hamburgerIcon

Orders

login

Profile

Skin CareHair CarePreg & MomsBaby CareDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • గర్భధారణ సమయంలో అతిగా నిద్రపోవడం మామూలేనా? (Does Sleeping alot During Pregnancy is Common in Telugu)? arrow

In this Article

    గర్భధారణ సమయంలో అతిగా నిద్రపోవడం మామూలేనా? (Does Sleeping alot During Pregnancy is Common in Telugu)?

    Pregnancy

    గర్భధారణ సమయంలో అతిగా నిద్రపోవడం మామూలేనా? (Does Sleeping alot During Pregnancy is Common in Telugu)?

    3 November 2023 న నవీకరించబడింది

    గర్భవతులైన మీరు ఎక్కువగా నిద్రపోతున్నారా? మానవ శిశువు ఎదగడమనేది చాలా కష్టతరమైన ప్రక్రియ, కాబట్టి గర్భధారణ సమయంలో కాస్త ఎక్కువగా అలసిపోయినట్లు అనిపించినా ఆశ్చర్య పడలసిన పని లేదు. అయితే, అన్ని సమయాలలో నిద్రపోవాలని అనిపిస్తేనే ఆందోళన పడాల్సివుంటుంది. అలాగే, మీరు గర్భవతులైనప్పుడు మీరు పొందే నిద్ర మొత్తం మిమ్మల్ని ఇంకా మీ బిడ్డను ప్రభావితం చేయడమే కాకుండా మీ బిడ్డ జననాన్ని మరియు ప్రసవాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అలాగే, గర్భధారణ సమయంలో నిద్ర లేకపోవడం వల్ల, అది ప్రీఎక్లంప్సియాతో సహా అనేక సమస్యలకు దారి తీస్తుంది, ఇది ముందస్తు జననానికి కూడా దారితీయవచ్చు. కాబట్టి ఇది నిజంగానే విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం.

    మీరు గమనించే మొదటి లక్షణాలలో ఒకటి గర్భవతిగా ఉన్నప్పుడు విపరీతమైన అలసట ఇంకా సుస్తు చేయడం లాంటివి. హార్మోన్లలో మార్పు కలగడం వలన, ముఖ్యంగా గర్భవతిగా ఉన్న అదనపు ప్రొజెస్టెరాన్ కారణంగా నిద్రను ఆపలేనంతగా కలిగిస్తుంది. గర్భధారణ ప్రారంభంలో, రక్తపోటు మరియు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా తగ్గుతాయి, అవి మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది. అయితే, మొదటి త్రైమాసికం తర్వాత, మీరు శక్తిని పుంజుకోవాల్సి వుంటుంది. కొన్నిసార్లు మీరు మూడవ త్రైమాసికంలో గర్భధారణ సమయంలో శిశువు ఎదగడం వల్ల శారీరక అలసట మరియు అది శరీరంపై కలిగించే ఒత్తిడి కారణంగా నిద్రపోవడం కాస్త ఎక్కువవుతుంది.

    గర్భధారణ సమయంలో అతిగా నిద్రపోవడం అంటే ఏమిటి? (Excessive Sleep During Pregnancy in Telugu)?

    నిద్ర ఎక్కువ రావడమనేది పాక్షికమైన అంశం, ఇంకా ఇది మీ నిర్దిష్ట నిద్ర అవసరాలు మరియు అలవాట్లపై కూడా ఆధారపడి ఉంటుంది. పరిశోధన ప్రకారం, మంచి ఆరోగ్యానికి అవసరమైన నిద్రా సమయం వయస్సును బట్టి మారుతుంది. చాలా మంది మహిళలు గర్భవతిగా ఉన్నప్పుడు, ప్రతిరోజూ ఏడు నుండి తొమ్మిది గంటల సేపు నిద్రపోవాలని సిఫార్సు చేయబడింది. అయితే, మీరు మామూలుగా 9 నుండి 10 గంటల వరకు నిద్రపోయేవారై ఇంకా మంచి నిద్రను పొందుతున్నట్లనిపిస్తే, అది మీకు అతి నిద్రకు సంకేతం కావచ్చు. అలాగే, మీరు రాత్రిపూట చాలా సార్లు మేల్కొనడం లేదా నిద్రకు అంతరాయం కలిగించే అలవాట్లను కలిగి ఉంటే మీరు సాధారణం కంటే ఎక్కువ సమయం పడకపైనే గడపవలసి రావచ్చు.

    కాబట్టి నిద్ర ఎందుకు అతి ముఖ్యమైనది? అన్ని రకాల కీలకమైన శారీరక విధులకు నిద్ర అవసరమని సైన్స్ నిరూపించింది, అంతేకాక నిద్ర శక్తిని పునరుద్ధరిస్తుంది ఇంకా మనం మేల్కొని ఉన్నప్పుడు మెదడు తీసుకున్న కొత్త సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. అలాగే, స్పష్టంగా ఆలోచించడం, వెంటనే స్పందించడం, భావోద్వేగాలను దృష్టిపెట్టడం ఇంకా నియంత్రించడం లాంటివి సరైన నిద్ర లేకుంటే దాదాపు అసాధ్యం అవుతుంది. అంతేకాక, నిద్రలేమి కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

    గర్భధారణ సమయంలో అతినిద్రకు కారణాలేమిటి? (What Makes You Feel So Sleepy During Pregnancy in telugu)?

    గర్భధారణ మొదటి ఇంకా చివరి త్రైమాసికంలో అలసిపోయినట్లు అనిపించడం సర్వసాధారణం. సాధారణంగా, మొదటి త్రైమాసికంలో, రక్త పరిమాణం మరియు ప్రొజెస్టెరాన్ స్థాయిలు అధికమవుతాయి, ఇది ఎక్కువ నిద్రను కలిగించవచ్చు. అయితే, మూడవ త్రైమాసికం నాటికి, పెరిగిన గర్బస్థ శిశువు బరువును మోయడం వల్ల ఇంకా ప్రసవానికి చేరువవుతునామన్న మానసిక ఆందోళన కారణంగా మంచం మీద ఇంకాస్త సమయం గడపాలని కోరుకుంటారు. అంతేకాకుండా, హార్మోన్ల స్థాయిలలో ఇంకా శారీరక మార్పుల కారణంగా మంచి నిద్రను పొందలేరు. ఒత్తిడి ఇంకా ఆందోళన స్థాయిలు పెరగడం మరియు గర్భధారణ సంబంధిత సమస్యల కారణంగా కలతనిద్రలతో కూడిన రాత్రులు ఉండవచ్చు మరియు మీరు పగటిపూట మరింత అలసిపోయినట్లు అనిపించవచ్చు లేదా నిద్రపోవాలని అనిపించవచ్చు.

    ప్రెగ్నెన్సీ సమయంలో అతినిద్ర వల్ల వచ్చే సమస్యలు (Risks Due To Excessive Sleeping During Pregnancy)

    గర్భధారణలోని మూడవ త్రైమాసికం సమయంలో అతినిద్ర వల్ల సమస్యలుండవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. గర్భం దాల్చిన చివరి నెలలో నిరంతరాయంగా తొమ్మిది గంటల కంటే ఎక్కువసేపు నిద్రపోయే లు మరియు గర్భం దాల్చిన చివరి నెలలో సాధారణంగా ఎలాంటి కలతనిద్రలు లేని స్త్రీలు మృతశిశువుని జన్మనిచ్చే అవకాశం ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. ఈ అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు ఎక్కువ కాలం నిద్రలేమి రాత్రుల వల్ల గర్భస్థ పిండం కదలికలు తగ్గిపోతాయని, అయితే అవి మృత శిశుజననానికి కారణం కాదని భావిస్తున్నారు. మీరు అతిగా నిద్రపోకూడదనుకుంటున్నప్పటికీ, మీ గర్భధారణ చివరి దశలో తగినంత నిద్ర పోవడంవల్ల కొన్ని ఆశించే ప్రయోజనాలు ఉన్నందున, కనీసం ఎనిమిది గంటలు నిద్రలో గడపడం ఎంతో అవసరం.

    గర్భధారణ సమయంలో నిద్ర ప్రయోజనాలు: (Benefits of Sleep During Pregnancy in Telugu)

    గర్భధారణ చివరి ధశలో రాత్రిపూట ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోయే స్త్రీలకు కానుపు సమయం ఎక్కువగా ఉంటుందని మరియు సి-సెక్షన్ ద్వారా ప్రసవం అయ్యే అవకాశం 4.5 రెట్లు ఎక్కువగా ఉంటుందని గత పరిశోధనలో తేలింది. అలాగే, కొన్ని జంతువులపై చేసిన పరిశోధనలు గర్భధారణ సమయంలో తగినంత నిద్ర లేకపోవడం వల్ల సంతానం మీద దీర్ఘకాలిక ప్రభావాలు ఉండవచ్చని సూచిస్తున్నాయి. అందువల్ల మీరు రాత్రుళ్లు చాలా సార్లు మెల్కోంతున్నట్లయితే, మీరు నిద్రను పూర్తిచేయడం కోసం సాయంత్రం లేదా ఉదయం సమయాన్ని అందుకు కేటాయించుకోవచ్చు.

    తగినంత నిద్రతోపాటు, మీ నిద్ర చక్కగా ఉండాలని కూడా ఆలోచించడం చాలా అవసరం. గర్భధారణ సమయంలో మగత నిద్రలో శ్వాసించే విధానం కూడా ప్రీఎక్లంప్సియా ప్రమాదాన్ని పెంచుతుందని అధ్యయనాలు సూచించాయి. అలాగే, సాధారణ స్త్రీలలో కంటే గర్భవతులలో ఎక్కువగా కనిపించే గురక, ప్రీక్లాంప్సియా మరియు గర్భధారణలో వచ్చే మధుమేహంతో సంబంధం కలిగి ఉంటుంది.

    గర్భధారణ సమయంలో నిద్రను ప్రభావితం చేసే సమస్యలు లేదా అతి నిద్రకు కారణాలు ఏమై ఉండవచ్చు? (Problems Can Affect Sleep During Pregnancy Or Cause Excessive Sleeping)

    గర్భధారణ సమయంలో మీ నిద్ర ఎందుకు కాస్త భిన్నంగా ఉంటుందో అనే దానికి అనేక వివరణలు ఉన్నాయి. కొన్ని అవకాశమున్న కారణాలు క్రింది వాటిని కూడా కలిగి ఉంటాయి:

    1. హార్మోన్ల మార్పులు: మొదటి త్రైమాసికంలో రక్తపోటు మరియు రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి, ఇది అలసట అనిపించేలా చేయవచ్చు. అలాగే, ప్రొజెస్టెరాన్ స్థాయిలను పెంచుకోవడం వల్ల ఈ సమయంలో ఎక్కువసేపు చక్కగా నిద్రపోయేలా చేయవచ్చు.
    2. రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్: కొంతమంది మహిళలు తమ కాళ్లను తరచుగా జాడించుకొనేందుకు కాలడం వల్ల నిద్రలేమి రాత్రులను అనుభవించవచ్చు. ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరగడం లేదా ఫోలిక్ యాసిడ్ ఇంకా ఐరన్ కొరత రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్‌కు కారణమవుతాయి.
    3. గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ రుగ్మత: మీ జీర్ణాశయంలోకి ఆహారం వెళ్ళేందుకు అన్నవాహిక చివరలో ఉన్న కండరాల వలయం తెరుచుకుంటుంది. ఈ వలయకండరాలు వదులైనప్పుడు గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ రుగ్మత వస్తుంది.ఇది ఉన్న మహిళల్లో ఆహారం ఇంకా ద్రవాలు తిరిగి గొంతులోకి ఎగదన్నుకొని వస్తాయి. కొన్ని సందర్భాల్లో, గర్భధారణ GERDకి దారితీస్తుంది, ఎందుకంటే కడుపు ప్రాంతంలో అదనపు ఒత్తిడి అన్నవాహిక చివరిలో ఉండే వలయ కండరాలు సరైన రీతిలో ముడుచుకోకుండా అడ్డుకుంటుంది.
    4. నిద్రలేమి: గర్భవతులు ముఖ్యంగా మొదటి ఇంకా మూడవ త్రైమాసికంలో, పడకపై ఎక్కువ సమయం గడపినా కానీ సుఖ నిద్రకు నోచుకోలేరు. గర్భధారణలో వచ్చే నొప్పులు ఇంకా ఈడ్పులవంటివి నిద్రలేమిని కలిగించే సాధారణ కారణాలలో ఒకటి. బిడ్డకు జన్మనివ్వడం ఇంకా వారి సంరక్షణ విషయంలో మనసులో కలిగే ఒత్తిడి మరియు ఆందోళన అధిక స్థాయిలో ఉండటం వల్ల కూడా వారికది ఆలశ్యంగా నిద్రపోయేలా చేయవచ్చు.
    5. స్లీప్ అప్నియా: నిద్రపోతున్నప్పుడు, శ్వాసలో ఇబ్బంది అనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. గర్భధారణ సమయంలో మహిళలకు స్లీప్ అప్నియా వచ్చే అవకాశాలున్నాయని కొన్ని సమీక్షల వల్ల తెలిసాయి, ఇది హార్మోన్ల ఇంకా శారీరక మార్పులు వల్ల కావచ్చు. ఇది గర్భధారణ తర్వాత తగ్గిపోవచ్చు, ఇంకా ఇది ఇతర రుగ్మతలకు సంబంధించినది. కాబట్టి దీనిని పరీక్ష చేయించుకోవడం ఎంతో అవసరం.
    6. అతి మూత్రవిసర్జన: మూడవ త్రైమాసికంలో, బాత్రూమ్‌ని వెళ్ళి రావడానికి రాత్రుళ్లు చాలా సార్లు మేల్కొవలసి ఉంటుంది, ముఖ్యంగా శిశువు పెరుగుతున్నందున ఇంకా అందువల్ల మూత్రాశయంపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ పరిస్థితిని నియంత్రించుకొనేందుకు నిద్రపోయే ముందు ద్రవపదార్థాలు తీసుకోవడం పరిమితం చేయగలిగినప్పటికీ, డిహైడ్రేషన్ కలగకుండా జాగ్రత్తపడాలని గుర్తుంచుకోవాలి.
    7. నిద్రను పాడుచేసే కలలు: కొందరు స్త్రీలకు సాధారణ స్థాయికన్న ఎక్కువగా కలలు వస్తాయి, అవి అసాధారణ కలలు లేదా పీడకలలై ఉంటాయి. అప్పుడప్పుడు, ఇది ఒత్తిడిని లేదా నిద్రలో అవాంతరాలు కలిగించవచ్చు. అయినప్పటికీ, మామూలుగా నిర్ణయించుకొన్న నిద్రాసమయానికి కట్టుబడి ఉండటానికి ప్రయత్నించాలి ఇంకా వివిధ నిద్రా భంగిమలను కూడా ప్రయత్నించవచ్చు లేదా గర్భధారణలో వాడే దిండును ఉపయోగించవచ్చు. అయినా కూడా, ఇంకా కలలు అలాగే వస్తూవుంటే, భాగస్వామి లేదా స్నేహితులతో మాట్లాడటం ఈ విషయంలో సహాయపడుతుంది. చివరగా, అవసరమైతే సలహాదారులను సంప్రదించేందుకు కూడా సిద్ధపడాలి.
    8. శ్వాసలో ఇబ్బంది- గురక: గర్భావధి పెరిగేకొద్దీ హార్మోన్ల హెచ్చుతగ్గుల కారణంగా ముక్కుదిబ్బడ్డలాగా శ్వాసలో ఇబ్బంది రావచ్చు ఇంకా ఊపిరి పట్టేసినట్లు అనిపించవచ్చు. దీనిని సెలైన్ నాసల్ స్ప్రేలను ఉపయోగించడం వల్ల నివారిచుకోవచ్చు. కొంతమంది స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు మొదటిసారిగా గురక పెట్టడం కూడా ప్రారంభిస్తారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ఇంకా గర్భధారణ సమయంలో బరువు ఎక్కువగా పెరగకుండా ఉండటం ఈ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు, తల పైకెత్తి పడుకోవడం వల్ల కూడా సౌకర్యంగా అనిపిస్తుంది. కాబట్టి ఇందుకోసం దిండ్లను ఉపయోగించవచ్చు లేదా మంచం తలవైపు భాగాన్ని కాస్త పైకి లేపవచ్చు, దీనివల్ల గురక తగ్గించడంలో ఇవి సహాయపడతాయి.
    9. అజీర్ణం: గర్భధారణ సమయంలో గుండెల్లో మంట ఉండతామనేది అందరికీ సుపరిచితం, ఇది పెరుగుతున్న శిశువు కారణంగా కావచ్చు, అందువల్ల అవయవాలపై ఒత్తిడి పెరుగుతుంది, అందువల్ల అది రిఫ్లక్స్‌కు దారి తీస్తుంది ఇంకా అది గర్భవతులకు విశ్రాంతి తీసుకోకుండా చికాకుని మిగుల్చుతుంది. ఇలాంటి నొప్పిని తగ్గించుకొనేందుకు, సపోర్టును ఇచ్చే దిండ్లను ఉపయోగించవచ్చు లేదా తల పైకెత్తి నిద్రించవచ్చు. అలాగే, అతిగా తినడం ఇంకా మసాలా, పుల్లని మరియు వేయించిన ఆహారాలను తీసుకోకూడదు.
    10. మార్నింగ్ సిక్‌నెస్: మార్నింగ్ సిక్‌నెస్‌ వల్ల కలిగే వికారం నిద్రకు దూరం చేస్తుంది. కడుపు నిండుగా ఉంచుకోవడం ద్వారా, ఈ వికారాన్ని తగ్గించవచ్చు. పగటిపూట, కరకరలాడే పదార్థాలను ఇంకా తేలికపాటి స్నాక్స్ తీసుకొనేలా ప్రయత్నించాలి.
    11. కాళ్లలో తిమ్మిర్లు: కాళ్లలో తిమ్మిర్లు కూడా నిద్రకు భంగం కలిగించవచ్చు. గర్భధారణ సమయంలో కాళ్ళ తిమ్మిరి ఎందుకు వస్తుంది అనేదానికి సరైన వివరణ లేదు. కానీ కాలి పిక్క కండరాలను సాగదీయడం, రోజంతా చురుకుగా ఉండటం ఇంకా పుష్కలంగా ద్రవాలు తీసుకోవడం వంటివి దీనిని తగ్గించుకొనేందుకు చేయగలిగే నివారణ ఉపాయాలు.
    12. వెన్నునొప్పి: కొంతమంది స్త్రీలకు రాత్రిపూట వెన్నునొప్పి ఎక్కువగా ఉంటుంది. అధిక బరువులు ఎత్తకూడదు, ఇంటి పనులు చేయకుండా ఇంకా ఎక్కువసేపు నిలబడకుండా ఉండేందుకుప్రయత్నించాలి. వీలైతే, పగటి సమయంలో కాళ్ళను పైకి లేపి ఉంచి విశ్రాంతి తీసుకోవాలి.

    గర్భధారణ సమయంలో నిద్రను మెరుగుపరచుకొనేందుకు ఏమి చేయాలి (What Can You Do To Improve Sleep During Pregnancy)?

    గర్భధారణ సమయంలో కాస్తంత కష్టపడితే మంచి నిద్రను సొంతం చేసుకోవచ్చు. నిద్రను మెరుగుపరచుకొనేందుకు ప్రయత్నించవలసిన అనేక అంశాలు ఉన్నాయి.

    • ప్రెగ్నెన్సీ పిల్లోని వాడేందుకు ప్రయత్నించాలి: మీరు సాధారణంగా వెల్లకిలా పడుకునేవారైతే లేదా సరైన భంగిమలో పడుకోలేకపోతే, నిద్రపోతున్నప్పుడు ప్రెగ్నెన్సీ పిల్లో మంచి సపోర్టును ఇంకా హాయిగా అనిపించేలా చేస్తుంది.
    • అంతర్లీన ఆందోళనలను తగ్గించుకోవాలి: ప్రసవం గురిచి ఆందోళన లేదా ఆత్రుతగా ఉన్నారా? మీకు నిద్ర రానీకుండా చేసే మరేదైనా కారణం మీ మనసులో ఉందా? మీ మనసులో ఉండే ఈ సమస్యలతో సరైన తీరులో వ్యవహరించడం వల్ల సుఖనిద్ర లభిస్తుంది.
    • ప్రతిరోజూ వ్యాయామం చేయాలి: వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి మంచి నిద్ర. అలాగే, సాధారణ వ్యాయామం వల్ల పగటిపూట చేయవలసిన పనులను చేయడానికి మరింత శక్తిని ఇస్తుంది ప్రశవాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేలా శరీరం తట్టుకొనేలా సహాయపడుతుంది.
    • మసాజ్ మంచిది: స్పర్శ ఎంతో ఓదార్పునిస్తుంది ఇంకా మంచి నిద్రకు సహాయపడుతుంది. మసాజ్ గర్భధారణకు సంబంధించిన నొప్పులు మరియు బాధలను కూడా తగ్గిస్తుంది ఇంకా మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
    • నిద్రించే చక్కని అలవాట్లను ఏర్పరచుకోవాలి: మంచి నిద్రించే అలవాట్లు, రాత్రి నిద్ర కోసం మంచి మానసిక స్థితి ఏర్పడేలా సహాయపడతాయి. మంచి ప్రవర్తన నమూనాలను తర్వాత అలవాటైన సమయాల్లో మనసు నిద్రను కోరుతుంది.
    • సరైన నిద్రించే చోటును ఏర్పరచుకోవాలి: ఎలక్ట్రానిక్స్‌ వస్తువులని బెడ్‌రూమ్ వెలుపల ఉంచడం, కొత్త పరుపు కొని తెచ్చుకోవడం, గాడి శుభ్రంగా ఉండేలా చూసుకోవడం లేదా నిద్రపోయే ముందు థర్మోస్టాట్‌ను ఖచ్చితమైన ఉష్ణోగ్రతకు సర్దుబాటు చేయడం వంటివి గుర్తుంచుకోవాలి.

    ముగింపు (Conclusion)

    గర్భధారణ సమయంలో మీ ఒకరికే అలసిపోయినట్లు లేదా ఆత్రుతగా ఉన్నట్లు అనిపించదు. అలసిపోయినట్లు అనిపించడం అనేది, ముఖ్యంగా మీ గర్భం ప్రారంభంలో ఇంకా చివరిలో కనిపించే సాధారణ గర్భదారణ రుగ్మత. అయితే, మీరు ఎల్లప్పుడూ సరిగ్గా నిద్రపోతున్నట్లు లేదా రోజులోని ఎక్కువ గంటలు నిద్రలో గడుపుతున్నట్లు అనిపిస్తే, అది వైద్యుడిని సంప్రదించల్సిన సమయం కావచ్చు. ఎటువంటి అంతర్లీన వైద్య సమస్యలు ఇందుకు కారణం కాదని వారు తెలుసుకోగలరు.

    Tags

    Sleep during preganancy in telugu, Sleepy pregnant ladies in telugu, Excessive sleeping during pregnancy in telugu, Sleeping a lot during pregnancy in telugu, Insomnia during pregnancy in telugu.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Kakarla Sirisha

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    Related Topics

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.