


Pregnancy Best Foods
3 November 2023 న నవీకరించబడింది
గర్భవతి అయిన మహిళ ఆనందానికి, సంతోషానికి, ఉత్సాహానికి అవధులు ఉండవు. అయితే అనేక సందేహాలు కూడా ఉంటాయి. ఏం తినాలి? ఏం తినకూడదు? ఏం తింటే కడుపులో పెరుగుతున్న బిడ్డకు మంచిది? లాంటి సందేహాలు ఉంటాయి. చాలావరకు తరతరాలుగా పాటిస్తున్న సలహాలు, సూచనలన్నీ పెద్దల నుంచి వస్తుంటాయి. అయితే ఈ సలహాలు, సూచనల్లో విరుద్ధమైనవి ఉంటే అది గందరగోళానికి దారితీయొచ్చు. ఇలాంటి సందర్భంలో కాబోయే తల్లులకు ఏది మంచిదో, ఏది కాదో చెప్పేందుకు అనేక పరిశోధనలు తోడ్పడుతుంటాయి. ఈ ఆర్టికల్‌లో మేము భారతదేశంలోని వంటకాల్లో ఒకటైన బేసిల్ సీడ్స్ లేదా సబ్జా గింజల ప్రయోజనాలను, ప్రభావాలను మైక్రోస్కోపిక్ పరిశీలనలో వివరిస్తాం. గర్భవతులకు ఇది ఎంత మేలు చేస్తుందో, ఎలా హానికలిగిస్తుందో మీరు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోవచ్చు.
సబ్జా గింజల్ని బేసిల్ సీడ్స్, టుక్మరియా సీడ్స్ అని కూడా పిలుస్తారు. ఆయుర్వేదిక్, చైనీస్ మెడిసిన్‌లో ఇవి ఓ భాగం. ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లోని ఉష్ణమండల ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా పండుతాయి. సబ్జా గింజలు చూడటానికి నువ్వులలా కనిపిస్తాయి. కానీ నలుపు రంగులో ఉంటాయి. స్వీట్ బేసిల్ నుంచి సబ్జా గింజల్ని సంగ్రహిస్తారు. వీటిని నేరుగా తినడం కష్టం. నమలడానికి ఇబ్బందిగా ఉంటుంది. నీళ్లల్లో 15 నిమిషాలు నానబెట్టి తినాలి. సబ్జా గింజలు నీళ్లల్లో నానితే గింజల చుట్టూ గుజ్జు ఏర్పడుతుంది.
100 గ్రాముల సబ్జా గింజలలోని పోషక విలువలు ఈ కింది విధంగా ఉంటాయి-
|
కేలరీలు
|
23 |
|
కార్బోహైడ్రేట్స్
|
2.65 గ్రాములు |
|
పీచుపదార్థం |
3.9 గ్రాములు
|
|
క్యాల్షియం
|
177 మిల్లీ గ్రాములు |
|
పొటాషియం
|
462 మిల్లీ గ్రాములు |
|
ఐరన్
|
3.17 మిల్లీ గ్రాములు |
|
మొత్తం కొవ్వు
|
0.64 గ్రాములు |
|
సోడియం |
4 మిల్లీ గ్రాములు
|
|
చక్కెర
|
0.3 గ్రాములు |
|
ఫోలేట్
|
68 ug |
|
విటమిన్ బీ6
|
0.155 మిల్లీ గ్రాములు |
|
రైబోఫ్లేవిన్
|
0.076 మిల్లీ గ్రాములు |
|
నీరు
|
92.1 గ్రాములు |
బేసిల్ సీడ్స్‌లో ముఖ్యమైన పోషకాలు ఉన్నప్పటికీ, గర్భవతిగా ఉన్నప్పుడు వీటిని తినమని సూచించరు. సబ్జా గింజలు శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలను తగ్గిస్తాయని వైద్య రంగ నిపుణుల్లో ఏకాభిప్రాయం ఉంది. ఇది గర్భధారణ సమయంలో కీలకమైన హార్మోన్ అని తెలిసిందే. గర్భవతి కడుపులోని పిండంలో నాళాలు ఏర్పడటానికి, శిశువుకు పోషకాలను బదిలీ చేయడానికి ఈస్ట్రోజెన్ కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల, ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం శిశువు యొక్క పెరుగుదలకు, అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది.
ఇంకా సీ సెక్షన్ డెలివరీకి ముందు సబ్జా గింజలు తీసుకుంటే, తీవ్ర రక్తస్రావం ఏర్పడే అవకాశం ఉంది. ఇందుకు కారణం సబ్జా గింజలు రక్తాన్ని పల్చగా చేస్తాయని , రక్తం గడ్డకట్టడాన్ని నెమ్మది చేస్తుందని చెబుతుంటారు. కొన్ని జంతువులపై జరిగిన అధ్యయనాల్లో సబ్జా గింజలు వీర్యంపై ప్రతికూలంగా ప్రభావం చూపిస్తాయని, గర్భధారణలో సంకోచాలను ప్రేరిపిస్తుందని తేలింది. అందుకే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నా, గర్భవతి అయినా సబ్జా గింజల్ని అతిగా తినకపోవడమే మంచిది.
సబ్జా గింజలతో పలు రకాల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, గర్భిణీలపై ఇవి ప్రతికూల ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. కాబట్టి కాబోయే తల్లులు ఈ విషయాలు గుర్తుంచుకోవాలి.
జవాబు: గర్భవతులు సబ్జా గింజలు తింటే ఈస్ట్రోజెన్ స్థాయిల్ని తగ్గిస్తుంది. ఈస్ట్రోజెన్ ఒక సమగ్ర హార్మోన్. ఇది పిండంలో రక్తనాళాలు ఏర్పడటానికి సహాయపడుతుంది. బిడ్డకు కావాల్సిన పోషకాలను తల్లి నుంచి బదిలీ చేస్తుంది. ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గితే, పుట్టబోయే బిడ్డపై హానికరమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే సబ్జా గింజలు కడుపులోని పిండానికి హాని కలిగించవచ్చు.
జవాబు: గర్భధారణ విషయానికి వస్తే, సబ్జా గింజలు శరీరానికి చలువను చేస్తాయి.
జవాబు: సబ్జా గింజలు ఋతుస్రావం క్రమబద్ధతను మెరుగుపరుస్తాయి. తిమ్మిరిని తగ్గిస్తాయి.
Yes
No

Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips











డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)