This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

మీరు ఎగ్ డోనర్ ప్రక్రియ​ను గురించి ఎప్పుడు పరిగణలోనికి తీసుకోవాలి? (When Should You Consider an Egg Donor in Telugu?)

In Vitro Fertilization (IVF)
Written by - Sarada Ayyalaచివరిగా నవీకరించబడింది: Feb 19, 2026
మీరు ఎగ్ డోనర్ ప్రక్రియ​ను గురించి ఎప్పుడు పరిగణలోనికి తీసుకోవాలి? (When Should You Consider an Egg Donor in Telugu?)
Read time6 min

తమ అండాలతో గర్భం దాల్చకుండా పిల్లలను కోరుకునే మహిళలకు ఎగ్ డొనేషన్ ప్రక్రియ అనేది ఒక వరం. చాలా మందిలో పుట్టినప్పటి నుంచి అండాశయాల సమస్య ఉంటుంది. మోనోపాజ్ (పీరియడ్ ఆగిపోయే ప్రక్రియ), హర్మోన్ల చికిత్సకు అండాశయ ప్రతిస్పందన సరిగా లేకపోవడం లేదా మునుపటి IVF చికిత్సలలో తక్కువ ఎగ్ లేదా ఎంబ్రియో క్వాలిటీ కానీ కారణం కావొచ్చు. తల్లి వయసు కారణంగా గుడ్డు నాణ్యత తక్కువగా ఉండడం అందువల్ల ఎగ్ డొనేట్ చేయడం సాధారణం. 37 సంవత్సరాల తర్వాత స్త్రీ ఎగ్స్ క్వాలిటీ గణనీయంగా తగ్గుతుంది.

ఎగ్ డొనేషన్ అంటే ఏమిటి? (What Is Egg Donation in Telugu)

గర్భం దాల్చేందుకు ఒక స్త్రీ (డోనర్) తన అండాలను మరొక స్త్రీకి (రిసీవర్​) అందజేసినపుడు సాధారణంగా ఎగ్ డొనేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఎగ్ డొనేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు సింగిల్ సైకిల్​లో ఎక్కువ అండాలను ఉత్పత్తి చేసేందుకు డోనర్​కు మందులు ఇస్తారు. ఈ అండాలను బయటకు తీసేందుకు సూది ద్వారా అల్ట్రాసౌండ్ ప్రోబ్ అనేది యోని కణజాలంలోకి చొప్పించబడుతుంది. ఆ తర్వాత గుడ్లు అండాశయాల నుంచి మనకు కనిపిస్తాయి. అండాలను వెలికి తీసిన తర్వాత వాటిని ఎంబ్రియాలజిస్ట్ (నిపుణుడు) పరీక్షిస్తాడు. ఆ తర్వాత స్పెర్మ్ అనేది మగ భాగస్వామి స్పెర్మ్ బ్యాంక్ నుంచి అండాలలోకి చొప్పించబడుతుంది. ఈ పద్ధతిని ఇన్​ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) అని పిలుస్తారు.

డోనర్ IVF సైకిల్ ఎలా పని చేస్తుంది? (How Does a Donor IVF Cycle Work in Telugu?)

సాధారణ ఇన్ విట్రోఫెర్టిలైజేషన్ (IVF) అండాశయ స్టిములేషన్ (ఉద్దీపన)ను కలిగి ఉంటుంది. ఫలదీకరణం కోసం ఆరోగ్యకరమైన అండాలను ఉత్పత్తి చేసేందుకు ఉద్దేశించబడింది. డోనర్ IVF సైకిల్స్ సక్సెస్ కాకముందు స్త్రీ వేరే స్త్రీ నుంచి అండాలను పొందాల్సి ఉంటుంది. ఆ స్త్రీ తెలిసిన వ్యక్తయినా కావొచ్చు. లేదా IVF క్లీనిక్​లో కలిసిన అనామక వ్యక్తి అయినా కావొచ్చు. డోనర్ ఎగ్ ద్వారా IVF చేయించుకునేందుకు గతంలో ఒకటి కంటే ఎక్కువ సార్లు IVF ప్రక్రియ ఫెయిల్​ అయి ఉండాలి.

డోనర్​ ఎగ్స్​తో IVF ఎవరు చేయించుకుంటారు? (Who Gets an IVF Cycle With Donor Eggs in Telugu?)

ఏదేమైనప్పటికీ పరిశోధనలు చెప్పే విషయం ఏమిటంటే.. డోనర్ ఎగ్స్​ను క్షుణ్ణంగా తనిఖీ చేయడం వలన డోనర్ ఎగ్ IVF ఖర్చు లేదా ఇన్​ఫర్టిలిటీ చికిత్స ఖర్చును తగ్గించవచ్చు. అందుకోసమే కొంత మంది మహిళలు IVFను ప్రిఫర్ చేస్తారు. ఒక స్త్రీ డోనర్ ఎగ్స్​ను ఎంచుకునేందుకు గల కారణాలు…

  • అండాశయ వైఫల్యం
  • వయసు (37 మరియు అంతకంటే ఎక్కువ)
  • తెలియని సంతాన సమస్యలు
  • క్షీణిస్తున్న అండాశయ నిల్వ
  • పిండవ్యాధి యొక్క అధిక ప్రమాదం
  • AMH యొక్క తక్కువ లెవెల్స్ (యాంటీ-ముల్లెరిన్ హార్మోన్).
  • ఒకటి కంటే ఎక్కువ IVF చికిత్సలు విఫలం అయితే
  • గర్భస్రావాలు

ఎగ్ డొనేషన్ ప్రక్రియ (The Process of Egg Donation in Telugu)

ఒకటి కంటే ఎక్కువ అండాలను ఉత్పత్తి చేసేందుకు ఎగ్ డోనర్​కు హార్మోన్స్ ఇవ్వబడతాయి. సాధారణంగా మహిళలు నెలకు ఒక అండాన్ని ఉత్పత్తి చేస్తారు. కానీ ఒకటి కంటే ఎక్కువ హార్మోన్లను డెవలప్​ చేసేందుకు ఇంజెక్షన్లు ఇవ్వబడతాయి. ఆమె గుడ్లు అనేవి పరిపక్వ దశకు చేరుకొని.. రిట్రైవ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నపుడు ఆమె ఫర్టిలిటీ డాక్టర్ స్టెప్-బై-స్టెప్ ఎగ్​ డొనేషన్ ప్రక్రియను ప్లాన్ చేస్తాడు. ఎగ్ డోనర్​ను మత్తులో ఉంచుతూ ఆమె వైద్యుడు ఆమెలో పరిపక్వం చెందిన అండాలను అల్ట్రాసౌండ్ గైడెడ్ నీడిల్ ద్వారా ఒక్కొక్కటిగా సేకరిస్తాడు. గ్రహీత భాగస్వామి స్పెర్మ్ లేదా డోనర్ స్పెర్మ్ ద్వారా అండాలు ప్రయోగశాలలో ఫలదీకరణం చేయబడతాయి. ఒకటి కంటే ఎక్కువ అండాలను ఫలదీకరణం చేస్తారు. దీనిని డోనర్ ఎగ్ ద్వారా IVF ప్రాసెస్ అని పిలుస్తారు. ఎంబ్రియో (ఫలదీకరణం చెందిన గుడ్డు) గ్రహీత యొక్క గర్భాశయంలో అమర్చబడుతుంది.

ఎగ్ డొనేషన్ ప్రక్రియలో ఉన్న రిస్క్స్ (The Potential Risks of Egg Donation in Telugu)

ఒక స్త్రీకి నార్మల్ IVF చికిత్సలో ఎటువంటి సమస్యలు ఉంటాయో.. ఎగ్ డొనేషన్ ప్రక్రియలో కూడా అవే ప్రమాదాలు ఉంటాయి. అండాశయాలను ఉత్తేజపరిచేందుకు ఉపయోగించే ఔషధాల వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఎగ్ డోనర్స్ అవగాహన కలిగి ఉండాలి. డోనర్ OHSS (ఓవరిన్ (అండాశయ) హైపర్ స్టిములేషన్ సిండ్రోమ్) పొందే అవకాశం ఎక్కువగా ఉంది. డోనర్స్ సాధారణంగా చాలా చిన్నవారు మరియు ఎక్కువ ఫర్టైల్ కలిగినవారు కాబట్టి ఈ సమస్య వస్తుంది. IVF చేయించుకుంటున్న వంధ్యత్వం కలిగిన మహిళ కంటే ఎగ్ డొనేషన్ చేసే మహిళలకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

డోనర్స్ OHSS వార్నింగ్ సైన్స్ గురించి పూర్తి అవగాహనను కలిగి ఉండాలి. అవసరమైతే తక్షణ చర్య కూడా తీసుకోవాలి. అరుదైన పరిస్థితులలో చికిత్స చేయని OHSS మహిళ సంతానానికి, ఆమె ప్రాణానికి కూడా హాని కలిగిస్తుంది. గర్భవతి కావాలని ఆశిస్తూ డోనర్ ఎగ్ IVF చికిత్స తీసుకున్న మహిళలకు మల్టీపుల్ ప్రెగ్నెన్సీలు అనేవి సాధారణ ప్రమాదం. మల్టీపుల్ ప్రెగ్నెన్సీ ప్రమాదాన్ని తగ్గించుకునేందుకు కొన్ని ఎంబ్రియోస్​ను ట్రాన్స్​ఫర్ చేయండి. మీ పరిస్థితికి ఒకే పిండం అనేది సరిగ్గా ఉంటుందో లేదో మీ IVF నిపుణుడితో చర్చించి నిర్ణయం తీసుకోండి.

IVFలో డోనర్ ఎగ్స్​ను ఉపయోగిస్తే సక్సెస్ రేటు ఎంత ఉంటుంది? (What Is The Success Rate Of Using Donor Eggs In IVF Procedures in Telugu?)

డోన్ ఎగ్ IVF అనేది ఫ్రెష్ ఎంబ్రియోను బదిలీ చేసినపుడు 55.9 శాతం, ఫ్రోజెన్ ఎంబ్రియోను బదిలీ చేసినపుడు 40.2శాతం బర్త్ రేటును కలిగి ఉంటుంది. సక్సెస్ రేట్లు అనేవి మీరు ఏ IVF చికిత్స మీదైతే ఆధారపడతారో వాటిని బట్టి ఉంటుంది. మీరు.. ఇతర సంతానం లేని జంట అండాలను పంచుకోవాలని నిర్ణయించుకుంటే.. మీ గర్భధారణ రేటు సగటు కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కుటుంబసభ్యుడు లేదా సన్నిహితుడైన వ్యక్తిని ఎగ్ డొనేషన్​ కోసం ఉపయోగించినట్లయితే అదే సూత్రం వర్తిస్తుంది. వీరిని ఎంచుకుంటే వారు ఉత్తమ డోనర్ అయ్యే అవకాశం ఉండకపోవచ్చు.

ఇండియాలో IVF చేయించుకునేందుకు ఎంత ఖర్చవుతుంది? (How Much Does It Cost To Have An IVF In India?)

ఇండియాలో ఇన్​ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) చికిత్స ఖర్చు రూ. 60,000 నుంచి రూ. 80,000 వరకు ఉంటుంది. అంతే కాకుండా ఈ డోనర్ ఎగ్ ఖర్చులో అవసరమైన అన్ని రకాల మందులు ఉంటాయి. అయినప్పటికీ ఇన్​విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) చికిత్స కొరకు చాలా మంది జంటలు రూ. 5 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. ఎందుకంటే వారికి మల్టీపుల్ రౌండ్స్ IVF సైకిల్స్ అవసరం.

చివరగా.. (Conclusion:)

IVF చేయించుకుంటే మీలో సక్సెస్​ రేట్ ఎంత ఉంటుందనే విషయాన్ని వైద్య నిపుణులను అడిగి తెలుసుకోండి. వంధ్యత్వం (ఇన్​ ఫెర్టిలిటీ) ఉన్నప్పటికీ గర్భం ధరించడం, ఒక ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వడం ఇప్పటికీ సాధ్యమే. డోనర్​ ఎగ్​ను మీ భాగస్వామి స్పెర్మ్​తో ఫలదీకరణం చెందించిన తర్వాత మీ గర్భాశయంలోకి ప్రవేశపెట్టడం ద్వారా కూడా ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీని సాధించవచ్చు.

Tags:

What is egg donor method in telugu, Egg donor method in telugu, Benefits of Egg donor method in telugu, When should we consider Egg donor in telugu, Financial details of Egg donor in telugu, Success rate of egg donor in telugu.

Is this helpful?

thumbs_upYes

thumb_downNo

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Mylo App Banner

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Apple App StoreGoogle Play Store
Apple App StoreGoogle Play Store

Article Posted Under

Helpful Tools & Calculators

undefined icon
Pregnancy Calendar
See baby growth week by week
arrow_right
undefined icon
Mylo Store
Shop for mom & baby
arrow_right
undefined icon
Pregnancy Diet Chart
Trimester & region-wise diet plan
arrow_right
undefined icon
Mamasutra
Safe positions for pregnancy
arrow_right
undefined icon
Save Memories
Store baby's photos & firsts
arrow_right
undefined icon
Weight Tracker
Monitor your weight
arrow_right
undefined icon
Zordar Dadi Ke Nuskhe
Gharelu nushke that work
arrow_right
undefined icon
My Calendar
Predict periods & record symptoms
arrow_right
undefined icon
Ovulation Calendar
Know your monthly cycle
arrow_right
undefined icon
Pill Reminder
Get reminded for medicines
arrow_right
undefined icon
Vaccination Tracker
Never miss a vaccine date
arrow_right
undefined icon
Make Baby Sleep
Play white noise & sleep music
arrow_right
undefined icon
Pregnancy Music
Play calming music for baby
arrow_right
undefined icon
Baby Diet Chart
Age-wise food plans for baby
arrow_right
Sarada Ayyala
Sarada Ayyala

Related Articles

Questions about this article

  • Asked by 28 weeks pregnant

    Naku eppudu 7 months baby moments teliyadam ledhu...

  • Asked when 35 weeks pregnant

    Hi I'm 34 weeks 3 days pregnant repu 9th month start avtadi naku eroju mrng milky white discharge iendi problem em undadu kada

  • Asked when 39 weeks pregnant

    Hii all Naku ee month(april19) delivary date echinchindi bt Naku pottalo right side pain vastundi nyt nundi akkuvaga m aina pblm sis chepara konchem urgent plz

  • Asked when 34 weeks pregnant

    Hii 34 weeks how many months

  • Asked when 14 weeks pregnant

    Naku eppudu 4th month raw rice thinalanye vude no problem or problem please tell me

Recently Published Articles

Your body needs extra nutrition this trimester - these can help.

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.