hamburgerIcon

Orders

login

Profile

SkinHairFertilityBabyDiapersMore

Lowest price Ever for Children's Day! Use Code: FIRST10

ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Missed Period arrow
  • క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ : గర్భవతే కానీ తెలియదు arrow

In this Article

    క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ : గర్భవతే కానీ తెలియదు

    Missed Period

    క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ : గర్భవతే కానీ తెలియదు

    3 November 2023 న నవీకరించబడింది

    చాలామంది స్త్రీలలో సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో రకరకాల లక్షణాలు, సూచికలు కన్పిస్తాయి. కొంతమంది మహిళలకి అరుదుగా ఏ రకమైన లక్షణాలు ఉండవు. ఒకవేళ మీరు ఇటువంటి మహిళ అయి, కోరుకోని ప్రెగ్నెన్సీ పొంది ఉంటే బహుశా మీకు వచ్చినది క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ అయి ఉంటుంది.

    క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి?

    క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ అంటే అర్థం సాధారణంగా గర్భం దాల్చినా అది తెలియని వ్యక్తి స్థితిని సూచిస్తుంది. దీన్నే “రహస్య గర్భం” అని కూడా పిలుస్తారు. ఈ స్థితిలో ఆ మహిళ కేవలం ప్రసవం నొప్పులు మొదలైనప్పుడే తను గర్భవతని గ్రహిస్తుంది.

    చాలామంది మహిళలు సాధారణంగా నాలుగు నుండి పన్నెండు వారాల మధ్యలో వారు గర్భవతి అని తెలుసుకుంటారు. అదికూడా ప్రెగ్నెన్సీ లక్షణాలను చూపించినట్టయితే లేదా వారి పిరియడ్ను మిస్ అయితే ఇలా తెలుసుకుంటారు. కానీ మీకు వచ్చినది క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ అయితే ఏ రకంగానూ మీరు గర్భవతి అని అనుమానించడం సాధ్యమవదు. మీ ప్రెగ్నెన్సీ పరీక్ష సరైనది కాకపోవచ్చు అనుకుంటారు. ఇంకా ఇది ప్లాన్ చేయని ప్రెగ్నెన్సీ ఏమో అందుకని ఏ రకమైన ప్రెగ్నెన్సీ లక్షణాలు లేవు లేదా గర్భాన్ని ఏదో వైరస్ సోకినట్టు తప్పుగా భావించే అవకాశం కూడా ఉంటుంది.

    గర్భవతి అయ్యి కూడా తెలియకుండా ఉండటం ఎలా సాధ్యపడుతుంది?

    పిల్లలు ఉన్న చాలామంది మహిళలకి మరొక స్త్రీ గర్భవతి అయితే తనకి తెలియకుండా ఉంటుందని నమ్మడం కష్టం. చాలా తరచుగా, చాలామటుకు ఇబ్బంది పెట్టే లక్షణాలైన పిరియడ్స్ రాకపోవడం. ప్లానింగ్ లేకుండా గర్భం దాల్చడం, బరువు పెరగడం ఇవన్నీ మీ శరీరం కొత్త జీవికి ప్రాణం పోస్తోందనడానికి స్పష్టమైన గుర్తులు.

    • మీరు ఇంకా నమ్మలేకపోతూ ఉంటే.. ఒక గర్భవతి మహిళకి తన పరిస్థితి ఏంటో తెలియకుండా ఉండే ఈ కింది సందర్భాలని పరిగణించండి:
    • మీరు కుటుంబ నియంత్రణ పద్ధతులని పాటిస్తే లేదా గర్భ నిరోధక మాత్రలని క్రమంగా, సరిగ్గా తీసుకుంటూ ఉంటే, మీరు గర్భవతి కావచ్చు అని అనుకోకపోవచ్చు.
    • చాలామంది స్త్రీలలో ప్రెగ్నెన్సీకి సంబంధించి మొదటి అలాగే అతి ముఖ్యమైన లక్షణాలలో ఒకటి పిరియడ్ మిస్సవ్వటం.
    • గర్భం దాల్చాక, దాదాపు రెండు వారాలు తర్వాత, మీ బిడ్డ గర్భాశయంలో ఒకపక్క అతుక్కున్నప్పుడు మీకు ఇంప్లాంటేషన్ రక్తస్రావం జరగవచ్చు. కొంతమంది మహిళలు, ముఖ్యంగా సాధారణంగా ఎక్కువ రక్తస్రావం జరగని వారు దీన్ని వారి పిరియడ్‌గా భావిస్తారు.
    • మీకు ఇదివరకు ప్లాన్ లేకుండా వచ్చిన ప్రెగ్నెన్సీ యొక్క అనుభవం ఉండి ఉండవచ్చు అలాగే ప్రెగ్నెన్సీ పరీక్షని చాలా త్వరగా చేసుకుని ఉండవచ్చు.
    • మీకు పొద్దున్నే వికారం, వాంతులు లేదా రొమ్ములు సున్నితంగా మారి నొప్పులు పుట్టటం వంటి ప్రెగ్నెన్సీ యొక్క సాధారణ లక్షణాలు ఏవీ లేకుండా ఉంటే, మీరు గర్భవతి అని మీకు తెలియకపోవచ్చు.
    • మీరు ఏమీ పెద్దగా అదనపు బరువు పెరగరు లేదా మీ బేబీ బంప్ కన్పించేంత పెద్దదిగా పెరగదు.
    • ఒకవేళ మీ బిడ్డ మరీ చురుకుగా లేకుండా ఉంటే, బిడ్డ కదులుతున్నట్లు మీకు పెద్దగా అన్పించకపోవచ్చు.
    • గతంలో గర్భం దాల్చడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నవారు లేదా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉండి గర్భం దాల్చడం కష్టమయ్యే మహిళలు వారు గర్భవతని గుర్తించకపోవచ్చు.
    • మానసిక ఒత్తిడి, భయం అలాగే అవమాన భావన ఒక మహిళకి తను ప్రెగ్నెంట్ అని అంగీకరించటాన్ని లేదా ఒప్పుకోవటాన్ని కష్టతరం చేస్తుంది.

    క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ యొక్క లక్షణాలు ఏమిటి?

    క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ వచ్చిన వారు సాధారణ గర్భం లేదా ప్లానింగ్ లేని గర్భం వచ్చిన వారి లక్షణాలనే కలిగి ఉంటారు. కానీ ముఖ్యమైన తేడా ఏంటంటే అటువంటి మహిళకి తనకొచ్చే లక్షణాలు ప్రెగ్నెన్సీ వల్ల వస్తున్నాయి అన్నది తెలియదు. ఉదాహరణకి.. ఏదో ప్రత్యేక ఆహారం తిన్నందువల్ల తనకి ఒంట్లో బాలేదని లేదా ఇంకా నిద్ర అవసరం కాబట్టి తొందరగా అలిసిపోయామని ఇలా అనుకోవచ్చు. క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ యొక్క ఇతర లక్షణాలు:

    • పిరియడ్స్ క్రమంగా రాకపోవటం
    • రొమ్ములలో నొప్పి, వాపు లేదా సున్నితత్వం
    • కొద్దిగా రక్తస్రావం లేదా స్పాటింగ్ జరగటం
    • వికారం మరియు/లేదా వాంతులు
    • అలసిపోవటం
    • వాపు
    • తిమ్మిరి లేదా క్రాంప్స్
    • మలబద్ధకం
    • ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళాల్సి రావటం
    • పడిశం
    • ఆకలి లేదా ఏదన్నా తినాలన్న కోరికలలో హఠాత్తుగా మార్పులు రావటం

    ఈ క్రిప్టిక్ ప్రెగ్నెన్సీలు ఎంత తరచుగా వస్తూ ఉంటాయి?

    ప్రెగ్నెన్సీ అన్నది ప్రతి మహిళని తనదైన రీతిలో ప్రభావితం చేస్తుంది. కొంతమంది యువతులు గర్భం దాల్చిన కొద్దిసేపటికే తాము గర్భవతా అని అనుమానిస్తారు. అదే మరికొందరు పిరియడ్ రాకుండా నెలలు గడిచినా ఎందుకని ఆలోచించకపోవచ్చు.

    క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ వచ్చే సందర్భాలు చాలా అసాధారణం. అధ్యయనాల ప్రకారం 475 మంది మహిళల్లో ఒక్కరు మాత్రమే తమకి ప్రెగ్నెన్సీ వచ్చిందని గర్భం దాల్చిన 20 వారాల వరకు తెలుసుకోలేక పోతారు. 2500 మంది మహిళల్లో ఒక్కరు మాత్రమే ప్రసవించే వరకు వారికి అసలు గర్భం వచ్చిందని తెలుసుకోలేరు.

    క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ వలన వచ్చే పరిణామాలు ఏమిటి?

    ఆడవారికి అలాగే అప్పుడే పుట్టిన పసిబిడ్డలకి పుట్టుక ముందు ఇచ్చే సంరక్షణ (ప్రీనేటల్ కేర్) ఇంకా తరచుగా పరీక్షల వలన చాలా ప్రయోజనం ఉంటుంది.

    గర్భవతి మహిళకి తను గర్భం దాల్చినట్లు తెలియకపోతే, ఆమె అలాగే ఆమె పుట్టబోయే బిడ్డ అవసరమైన సంరక్షణని పొందలేరు. దీనివలన గర్భవతి అయిన అమ్మాయి అలాగే బిడ్డ ఇద్దరూ అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది.

    క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ వచ్చిన మహిళల్లో ఎక్కువ శాతం మంది ప్రొఫెషనల్ నిపుణుల సాయం లేకుండానే ఇంటి వద్దనే లేదా ఎక్కడైనా జన్మనిస్తారు. అస్సలు ఊహించనప్పుడు బిడ్డని కనాల్సి రావటం చాలా బాధాకరమైన అనుభవం కావచ్చు. అది మానసిక ఆరోగ్య సమస్యలకి కూడా దారితీయవచ్చు.

    క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ ద్వారా పుట్టిన పిల్లలకి, సాధారణ గర్భధారణ సమయంలో కూడా ప్రీనేటల్ కేర్ అందుబాటులో లేని తల్లులకి పుట్టిన చాలామంది పిల్లలలాగా, సమయానికి ముందే పుట్టే, తక్కువ బరువుతో పుట్టే లేదా వారి పిండ వయస్సుకి సరిపడేదానికన్నా సన్నగా జన్మించే రిస్కులు ఎక్కువగా ఉంటాయి. క్రిప్టిక్ ప్రెగ్నెన్సీలలో పురిటి సమయంలోనే బిడ్డలు చనిపోవటం, పుట్టాక కూడా మరణించటం, అలాంటి పిల్లల పట్ల నిర్లక్ష్యంతో వ్యవహరించటం వంటి ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

    చివరిమాట

    క్రిప్టిక్ ప్రెగ్నెన్సీకి సంబంధించి ముఖ్యమైన సమస్య ఏంటంటే.. ఈ లక్షణాలన్నీ మహిళల్లో చాలా సాధారణంగా ఉంటూనే ఉంటాయి. అందుకని డాక్టరుకి అల్ట్రాసౌండులో గర్భాశయం పెద్దగా విస్తరించి అలాగే పిండం స్థిరంగా నిలబడి కన్పిస్తే కానీ ఆ మహిళ గర్భవతి అని తెలియకపోవచ్చు. క్రిప్టిక్ ప్రెగ్నెన్సీలని ఆపటానికి చేయగలిగిన ఒకటే విషయం మహిళలు గర్భనిరోధక పద్ధతిని మరింత జాగ్రత్తగా వాడాలి. అంతవరకూ క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ వచ్చిన మహిళని గర్భవతా కాదా అన్నది గుర్తించడం కష్టం.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Sarada Ayyala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.