hamburgerIcon

Orders

login

Profile

SkinHairFertilityBabyDiapersMore
Lowest price Ever for Children's Day! Use Code: FIRST10Lowest price Ever for Children's Day! Use Code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • మీ శిశువు పగటిపూట కునుకు తీయడానికి నిరాకరించినప్పుడు ఏమి చేయాలి? (What to Do If Your Child Refuses to Take a Nap in Telugu?) arrow

In this Article

    మీ శిశువు పగటిపూట కునుకు తీయడానికి నిరాకరించినప్పుడు ఏమి చేయాలి? (What to Do If Your Child Refuses to Take a Nap in Telugu?)

    Baby Care

    మీ శిశువు పగటిపూట కునుకు తీయడానికి నిరాకరించినప్పుడు ఏమి చేయాలి? (What to Do If Your Child Refuses to Take a Nap in Telugu?)

    27 July 2023 న నవీకరించబడింది

    పగటిపూట కొన్ని గంటలు మాత్రమే నిద్రపోవచ్చు, కానీ పిల్లల మూడ్‌ను మెరుగుపరుస్తుంది. అలాగే ఏడుపు, చికాకును తగ్గిస్తుంది. పరిశోధన ప్రకారం, ప్రతిరోజూ పగటిపూట నిద్రపోయే పిల్లలు తక్కువ సార్లు అనారోగ్యానికి గురవుతారు. వారు పెరిగేకొద్దీ స్థూలకాయానికి గురయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే మెరుగైన దృష్టిని కలిగి ఉంటారు. రాత్రి నిద్రలో కొరత ఏర్పడితే కూడా పగటిపూట నిద్ర భర్తీ చేస్తుంది. మొత్తం నిద్రలో కొంచెం కొరత ఏర్పడినా పిల్లలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. చురుకుదనాన్ని తగ్గిస్తుంది, అలసటను పెంచుతుంది.

    పిల్లలు పగటిపూట కునుకు తీయకపోవడానికి కారణాలు, పరిష్కారం (Reasons Why Kids Refuse to Take Naps & Solution in Telugu)

    1. ప్రస్తుతం నిద్రించే సమయంలో మార్పు (Change in the Current Nap Schedule)

    మీ బిడ్డ వేగంగా ఎదిగే కొద్దీ, బాబు/పాప పాకడం, ఘన ఆహారాన్ని తినడం నేర్చుకునేటప్పుడు మార్పులు ఉంటాయి, అలాగే నిద్ర విధానంలో కూడా అదే రకంగా ఉంటుంది. నిద్ర విధానంలో మార్పును గుర్తించడానికి, మారిన అవసరాలకు అనుగుణంగా సమయాన్ని మళ్లీ సర్దుబాటు చేయడానికి నిద్ర వేళల్లో అలసటకు సంబంధించి ఏవైనా సంకేతాలు ఉన్నాయా అని గమనించండి.

    2. సరైన నిద్ర షెడ్యూల్ లేకపోవడం (Lack of Proper Sleep Schedule)

    వారాంతాల్లో, వారంలోని మిగిలిన రోజులలో నిద్ర వేళల్లో మార్పులు ఉంటే, మీ శిశువు కొంచెం గజిబిజిగా ఉండవచ్చు. డే కేర్ సెంటర్‌లో వేరొక దినచర్య, ఇంట్లో నిద్రపోయిన సమయాలు వేరుగా ఉండటం కూడా కారణం కావచ్చు. నిర్ణీత సమయంలో అరగంట వ్యవధిలోపే మీ పిల్లల కోసం స్థిరమైన నిద్ర సమయాన్ని అలవాటు చేయడానికి ప్రయత్నించండి.

    3. మీ బిడ్డ బాగా అలసిపోవడం (Your Child is Overtired)

    ఒకవేళ మీరు మీ పిల్లల అలసట సంకేతాలను గుర్తించకపోతే, బాబు/పాపలో అలసట అధిక స్థాయికి వెళ్లవచ్చు. ఈ సందర్భంలో, వారు కృత్రిమ శక్తి స్థితిని అనుభవించవచ్చు, దీని ఫలితంగా గజిబిజి, విసుగు, ఏడుపు కలగవచ్చు.

    ఈ పరిస్థితిని పరిష్కరించడానికి, మీ పిల్లలకు నిద్ర వచ్చే సమయాలను ట్రాక్ చేయడం నేర్చుకోండి. సాధారణ నిద్ర సమయం దగ్గర పడుతుండగా, ప్రవర్తన లేదా హావభావాలలో ఏదైనా మార్పు ఉందేమో గమనించండి. అటువంటి మార్పునకు సంబంధించిన సంకేతాలను చూసిన వెంటనే మీ బిడ్డను నిద్రపుచ్చడానికి ప్రయత్నించండి.

    కునుకు ఎంతసేపు ఉండాలి? (How Long Should a Nap Lasts?)

    పిల్లలు పగటిపూట సాధారణంగా 1-2 గంటల వరకు నిద్రపోతారు. అయితే పగటిపూట అంత కంటే ఎక్కువ సేపు నిద్రపోతే, రాత్రి ఆలస్యంగా నిద్రపోతారు. ఇలాంటి సందర్భంలో, నిద్ర వేళలను సరి చేయడానికి, అలాగే క్రమంగా ఉంచడానికి మధ్యాహ్న నిద్ర సమయాన్ని తగ్గించండి.

    Tags:

    Day time naps for kids in telugu, Nap Schedule for your baby in telugu, Baby nap schedule in telugu, How long nap schedule lasts in telugu.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Nayana Mukkamala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.