hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • మీ బిడ్డ కోసం సురక్షితమైన & మంచి స్టోలర్‌ను ఎలా ఎంచుకోవాలి? (How to Choose the Safest & Best Stroller for Your Baby in Telugu) arrow

In this Article

    మీ బిడ్డ కోసం సురక్షితమైన & మంచి స్టోలర్‌ను ఎలా ఎంచుకోవాలి? (How to Choose the Safest & Best Stroller for Your Baby in Telugu)

    Baby Care

    మీ బిడ్డ కోసం సురక్షితమైన & మంచి స్టోలర్‌ను ఎలా ఎంచుకోవాలి? (How to Choose the Safest & Best Stroller for Your Baby in Telugu)

    3 November 2023 న నవీకరించబడింది

    తమ పిల్లలతో స్వేచ్ఛగా విహరించాలనుకొనే హుషారైన తల్లిదండ్రులకు బేబీ స్టోలర్లు ఒక వరం లాంటివి. నేటి ఆధునిక యుగంలో స్టోలర్లు అనేవి చాలా మంది తల్లిదండ్రులకు ఒక అవసమైన ఆసరా. మీ చిన్నారిని షికారుకు తిప్పినపుడు లేదా కొత్త ప్రదేశాలకు వెళ్లాలనుకొన్నప్పుడు అవి సౌకర్యం, రక్షణ ఇంకా వస్తువులను నిల్వచేసుకొనే అద్భుతమైన సదుపాయాన్ని అందిస్తాయి. అంతేకాకుండా, చక్కని స్టోలర్లు శిశువు కూర్చోబెట్టేందుకే కాక తాత్కాలికంగా ఎక్కడైనా కాసేపు నిలబడేందుకు కూడా సురక్షితమైన చోటును అందించడమే కాకుండా, వైప్‌లు మరియు డైపర్‌ల వంటి మార్చుకొనే బట్టలు ఇంకా అదనపు పాలసీసాల వరకు తప్పనిసరిగా దగ్గరుంచుకోవలసిన అన్ని వస్తువులను నిల్వ చేసుకొనేందుకు పనికివస్తుంది. కానీ ఒక మంచి బేబీ స్టోలర్‌ను కనుగొనడం కాస్త కష్టతరమే. మార్కెట్ నిండా వివిధ మోడళ్ళు మరియు ధరలలో ఇవి అందుబాటులో ఉంటాయి. కాబట్టి మంచి వాటిని వెదకటం మొదలుపెట్టే ముందు మీ బడ్జెట్‌ను ఎంతో తెలుసుకోవాలి. ఆపై, మీరు స్టోలర్‌ను ఎలా ఉపయోగించాలనుకుంటున్నారో ఆలోచించి, అందుకు తగ్గ ఎంపికలు ఉన్న వాటిని ఎంచుకోవాలి. మీరు దీనిని ఎక్కడ ఉపయోగించాల్సి ఉంటుంది? స్టోలర్‌ను ఎక్కడ నిల్వ చేయబోతున్నారు? ఎంత మంది పిల్లలకు దీనిని ఉపయోగించాలనుకొంటునారు? ఇంకా వీటిలో ఏయే అంశాలు ఉన్నాయి? అనే విషయాలపై సంపూర్ణ అవగాహన ఉండాలి.

    ప్రాథమిక స్టోలర్ ప్రయాణాన్నికి ఇంకా నిల్వచేసుకొనేందుకు సులువైనది, అయితే ఎక్కువ-పనితీరు కనబరిచే స్టోలర్ వ్యవస్థ అదనపు నిల్వ మరియు స్నాప్-ఆన్ బాసినెట్‌లు లేదా క్యాట్ సీట్లు వంటి ఇతర ఉపయోగపడే అంశాలను కలిగి ఉంటాయి. కొంతమంది తల్లిదండ్రులకు అప్పుడప్పుడు వాడేందుకు ఒక సాధారణమైన స్ట్రోలర్ చక్కగా సరిపోతుంది.

    బేబీ స్టోలర్ అంటే ఏమిటి? (What is a Baby Stroller in Telugu)

    స్టోలర్ అనేది చక్రాలుండే బండి లాంటి పరికరం, దీనిలో పిల్లలను నిటారుగా కూర్చోబెట్టవచ్చు ఇంకా సేఫ్టీ బెల్ట్‌లు, క్రోచ్ స్ట్రాప్ మరియు రక్షణనిచ్చే జీనుతో పాటు వస్తుంది. అనుకోని వాతావరణ పరిస్థితుల నుండి శిశువులను సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి ఒక రక్షణ గొడుగులాంటిది అమర్చబడి ఉంటుంది. అప్పుడే కూర్చోవడం మొదలుపెట్టిన శిశువులకు లేదా తలను నిలపగలిగే పిల్లలకి ఇది చక్కగా సరిపోతుంది. స్టోలర్‌ల గురించిన మంచి విషయం ఏమిటంటే అవి తల్లిదండ్రులకు విశ్రాంతిని కలిగించడం, మరింత సౌకర్యవంతంగా నడవగలగడం ఇంకా వారి పిల్లలను సౌకర్యవంతంగా ఉంచేలా చేయడం వంటివి.

    మీ బిడ్డకు స్టోలర్ అవసరమా? (Do You Need a Stroller for Your Baby in Telugu)

    బిడ్డను లేదా శిశువును ఒక చోటు నుండి మరో చోటికి తీసుకెళ్లడానికి స్టోలర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఒక స్ట్రోలర్ వల్ల ఉపయోగమేమిటంటే, అది తల్లిదండ్రులకు చక్కని సౌలభ్యం చేకూర్చుతుంది. బేబీ క్యారియర్, కార్ సీటు అనేవి పసిపిల్లల చిన్న పాదాలకు అనుగుణంగా ఉండాలని అందరూ సూచిస్తారు. బహుశా, అమ్మా లేదా నాన్నతో వారి చిన్నారి హుషారుగోల్పే బయటిప్రదేశంలో విహరిస్తున్నప్పుడు, ఎక్కువ రద్దీ ఉన్న ప్రదేశంలో, వారి చేతులు ఖాళీగా ఉండేలా లేదా వారి వీపుపై ఉన్న డైపర్ బ్యాగ్, సిప్పీ కప్పులు, స్నాక్స్ తగిలిచ్చుకొనే బాధలేకుండా ఉంచడానికి, ఇంకా ఏదైనా నిల్వచేసేందుకు, లేదా దుస్తులు మార్చే సందర్భంలో కూడా ఇలాంటి వసతులు అందించే ఈ చక్కని చక్రాల స్ట్రోలర్ సహాయం వారికి అవసరమవుతుంది. మీరు ఎంచుకోగల వివిధ రకాల స్ట్రోలర్‌లను తెలుసుకొనే ముందు, స్ట్రోలర్‌లు ఉపయోగించేందుకు కొన్ని సూచనలుంటాయని తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. మీరు ఎంచుకున్న ఏ స్ట్రోలర్ అయినా సరే వాటి తయారీదారు పేర్కొన్న సూచనలను అనుసరించాల్సి ఉంటుంది.

    ఉదాహరణకు, చాలా స్ట్రోలర్లు నాలుగు నుండి ఆరు నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఉద్దేశించబడి ఉండవు. వాటిని నవజాత శిశువులకు సురక్షితంగా ఉంచడానికి, కొన్ని స్ట్రోలర్‌లకు లై-ఫ్లాట్ సీట్లు లేదా ప్రాం బెడ్స్ వంటి అదనపు అమరికలు అవసరపడవచ్చు. అయితే, నవజాత శిశువులను కారు నుండి స్ట్రోలర్ లేదా బయటకు తరలించడానికి కారు సీటుకు కనెక్ట్ చేయడానికి ఇతర స్ట్రోలర్లు తయారు చేయబడ్డాయి. స్ట్రోలర్‌లకు బరువు ఇంకా ఎత్తు అవసరాలు, భద్రత కోసం నిర్దిష్ట అవసరాలు నవజాత శిశువు దశకు తగిన దాని కన్నా ఎక్కువ ఉంటాయి మరియు మీరు అనుకోకుండా చిన్నారులకు అపాయం కలగకుండా చూసుకొనేందుకు తగిన హెచ్చరికలను వాటిపై పేర్కొంటారు. గుర్తుంచుకోండి, ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, స్ట్రోలర్ అనేది మీకు అన్నీటికంటే అత్యంత అమూల్యమైన బిడ్డను మోసుకెల్లే కదిలే సాధనమనేది గుర్తుంచుకోవాలి.

    బిడ్డ కోసం సరైన స్ట్రోలర్‌ను ఎలా ఎంచుకోవాలి? (How To Choose The Perfect Stroller For Your Baby in Telugu)

    బేబీ స్ట్రోలర్లు వివిధ ధరల శ్రేణుల్లో దొరుకుతాయి, అయితే కొన్నిసార్లు మాత్రమే మన బడ్జెట్‌కు అనుకూలంగా ఉండేవి ఉంటాయి. స్ట్రోలర్‌లో గమనించవలసిన అంశాలు లేదా ఫీచర్‌లను ముందే తెలుసుకొని ఉంటే అది మీకు సహాయకారిగా ఉంటుంది. అనుకూలమైన చక్కని బేబీ స్ట్రోలర్‌ను ఎంచుకొనేటప్పుడు ఈ క్రింది విషయాలను గమనించవలసి ఉంటుంది: ఇది నవజాత శిశువులకు అనుకూలంగా ఉంటుందా? చాలా స్ట్రోలర్‌లు తలను కదిలించేలా చక్కని నియంత్రను ఇస్తాయి, అయితే అప్పుడే కూర్చోవడం నేర్చుకుంటున్న శిశువులకు మాత్రమే ఇవి సరిపోతాయి. అదే సమయంలో, కొన్ని నమూనాలు చాలా లోతైన రీక్లైన్ లేదా బాసినెట్ను అందిస్తాయి, ఇది నవజాత శిశువుకు చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కొత్త బేబీ స్ట్రోలర్‌ని కొనేటప్పుడు, మీ చిన్నారికి చక్కగా సరిపోయేదాన్ని ఎంచుకోవాలి. వీటిని వాడటం ఎంత సులభం? మీరు స్ట్రోలర్‌ల జాబితాను తయారు చేసుకొని, చివరకు ఒక దానిని ఎంచుకొని, నచ్చిన తర్వాతనే, వాటిని కొనుగోలు చేయాలి. స్టోర్‌లో ప్రద్రశన కోసం ఉంచినవి సులభమైన వాడకానికి ఎలాంటి హామీ ఇవ్వదు. టెస్ట్ రైడ్ కోసం వాటిని తీసుకొని, మీరు దానిని ఎంత సులువుగా వాడవచ్చో తెలుసుకోవాలి. ఒకదానిని ఎంచుకోనే ముందు ఈ క్రింది ప్రశ్నలను మీరే వేసుకొని సందేహాలను తీర్చుకొంటే, అది మీకు దోహదపడుతుంది.

    1. స్టీరింగ్ స్మూత్ గా ఉందా?

    2. అత్యవసర పరిస్థితిలో, మీరు దానిని ఒక చేత్తో వాడగలరా?

    3. మీరు మలుపు తిప్పినపుడు ఏమి జరుగుతుంది?

    వెళ్ళే దారిలో ఎలాంటి అపాయలు జరగకుండా దీనిని ఎంత సులభతరం చేయాలో విశ్లేషించుకోవడం మంచిది. మీరు దీనిని ఎక్కడ ఉపయోగిస్తారు? స్ట్రోలర్‌లను ఎన్నుకునేటప్పుడు అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే మీరు వాటిని ఎక్కడ ఉపయోగిస్తారనేది. మీరు వాటిని నగరంలోని ఇరుకైన వీధుల్లో వాడదలిస్తే పెద్దగా ఉన్నవి మీకు బాగా సరిపోతాయి. అందుకోసం మీరు పైన గొడుగు ఆచ్ఛాదనంలా ఉండే మోడల్ తీసుకొంటే మంచిది. అయితే, ఈ గొడుగు మోడల్ మీకు డైపర్ బ్యాగ్, మీ పర్సు ఇంకా ఇతరాత్ర వస్తువులతో పాటు కొన్నింటికి మాత్రమే ఉంచుకొనే ఖాళీ స్థలం కలిగి ఉంటుంది. కాబట్టి, మీరు స్ట్రోలర్‌లను ఎక్కడ ఉపయోగించాలో ఎల్లప్పుడూ ఆలోచించుకొని ఉండాలి, ఇది మీకు అయోమయానికి గురికాకుండా చేస్తుంది.దీనిని మడవడం ఇంకా విస్తరింపజేయడం ఎంత సులభం? మీరు స్ట్రోలర్‌ను మడచి తిరిగి విప్పాలనుకున్నప్పుడు బిడ్డను ఒక చేతిలో పట్టుకుని, మరొక చేతిలో స్ట్రోలర్‌ను మడవాలి లేదా తెరవాలి. కాబట్టి, మీరు కోరుకున్న స్ట్రోలర్‌ను మడవడం ఇంకా తెరవడం సులభంగా ఉండేలా చూసుకోవాలి మరియు ఉత్పత్తి వివరణలలో చెప్పిన విషయాలు చూడకకూడదు. మీరు కొనే ముందు వాటిని పరీక్షించడం ఎల్లప్పుడూ మంచిదే. స్ట్రోలర్‌లను ఒక చేత్తో మడవడం మరియు తెరవడం సులభతరంగ ఉందో లేదో, ముందుగానే తనిఖీ చేసుకోవడం ఎల్లప్పుడూ మంచిది. బేబీ స్ట్రోలర్ బరువు ఎంత ఉంది? మీరు బేబీ స్ట్రోలర్ బరువునుకూడా తెలుసుకోవాలి ఇంకా మీరు రోడ్డుపై ఇంత బరువుతో దీనిని ఉపయోగించగలరో లేదో తెలుసుకోవాలి. తేలికగా ఉండటమనేది వేర్వేరు వ్యక్తులకు భిన్నంగా ఉంటుంది. కొందరు 12 పౌండ్ల బరువును తేలికైనదిగా అంటుండగా, మరికొందరు 25 పౌండ్లవి తేలికైనవి అంటారు. కాబట్టి, మీరు స్ట్రోలర్ బరువును తట్టుకోగలరేమో తెలుసుకొని వాటినే కోనాలి.

    వివిధ రకాల స్ట్రోలర్లు ఏవి (What Are the Different Types of Strollers in Telugu)?

    మార్కెట్లో అనేక రకాల స్ట్రోలర్లు అందుబాటులో ఉన్నాయి ఇంకా వీటిలో ఆరు ప్రధాన రకాలు ఉన్నాయి, అవి క్రింది విధంగా ఉన్నాయి:

    ఫుల్-సైజ్ స్ట్రోలర్ (Full-sized stroller):

    పేరుకు తగ్గట్లుగానే, ఫుల్-సైజ్ స్ట్రోలర్‌లు భారీగా ఇంకా మన్నికైనవిగా ఉంటాయి. చిరుప్రాయంలో ఉన్న మీ చిన్నారిని చక్కగా నడిపించే స్ట్రోలర్‌లో పెట్టుబడి పెట్టబోతున్నట్లయితే, ఫుల్-సైజ్ స్ట్రోలర్‌ను కొనేందుకు జంకకూడదు. ఇవి అపారమైన ఎంపికలు కలిగిఉండటమే కాకుండా పరిమాణంలో పెద్దవి ఇంకా దృఢమైనవి. అంతేకాక, అనేక మోడల్‌లు సంపూర్ణ శ్రేణి ఫీచర్లతో వస్తాయి, ఇవి పిల్లల ప్రయాణాన్ని ఆనందమయం చేయడమే కాక తల్లిదండ్రుల జీవితాన్ని సులభతరం చేస్తాయి. ఫుల్-సైజ్ స్ట్రోలర్ల కొన్ని (ఫీచర్లు) లక్షణాలు:

    4. విశాలమైన, సౌకర్యవంతమైన ఇంకా బాగా మెత్తగా నింపబడ్డ సీటు ఉంది.

    5. డీప్ సీట్ రిక్లైన్‌తో వస్తుంది.

    6. సీటులో ముందు లేదా వెనుక వైపుకు ఎక్కేలా ఎంపిక.

    7. దీనిని కారు సీటుకు కూడా జోడించవచ్చు.

    8. శిశువు పరిమాణంతో పాటు పెరిగే మార్చగలిగే డిజైన్‌తో వస్తుంది, నవజాత శిశువు కారు సీటు లేదా ఐచ్ఛిక బాసినెట్‌తో పసిపిల్లల వాడకం వరకు ఉపయోగించవచ్చు.

    9. విస్తరించదగిన ఛత్రం (గొడుగులాంటిది) కలిగి ఉంటుంది

    10. తాకిడిని తట్టుకొనేందుకు తగిన సస్పెన్షన్‌తో కూడిన ధృడమైన టైర్‌లను కలిగి ఉంది.

    11. నిల్వ ఉంచుకొనే స్థలం ఎక్కువ.

    12. కప్ హోల్డర్ లేదా స్నాక్ ట్రే వంటి ఉపయుక్తమైన అమరికలు గలవి.

    13. అవి దృఢంగా ఇంకా బరువుగా ఉంటాయి.

    14. తక్కువ స్టోరేజీతో కలిగిన చిన్న ఇంటికి కూడా ఇవి చక్కగా సరిపోతాయి..

    తేలికైనవి లేదా గొడుగు కప్పు ఉన్న స్ట్రోలర్ ( Lightweight or umbrella stroller):

    ఇవి చాలా తేలికగా ఉంటాయి ఇంకా ఫుల్-సైజ్ స్ట్రోలర్ల బరువును ఇష్టపడని వారికి అనుకూలంగా ఉంటాయి. వాటి లక్షణాలు కొన్ని క్రింది విధంగా ఉంటాయి:

    15. తేలికైన స్ట్రోలర్లు సులభంగా వాడటం కోసం రూపొందించబడింది; కొన్ని డిజైన్‌లు భుజం పట్టీతో పాటు కూడా వస్తాయి.

    16. ఈ మోడల్‌ స్ట్రోలర్లను మడతపెట్టడం సులభం ఇంకా ఎక్కడైనా నిల్వ చేసుకోవచ్చు.

    17. అవి లోతుగా ఉండని సీటు వాలు, విస్తరించదగిన గొడుగు పైకప్పు, స్టోరేజీకి బాస్కెట్ మరియు అంతర్నిర్మిత కప్ హోల్డర్ లేదా స్నాక్ ట్రే వంటి ప్రయోజనకరమైన ఫీచర్లను కలిగి ఉంటాయి.

    వీటిలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, అవి:

    18. తేలికైన స్ట్రోలర్ నెలల బిడ్డల కోసం ఉపయోగించాలని చూస్తున్నట్లయితే మాత్రమే ఉపయోగకరం. చాలా గొడుగు నమూనాలున్నవి ఆరు నెలలు ఇంకా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం రూపొందించబడ్డాయి.

    19. వాటికి కన్వర్టిబుల్ (మార్చుకోదగిన) ఆప్షన్ లేదు.

    జాగింగ్ స్ట్రోలర్ (Jogging stroller):

    జాగింగ్ చేస్తున్న వారికి, జాగింగ్ స్ట్రోలర్ మంచి ఎంపిక కావచ్చు. ఈ స్ట్రోలర్‌లు పెద్ద, దృఢమైన చక్రాలను కలిగి ఉంటాయి మరియు ఎగుడుదిగుడు దారుల్లో ఇంకా నేలపై వేగంగా తీసుకెళ్ళేందుకు మెరుగైన సస్పెన్షన్‌ను కలిగి ఉంటాయి. జాగింగ్ స్ట్రోలర్స్ అందించే కొన్ని ప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి:

    20. సుపీరియర్ సస్పెన్షన్ శిశువును ట్రయిల్‌లో ఇంకా బయట సౌకర్యవంతంగా ఉంచినప్పుడు కూడా మిమ్మల్ని నడవడానికి, జాగ్ చేయడానికి లేదా హైకింగ్ చేయడానికి సహాయపడుతుంది.

    21. చాలా జాగింగ్ స్ట్రోలర్లు ఫ్రంట్ వీల్‌తో వస్తాయి, అవి గిరగిరా తిరుగుతాయి లేదా స్థిరంగా బిగించబడి ఉంటాయి.

    22. వీటి ఇతర ప్రయోజనాలలో కార్ సీట్లు, డీప్ రిక్లైనింగ్ సీట్లు, టెలిస్కోపింగ్ హ్యాండిల్‌బార్లు మరియు స్టోరేజ్ బాస్కెట్‌ల వంటి అనుకూలతలు ఉన్నాయి. కీలకమైన భద్రతా ఫీచర్లలో హ్యాండ్ బ్రేక్, ఐదు-పాయింట్ల జీను ఇంకా మణికట్టు పట్టీ ఉన్నాయి.

    ఈ స్ట్రోలర్ల వల్ల కొన్ని ప్రతికూలతలు క్రింది విధంగా ఉన్నాయి:

    23. ఈ స్ట్రోలర్ మోడల్‌లు కాస్త బరువుగా ఉండటమే కాక అసెంబుల్ చేయడం కష్టతరంగా ఉంటుంది.

    24. ఈ స్ట్రోలర్లకు గొడుగు ఉండటం వల్ల తక్కువ స్థలం ఉన్నప్పుడు వాటిని మడవలేము.

    25. అవి ఫుల్-సైజ్ స్ట్రోలర్ల కంటే వెడల్పుగా ఉంటాయి.

    డబుల్ స్ట్రోలర్ (Double stroller):

    ఈ స్ట్రోలర్‌లు కవలలు ఉన్న తల్లిదండ్రుల కోసం లేదా వారి స్ట్రోలర్ అలవాటుని వదులుకోవాలా వద్దా అని అనుకుంటున్న పసిపిల్లల కోసం. ఇవి రెండు ఫార్మాట్లలో వస్తాయి, టెన్డం, ఇక్కడ ఒక పిల్లవాడు ఇంకో బిడ్డ వెనుక కూర్చుంటాడు అలాగే పక్కపక్కనే కొర్చోవచ్చు. వీటి ప్రయోజనాలు ఇలా ఉన్నాయి:

    26. ఈ మోడల్ మీకు ఒకరికన్నా ఎక్కువ పిల్లలకు కూడా ఈ ఒక్క స్ట్రోలర్‌ను మాత్రమే ఉపయోగించుకొనే అవకాశమిస్తుంది.

    27. ఈ మోడల్‌లు పెద్దవిగా ఉన్నందున సాధారణంగా తగినంత నిల్వ స్థలం అవసరమవుతుంది.

    ఈ నమూనాలకు ఉన్న కొన్ని ప్రతికూలతలు:

    28. 28. అవి పెద్దవిగా మరియు భారీగా ఉంటాయి ఇంకా నేలపై వాటి పెద్ద ముద్రలు పడతాయి.

    29. 29. కొన్ని మోడల్‌లు తేలికగా ఉన్నప్పటికీ, అవి ఎగుడుదిగుడు ఉపరితలంపై ఇంకా నేలపై సరిగ్గా నడవలేవు, ఇంకా ఇలాంటి సమస్యలు కలిగి ఉంటాయి.

    కార్ సీట్ క్యారియర్ (Car seat carrier):

    ఈ చక్రాల ఫ్రేమ్‌లు మీ శిశువు కారు సీటును స్ట్రోలర్‌గా మార్చడానికి నిర్మించబడ్డాయి. వీటి వల్ల కొన్ని ప్రయోజనాలు:

    30. అవి సులభంగా తీసుకెళ్లవచ్చు ఇంకా పరిమాణంలో చిన్నవే కాక తేలికైనవి కూడా.

    31. కారు లోపలికి మరియు బయటికి ఎటువంటి ఇబ్బంది లేని వార్పులు చేసుకోవచ్చు కావున అవి ప్రయాణానికి అనుకూలమైనవి ఇంకా మంచివి.

    32. కొన్ని నమూనాలు ఇద్దరు శిశువులకు కూడా చోటు కల్పిస్తాయి.

    కొన్ని ప్రతికూలతలు:

    33. శిశువులు త్వరగా కారు సీటు కన్నా పెరిగిపోతారు కాబట్టి ఈ నమూనాలు స్వల్పకాలిక ఉపయోగం కోసం మంచివి. అలాగే, కొన్ని పూర్తి-ఫీచర్ ఉన్న స్ట్రోలర్ కార్ సీట్లు వలె పని చేస్తాయి, తరువాత పసిపిల్లలకు అనుకూలమైన స్ట్రోలర్లుగా మార్చుకోవచ్చు.

    34. వాటికి కప్ హోల్డర్‌లు లేదా స్టోరేజ్ వంటి అదనపు ఫీచర్లు ఉండవు.

    ప్రయాణ వ్యవస్థ (Travel System)

    ప్రయాణ వ్యవస్థ ఒక బేబీ కార్ సీటును ఇంకా ఒక స్ట్రోలర్‌ను జత చేస్తుంది. మీరు ఫుల్-సైజ్, తేలికైనవి ఇంకా జాగింగ్ స్ట్రోలర్స్ వంటి వివిధ రకాల స్ట్రోలర్‌లతో మీకు కావలసిన ప్రయాణ వ్యవస్థను ఎంచుకోవచ్చు. ఈ నమూనాలలోని కొన్ని ప్రయోజనాలు:

    35. అడాప్టర్ సహాయంతో బేబీ కార్ సీటును మీ స్ట్రోలర్‌కి జోడించవచ్చు అంటే మీరు నిద్రిస్తున్న మీ బిడ్డ మేల్కొనకుండానే వారిని కారు నుండి స్ట్రోలర్‌కి తరలించవచ్చు.

    36. ఈ రెండు భాగాలను కొనడం ద్వారా కొంత డబ్బు ఆదా చేసుకోవచ్చు.

    ఇవి క్రింది చూపిన కొన్ని ప్రతికూలతలు కలిగి ఉంటాయి:

    37. స్ట్రోలర్‌లను కొన్ని సంవత్సరాల పాటే వాడుకోవచ్చు, మీ బిడ్డ చాలా త్వరగా కారు సీటును దాటి పెరిగిపోవచ్చు.

    38. మీకు ఒకటి కంటే ఎక్కువ కార్లను కలిగి ఉన్నట్లయితే, మీ రెండవ కారుతో ఉపయోగించుకొనేందుకు మీరు ప్రత్యేక కారు సీటు లేదా బేస్‌ని కొనల్సివుంటుంది.

    స్ట్రోలర్ కొనేముందు నేను ఏమి గమనించాలి (What Should I Consider When Buying a Stroller in Telugu)?

    స్ట్రోలర్‌ను కొనే ముందు, కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం, అవి ఏవంటే:

    • ధర: మోడళ్లను బట్టి స్ట్రోలర్ ధరలు మారుతూ ఉంటాయి. అధిక-ధర ఉన్న మొదళ్ళలో తరచుగా సర్దుబాటు చేయగల హ్యాండిల్‌బార్లు, రెయిన్ షీల్డ్‌లు, పెద్ద అండర్‌క్యారేజ్ ఇంకా బహుళ సీట్లు వంటి అదనపు సౌలభ్యాన్ని కలిగించే లక్షణాలను మెండుగా అందిస్తాయి, అలాంటివి కొన్నిసార్లు మాత్రమే అవసరం.
    • జీవనశైలి: మీరు రోజువారీగా ఎక్కువగా వాడాలని ఆశిస్తున్నారా? లేక అప్పుడప్పుడు విహారయాత్రల కోసం మీకు స్ట్రోలర్ అవసరమా? ఈ సమయంలో మీ జీవనశైలికి తగ్గ కారకాలను పరిగణనలోకి తీసుకోవడం అవసరం. పరిగణించవలసిన ఇతర అంశాలు ఏమిటంటే, మీరు మీ స్ట్రోలర్‌ను కారుతో ప్రయాణించగలరా? లేదా మీరు నగరం గుండా అన్నిచోట్లకి ప్రయాణిస్తున్నారా? ఈ ప్రశ్నలు మీరు మరింత ప్రాథమిక, తేలికైన మోడల్‌ని ఎంచుకోవాలా లేదా భారీ మోడల్‌ను ఎంచుకోవాలా అని నిర్ణయించడంలో మీకు సహాయపడతాయి.
    • కుటుంబ పరిమాణం: మీ కుటుంబ పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకోవడం మరొక అంశం. మీరు ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండాలని ప్లాన్ చేస్తే, ఎక్కువ మంది పిల్లలకు చోటు కల్పించే మోడల్‌ను కొనడం సమంజసమే.

    స్ట్రోలర్‌లో గమనించవలసిన ఉపయోగపడే ఫీచర్‌లు

    మీరు మీ స్ట్రోలర్‌లో గమనించవలసిన కొన్ని అదనపు ఫీచర్లు:

    ఉతికి శుభ్రపరచగల బట్ట (Washable fabric):

    స్ట్రోలర్ ఉతికి తిరిగి వాడే బట్టతో తయారు చేయబడిందని తెలుసుకోవాలి. స్ట్రోలర్‌లో స్నాక్స్ ఇంకా వాటి ముక్కలు ఉన్నట్లయితే శిశువుకు అసౌకర్యంగా అనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి, అవి స్ట్రోలర్‌ని మురికిగా ఇంకా అస్తవ్యస్తంగా చేస్తుంది. మీరు స్ట్రోలర్ ఫాబ్రిక్‌ను శుభ్రంగా ఇంకా చక్కగా ఉంచేందుకు, వాటిని క్రమం తప్పకుండా ఉతకి శుభ్రపరచాలి. చక్కగా వాడుకొనే స్ట్రోలర్ చాలా కాలం పాటు మన్నికైనదిగా ఉంటుంది.

    నిల్వ (Storage):

    మీరు మీ బిడ్డను వాకింగ్ లేదా షాపింగ్‌కు తీసుకెళ్లినప్పుడు మీకు అదనపు వస్తువులు అవసరం. కాబట్టి దీనిని సులభతరం చేయడానికి విశాలమైన నిల్వ ప్రాంతంతో కూడిన బాస్కెట్ కలిగి ఉండటం చాలా అవసరం.

    నాణ్యమైన చక్రాలు (Quality wheels):

    చక్రాలు స్ట్రోలర్‌లలో కీలకమైనవి కాబట్టి, అవి దృఢంగా ఇంకా మన్నికగా ఉన్నాయో లేదో తరచి చూడాలి.

    భద్రతా ఫీచర్లు (Safety features):

    అలాగే, మీరు కొన్న స్ట్రోలర్ సాఫీగా ప్రయాణించడానికి అవసరమైన అన్ని భద్రతా అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి.

    ఎండకు గొడుగు (Sun canopy):

    ఛత్రంతో కూడిన స్ట్రోలర్లు మీ చిన్నారులను ఎండ, వర్షం ఇంకా ఇతరాత్ర వాతావరణ పరిస్థితుల నుండి రక్షించగలవు. కొన్ని మోడళ్ళు మొత్తం స్ట్రోలర్‌ను కప్పివుంచగలవు లేదా శిశువు రక్షణ కోసం ఒక విండోను కలిగి ఉంటాయి.

    దీర్ఘకాలం మన్నేవి (Longevity):

    దీర్ఘకాలం మన్నే ఇంకా పెరిగే బిడ్డతో పాటు సర్దుబాటు చేసుకొనేలాంటి స్ట్రైకర్‌ను ఎంచుకోవాలని తెలుసుకోవాలి.

    స్ట్రోలర్ సురక్షితంగా ఉందని తెలుసుకోవడం ఎలా (How to Make Sure Your Stroller is Safe in Telugu)?

    శిశువుతో కాలిబాటలో వెళ్ళే విషయంలో భద్రత ప్రధానం. ఈ రోజుల్లో, దాదాపు అన్ని స్ట్రోలర్ మోడల్‌లు ప్రాథమిక భద్రతా ప్రమాణాలతో వస్తున్నాయి, అయితే మీరు స్ట్రోలర్‌ను కొనేటప్పుడు పరిగణించవలసిన కొన్ని అదనపు భద్రతా ఫీచర్లు ఉన్నాయి:

    ఐదు-పాయింట్ సేఫ్టీ జీను కోసం చూడండి ( Look for a five-point safety harness):

    ఐదు-పాయింట్ జీనులు సాపేక్షంగా ప్రామాణికమైనవి, కానీ కొన్ని గొడుగు మోడళ్ళు మూడు-పాయింట్ల జీనుతో సరిపెట్టవచ్చు. స్నాప్‌లు సురక్షితంగా ఉన్నాయని ఇంకా కట్టేందుకు సులువు అని నిర్ధారించుకోవడానికి వాటిని పరీక్షించాలని తెలుసుకోవాలి.

    బ్రేక్‌లు వేసి చూడాలి (Put on the brakes):

    బ్రేక్‌లు ఎంత సులభంగా ఉపయోగించాలో మరియు అవి ట్రిప్ చేయడం ఎంత సులభమో తనిఖీ చేయాలి. మీరు అనుకోని సమయంలో మీరు బ్రేక్‌లు కొట్టినట్లు అనిపిస్తుందా? బ్రేక్‌లు సురక్షితమైన ఆపుతున్నాయా?

    కీలుబందులు ఇంకా అంచులను పరిశీలించాలి (Examine the hinges and edges):

    ఏదైనా శిశువు పరికరాలపై మూలాలు ఇంకా రంధ్రాలు గమ్మత్తైనవిగా ఉంటాయి కానీ స్ట్రోలర్‌ల కోసం వెతుకుతున్నప్పుడు వీటిపట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే, ఏదైనా పొడుచుకు వచ్చినట్లు లేదా పదునైన అంచుల పట్ల జాగ్రత్త వహించాలి, ఎందుకంటే చిన్న పిల్లల వేళ్లు ఇంకా కాళ్ళు అలాంటి చోట్ల చిక్కుకోవచ్చు.

    కాస్తంత నీడ ఉండాలి (Get some shade):

    ఎండలో, వర్షంలో లేదా అస్థిర వాతావరణ పరిస్థితులను తట్టుకొనేలా గొడుగులాంటి రక్షణ ఉండే స్ట్రోలర్ అవసరం.

    శిశువు వెనక్కి జారగిలి పడుకోగలదా (Can the baby lie back)?

    సీటు ఎంత లోపలికి వంపు ఉంటుంది? నవజాత శిశువును స్ట్రోలర్‌లో ఉంచాలని అనుకొంటే ఫ్లాట్ రిక్లైన్ లేదా బాసినెట్ అటాచ్‌మెంట్‌ను అందించే మోడల్‌లను ఎంచుకోవాలి.

    అన్ని భాగాలను కలిపి ఉంచాలి (Put all the pieces together):

    మీరు ట్రావెల్ సిస్టమ్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, కారు సీటు కోసం భద్రతా రేటింగ్‌లను చూడాలి ఇంకా కారు సీటు స్ట్రోలర్‌కి ఎలా అనుసంధానిచవచ్చో గమనించాలి. ఇది వాడేందుకు సులభమైనదా లేదా ఒన్-క్లిక్ సిస్టమ్‌ని కలిగి ఉందా అని మీరు తప్పకుండా సరి చూసుకోవాలి. మీరనుకుంటునట్లే స్ట్రోలర్లు వీలైనంత సరళంగా ఉండాలి.

    ముగింపు

    ప్రపంచంలోనే మీ బిడ్డకు ఇష్టమైన ప్రదేశం బేబీ స్ట్రోలర్ కావచ్చు, ఎందుకంటే అది వారిని అనేక చోట్లకు తిప్పి ప్రదేశాలకు వారికి ప్రయాణపు సౌఖ్యన్ని అందిస్తుంది. మీరు సరైన స్ట్రోలర్‌ను ఎంచుకోవడం ద్వారా వారి సౌలభ్యం మరియు భద్రతకు కట్టుబడి ఉండవచ్చు. జాగింగ్ లేదా షాపింగ్ వంటి మీ అభిరుచులలో కొన్నింటిని ఆస్వాదించాలనే నిరంతర ప్రయాసలో, మీరు మీ బిడ్డను మోయాల్సిన పనిలేకుండా స్వేచ్ఛను పొందవచ్చు. అలాగే, ఎంచుకోవడానికి ఎంపికల కొరత అనేదే లేదు. కాబట్టి ఏరకమైన స్ట్రోలర్‌ను కొనే ముందు భద్రతా నిబంధనలను పరిగణనలోకి తీసుకోవడం ఎంతో ముఖ్యం

    Tags: How to Choose the Best Stroller for Baby in Hindi How To Choose The Safest & Best Stroller For Your Baby in Tamil How To Choose The Safest & Best Stroller For Your Baby in Bengali How To Choose The Safest & Best Stroller For Your Baby in English

    Buddy Ultra-Light Baby Stroller - Blue

    Baby Pram for Toddlers & Kids | 3 Point Safety Harness | 360° Front Wheel Swivel| Umbrella Fold

    ₹ 4199

    4.8

    (20)

    252 Users bought

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Dhanlaxmi Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.