hamburgerIcon

Orders

login

Profile

STORE
Skin CareHair CarePreg & MomsBaby CareDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Diet & Nutrition arrow
  • గర్భవతిగా ఉన్నప్పుడు పాస్తా | ప్రయోజనాలు, ప్రమాదాలు | Pasta During Pregnancy | Benefits & Risks in Telugu arrow

In this Article

    గర్భవతిగా ఉన్నప్పుడు పాస్తా | ప్రయోజనాలు, ప్రమాదాలు | Pasta During Pregnancy | Benefits & Risks in Telugu

    Diet & Nutrition

    గర్భవతిగా ఉన్నప్పుడు పాస్తా | ప్రయోజనాలు, ప్రమాదాలు | Pasta During Pregnancy | Benefits & Risks in Telugu

    3 November 2023 న నవీకరించబడింది

    గర్భవతిగా ఉన్నప్పుడు పాస్తా తినాలన్న కోరిక మహిళల్లో ఎక్కువగా ఉండటం సహజమే. కానీ పాస్తా తినొచ్చా లేదా అన్న ఆందోళన వారిని వెంటాడుతూ ఉంటుంది. సాధారణంగా ఇంట్లో తయారుచేసిన పాస్తాను గర్భవతిగా ఉన్నప్పుడు మితంగా తీసుకోవచ్చు. ఎలాంటి హాని ఉండదు. కానీ పాస్తా తినాలనుకుంటే ముందుగా పాస్తా నాణ్యతపై దృష్టిపెట్టాలి. ఉదాహరణకు, హోల్ వీట్ పాస్తా లాంటి ఆరోగ్యకరమైన ఆప్షన్ ఎంచుకోవాలి. పాస్తా మితంగా తీసుకుంటే అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఉదాహరణకు.. పాస్తా శక్తిని ఇస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. రక్తహీనతపై పోరాడుతుంది. ఒకవేళ పాస్తా అతిగా తింటే పోషకాలను సరిగ్గా గ్రహించకపోవడం లేదా ఇన్ఫెక్షన్స్ బారినపడటం లాంటి ప్రమాదాలు ఉంటాయి.

    నేను గర్భవతిగా ఉన్నప్పుడు పాస్తా తినొచ్చా? (Can I Eat Pasta During Pregnancy in Telugu)

    అవును, గర్భవతిగా ఉన్నప్పుడు పాస్తా మితంగా తినొచ్చు. పాస్తా మాత్రమే తీసుకోవాలి. స్టోర్స్‌లో దొరికే రెడీమేడ్ స్పఘెట్టీ లాంటివి తీసుకోకూడదు. అవి అనారోగ్యకరమైనవి. ఇక పాస్తా ఎక్కువగా తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.

    గర్భవతిగా ఉన్నప్పుడు ఎలాంటి పాస్తా తినాలి? (Type of pasta that can be consumed During Pregnancy in Telugu)

    పాస్తా రుచికరమైన, అద్భుతమైన వంటకం. కాబోయే తల్లులు పాస్తా తినాలనుకుంటే ముందుగా వాటిలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకోవాలి. ఏది తినాలి, ఏది తినకూడదు అన్న అవగాహన పెంచుకోవాలి.

    1. రెగ్యులర్ పాస్తా(Regular Pasta)

    రెగ్యులర్ పాస్తా రిఫైన్డ్ గోధుమ పిండితో తయారు చేస్తారు. శుద్ధీకరణ ప్రక్రియలో బయటి పొర, లోపలి జెర్మ్ పొర తీసివేస్తారు. పిండి ఎండోస్పెర్మ్‌ను వదిలివేస్తుంది.

    2. హోల్ గ్రెయిన్ పాస్తా (Whole Grain Pasta)

    హోల్ గ్రెయిన్ పాస్తాలో గోధుమ కెర్నల్‌లోని మూడు పోషక పొరలను కలిగి ఉంటుంది. తవుడు, జెర్మ్, ఎండోస్పెర్మ్ ఉంటాయి. వీటిలో సూక్ష్మపోషకాలు, పీచుపదార్థం ఉంటాయి. రెగ్యులర్ పాస్తాతో పోలిస్తే, ఈ పాస్తా తింటే ఎక్కువ సంతృప్తి కలుగుతుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. రక్తపోటును తగ్గించడంతో పాటు, టైప్ 2 డయాబెటిస్, హృదయ సంబంధ వ్యాధి లాంటి దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తుంది.

    3. వైట్ బ్లెండ్ హోల్ వీట్ పాస్తా (White Blend and Whole Wheat Pasta)

    వైట్ బ్లెండ్, హోల్ వీట్ పాస్తా పేరులో ఉన్నట్టే ప్రాసెస్ చేసిన గోధుమ పిండి, సంపూర్ణ గోధుమలతో చేసిన పిండిని కలిపి తయారు చేస్తారు. ఇవి పూర్తిగా తృణధాన్యాలతో తయారు చేయబడిన రకాల కంటే తక్కువ నమలితే చాలు. స్టాండర్డ్ వైట్ పాస్తా కన్నా పోషకాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. సాంప్రదాయ రకం నుంచి సంపూర్ణ గోధుమలకు మారడానికి ఇది ఉపయోగపడుతుంది.

    గర్భవతిగా ఉన్నప్పుడు పాస్తా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits of pasta in pregnancy in Telugu)

    1 శక్తిని పెంపొందిస్తుంది (Boosts Energy)

    పాస్తా సంక్లిష్ట పిండి పదార్థాలకు మూలం. శక్తిని ఆలస్యంగా విడుదల చేస్తూ స్థాయిని మెయింటైన్ చేస్తూ ఉంటుంది.

    2. ప్రెగ్నెన్సీ డయాబెటిస్ నుంచి రక్షణ కల్పిస్తుంది (Protects against Pregnancy Diabetes)

    పాస్తాలో లో-గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఫలితంగా.. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్‌ని నియంత్రిస్తుంది. గర్భధారణ మధుమేహం నివారణలో సహాయపడుతుంది.

    3. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది (Controls high blood pressure)

    రక్తపోటు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాస్తాలో ఉప్పు చాలా తక్కువగా ఉంటుంది. అది రక్తపోటుపై ప్రభావం చూపించదు.

    4. మలబద్ధకం, హెమరాయిడ్స్‌ను నివారిస్తుంది (Prevents Constipation And Hemorrhoids)

    గర్భవతిగా ఉన్నప్పుడు హెమరాయిడ్స్, మలబద్ధకాన్ని నివారించడంలో గోధుమ పాస్తా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో పీచు పదార్థం ఉంటుంది కాబట్టి.

    5. రక్తహీనతపై పోరాడుతుంది (Battles Anemia)

    పాస్తాలో ఐరన్ ఉంటుంది కాబట్టి గర్భవతులు రక్తహీనతపై పోరాడవచ్చు.

    6. పిండం అభివృద్ధి (Fetal Development)

    విటమిన్ బీ పొందడానికి పాస్తా ఉపయోగపడుతుంది. గర్భంలోని పిండం అభివృద్ధికి విటమిన్ బీ అవసరం.

    7. న్యూరల్ ట్యూబ్‌లోని లోపాలను నివారిస్తుంది (Prevents Defects in the Neural Tube)

    గర్భస్థ శిశువు ఎదుగుదలలో అసాధారణతలు లేకుండా ఉండేందుకు, గర్భవతులకు కావాల్సిన ఫోలిక్ యాసిడ్ పాస్తాలో ఉంటుంది.

    8. ఇన్ఫెక్షన్ రిస్కును తగ్గిస్తుంది (Decreases Infection Risk)

    పాస్తాలో విటమిన్ ఏ కూడా ఉంటుంది. శ్లేష్మ పొర సమగ్రతను కాపాడటానికి ఇది తోడ్పడుతుంది. గర్భధారణ సమయంలో ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది.

    గర్భధారణ సమయంలో పాస్తా తినడం వల్ల కలిగే ప్రమాదాలు (Risks of pasta during pregnancy in Telugu)

    గర్భధారణ సమయంలో ఆకలి వేసినప్పుడు తినడానికి పాస్తా మంచి ఆప్షన్ అయినా.. తరచూ పాస్తా తినడం మంచిది కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. పాస్తాను అతిగా తీసుకోవడం వల్ల ఈ కింది సమస్యలు రావొచ్చు-

    • పాస్తాలో ఫైటేట్స్ ఉంటాయి. ఇవి మెగ్నీషియం, జింక్‌ను శరీరం పీల్చుకోకుండా అడ్డుకుంటాయి. పాస్తాలోని లెక్టిన్‌ల కారణంగా చెడు ఆహారం రక్తప్రవాహంలోకి ప్రవేశించేలా చేస్తాయి. అందుకే పాస్తా అతిగా తినడం మంచిది కాదు.
    • పాస్తాను తరచుగా తినకూడదు. ఎందుకంటే ఇది ఈస్ట్‌ను అభివృద్ధి చేస్తుంది. ఉదరానికి ఇది మంచిది కాదు. కూరగాయలతో కలిపి పాస్తా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
    • పాస్తాలో గ్లూటెన్ ఎక్కువగా ఉంటుంది. గ్లూటెన్ వల్ల మీకు ప్రతికూల ప్రభావాలు ఉన్నట్టైతే, పాస్తా తినకపోవడమే మంచిది.
    • పాస్తా ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. అందుకే పాస్తా అతిగా తినకుండా అప్పుడప్పుడు తినాలి.
    • సెలియాక్ వ్యాధితో బాధపడుతున్నట్టైతే పాస్తా తినకూడదు.

    పాస్తా తినాలన్న కోరికల్ని ఎలా తగ్గించుకోవాలి? (How to handle pasta cravings in Telugu)

    గర్భవతిగా ఉన్నప్పుడు పాస్తా తినాలన్న కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా పాస్తాపై ఆధారపడకుండా మీ ఆకలిని తీర్చడానికి ఆరోగ్యకరమైన ఆప్షన్స్ గురించి ఆలోచించాలి. ఉదాహరణకు.. చిన్న ప్లేట్‌లో పాస్తా, సోడియం తక్కువగా ఉన్న టమాటా కెచప్‌తో తీసుకోవచ్చు. చక్కెర, కేలరీలు ఎక్కువగా లేకుండా.. మీ ఆకలిని సంతృప్తిపర్చవచ్చు. పాస్తా తినాలన్న కోరికలు మరీ ఎక్కువగా ఉంటే, ఓసారి వైద్యులతో మాట్లాడి వారి సలహా తీసుకోవాలి. పాస్తా కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. కడుపులోని పిండం అభివృద్ధికి మంచిది. కానీ ఏదైనా అతిగా తీసుకుంటే మంచిది కాదు. పాస్తా విషయంలోనూ అంతే. మితంగా తీసుకోవడం మంచిది.

    References

    1. Chen X, Zhao D, Mao X, Xia Y, Baker PN, Zhang H. (2016). Maternal Dietary Patterns and Pregnancy Outcome. Nutrients.

    2. Ito M, Maruyama-Funatsuki W, Ikeda TM, Nishio Z, Nagasawa K, Tabiki T, Yamauchi H. (2012). Evaluation of fresh pasta-making properties of extra-strong common wheat (Triticum aestivum L.). Breed Sci.

    Tags

    Can I eat Pasta during pregnancy in Telugu, Types of Pasta in Telugu, What are the benefits of pasta during pregnancy in Telugu, What are the risk of eating pasta during pregnancy in Telugu, Pasta craving during pregnancy in Telugu, Pasta During Pregnancy | Benefits & Risks in English, Pasta During Pregnancy | Benefits & Risks in Hindi, Pasta During Pregnancy | Benefits & Risks in Tamil, ⁠Pasta During Pregnancy | Benefits & Risks in Bengali

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Kakarla Sirisha

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.