


Milestones
15 January 2026 న నవీకరించబడింది
మీ బిడ్డ పుట్టిన మొదటి సంవత్సరంలో సాధించిన ఎదుగుదలని, అలాగే వారు మైలురాళ్లని దాటడాన్ని గమనిస్తుంటే చాలా సరదాగా అనిపిస్తుంది. ప్రతి బేబీ ప్రత్యేకమైనదే. వారి ఎదుగుదల కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ చార్టులు కొన్ని పరిణామాలను అంచనా వేయడానికి, అలాగే మీ బిడ్డ పూర్తి ఎదుగుదలను ట్రాక్ చేయడానికి వారాలవారీ గైడ్‌గా పనిచేస్తాయి.
పిల్లలని పెంచడంలో అన్నిటికన్నా ఉత్సాహకరమైన భాగం ఏమిటంటే, వారు వారాలవారీగా ఎలా పెరుగుతున్నారు, వేగంగా ఎలా ఎదుగుతున్నారని గమనించడం. ఈ మైలురాళ్లని ఇక్కడ ఆసక్తికరంగా విభజించి, కింది విభాగంలో వివరంగా పేర్కొన్నాం.
పసిపిల్లలు తమ బాగోగులు చూసుకునేవారి గొంతులని గుర్తించటం నేర్చుకునే సమయం ఇది. అలా భాష అభివృద్ధికి పునాది పడుతుంది.
పసిపిల్లలు తమ దగ్గరి దూరంలో ఉన్న వస్తువులపై దృష్టి పెట్టడం మొదలుపెడతారు.
కచ్చితంగా కాకున్నప్పటికీ, పసిపిల్లలు హత్తుకుని పడుకోవటం నేర్చుకుంటారు.
ఇది పసిపిల్లల మైలురాళ్లలో మొదటి పెద్దది, ఈపాటికి “కూ” అలాగే “ ఆహ్” అనే శబ్దాలు చేయటం నేర్చుకుంటారు.
పసిపిల్లల కదలికలు మరింత నెమ్మదిగా, మృదువుగా అలాగే తక్కువ యాదృఛ్చికంగా మారతాయి.
పసిపిల్లలు వారి మొహంలో కండరాలని ఉపయోగించి చిరునవ్వు లేదా నవ్వటం ప్రారంభిస్తారు.
పసిపిల్లలు ఇంద్రియజ్ఞానంతో శబ్దాలని గుర్తిస్తూ అర్థం చేసుకోవటం మొదలుపెడతారు.
మెడ కండరాలు గట్టిపడటంతో, పసిపిల్లలు తమ తలలను 45 డిగ్రీల కోణం వరకూ నిలిపి ఉంచగలరు.
పసిపిల్లలకి ఎక్కువ ఉత్సుకత ఉంటుంది, అలాగే పెద్ద శబ్దస్థాయి ఉన్న(పిచ్) గొంతుల వంటి శబ్దాలకి ప్రతిస్పందిస్తారు.
పసిపిల్లలు జనసమ్మర్దంలో తెలిసిన మొహాలని గుర్తించడం నేర్చుకుంటారు.
పసిపిల్లలకి కొత్త విషయాలని నేర్చుకోవటంపై మరింత ఉత్సుకత ఉన్నట్లు కన్పిస్తారు.
ఈ దశలో, పసిపిల్లలు సామాన్యంగా తమ చేతుల పనిని అర్థం చేసుకోవటం మొదలుపెడతారు.
ఈ వారంలో పిల్లలు నవ్వటం, ఆగకుండా కేరింతలు కొట్టడం అలాగే గుంభనంగా నవ్వి ఊరుకోవటం లాంటివి చేస్తుంటారు.
చేతులు ఇంకా కాళ్ల మధ్య శిశువులు సమన్వయం ప్రదర్శిస్తారు.
పసిపిల్లలు ఈ సమయంలో బోర్లా పడటం నేర్చుకుంటారు.
మెడ, అస్థిపంజరం, కడుపులో కండరాలు మరింత బలంగా మారుతూ ఉంటాయి.
పసిపిల్లలు మరింత స్వరంతో అరుస్తారు, వివిధ రకాల శబ్దాలని చేస్తుంటారు.
ఈ సమయంలో పసిపిల్లలు ఏకాంతంగా గడపటాన్ని ఆస్వాదించటం మొదలుపెట్టవచ్చు.
పసిపిల్లలకి ఈ సమయంలో శబ్దాలని బొమ్మలతో అనుసంధానించటం నేర్పించవచ్చు.
పసిపిల్లలు తమనితాము అర్థం చేసుకోవటం, గుర్తించడం ప్రారంభిస్తారు, అద్దంలో వారి ప్రతిబింబాన్ని చూసి నవ్వవచ్చు కూడా.
ఈ వారానికి పసిపిల్లలు పాకటం మొదలుపెట్టేస్తారు.
ఈ దశ కొంచెం కంగారుగా ఉంటుంది. ఎందుకంటే పసిపిల్లలు ఈ సమయంలో ఏది కన్పిస్తే దాన్ని నోటిలో పెట్టేసుకుంటూ ఉంటారు.
ఈపాటికి పసిపిల్లలు తమ పైశరీర భాగంలో కండరాల బలాన్ని పెంచుకుని ఉంటారు.
కండరాల ఎదుగుదల కొనసాగుతుంది.
స్థూల చలన నైపుణ్యాలు (గ్రాస్ మోటార్ స్కిల్స్) అంటే నడవటం, పాకటం వంటివి అభివృద్ధి చెందుతాయి.
పసిపిల్లలకి తమ తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో బలమైన అనుబంధం ఏర్పడి ఉన్నందున విడిపోతే వచ్చే మానసిక ఆందోళన (సెపరేషన్ యాంక్జైటీ) ఈ సమయంలో కలగవచ్చు.
పసిపిల్లలు అన్నిటిలో కారణ-ప్రభావ సంబంధాలని ఏర్పర్చుకోవటం నేర్చుకుంటారు.
పసిపిల్లలు చప్పట్లు కొట్టడం మొదలుపెట్టవచ్చు. లేదా వారి చేతులని అంతకుముందు కంటే చాలా నూతనంగా ఉపయోగించవచ్చు.
పసిపిల్లలు ఈ దశలో అందరితో కలవడానికి సుముఖత చూపించే కారణంగా బయటకి వెళ్లి కొత్తవాళ్లని కలవాలని ఆరాటపడతారు.
కండరాల బలం ఇంకా సమన్వయం మరింతగా అభివృద్ధి చెందటం కొనసాగుతుంది.
పసిపిల్లలు ఈ సమయంలో చేతులు కట్టుకోవటం చేస్తున్నారు అంటే వారు చేతులని ఉపయోగించే పద్ధతి పూర్తిస్థాయి దశలో ఉన్నదని అర్థం.
పసిపిల్లలు చేతుల పట్టులేకుండా వస్తువులపై వంగటం లేదా ఆనటం వంటివి చేయడం నేర్చుకోవచ్చు.
పసిపిల్లలు వారికి నచ్చినవి, నచ్చనివి వారి సొంత మార్గాలలో వ్యక్తీకరించటం మొదలుపెడతారు.
కాళ్లలో బలం అలాగే సమన్వయం మరింత అభివృద్ధి చెందుతాయి.
కొద్దిమంది పసిపిల్లలు బంతి లేదా సీసా వంటి సామాన్య పదాలని అర్థం చేసుకోవటం మొదలుపెట్టవచ్చు.
పసిపిల్లలు ఈ దశలో వారి అనుభవాల నుండి జ్ఞాపకాలని సృష్టించుకోవడం మొదలుపెట్టవచ్చు.
ఈ దశలో కదలిక, ఉత్సుకత రెండూ పూర్తిస్థాయిలో ఉంటాయి.
పసిపిల్లలు కొత్త వస్తువులని చేరుకోవటానికి తాపత్రయపడటం లేదా వాటిని కొట్టడం వంటి వాటితో అల్లరిగా మారవచ్చు.
పసిపిల్లలు ఈ దశలో సాధారణంగా పళ్ల చిగుళ్లు పెరుగుతూ అసౌకర్యంగా ఉండటం లేదా చిన్న వస్తువులని కొడుతూ సమయం గడుపుతారు.
పసిపిల్లలు పరిశీలిస్తూ అనుకరించటం నేర్చుకుంటారు.
పసిబిడ్డ తన గురించి,చుట్టుపక్కల గురించి మరింత స్పృహలోకి వచ్చినప్పుడు ఆత్మవిశ్వాసం యొక్క భావన నెమ్మదిగా వారి మనస్సులలోకి ప్రవేశిస్తుంది.
మెదడు, ఆలోచనాభివృద్ధికి ఇది ముఖ్యమైనది అలాగే ఎదుగుదల కొనసాగే దశ.
పసిపిల్లలకి వస్తువుల శాశ్వత భావనని ఇప్పుడు పరిచయం చేయవచ్చు.
పసిపిల్లలు అన్నీ కొత్తవి ప్రయత్నించటానికి ఉత్సుకతతో ఉంటారు, కొన్నిసార్లు మెట్ల వంటి ప్రమాదకరమైన విషయాలు కూడా.
పసిపిల్లలు ఈపాటికి వారంతట వారే తినడం నేర్చుకోవటానికి ప్రయత్నిస్తారు.
ఈ దశలో పసిపిల్లల వ్యక్తిత్వం ఏర్పడటం మొదలవ్వచ్చు.
ఉత్సుకత, కొత్తవి ప్రయత్నించటం, అభిప్రాయాలు ఏర్పడటం వంటివి కొనసాగుతాయి.
పసిపిల్లలు ఏదైనా పట్టుకుని అడుగులు వేసే దశలోకి అడుగుపెట్టబోతున్నారు.
తెలియనివారి చుట్టూ మానసిక ఆందోళన పడటం నెమ్మదిగా తిరిగి రావచ్చు.
పసిపిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొత్తకొత్తగా అనుభూతి చెందుతూనే ఉండటం వలన వారికి ఉత్సాహం, శక్తి అపరిమితంగా ఉంటాయి. అలసట అనేదే ఉండదు.
పసిపిల్లలు తమ పరిమితులని తెలుసుకునే మొదటి పాఠాలని నేర్చుకుంటారు.
ఈపాటికి, చాలామంది పసిపిల్లలు మా లేదా దాదాలాంటి నిర్దేశించిన పేర్లతో అందరినీ పిలవడం మొదలుపెడతారు.
ఈ గైడ్ కొత్తగా తల్లిదండ్రులైన వారికి జరిగేవాటి గురించి టూకీగా సమాచారం చెప్పగలదు. అయితే, మీ బిడ్డలు దాటే మైలురాళ్ల ఆనందం స్వయంగా అనుభూతి చెందితేనే తెలుస్తుంది
Baby Milestones in the First Year of Birth In English, Baby Milestones in the First Year of Birth In Hindi, Baby Milestones in the First Year of Birth In Tamil, Baby Milestones in the First Year of Birth In Bengali
Yes
No

Written by
Nayana Mukkamala
Get baby's diet chart, and growth tips











భారతదేశం పితృత్వ సెలవును ఆఫర్ చేస్తుందా?

జనన నియంత్రణ కోసం యోని రింగ్: ఇది ఎలా పనిచేస్తుంది, ప్రయోజనాలు & ప్రమాదం

గర్భిణీ స్త్రీ ఒక రోజుకి కనీసం ఎన్ని గంటలు పని చేయాలి?

రొమ్ము స్వీయ పరీక్ష అంటే ఏంటీ? రొమ్ము స్వీయ పరీక్ష ఎందుకు చేసుకోవాలి?

గర్భవతిగా ఉన్నప్పుడు బర్గర్: ప్రయోజనాలు, ప్రభావాలు | Burger During Pregnancy Benefits & Effects in Telugu
మీకు ఈవెన్ స్కిన్‌టోన్ కావాలా? అయితే ఈవెన్ స్కిన్ టోన్ సహజంగా పొందేందుకు 5 ఉత్తమ మార్గాలు మీకోసం (Do you want an even skintone? Top 5 best ways to get an even skin tone naturally in Telugu)