hamburgerIcon

Orders

login

Profile

SkinHairFertilityBabyDiapersMore

Lowest price this festive season! Code: FIRST10

ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • 4 వారాల ప్రెగ్నెన్సీ తర్వాత బేబీ సైజ్ ఎలా ఉంటుంది? (Size of Baby After 4 Week Pregnancy in Telugu?) arrow

In this Article

    4 వారాల ప్రెగ్నెన్సీ తర్వాత బేబీ సైజ్ ఎలా ఉంటుంది? (Size of Baby After 4 Week Pregnancy in Telugu?)

    Pregnancy

    4 వారాల ప్రెగ్నెన్సీ తర్వాత బేబీ సైజ్ ఎలా ఉంటుంది? (Size of Baby After 4 Week Pregnancy in Telugu?)

    3 November 2023 న నవీకరించబడింది

    గర్భం దాల్చిన నెల రోజుల తర్వాత మీ శిశువు ఎంత సైజులో ఉంటుందో తెలుసుకోవాలనే ఆతృత మీకు ఉందా? సరే... మీరు గర్భం దాల్చిన మొదటి నెలలోనే అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోవడమం తొందరపడినట్టే అవుతుంది. మీ గర్భం యొక్క దశలను గురించి పూర్తిగా తెలుసుకునేందుకు మీరు మీ గైనకాలజిస్ట్​తో అపాయింట్​మెంట్ బుక్ చేసుకోవచ్చు.

    ప్రెగ్నెన్సీ 4వ వారంలో మీ బిడ్డ సైజు ఎంత పెద్దగా ఉంటుంది? (Size of Baby During 4th Week of Pregnancy in Telugu)

    మీ ప్రెగ్నెన్సీ 4వ వారంలో మీ ప్లాసెంటా, ఆమ్నియోటిక్ సాక్ డెవలప్ కావడం ప్రారంభిస్తాయి. రొమ్ములు కాస్త నొప్పిగా అనిపించడం, మూడ్ స్వింగ్స్ వంటివి మీరు గమనించవచ్చు. అంతే కాకుండా మీరు కొద్దిగా పొత్తి కడుపు నొప్పిని కూడా అనుభవించొచ్చు. మీ 4 వారాల ప్రెగ్నెన్సీ పీరియడ్​లో మీకు కనిపించే మరో సాధారణ లక్షణం ఇంప్లాంటేషన్ రక్తస్రావం. మీరు ఎటువంటి లక్షణాలను గుర్తించకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలా మంది మహిళల్లో ఈ లక్షణాలు కనిపించవు. చాలా మంది మహిళల్లో చాలా ఆలస్యంగా ఈ లక్షణాలు కనిపిస్తాయి.

    మీ మొదటి నెల ప్రెగ్నెన్సీలో అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోవాలా? (Does Ultrasound Required at First Month of Pregnancy in Telugu?)

    4 వారాల గర్భం సాధారణంగా ఒక నెల రోజుల గర్భం. మీరు ప్రసవించేందుకు ఇంకా 8 నెలల సమయం ఉందని కూడా దీని అర్థం. మీ ప్రెగ్నెన్సీ మూడు త్రైమాసికాలుగా విభజించి ఉంటుంది. ప్రతి త్రైమాసికంలో కొన్ని రకాల లక్షణాలు ఉంటాయి. మీ శిశువు పరిమాణం, పెరుగుదల, శిశువు రాకకోసం ఉత్సాహం వంటివి ఉంటాయి. మీరు ఈ నెలలో అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోవాలనుకుంటే అది కాస్త తొందరపడినట్టే అవుతుంది. వాస్తవానికి మీరు పెరుగుతున్న కణాల సమూహాన్ని మాత్రమే చూడొచ్చు. చూసేందుకు ఈ కణాలు పాపీ సీడ్స్ వలే చిన్నగా ఉంటాయి. మీ బేబీ తనకు కావాల్సిన అన్ని విషయాలను సమకూర్చుకుంటుంది. మీ కడుపులో పెరుగుతున్న బిడ్డను పోషించడానికి మీ శరీరం సిద్ధంగా ఉంటుంది. మీరు చాలా కొత్త లక్షణాలను మరియు భావాలను అనుభవించొచ్చు.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: ఎల్ఎంపీ, అల్ట్రాసౌండ్ స్కాన్ మధ్య తేడాలు

    గర్భిణీ స్త్రీ తన మొదటి నెల గర్భధారణ సమయంలో ఎలాంటి అనుభవం పొందుతుంది? (Experiences of Pregnant Ladies During First Month of Pregnancy in Telugu)

    మీరు ప్రెగ్నెంట్​గా ఉన్నట్లు అనిపించకపోయినా.. అండం ఫలదీకణం చెందుతుంది. నాలుగో వారంలో అండం గర్భాశయంతో నిరంతరం ఇంటరాక్ట్ అవుతుంది. ఇది చివరకు ఇంప్లాంటేషన్​కు దారి తీస్తుంది. ఈ సమయంలో మీరు లేత గులాబీ లేదా లేత ఎరుపు రంగులో రక్తస్రావం జరగడాన్ని గమనించవచ్చు. నిజానికి ఇది గోధుమ రంగులో కూడా ఉండొచ్చు. అంతే కాకుండా వాస్తవకాలంతో పోలిస్తే ఇది ముందుగానే సంభవించొచ్చు. మీరు కొంచెం రక్తస్రావం గమనిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిజంగా ఇది ఏ తప్పునూ సూచించదు. మీరు ఊహించని పెరుగుదలను అనుభవించొచ్చు. మీ రొమ్ముల సైజ్ మారొచ్చు. లేదా బొడ్డు ప్రాంతంలో అదనపు ఒత్తిడిని అనుభవించొచ్చు. చివరకు మీ శరీరం అదనపు ప్రెగ్నెన్సీ హార్మోన్లను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది.

    ఈ సమయంలో పాటించాల్సిన కొన్ని ఉత్తమ చిట్కాలు ఏమిటి? (Best Tips to Follow During 4 Weeks of Pregnancy in Telugu)

    గర్భం యొక్క 4 వ వారంలో ఇంప్లాంటేషన్ రక్తస్రావంతో పాటుగా ఈ దశలో ప్రీమెన్‌స్ట్రువల్ లక్షణాలను గమనించవచ్చు. ఈ దశలో మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు కింది చర్యలు పాటించవచ్చు.

    1. విటమిన్ D సప్లిమెంట్లను తీసుకోండి (Take D Vitamin Supplements)

    విటమిన్ D అనేది చాలా ముఖ్యమైనది. మీ దంతాలు, ఎముకలకు ఇది ముఖ్యమైనది. నిజానికి ఇది కాల్షియం శోషణకు సహాయపడుతుంది. విటమిన్ D ఉదయం సూర్యరశ్శి నుంచి, అలాగే పాలు తాగడం వలన లభిస్తుంది. చాలా మట్టుకు ప్రీనేటల్ సప్లిమెంట్స్‌లో విటమిన్ D సప్లిమెంట్లు కూడా ఇస్తారు.

    2. మీ గడువు తేదీని లెక్కించడాన్ని పరిగణించండి (Calculate Your Due Date)

    మీ డెలివరీ గడువు తేదీ లెక్కించేందుకు మీరు కొత్తగా గణితం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సాధారణంగా మీ చివరి పీరియడ్ తర్వాత మీ డ్యూ డేట్ అనేది 40 వారాలుగా లెక్కించాలి. మీరు నెలతప్పిన రెండు వారాల తర్వాత మీరు టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. మీ డెలివరీ డేట్ గురించి మీ గైనకాలజిస్టును కూడా సంప్రదించవచ్చు. చాలా తక్కువ మంది పిల్లలు మాత్రమే డెలివరీ డేట్ షెడ్యూలుకు అనుగుణంగా జన్మిస్తారు.

    3. పొగపీల్చడం మానుకోండి (Stop Smoking)

    ఇతర వ్యక్తులు వదిలిన పొగను పీల్చడం.. మీతో పాటుగా మీ బిడ్డకు కూడా ప్రమాదకరమే. వాస్తవానికి ఇది గర్భస్రావం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, ఇతర ఊహించని సమస్యలకు దారి తీయొచ్చు. అందుకోసమే ఈ చిట్కాను వీలైనంత సీరియస్​గా పరిగణించండి.

    4. కొత్త వంటకం తయారు చేసేందుకు ప్రయత్నించండి (Try New Recipes)

    మీకు సౌకర్యవంతంగా అనిపించే కొత్త ఆహారాలను ట్రై చేయడం మీకు కంఫర్ట్​గా ఉంటుంది. అయినప్పటికీ అతిగా తినకుండా చూసుకోండి. అతిగా తినడం వలన మీకు కడుపు ఉబ్బినట్లు అనిపిస్తుంది. వికారంగా కూడా అనిపిస్తుంటుంది. మీరు సురక్షితంగా ఉండేలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేందుకు ప్రయత్నించండి.

    5. మీ గైనకాలజిస్ట్​తో అపాయింట్​మెంట్ బుక్ చేసుకోండి (Book Appointment with Your Gynecologist)

    మీ ప్రెగ్నెన్సీ ఆరువారాలు పూర్తయిన తర్వాత మీరు డాక్టర్ అపాయింట్​మెంట్ బుక్ చేసుకోవడం ఉత్తమం కావొచ్చు. అంతే కాకుండా ఎక్కువ ప్రినేటల్ కేర్​తో మిమ్మల్ని మీరు ఉల్లాసపర్చుకోవడం చాలా ముఖ్యం. మీరు అపాయింట్​మెంట్ బుక్ చేసుకుంటున్న డాక్టర్ గురించి ముందుగానే మరింత తెలుసుకోవడం ఉత్తమం.

    6. ఇంటి ఆహారాలను తీసుకోండి. (Take Home Foods)

    పబ్లిక్ రెస్టారెంట్లలో తినడం వలన ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ దశలో అలాంటి అనుభవం మంచిది కాదు. ప్రెగ్నెన్సీ సమయంలో పబ్లిక్ రెస్టారెంట్లలో తరుచుగా తినడం వలన సాల్మోనెల్లా వంటి ఆహారం ద్వారా వచ్చే వ్యాధులు ఎదురవుతాయి. పౌల్ట్రీ, చేపలు, డైరీ ప్రొడక్ట్స్ తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ కావొచ్చు.

    Tags:

    Four Weeks of Pregnancy journey in telugu, Bump size in Four Weeks of Pregnancy in telugu, Baby size during Four Weeks of Pregnancy in telugu, Symptoms of Four Weeks of Pregnant ladies in Telugu, Tips to follow during Four Weeks of Pregnancy.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Swetha Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    Related Topics

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.