Parenting Tips
27 July 2023 న నవీకరించబడింది
మీ పిల్లలు మంచివాళ్లుగా ఎదిగారా? లేక చెడ్డవాళ్లుగా మారారా? అనే దానిపై మీ పెంపక విధానం అనేది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒక సందర్భంలో బ్యాడ్ పేరెంటింగ్ స్టైల్ అనిపించేది ఒకానొక సందర్భంలో గుడ్ పేరెంటింగ్ స్టైల్ అనిపించొచ్చు. అందుకోసమే వివిధ పేరెంటింగ్ స్టైల్స్ గురించి తెలుసుకోవడం అవసరం. పెంపక విధానం అనేది ఈ నాలుగు కేటగిరీలుగా వర్గీకరించబడింది.
ఇది ఇతర పెంపక విధానాల నుంచి ఈజీగా వేరు చేయబడుతుంది. ఇది స్ట్రిక్ట్ పేరెంటింగ్‌గా కూడా సూచించబడుతుంది. నిరంకుశ శైలి పిల్లలు ఎటువంటి ప్రశ్నలు వేయకుండా కామ్‌గా ఉండాలని ఆశిస్తుంది. పిల్లలు ఏదైనా ప్రశ్నించినపుడు ఎందుకు అని వివరించే బదులు ‘నేను చెప్పాను కదా’ అనే సమాధానం ఇస్తారు. ఇటువంటి సందర్భాల్లో పిల్లల్లో అవిధేయత శిక్షించబడుతుంది. పిల్లలకు వారి సొంత ఎంపికల నుంచి ఎన్నుకునే అవకాశం మరియు తప్పుల నుంచి నేర్చునే అవకాశం ఉండదు. ఒక పిల్లవాడు ఈ నియమాలను పాటించేందుకు తగినవాడు కావచ్చు. కానీ సామాజిక పరిస్థితులలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వారు తక్కువ ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు.
ఈ పేరెంటింగ్ స్టైల్ అనేది పైన పేర్కొన్న అథారిటేరియన్ పేరెంటింగ్ స్టైల్ కంటే కొంచెం సౌమ్యంగా ఉంటుంది. ఇందులో పేరెంట్స్ పిల్లలతో రూల్స్, మరియు శిక్షల గురించి చర్చిస్తారు. మరింత బాధ్యతతో ఉంటారు. ఈ సందర్భంలో శిక్షలు ఖరారు చేసే ముందు పిల్లలు వారి అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకోమని తల్లిదండ్రులను అడిగే అవకాశం ఉంటుంది. ఇది బాగా నమ్మకంగా ఉండే పిల్లలకు సమర్థవంతమైన పెంపకవిధానంగా పరిగణించబడుతుంది. ఈ విధానం మీ పిల్లాడికి సరిగ్గా సూట్ కాకపోతే మీ పిల్లాడు ఏదైనా బిహేవియరల్ సమస్యతో బాధపడుతున్నాడో మీ వైద్యుడికి ఓసారి చూపించండి.
ఈ తరహా పెంపకవిధానంలో పిల్లలతో మరింత స్నేహంగా మెలుగుతుంటారు. వారు పిల్లలతో ప్రేమగా ఉన్నప్పటికీ కొన్ని సరిహద్దులను ఏర్పరుచుకుని ఉంటారు. మరియు వారు పిల్లలను మందలించేందుకు కనీస ప్రయత్నం చేస్తారు. ఈ పేరెంటింగ్ విధానం పిల్లల స్వేచ్ఛ మరియు ఆనందాన్ని ఎంఫైసైజ్ చేస్తుంది. ఈ విధానాన్ని ఉపయోగించే తల్లిదండ్రులు వారి పిల్లలతో హృదయపూర్వకంగా ఉంటూ స్థిరమైన సంభాషణను నిర్వహిస్తారు. ఏదేమైనా ఈ విధమైన పేరెంటింగ్ విధానంతో పిల్లలు కాలక్రమేణా అపరాధభావనను పెంచుకోవచ్చు. ఏదైనా అధికారాలను ఎదుర్కోవడంలో కష్టపడవచ్చు.
ఈ శైలి నిరంకుశ పెంపక విధానానికి పూర్తిగా వ్యతిరేఖం. ఇందులో ఎటువంటి స్పష్టత ఉండదు. ఈ తల్లిదండ్రులు పిల్లల ప్రాథమిక అవసరాలైన ఆహారం, క్లాతింగ్, షెల్టర్ మాత్రమే చూసుకుంటారు. తమ పిల్లల రోజూవారీ జీవితంలో ఎక్కువగా ఇన్వాల్వ్ కారు. ఈ స్టైల్ ప్రతికూలతలు ఏమిటంటే ఈ శైలి వలన పిల్లలు పూర్ సెల్ఫ్ రెగ్యులేషన్‌ను కలిగి ఉంటారు. మరియు ఇతరులతో కమ్యూనికేట్ చేసేందుకు ఇబ్బంది పడతారు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: మైండ్‌ఫుల్ పేరెంటింగ్: పద్ధతులు & ప్రయోజనాలు
ప్రతి పెంపక విధానం కొన్ని లాభాలు మరియు నష్టాలను కలిగి ఉంటుంది. మరియు మీ పిల్లల వ్యక్తిత్వాన్ని బట్టి కూడా ఈ ప్రభావం మారొచ్చు. మీరు పేరెంటింగ్ స్టైల్స్‌పై ప్రాథమిక అవగాహన ఏర్పరచుకున్న తర్వాత మీకు మరియు మీ పిల్లలకు సరిపోయే సరైన విధానాన్ని ఎంచుకోవడం కీలకం.
మీకు ఇది కూడా నచ్చుతుంది: స్టే ఎట్ హోమ్ పేరెంట్ గా ఉండడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి?
Parenting tips in telugu, Impact of parenting on kids development in telugu, Mindful parenting tips in telugu, Try these parenting tips for your kids in telugu.
Yes
No
Written by
Nayana Mukkamala
Get baby's diet chart, and growth tips
మీ బిడ్డ నిద్రపోవడానికి సహాయపడే మూడు అత్యుత్తమ టిప్స్ (Top Three Tips to Help Your Baby Sleep in Telugu?)
మీ శిశువు పగటిపూట కునుకు తీయడానికి నిరాకరించినప్పుడు ఏమి చేయాలి? (What to Do If Your Child Refuses to Take a Nap in Telugu?)
మీ బిడ్డలో ఐరన్ లోపం ( Iron Deficiency in Your Baby in Telugu)
6-నెలల చెక్-అప్ : టీకాలు మరియు మరిన్ని (The 6 Month Check-up: Vaccinations and More in Telugu)
మీ బిడ్డ పుట్టిన తర్వాత రుతుస్రావం, మీ పీరియడ్స్ మరియు అండోత్సరం (ఓవ్యులేషన్ ) (Menstruation, Periods, and Ovulation After Baby in Telugu)
కంటి ఫ్లూ హెచ్చరిక: మీరు తెలుసుకోవలసిన సీజనల్ ఎపిడెమిక్ (Eye Flu Alert: The Seasonal Epidemic You Need to Know About in Telugu)
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |