కారణం ఏమిటి మరియు ఆహారం ద్వారా గర్భధారణ సమయంలో హెచ్‌సిజి స్థాయిలను ఎలా పెంచాలి