hamburgerIcon

Orders

login

Profile

STORE
Skin CareHair CarePreg & MomsBaby CareDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • మొటిమలు, హైపర్‌పిగ్మెంటేషన్‌ విషయంలో టీ ట్రీ ఆయిల్ ఎలా సహాయపడుతుంది? (How Can Tea Tree Oil Help In Dealing With Acne & Hyperpigmentation in Telugu?) arrow

In this Article

    మొటిమలు, హైపర్‌పిగ్మెంటేషన్‌ విషయంలో టీ ట్రీ ఆయిల్ ఎలా సహాయపడుతుంది?  (How Can Tea Tree Oil Help In Dealing With Acne & Hyperpigmentation in Telugu?)

    Pregnancy

    మొటిమలు, హైపర్‌పిగ్మెంటేషన్‌ విషయంలో టీ ట్రీ ఆయిల్ ఎలా సహాయపడుతుంది? (How Can Tea Tree Oil Help In Dealing With Acne & Hyperpigmentation in Telugu?)

    3 November 2023 న నవీకరించబడింది

    ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెర్మటాలజిస్టులు ఒక వ్యక్తి యొక్క చర్మం వారి ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తుందని నమ్ముతారు. మొటిమలు, హైపర్‌పిగ్మెంటేషన్‌ మీ చర్మాన్ని మాత్రమే కాకుండా మీ జీవితాన్నంతటినీ నిస్సందేహంగా ప్రభావితం చేస్తాయి. లోపల ఏదైనా వ్యాధి ఉంటే దాని సంకేతాలు మొదట మీ చర్మంపై స్పష్టంగా కనిపిస్తాయి. ఈ మచ్చలు మీ ఆత్మగౌరవాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో మీ సన్నిహితులు కూడా పూర్తిగా అర్థం చేసుకోలేరు.

    హైపర్‌పిగ్మెంటేషన్, మొటిమలు ఎందుకు వస్తాయి? (Why Does One Experience Hyperpigmentation And Acne in Telugu?)

    అనేక అంతర్లీన సమస్యల కారణంగా మొటిమలు, హైపర్పిగ్మెంటేషన్‌ రావచ్చు. ఈ సమస్యలు బాహ్యంగా ఉన్నవి గానీ, అంతర్గతంగా ఉన్నవి గానీ హార్మోన్లకు సంబంధించినవి గానీ కావచ్చు. అటువంటి చర్మ సమస్యలను అధిగమించడానికి ఇంట్లోనే కొన్ని చిట్కాలను ప్రయత్నించవచ్చు. టీ ట్రీ ఆయిల్ క్రీమ్ వంటి ప్రభావవంతమైన ఉత్పత్తులను వాడవచ్చు. లేదా డెర్మటాలజిస్టులతో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు.

    అంతే కాకుండా, చర్మం వయసు పెరిగి కూడా హైపర్‌పిగ్మెంటేషన్ రావచ్చు. అటువంటి పరిస్థితులలో, హైపర్‌పిగ్మెంటేషన్ తగ్గించడానికి మీరు ట్రెటినోయిన్, రెటినోల్ వంటి క్రియాశీల పదార్ధాలను ప్రయత్నించవచ్చు. మీరు మీ చర్మ సమస్యలను అధిగమించడానికి అనేక మార్గాలను ప్రయత్నించి, వాటిలో ఏదీ పని చేయనట్లయితే, మీరు చింతించాల్సిన పనిలేదు! ఎందుకంటే మైలో కేర్ టీ ట్రీ ఆయిల్ క్రీమ్‌తో గొప్ప ఫలితాలు రావడం ఖాయం!

    మీకు ఇది కూడా నచ్చుతుంది: డెలివరీ తర్వాత స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి? ఈ టిప్స్ మీకోసమే!

    ఈ సమయంలో మీరు ఏ ప్రొడక్ట్స్ తీసుకుంటే మంచిది? (What Products Should You Consider Switching To At This Point in Telugu?)

    చూసేవాళ్ళకి ఇది ఒక చిన్న సమస్యగా అనిపించవచ్చు. అయినప్పటికీ.. హైపర్‌పిగ్మెంటేషన్, మొటిమల వల్ల మనసులో మార్పులను తేలికగా తీసుకోకూడదు. హానికరమైన రసాయనాలను కలిగి ఉన్న వివిధ చర్మ సంరక్షణ ఉత్పత్తులను అప్లై చేయడంలో నిరుత్సాహం, అలసిపోయిన తర్వాత, మీరు ఇప్పుడు సహజ పదార్ధాలు గల ప్రొడక్ట్స్ వాడాలి. మైలో కేర్ టీ ట్రీ ఫేస్‌వాష్, ఫేస్ క్రీమ్ మీకు మొండి మచ్చలు, మొటిమలను వదిలించుకోవడానికి సహాయపడతాయి. ఈ చర్మ సంరక్షణ ఉత్పత్తులు టీ ట్రీ ఆయిల్, వేప, తులసి, రకరకాల పండ్ల రసాల వంటి సహజ పదార్ధాల గుణాలతో తయారు చేయబడ్డాయి. టీ ట్రీ ఆయిల్ దాని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీమైక్రోబయల్ లక్షణాల వల్ల అద్భుతమైన చర్మ చికిత్సగా పరిగణించబడుతుంది.

    హైపర్‌పిగ్మెంటేషన్, మొటిమల మచ్చల రూపాన్ని తగ్గించడానికి మీరు అనుసరించగల కొన్ని చిట్కాలు ఏమిటి? (What Are A Few Tips You Could Follow To Reduce The Appearance Of Hyperpigmentation And Acne Scars? )

    టీ ట్రీ ఆయిల్ అలర్జీకి గురయ్యే సున్నితమైన చర్మాలు తప్ప అన్ని రకాల చర్మాలపై అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఎసెన్షియల్ ఆయిల్ యొక్క అత్యంత అసాధారణమైన లక్షణాలలో ఒకటి, ఇది చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోవటం ద్వారా మాయిశ్చరైజింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. దీనికి సేబాషియస్ గ్రంథుల నుండి జిడ్డు, ధూళిని తొలగించే శక్తి కూడా ఉంది. మొటిమలు, పిగ్మెంటేషన్‌లను నివారించేటప్పుడు టీ ట్రీ ఆయిల్ సహాయపడే మార్గాలు ఎన్నో ఉన్నాయి. మీరు ఈ క్రింది అంశాలను పరిగణించవచ్చు:

    • మీరు తప్పనిసరిగా మైలో కేర్ టీ ట్రీ ఫేస్ వాష్‌తో మీ ముఖాన్ని కడుక్కోవాలి. ఫలితాలు తొందరగా రావాలంటే.. మీరు దీన్ని ప్రతిరోజూ రెండుసార్లు అప్లై చేయాలి. మృదువైన కాటన్ ఫేస్ టవల్‌తో మీ ముఖాన్ని ఆరబెట్టుకోవాలి. మీ ముఖానికి ఎప్పుడూ చల్లటి నీటిని వాడండి. ఎందుకంటే వేడి నీరు మీ చర్మం యొక్క అన్ని రంధ్రాలను తెరుస్తుంది. అలా కాకుండా, మీ ముఖంపై శుభ్రమైన టవల్‌ని ఉపయోగించండి.
    • చేతులు శుభ్రంగా కడుక్కొని, మీరు మీ మొటిమలు లేదా మీ ముఖంపై సమస్య ఉన్నచోట (హైపర్‌పిగ్మెంటేషన్ ఉన్న చోట) సున్నితంగా, కొద్దిగా మైలో కేర్ టీ ట్రీ ఫేస్ క్రీమ్‌ను రాయాలి. ఈ క్రీమ్ ని తడిగా ఉన్న చర్మంపై కూడా రాసుకోవచ్చు.
    • ఎక్కడైతే మొటిమలు ఉన్నాయో అక్కడ గట్టిగా రుద్దకుండా తేలికగా పూయాలి. అక్కడ రక్త ప్రసరణ మెరుగుపరచడానికి మర్దనా చేయాలి. కనీసం నాలుగైదు నిమిషాల పాటు మర్దనా చేయాలి.
    • క్రీమ్ అప్లై చేసిన తర్వాత చర్మం దాన్ని పీల్చుకొనే వరకు ఓపికగా ఆగాలి. మీరు తడి చర్మంపై కూడా ఈ క్రీమ్‌ని రాయవచ్చు.
    • మీరు మీ ముఖాన్ని మళ్ళీ మళ్ళీ తాకకుండా ఉండాలి. అంతే కాకుండా, ఏదైనా మొటిమలను పగలగొట్టడం, లేదా గిల్లడం లాంటివి చేయకుండా ఉండాలి. అలా చేయడం వల్ల మీ చర్మ సమస్యలు ఇంకా తీవ్రంగా పెరిగే అవకాశం ఉంటుంది.
    • ఒక పలుచని పొరలా అప్లై చేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ పొరలుగా రాస్తే మీ సున్నితమైన చర్మం దెబ్బతింటుంది. కాబట్టి ఎక్కువ సార్లు పొరలుగా రాయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా, మీ చర్మానికి సూర్యరశ్మి తగిలితే కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఎండలోకి వెళ్లే ముందు అవసరమైనంత సన్‌స్క్రీన్‌ అప్లై చేయాలి.
    • టీ ట్రీ ఆయిల్ ఉన్న ప్రొడక్ట్ ఉపయోగించిన తర్వాత దాని పైన మీరు మరే ప్రొడక్ట్‌ని ఉపయోగించకూడదు. ఈ దశలో మీరు ఏ ప్రొడక్ట్స్ ఉపయోగించవచ్చు, ఏ ప్రొడక్ట్స్ ఉపయోగించకూడదు అనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి మీరు మీ డెర్మటాలజిస్టులని కూడా సంప్రదించవచ్చు.
    • మరుసటి రోజు ఉదయం ఫేస్ వాష్‌తో మీ ముఖాన్ని కడుక్కోవాలి, మీ డెర్మటాలజిస్ట్ సిఫార్సు చేసిన విధంగా సన్‌స్క్రీన్ లోషన్‌ను అప్లై చేయాలి. అలాగే, శుభ్రమైన టవల్‌ని ఉపయోగించాలి. ప్రొడక్ట్‌ని మీ ముఖంపై రుద్దేటప్పుడు లేదా ముఖాన్ని కడిగేటప్పుడు మీ సున్నితంగా చేయండి. కొద్దిగా ఎర్రగా అయితే, భయపడకండి! ఆ ఎరుపు కొంతసేపటి తరువాత పోతుంది.
    • అద్భుతమైన ఫలితాల కోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, ధ్యానం చేయడం వంటివి చేయడంలో రాజీపడకండి. వాస్తవానికి, సమతుల ఆహారం తీసుకోవడం వల్ల మీరు అనుకున్నదానికంటే కూడా ఎక్కువగా ఉపయోగపడవచ్చు. అంతేకాకుండా, ప్రతిరోజూ 60 నిమిషాల పాటు చక్కగా వ్యాయామం చేయాలని నిర్ధారించుకోండి. ఎప్పుడూ ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించడం వలన మీకు ఎప్పుడైనా మంచి ఫలితాలు కనబడవచ్చు!
    • మీ ముఖంపైన ఉండే చర్మం శరీరంలోని మిగిలిన భాగాల కంటే చాలా సున్నితంగాను, పలుచగాను ఉంటుంది కాబట్టి మీ ముఖంపైన ఏదైనా స్కిన్ కేర్ ప్రొడక్ట్‌ను అప్లై చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు తెలియకుండానే ఆ ప్రొడక్ట్ లోని కొన్ని పదార్ధాల పట్ల మీకు అలెర్జీ ఉండి, ప్యాచ్ టెస్ట్ చేయకపోతే అది మీ చర్మంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
    • టీ ట్రీ ఆయిల్ పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్‌లను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మీరు ఏదో ఒకటి ఉపయోగించి మీ సమయాన్ని, డబ్బును, శక్తిని వృధా చేసుకోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే, ఈ రోజుల్లో, ఇంటర్నెట్‌లో దొరికే చాలా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌లో సహజ పదార్ధాలు ఉండవు. మీ చర్మం పరిస్థితి ఎలా ఉందో కూడా చూసుకోవాలి. వాస్తవానికి, కొన్ని ప్రొడక్ట్స్‌లో సున్నితమైన చర్మంపై కఠినంగా పనిచేసే రసాయనాలు ఉంటాయి.
    • మీరు ఏవో ఒక మందులను సొంతంగా ఉపయోగించే ముందు డెర్మటాలజిస్టులని సంప్రదించాలి. సహజ పదార్ధాలు కలిగి ఉన్నవి, ఉపయోగించడానికి సురక్షితమైనవి అయిన ప్రొడక్ట్స్ వాడటం ఎప్పుడైనా మంచిదే. సహజ పదార్ధాలు కలిగి ఉన్న ఏదైనా స్కిన్ కేర్ ప్రొడక్ట్ కొనే ముందు లేబుల్‌ను జాగ్రత్తగా చదవండి. మీకు చర్మం అలెర్జీ వచ్చేదో కాదో తెలుసుకోవాలి. మీ మొటిమలు లేదా హైపర్‌పిగ్మెంటేషన్ ఉన్న చర్మానికి ఏదైనా స్కిన్ కేర్ ప్రొడక్ట్ ని అప్లై చేసే ముందు డెర్మటాలజిస్టులని సంప్రదించండి.

    అన్ని రకాల చర్మాలకు టీ ట్రీ ఆయిల్ ప్రొడక్ట్స్ పడతాయా? (Is Every Type Of Skin Compatible With Tea Tree Oil Products?)

    లేదు! టీ ట్రీ ఆయిల్ లేదా టీ ట్రీ ఆయిల్ కలిగిన ప్రొడక్ట్స్ అన్ని రకాల చర్మాలకు అనుకూలంగా ఉండవు. నిజానికి, వాడటం మొదలుపెట్టిన కొత్తల్లో ఒక రకమైన అలెర్జీలాంటిది రావడం చాలా సాధారణం. కాంటాక్ట్ డెర్మటైటిస్ లేదా తేలికపాటి దద్దుర్ల లాంటి అలెర్జీ రావచ్చు. అంతేకాకుండా, ఈ దద్దుర్ల వల్ల వాపు, దురద లేదా మంట కూడా రావచ్చు. సరిగ్గా నిల్వ చేయని లేదా గడువు ముగిసిన టీ ట్రీ ఆయిల్‌ని ఉపయోగించడం వల్ల ఈ అలెర్జీ రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది.

    చర్మంపై దద్దుర్లు, దురద, మంట లేదా పొక్కులు వంటివి వస్తే టీ ట్రీ ఆయిల్ వాడటం ఆపేయాలని అనుకోవచ్చు. వాడటం మొదలుపెట్టిన కొత్తల్లో, చర్మం పగలడం చాలా సాధారణం. అందువల్ల, చాలా తక్కువ టీ ట్రీ ఆయిల్‌ను కొద్దిగా క్యారియర్ ఆయిల్‌తో కలిపి ఉపయోగించాలని తెలుసుకోండి. నిజానికి, మీరు ఎంత తక్కువగా ఉపయోగిస్తే, చికాకు అంత తక్కువగా ఉంటుంది, అంత ఎక్కువ ప్రభావం ఉంటుంది. అందువల్ల, మీరు మొటిమల కోసం టీ ట్రీ ఫేస్ క్రీమ్‌ని పలుచగా అప్లై చేయడం మంచిది ముఖ్యంగా నిద్రపోయే ముందు.

    మీకు తామర లాంటి చర్మ వ్యాధులు ఉంటే, టీ ట్రీ ఆయిల్‌తో కూడిన ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల అది పెరగవచ్చు. అంతేకాకుండా, టీ ట్రీ ఆయిల్ ని పీల్చడం ఆస్తమా ఉన్నవారికి కూడా ఇబ్బందిగా మారవచ్చు. ఏదైనా టీ ట్రీ ఆయిల్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం ప్రారంభించే ముందు ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించాలని గుర్తుంచుకోండి. మంచి నాణ్యత గల మైలో కేర్ టీ ట్రీ ఫేస్ క్రీమ్‌ను ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: తామర నుండి ఉపశమనం - కారణాలు, లక్షణాలు మరియు చికిత్స

    టీ ట్రీ ఆయిల్ ప్రొడక్ట్స్ వల్ల మీకు ఫలితం ఏమీ కనిపించకపోతే మీరు ఏమి చేయవచ్చు? (What Can You Do If You Do Not See Any Result With Tea Tree Oil Products?)

    టీ ట్రీ ఆయిల్ క్రీమ్ లేదా అటువంటి ప్రొడక్ట్స్ క్రమం తప్పకుండా ఉపయోగించిన తర్వాత మీకు ఏవైనా తేడాలు లేదా ఫలితాలు కనిపించకపోతే, మీ డెర్మటాలజిస్టుని సంప్రదించడానికి ఇది చాలా సమయం. డెర్మటాలజిస్ట్ మీ చర్మ రకానికి అనుకూలంగా ఉండే మరింత శక్తివంతమైన ప్రొడక్ట్స్ సిఫారసు చేయవచ్చు. సాధారణంగా, టీ ట్రీ ఆయిల్ ప్రొడక్ట్స్ చాలా ప్రభావవంతంగా ఉంటాయి. రెండు నెలల కంటే తక్కువ రోజులలోనే ఆశించిన ఫలితాలను చూపుతాయి. అయినప్పటికీ.. తీవ్రమైన అలెర్జీ రియాక్షన్స్ వస్తే టీ ట్రీ ఆయిల్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం మానేయడం మంచిది.

    రెటినోల్, ట్రెటినోయిన్, గ్లైకోలిక్ యాసిడ్ అలాగే బెంజాయిల్ పెరాక్సైడ్ వంటి పదార్ధాలతో టీ ట్రీ ఆయిల్ ప్రొడక్ట్స్ కలపకుండా చూసుకోండి. ఇది మరింత చికాకు కలిగించవచ్చు. కొత్త సమస్యలకు దారి తీయవచ్చు. టీ ట్రీ ఆయిల్‌ను ఇతర శక్తివంతమైన పదార్థాలతో కలిపి వాడకూడదని అనడానికి మరొక కారణం ఏమిటంటే, మీ చర్మం ఒకేసారి ఎక్కువగా తీసుకోలేకపోవచ్చు. దీనివల్ల చికాకు, చర్మం ఎర్రబడటంతో పాటు మీ చర్మ కణాలు వేగంగా ప్రభావితమవ్వవచ్చు. అంతే కాదు, టీ ట్రీ ఆయిల్ ప్రొడక్ట్స్ రోజుకు రెండు సార్లు కంటే ఎక్కువ ఉపయోగించకూడదు.

    మీ చర్మం ఎర్రబడి, మండుతూ ఉంటే, మీరు అస్సలు భయపడవలసిన అవసరం లేదు. అలా ఉంటే, కొత్త ప్రొడక్ట్ కి మీ చర్మం అలవాటు పడుతోందని అర్థం. మీ చర్మం కొన్ని గంటల తర్వాత లేదా కొత్త ప్రొడక్ట్‌ని‌ కొన్నాళ్ళ పాటు ఉపయోగించిన తర్వాత మామూలుగా మారిపోవాలి. అప్పుడు మీరు మీ ముఖం శుభ్రంగా కడుక్కోవచ్చు. శుభ్రమైన టవల్‌తో మీ చర్మాన్ని సున్నితంగా అద్దండి. అవసరమైతే మంచి నాణ్యమైన క్లెన్సర్‌ని కూడా అప్లై చేసుకోవచ్చు!

    అసలు హైపర్‌పిగ్మెంటేషన్, మొటిమలకు అంతం ఉందా? (Is There An End To Hyperpigmentation And Acne In General?)

    ఉంది! మీరు టీ ట్రీ ఆయిల్ కొత్త ప్రొడక్ట్స్ క్రమం తప్పకుండా ఉపయోగిస్తే, హైపర్‌పిగ్మెంటేషన్‌తో పాటు మొటిమలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ఆ మొండి మచ్చల కారణంగా మీరు మీ ఆత్మగౌరవాన్ని అనేకసార్లు ప్రశ్నించాల్సి వచ్చి ఉండవచ్చు. అయితే, శుభవార్త ఏమిటంటే, మీరు కలలుగనే చర్మం పొందవచ్చు! హైపర్‌పిగ్మెంటేషన్ మచ్చలు కాలక్రమేణా తగ్గినప్పటికీ, లోతైన మచ్చలు అంత తేలికగా పోవు. అటువంటి పరిస్థితులలో, మీరు స్కిన్ కేర్ ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చు లేదా టీ ట్రీ ఆయిల్ ఎక్స్‌ట్రాక్ట్స్ కలిగి ఉన్న వేరే చికిత్సలను ఉపయోగించవచ్చు.

    ఇంకా, మీరు ఇంకా కొన్ని చర్మ సంరక్షణ విధానాలను అనుసరించవచ్చు. ముందుగా, మీరు బయటకు వెళ్ళిన ప్రతిసారీ సన్‌స్క్రీన్‌ని అప్లై చేయండి. కొన్నిసార్లు, యువి కిరణాలు హైపర్‌పిగ్మెంటేషన్ మొటిమలను తీవ్రతరం చేస్తాయి. చివరికి, ఆ మచ్చలు మసకబారడానికి చాలా సమయం పట్టవచ్చు. రెండవది, సరళమైన ఇంకా ప్రభావవంతమైన చర్మ సంరక్షణ దినచర్యకు కట్టుబడి ఉండండి. ఇది ఖచ్చితంగా ట్రిక్ చేయాలి! మీరు మైక్రో-నీడ్లింగ్, రసాయన పీల్ చికిత్సలను కూడా ఎంచుకోవచ్చు.

    టీ ట్రీ ఆయిల్ ఉత్పత్తులను ఉపయోగించిన తర్వాత ఫలితాలను చూడటానికి ఎంత సమయం పడుతుంది? (How Long Will It Take To See The Results After Using Tea Tree Oil Products?)

    మీరు టీ ట్రీ ఆయిల్ ప్రొడక్ట్స్ క్రమం తప్పకుండా ఉపయోగిస్తే రెండు నెలలలోపు ఫలితాలు కనిపించవచ్చు. టీ ట్రీ ఆయిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కాకుండా యాంటీమైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. ఇది వివిధ ఇన్‌ఫెక్షన్‌లతో పాటు మొండి మొటిమలను కూడా నయం చేస్తుంది. క్రమం తప్పకుండా ఉపయోగిస్తే 45 రోజులలోపు చక్కని ఫలితాలను పొందవచ్చు. నిజానికి, మీరింకా ఆలస్యం చేయకూడదు. ఈరోజే మీకు ఇష్టమైన మైలో కేర్ టీ ట్రీ క్రీమ్‌ను కొనుగోలు చేయండి!

    మళ్ళీ చెప్తున్నా.. అచ్చంగా టీ ట్రీ ఆయిల్‌ను చర్మానికి అప్లై చేయడం వల్ల కాంటాక్ట్ డెర్మటైటిస్ లేదా ఇలాంటి చర్మ సమస్యలు రావచ్చని మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందువల్ల, మీరు కొబ్బరి నూనె లేదా బాదం నూనె వంటి మంచి నాణ్యత గల క్యారియర్ ఆయిల్‌తో టీ ట్రీ ఆయిల్‌ను కలపడం మంచిది. అంతేకాకుండా.. మీరు మైలో కేర్ టీ ట్రీ క్రీమ్‌ కూడా తీసుకోవచ్చు. ఇది చాలా తక్కువ సమయంలో అంతే ప్రభావాన్ని చూపుతుంది!

    తుది తీర్పు (The Final Verdict):

    మీరు మొటిమల మచ్చలు లేదా ఇతర చర్మ సమస్యలతో బాధపడుతుంటే ఖచ్చితంగా టీ ట్రీ ఆయిల్ మంచి చిట్కా. ఈ శక్తివంతమైన నూనె యొక్క రక్తస్రావాన్ని ఆపే లక్షణాలు, యాంటీమైక్రోబయల్ లక్షణాల కారణంగా ఇది మీకు చాలా తక్కువ సమయంలోనే ఆరోగ్యంగా కనిపించే చర్మాన్ని మీ సొంతం చేస్తుంది! అది మచ్చలయినా, మొటిమలయినా, ఇన్ఫెక్షన్ అయినా, అన్నింటికీ చక్కని పరిష్కారం టీ ట్రీ ఆయిల్.

    ఇంకా, టీ ట్రీ ఆయిల్‌తో కూడిన మంచి నాణ్యమైన ప్రొడక్ట్స్ వాడటం చాలా ముఖ్యం. అన్ని టీ ట్రీ ప్రొడక్ట్స్ ఒకేలా ఉండవు, అందుచేత, తక్కువ ధరలో దొరికేవి, ఉపయోగించడానికి సురక్షితమైనవి అధిక నాణ్యత గల ప్రొడక్ట్స్ అందించే నమ్మదగిన బ్రాండ్‌ ఉపయోగించడం మంచిది.

    Tags:

    Tea Tree Oil in telugu, Tea Tree Oil benefits in telugu, Uses of Tea Tree Oil in telugu, Can Tea Tree Oil prevent acne in telugu, can Tea Tree Oil prevent pigmentation in telugu.l

    Tea Tree Face Wash with Neem & Glycolic Acid - 100 gm

    Cleanses, Exfoliates & Fights Acne | Removes Blackheads & Whiteheads

    ₹ 209

    4.2

    (2794)

    25865 Users bought

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Sarada Ayyala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.