hamburgerIcon
login
STORE

VIEW PRODUCTS

ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Growth & Development arrow
  • మీ పిల్లల అభివృద్ది కోసం ముఖ్యమైన గేమ్స్, యాక్టివిటీస్ (Games and Activities that are Essential for Your Little One's Development in Telugu) arrow

In this Article

    మీ పిల్లల అభివృద్ది కోసం ముఖ్యమైన గేమ్స్, యాక్టివిటీస్ (Games and Activities that are Essential for Your Little One's Development in Telugu)

    Growth & Development

    మీ పిల్లల అభివృద్ది కోసం ముఖ్యమైన గేమ్స్, యాక్టివిటీస్ (Games and Activities that are Essential for Your Little One's Development in Telugu)

    25 July 2023 న నవీకరించబడింది

    మొదటి ఐదేళ్లలో పిల్లల మెదడు చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. మరి ఈ సమయంలో ఆరోగ్యకరమైన అభివృద్ధిని ఎలా సాధించాలి? దీనికి అసలు సమాధానం మీకూ, మీ పిల్లలకు మధ్య సరైన ఇంటరాక్షన్ ఉండటమే. ఎందుకంటే మీరు పిల్లలతో ఇంటరాక్ట్ అయిన ప్రతీసారి, వారి కళ్లల్లో వెలుగులు నింపడమే కాదు, వారి మెదడుపై కూడా ప్రభావం చూపిస్తారు. బాల్యంలో మీ ఇంటరాక్షన్ సానుకూలంగా ఉంటే, అనుబంధాలను పెంచుతుంది. అది వారిలో ఆసక్తి పెంచడమే కాదు, జీవితకాలంపాటూ నేర్చుకోవడానికి వారిని సిద్ధం చేస్తుంది.

    మీ పిల్లల అభివృద్ధికి మీరు ఎలా తోడ్పడవచ్చు? (How Can You Support Your Child's Development in Telugu?)

    మీ పిల్లల కోసం ఇక్కడ ఉన్న కొన్ని యాక్టివిటీస్‌ని మీరు ప్రయత్నించవచ్చు.

    1. గెస్సింగ్ గేమ్ ఆడటం (Play the Guessing Game):

    మీ కుటుంబ సభ్యులు లేదా బంధువుల్లో ఒకరి పేరును గెస్ చేయమని అడగాలి. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి కొన్ని హింట్స్ ఇవ్వాలి. పిల్లల్లో క్లూస్ అన్నీ జోడిస్తూ క్రిటికల్ థింకింగ్ అభివృద్ధి చేయడానికి ఈ యాక్టివిటీ సాయపడుతుంది.

    2. పండ్లతో ఆటలు (Pick Out Fruits):

    పండ్ల గురించి వారిని అడగండి. ‘యాపిల్ తియ్యగా ఉంటుందా?’, ‘ఆరెంజ్ పుల్లగా ఉంటుందా?’ లాంటివి వారికి తెలియకపోయినా, వాటి రుచి ఎలా ఉందో పిల్లలు తమ సొంత మాటల్లో చెప్పేలా ప్రోత్సహించాలి. ఈ ఎక్సర్‌సైజ్‌తో పిల్లల్లో రీజనింగ్ స్కిల్స్, వొకాబులరీ పెరుగుతుంది.

    3. ఏవి ఎలా పనిచేస్తాయో చెప్పాలి (Share How Things Work):

    చేతులు కడుక్కునేప్పుడు లేదా స్నానం చేసేప్పుడు వేడి నీళ్లు, చల్ల నీళ్ల గురించి పిల్లలకు చెప్పాలి. రెండింటినీ కలిపితే నీళ్లు వెచ్చగా ఎలా అయ్యాయో చెప్పాలి. సబ్బుతో చేతులు శుభ్రంగా ఎలా మారుతాయి, టవల్‌తో తుడుచుకుంటే చేతులు పొడిగా ఎలా అవుతాయనేవి చెప్పాలి. ఇలా ఏవి ఎలా పనిచేస్తాయో చెప్పడం ద్వారా, రోజూ ఎలా శుభ్రంగా ఉండాలో పిల్లలు నేర్చుకుంటారు.

    4. మెట్లను లెక్కపెట్టడం (Counting the Stairs):

    మీ పిల్లలు పైకి ఎక్కుతున్నప్పుడు లేదా కిందకు దిగుతున్నప్పుడు చేతులు పట్టుకొని ఇద్దరూ కలిసి మెట్లను లెక్కపెట్టాలి. ఈ ఎక్సర్‌సైజ్ వల్ల వారికి అంకెల గురించి తెలుస్తుంది. బేసిక్ మ్యాథ్స్ నేర్చుకోవడం ఇక్కడే ప్రారంభం అవుతుంది.

    5. రైమ్స్ చెప్పండి (Make Rhymes):

    ఆహారం తినిపించేప్పుడు ఆహారానికి సంబంధించిన చిన్న రైమ్ మీరే క్రియేట్ చేయండి. అందులో మీ పిల్లల ఫేవరెట్ ఫుడ్ ఉండాలి. రైమ్‌తో పాటూ ఫుడ్ ఎంజాయ్ చేస్తారు.

    చివరగా (In the End):

    పైన చెప్పిన యాక్టివిటీస్‌తో నేర్చుకోవడం అనేది వినోదంగా ఉండటమే లక్ష్యంగా చేసుకోవాలి. పిల్లల్లో కాగ్నిటీవ్ డెవలప్‌మెంట్‌తో పాటు భాషాభివృద్ధికి ఉపయోగపడుతుంది.

    సూచించబడినవి:

    • మీ చిన్నారి మేథస్సుకు పదునుపెట్టే ఆటలు మరియు యాక్టివిటీలు
    • మీ చిన్నారి మేథస్సుకు పదునుపెట్టేందుకు మీ రోజువారీ కార్యకలాపాల్లో చేర్చుకోదగిన ఆటలు మరియు యాక్టివిటీలు ఏమిటి?

    Tags:

    Games and activities for your kids in telugu, games for your baby in telugu, brain development games for your baby, brain development activities in telugu.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Dhanlaxmi Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.