


Teething
14 February 2026 న నవీకరించబడింది
ప్రతి తల్లిదండ్రికి పీడకలగా మారే పరిణామాల్లో ఒకటి చిన్నారులకు దంతాలు రావడం (టీతింగ్). ప్రతి చిన్నారికి వివిధ రకాల పద్ధతుల్లో జరిగే ఈ ప్రక్రియ తల్లిదండ్రుల్లో విచారాన్ని నింపుతుంది. అంతేగాక ఈ సమయంలో చిగుళ్ల నుంచి పళ్లు బయటకు వచ్చే క్రమంలో చిన్నారులు తీవ్రమైన నొప్పిని ఎదుర్కొని ఏడుస్తూ ఉంటారు. అంతేగాక ఈ నొప్పి వల్ల మీ చిన్నారికి కొద్దిపాటి జ్వరం కూడా రావచ్చు, అయితే ఇదంతా సహజమే.
చిన్నారి అలసట లేకుండా, అధిక సమయం ఏడుస్తూ, చివరకు కొంచెం జ్వరం కూడా రావచ్చు. చిన్నారులకు సాధారంగా 4 నుంచి 7 వారాలు వచ్చాక ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కొన్ని కేసుల్లో, చిన్నారులకు ఏడు నెలలు వచ్చాక కూడా ఈ ప్రక్రియ ప్రారంభం కావచ్చు. ఒక వేళ మీ చిన్నారికి ఈ ప్రక్రియ ఆలస్యమైతే, అప్పటికీ మీరు విచారపడాల్సిన అవసరం లేదు. అది సహజ ప్రక్రియ, సమయం తీసుకుంటుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: శిశువు మొదటి దంతాలు: తల్లిదండ్రులు తెలుసుకోవలసిన 5 వాస్తవాలు
ఈ సమయంలో కింది వాటిని మీరు నోటీస్ చేస్తారు.
దంతాలు రావడం ప్రారంభమైనప్పుడు, రెండు ముందు దంతాలు పై దవడ నుంచి గానీ, కింది దవడ నుంచిగానీ మొదటిసారి కనిపిస్తాయి. ఆ తర్వాత నములు దంతాలు కనిపిస్తాయి. ఆ తర్వాత కోర దంతాలు బయటకు వస్తాయి. ఈ సమయంలో పళ్లు బయటకు వచ్చే చోట చిగుర్లలో కొంత వాపు కనిపించవచ్చు.
దంతాలు వచ్చే ఈ సమయంలో బొటన వేలును నోట్లో పెట్టుకొని చీకడం వల్ల కొంత స్వాంతన లభిస్తుంది. అయితే భవిష్యత్తులో అది అలవాటుగా మారకుండా ఉండేందుకు వీలైనంత త్వరగా దాన్ని మాన్పించాలి.
ఈ సమయంలో చిన్నారులు నములుతూ ఉండేందుకు ఏదో ఒకటి అవసరం. అందుకే మార్కెట్లోకి నమిలే బొమ్మలు (చ్యూ టాయ్స్) అందుబాటులోకి వచ్చాయి. అయితే అవి మెత్తని పదార్థాలతో తయారయ్యేలా చూసుకోవడం ద్వారా ప్రమాదం నుంచి అరికట్టవచ్చు. చల్లగా మారేందుకు టీతర్స్ ను సాధారణంగా ఫ్రిడ్జ్ లో ఉంచుతారు. వాటి ద్వారా పిల్లలు స్వాంతన పొందుతారు. అయితే కొన్నిసార్లు అవి మరింత గట్టిగా మారి చిన్నారుల చిగుళ్లను గాయపరచవచ్చు.
చిగుళ్లను మృదువుగా చేసే మందులను మీరు వాడకూడదు. అది ప్రమాదం. చిన్నారులు దాన్ని మిగవచ్చు. వారి ఆరోగ్యానికి అది సరిపడదు. అంతేగాక చిగుళ్ల నొప్పికోసం మార్కెట్లో దొరికే టాబ్లెట్లను వాడవద్దు. వాటిలో ఎఫ్డీఏ అనుమతించని ప్లాంట్ పాయిజన్ ఉండవచ్చు.
టీతింగ్ వల్ల ఎక్కువ జ్వరం రావచ్చు లేదా రాకపోవచ్చు. ఒకవేళ జ్వరం ఉంటే డాక్టరును సంప్రదించాలి.
కొత్త దంతాల పట్ల మీరు సరైన జాగ్రత్తలు తీసుకోవడం ఉపయోగకరమైంది. మృదువైన బ్రెజిల్ తో కూడిన చిన్నారుల బ్రష్ లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటితో భోజనం చేసిన ప్రతిసారి చిన్నారుల పళ్లను శుభ్రం చేయండి.
నిద్రించే సమయంలో పాల సీసా పీక చిన్నారి నోట్లో లేకుండా చూడండి. తద్వారా పాలు పళ్ల చుట్టూ పడి పళ్లు పాడవకుండా కాపాడవచ్చు. చల్లని పదార్థాలైన పెరుగు, చల్లబర్చిన పండ్లు, యాపిల్ సాస్ వంటివి చిన్నారి మీల్స్ లో భాగంగా ఉంచండి.
మీ చిన్నారి పెరుగుతున్న సమయంలో మీరు వారి సంరక్షణ తీసుకోవాల్సిందే. ఒక చిన్న పొరపాటు కూడా శాశ్వతమైన సమస్యను తెచ్చిపెట్టవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చిన్నారి దంతాలు పెరుగుతున్న సమయంలో కొన్ని విషయాలను మీరు ఎల్లప్పుడూ మదిలో ఉంచుకోవాలి.
మీ చిన్నారి నాలుగు నుంచి ఏడు నెలల వయసుతో ఉండి, దంతాలు వస్తున్నాయా ? దాని గురించి మీరు తెలుసుకోవాల్సిందంతా ఇక్కడ ఉంది.
నాలుగు నుంచి ఏడు నెలల చిన్నారుల్లో దంతాలు పెరగడం గురించి మీరు తెలుసుకోవాల్సింది
Teething in kids in telugu, effects of teething in telugu Teething What To Expect In Your 4 To 7 Month Old in English, Teething What To Expect In Your 4 To 7 Month Old in Hindi, Teething What To Expect In Your 4 To 7 Month Old in Tamil, Teething What To Expect In Your 4 To 7 Month Old in Bengali.
Yes
No

Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips











1 వ వారంలో ప్రెగ్నెన్సీ లక్షణాలు (1st Week of Pregnancy Symptoms in Telugu)

9 వారాల గర్భధారణలో అల్ట్రాసౌండ్: ఏమి ఊహించాలి మరియు చెడు శకునాలు ఏంటి? (9 Week Ultrasound: What to Expect & What are the Red Signals in Telugu?)

చనుమొన డిశ్చార్జ్కి సంభావ్య కారణాలు: కాన్సర్ కలిగించేవి - కాన్సర్ కానివి (Reasons for Nipple Discharge - Cancer & Non Cancer in Telugu)

గర్భధారణ సమయంలో కేక్ తరచుగా తినడం సురక్షితమేనా?

ప్రెగ్నెన్సీలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్: లక్షణాలు మరియు జాగ్రత్తలు

పసి పిల్లల బట్టలు గాలిలో ఆరబెట్టడం ఎంత వరకు సురక్షితం? (How Safe Is It to Air Dry Baby Clothes in Telugu?)