నిస్సందేహంగా, బిడ్డను కనడం ప్రతీ మహిళ జీవితంలో అద్భుతమైన సందర్భం అనే చెప్పాలి. అయితే ప్రతీసారి గర్భధారణ అందమైన, నొప్పిలేని అనుభవం కాదన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. అందుకే దీని నుంచి బయటడేందుకు ప్రీనేటల్ మసాజ్ సాయపడుతుంది. ప్రీనేటల్ మసాజ్ అంటే మహిళ గర్భవతిగా ఉన్న సమయంలో చేయించుకునే మసాజ్. గర్భవతిగా ఉన్నప్పుడు భంగిమలో మార్పులు రావడం, బరువు పెరగడం వల్ల కలిగే నొప్పుల్ని తగ్గించుకోవడానికి ఈ మసాజ్ ఉపయోగపడుతుంది.
ప్రీనేటల్ మసాజ్ సాధారణంగా చేసే మర్దన లాంటిదే. ఉద్రిక్తతకు కారణమయ్యే కండరాలను సడలించడం, చలనాన్ని పెంచడం, రక్తప్రసరణను మెరుగుపరచడం, నొప్పి నుంచి ఉపశమనం కలిగించడం కోసం ఈ మసాజ్ చేస్తారు. అయితే ప్రీనేటల్ మసాజ్ విషయానికి వస్తే గర్భవతులకు, వారి శరీర మార్పులకు అనుగుణంగా ఉంటుంది. కడుపులో బిడ్డను మోస్తుండటం వల్ల వారి గురుత్వాకర్షణ కేంద్రం మారుతుంది. దీని వల్ల మెడ, భుజాలు, వెన్ను, ఉదర కండరాలపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. మరోవైపు.. గర్భం కారణంగా పెల్విక్ జాయింట్స్ స్థిరత్వం తక్కువగా ఉంటుంది. ఇది పెల్విస్‌ను ముందుకు లాగడం ద్వారా భంగిమ కూడా మారుతుంది. వెన్ను దిగువ భాగంలో మీకు నొప్పి కూడా ఉండొచ్చు. ప్రీనేటల్ మసాజ్ ద్వారా ఇలాంటి నొప్పిని తగ్గించుకోవచ్చు. మసాజ్ చేసే సమయంలో, అనుభవజ్ఞులైన, ప్రొఫెషనల్ ప్రీనేటల్ మసాజ్ థెరపిస్ట్ గర్భవతులకు వాపు, నొప్పి ఉన్న దగ్గర ఉపశమనం కలిగేందుకు కొన్ని రకాల మసాజ్ టెక్నిక్స్ ఉపయోగిస్తారు. అంతేకాదు, వారికి ఎక్కడ మర్దన చేయకూడదో బాగా తెలుసు.
ఇంట్లోనే ప్రీనేటల్ మసాజ్ చేసుకోవాలనుకుంటే, పాదాలను మృదువుగా మర్దన చేయాలి. ఇందుకోసం ఏదైనా లోషన్ ఉపయోగించవచ్చు. పాదం పైన లోషన్ అప్లై చేసి, మృదువుగా ఒత్తిడి కలిగిస్తూ మసాజ్ చేయాలి. పాదం నుంచి చీలమండల వైపు, చీలమండల చుట్టూ చిన్న సర్కిల్స్ చేస్తూ మర్దన చేయాలి. రిలాక్స్ అయ్యేందుకు సాయపడుతుంది. ఆ తర్వాత వెనుకవైపు రబ్ చేయాలి. మసాజ్ కోసం మీ భాగస్వామి సాయం తీసుకోవాలి. మీ భాగస్వామిని రెండు చేతులను ఉపయోగించి పైకి, కిందకు స్ట్రోక్ ఇవ్వమని చెప్పండి. ఆ తర్వాత మీరు ఒట్టి చేతితో భుజంపై మర్దన చేయవచ్చు. మెడలో ఒక వైపు సున్నితంగా ఒత్తిడి కలిగిస్తూ మర్దన చేయాలి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీ సమయంలో మీరు ప్రయత్నించడానికి సురక్షితమైన టాప్ 10 బ్యూటీ ట్రీట్‌మెంట్స్
ప్రీనేటల్ మసాజ్‌తో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఇందుకు సంబంధించి గర్భవతులపై పరిశోధన లేదా పరీక్షల్ని నైతిక కారణాల వల్ల చేయకూడదు. ప్రీనేటల్ మసాజ్ వల్ల కలిగే లాభాలపై సాక్ష్యాలన్నీ వృత్తాంతాలే. మరి ప్రీనేటల్ మసాజ్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోండి.
మీరు గర్భవతిగా ఉన్నప్పుడు మీ చేతులు, కాళ్లు, పాదాల్లో వాపు రావడానికి కారణం.. రక్తప్రసరణ తక్కువగా ఉండటమే. దీంతో పాటు, ఈ సమయంలో రక్త నాళాలపై ఒత్తిడి పెరగడం కూడా వాపు రావడానికి కారణమవుతుంది. అయితే ప్రినేటల్ మసాజ్ చేయడం మృదు కణజాలాన్ని ఉత్తేజపరచడంలో.. అదనంగా ఉన్న ద్రవాన్ని తరలించడంలో సహాయపడుతుందని వైద్యులు చెబుతుంటారు. ఫలితంగా.. వాపు తగ్గి, మీకు సౌకర్యంగా ఉంటుంది. మరి మీరు ప్రీనేటల్ మసాజ్ థెరపీకి వెళ్లాలా వద్దా అనే అంశంపై వైద్యులను సంప్రదించాలి. వారి సలహా మేరకే నిర్ణయం తీసుకోవాలి.
చాలా మంది మహిళలు గర్భధారణ సమయంలో దీర్ఘకాలిక నరాల నొప్పిని అనుభవిస్తారు. గర్భవతిగా ఉన్నప్పుడు, వీపు కింది భాగంలో, పెల్విక్-ఫ్లోర్ కండరాలపై గర్భాశయం ఒత్తిడి కలిగిస్తుంది. క్రమంగా.. ఈ ఒత్తిడి మీ కాలి కండరాలకు వ్యాపిస్తుంది. సయాటిక్ నరంపై ప్రభావం చూపినప్పుడు, మీ కాళ్లల్లో మీరు అకస్మాత్తుగా లేదా తీవ్రమైన నొప్పిని అనుభవించవచ్చు. కండరాల్లో ఒత్తిడిని సమర్థవంతంగా రిలీజ్ చేసేందుకు ప్రినేటల్ మసాజ్ థెరపీ ఉపయోగపడుతుంది. క్రమంగా.. నరాలలో వాపును తగ్గిస్తుంది.
మీరు గర్భవతిగా ఉన్నప్పుడు మీ శరీరంలో ఏవైనా భాగాల్లో ప్రభావం ఉన్నప్పుడు, ప్రీనేటల్ మసాజ్ మీ బిగుతు కండరాలను సడలించడం ద్వారా నడుము నొప్పిని కూడా తగ్గిస్తుంది. ఇది శరీరం అంతటా రక్త ప్రవాహాన్ని ప్రభావవంతంగా పెంచుతుంది. శరీరంలోని ఒత్తిడిని విడుదల చేస్తుంది.
గర్భవతి కావడం, గర్భధారణ దశల్ని చూడటం మహిళకు ఆహ్లాదకరమైన అనుభవమే. కానీ గర్భధారణ మహిళల్లో ఆందోళనను కూడా సృష్టిస్తుంది. ఎందుకంటే.. మహిళ జీవితంలో ఇదో కొత్త అధ్యాయం. శరీరంలో అనేక మార్పులు వస్తాయి. శరీరాన్ని కనెక్ట్ చేయడానికి, ఈ సమయంలో వచ్చే సహజమైన మార్పులకు అలవాటుపడుతూ, సౌకర్యవంతంగా ఉండడం నేర్చుకోవడానికి ప్రినేటల్ మసాజ్ మంచి మార్గం. తద్వారా ఆందోళన కూడా తగ్గుతుంది. అంతేకాకుండా, గర్భధారణ సమయంలో వచ్చే సాధారణ, ఊహించని మార్పులను మీకు వివరించడం ద్వారా థెరపిస్ట్ మీకు మరింత మేలు చేస్తారనే చెప్పాలి.
కడుపులో బిడ్డ పెరిగేకొద్దీ, గర్భవతులకు నాణ్యమైన నిద్ర పొందడం కష్టమవుతుంది. మసాజ్ థెరపిస్ట్ గర్భవతులకు ఉపయోగపడే సరైన పద్ధతులు పాటించడం, ఒత్తిడిని కలిగించడం ద్వారా నాడీ వ్యవస్థకు విశ్రాంతిని అందిస్తారు. మీ శరీరం ఫీల్ గుడ్ హార్మోన్లను మరింతగా ఉత్పత్తి చేయడానికి ప్రేరణ పొందుతుంది. ఫలితంగా.. మీరు మరింత రిలాక్స్‌గా ఉంటారు. రాత్రివేళల్లో బాగా నిద్రపోతారు.
ప్రీనేటల్ మసాజ్ చేయించుకోవాలన్న ఆలోచన ఉన్నట్టైతే ముందుగా వైద్యులను సంప్రదించాలి. గర్భధారణ సమయంలో మీ సంరక్షణ కోసం మీకు ప్రసూతి వైద్యులు లేదా నిపుణుల సలహాలు అవసరం. ఈ విషయంపై మీరు వైద్యులతో మాట్లాడవచ్చు. అయితే, కొన్ని రకాల రిస్కులు ఉన్న మహిళలు ప్రీనేటల్ మసాజ్‌కు దూరంగా ఉండాలి. ఈ ప్రమాద కారకాలను పరిగణలోకి తీసుకోవాలి:
ఒకవేళ వైద్యులు మీరు ప్రీనేటల్ మసాజ్ చేయించుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. మీరు శిక్షణ పొందిన, కొన్నేళ్ల అనుభవం ఉన్న, సర్టిఫైడ్ ప్రీనేటల్ మసాజ్ థెరపిస్ట్‌ను సంప్రదించాలి. మీకు వికారం, వాంతులు ఉన్నట్టైతే ప్రెగ్నెన్సీ మసాజ్ చేయించుకోకపోవడం మంచిది. కొంతమంది మసాజ్ థెరపిస్ట్‌లు అలాంటి లక్షణాలను తగ్గించడంలో మీకు సహాయం చేయగలిగినా, మీరు ప్రీనేటల్ మసాజ్ ఎవాయిడ్ చేయాలి. గర్భస్థ మావి విచ్ఛిన్నం అయ్యే రిస్క్ మీకు ఉన్నట్టైతే ప్రీనేటల్ మసాజ్ చేయించుకోకూడదు. ప్రినేటల్ మసాజ్ వల్ల అనేక ప్రయోజనాలను చూడవచ్చు. అలాగని, పైన చర్చించినట్లుగా, ఈ మసాజ్ ప్రతీ గర్భవతికి తగినది కాదన్న విషయం గుర్తుంచుకోండి. అందుకే మహిళలు ప్రీనేటల్ మసాజ్ చేయించుకోవాలనుకుంటే, ముందుగా వైద్యులతో మాట్లాడాలి.
నిస్సందేహంగా, బిడ్డను కనడం ప్రతీ మహిళ జీవితంలో అద్భుతమైన సందర్భం అనే చెప్పాలి. అయితే ప్రతీసారి గర్భధారణ అందమైన, నొప్పిలేని అనుభవం కాదన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. అందుకే దీని నుంచి బయటడేందుకు ప్రీనేటల్ మసాజ్ సాయపడుతుంది. ప్రీనేటల్ మసాజ్ అంటే మహిళ గర్భవతిగా ఉన్న సమయంలో చేయించుకునే మసాజ్. గర్భవతిగా ఉన్నప్పుడు భంగిమలో మార్పులు రావడం, బరువు పెరగడం వల్ల కలిగే నొప్పుల్ని తగ్గించుకోవడానికి ఈ మసాజ్ ఉపయోగపడుతుంది.
ప్రీనేటల్ మసాజ్ సాధారణంగా చేసే మర్దన లాంటిదే. ఉద్రిక్తతకు కారణమయ్యే కండరాలను సడలించడం, చలనాన్ని పెంచడం, రక్తప్రసరణను మెరుగుపరచడం, నొప్పి నుంచి ఉపశమనం కలిగించడం కోసం ఈ మసాజ్ చేస్తారు. అయితే ప్రీనేటల్ మసాజ్ విషయానికి వస్తే గర్భవతులకు, వారి శరీర మార్పులకు అనుగుణంగా ఉంటుంది. కడుపులో బిడ్డను మోస్తుండటం వల్ల వారి గురుత్వాకర్షణ కేంద్రం మారుతుంది. దీని వల్ల మెడ, భుజాలు, వెన్ను, ఉదర కండరాలపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. మరోవైపు.. గర్భం కారణంగా పెల్విక్ జాయింట్స్ స్థిరత్వం తక్కువగా ఉంటుంది. ఇది పెల్విస్‌ను ముందుకు లాగడం ద్వారా భంగిమ కూడా మారుతుంది. వెన్ను దిగువ భాగంలో మీకు నొప్పి కూడా ఉండొచ్చు. ప్రీనేటల్ మసాజ్ ద్వారా ఇలాంటి నొప్పిని తగ్గించుకోవచ్చు. మసాజ్ చేసే సమయంలో, అనుభవజ్ఞులైన, ప్రొఫెషనల్ ప్రీనేటల్ మసాజ్ థెరపిస్ట్ గర్భవతులకు వాపు, నొప్పి ఉన్న దగ్గర ఉపశమనం కలిగేందుకు కొన్ని రకాల మసాజ్ టెక్నిక్స్ ఉపయోగిస్తారు. అంతేకాదు, వారికి ఎక్కడ మర్దన చేయకూడదో బాగా తెలుసు.
ఇంట్లోనే ప్రీనేటల్ మసాజ్ చేసుకోవాలనుకుంటే, పాదాలను మృదువుగా మర్దన చేయాలి. ఇందుకోసం ఏదైనా లోషన్ ఉపయోగించవచ్చు. పాదం పైన లోషన్ అప్లై చేసి, మృదువుగా ఒత్తిడి కలిగిస్తూ మసాజ్ చేయాలి. పాదం నుంచి చీలమండల వైపు, చీలమండల చుట్టూ చిన్న సర్కిల్స్ చేస్తూ మర్దన చేయాలి. రిలాక్స్ అయ్యేందుకు సాయపడుతుంది.
ఆ తర్వాత వెనుకవైపు రబ్ చేయాలి. మసాజ్ కోసం మీ భాగస్వామి సాయం తీసుకోవాలి. మీ భాగస్వామిని రెండు చేతులను ఉపయోగించి పైకి, కిందకు స్ట్రోక్ ఇవ్వమని చెప్పండి. ఆ తర్వాత మీరు ఒట్టి చేతితో భుజంపై మర్దన చేయవచ్చు. మెడలో ఒక వైపు సున్నితంగా ఒత్తిడి కలిగిస్తూ మర్దన చేయాలి.
ప్రీనేటల్ మసాజ్‌తో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఇందుకు సంబంధించి గర్భవతులపై పరిశోధన లేదా పరీక్షల్ని నైతిక కారణాల వల్ల చేయకూడదు. ప్రీనేటల్ మసాజ్ వల్ల కలిగే లాభాలపై సాక్ష్యాలన్నీ వృత్తాంతాలే. మరి ప్రీనేటల్ మసాజ్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోండి.
మీరు గర్భవతిగా ఉన్నప్పుడు మీ చేతులు, కాళ్లు, పాదాల్లో వాపు రావడానికి కారణం.. రక్తప్రసరణ తక్కువగా ఉండటమే. దీంతో పాటు, ఈ సమయంలో రక్త నాళాలపై ఒత్తిడి పెరగడం కూడా వాపు రావడానికి కారణమవుతుంది. అయితే ప్రినేటల్ మసాజ్ చేయడం మృదు కణజాలాన్ని ఉత్తేజపరచడంలో.. అదనంగా ఉన్న ద్రవాన్ని తరలించడంలో సహాయపడుతుందని వైద్యులు చెబుతుంటారు. ఫలితంగా.. వాపు తగ్గి, మీకు సౌకర్యంగా ఉంటుంది. మరి మీరు ప్రీనేటల్ మసాజ్ థెరపీకి వెళ్లాలా వద్దా అనే అంశంపై వైద్యులను సంప్రదించాలి. వారి సలహా మేరకే నిర్ణయం తీసుకోవాలి.
చాలా మంది మహిళలు గర్భధారణ సమయంలో దీర్ఘకాలిక నరాల నొప్పిని అనుభవిస్తారు. గర్భవతిగా ఉన్నప్పుడు, వీపు కింది భాగంలో, పెల్విక్-ఫ్లోర్ కండరాలపై గర్భాశయం ఒత్తిడి కలిగిస్తుంది. క్రమంగా.. ఈ ఒత్తిడి మీ కాలి కండరాలకు వ్యాపిస్తుంది. సయాటిక్ నరంపై ప్రభావం చూపినప్పుడు, మీ కాళ్లల్లో మీరు అకస్మాత్తుగా లేదా తీవ్రమైన నొప్పిని అనుభవించవచ్చు. కండరాల్లో ఒత్తిడిని సమర్థవంతంగా రిలీజ్ చేసేందుకు ప్రినేటల్ మసాజ్ థెరపీ ఉపయోగపడుతుంది. క్రమంగా.. నరాలలో వాపును తగ్గిస్తుంది.
మీరు గర్భవతిగా ఉన్నప్పుడు మీ శరీరంలో ఏవైనా భాగాల్లో ప్రభావం ఉన్నప్పుడు, ప్రీనేటల్ మసాజ్ మీ బిగుతు కండరాలను సడలించడం ద్వారా నడుము నొప్పిని కూడా తగ్గిస్తుంది. ఇది శరీరం అంతటా రక్త ప్రవాహాన్ని ప్రభావవంతంగా పెంచుతుంది. శరీరంలోని ఒత్తిడిని విడుదల చేస్తుంది.
గర్భవతి కావడం, గర్భధారణ దశల్ని చూడటం మహిళకు ఆహ్లాదకరమైన అనుభవమే. కానీ గర్భధారణ మహిళల్లో ఆందోళనను కూడా సృష్టిస్తుంది. ఎందుకంటే.. మహిళ జీవితంలో ఇదో కొత్త అధ్యాయం. శరీరంలో అనేక మార్పులు వస్తాయి. శరీరాన్ని కనెక్ట్ చేయడానికి, ఈ సమయంలో వచ్చే సహజమైన మార్పులకు అలవాటుపడుతూ, సౌకర్యవంతంగా ఉండడం నేర్చుకోవడానికి ప్రినేటల్ మసాజ్ మంచి మార్గం. తద్వారా ఆందోళన కూడా తగ్గుతుంది. అంతేకాకుండా, గర్భధారణ సమయంలో వచ్చే సాధారణ, ఊహించని మార్పులను మీకు వివరించడం ద్వారా థెరపిస్ట్ మీకు మరింత మేలు చేస్తారనే చెప్పాలి.
కడుపులో బిడ్డ పెరిగేకొద్దీ, గర్భవతులకు నాణ్యమైన నిద్ర పొందడం కష్టమవుతుంది. మసాజ్ థెరపిస్ట్ గర్భవతులకు ఉపయోగపడే సరైన పద్ధతులు పాటించడం, ఒత్తిడిని కలిగించడం ద్వారా నాడీ వ్యవస్థకు విశ్రాంతిని అందిస్తారు. మీ శరీరం ఫీల్ గుడ్ హార్మోన్లను మరింతగా ఉత్పత్తి చేయడానికి ప్రేరణ పొందుతుంది. ఫలితంగా.. మీరు మరింత రిలాక్స్‌గా ఉంటారు. రాత్రివేళల్లో బాగా నిద్రపోతారు.
ప్రీనేటల్ మసాజ్ చేయించుకోవాలన్న ఆలోచన ఉన్నట్టైతే ముందుగా వైద్యులను సంప్రదించాలి. గర్భధారణ సమయంలో మీ సంరక్షణ కోసం మీకు ప్రసూతి వైద్యులు లేదా నిపుణుల సలహాలు అవసరం. ఈ విషయంపై మీరు వైద్యులతో మాట్లాడవచ్చు. అయితే, కొన్ని రకాల రిస్కులు ఉన్న మహిళలు ప్రీనేటల్ మసాజ్‌కు దూరంగా ఉండాలి. ఈ ప్రమాద కారకాలను పరిగణలోకి తీసుకోవాలి:
ఒకవేళ వైద్యులు మీరు ప్రీనేటల్ మసాజ్ చేయించుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. మీరు శిక్షణ పొందిన, కొన్నేళ్ల అనుభవం ఉన్న, సర్టిఫైడ్ ప్రీనేటల్ మసాజ్ థెరపిస్ట్‌ను సంప్రదించాలి. మీకు వికారం, వాంతులు ఉన్నట్టైతే ప్రెగ్నెన్సీ మసాజ్ చేయించుకోకపోవడం మంచిది. కొంతమంది మసాజ్ థెరపిస్ట్‌లు అలాంటి లక్షణాలను తగ్గించడంలో మీకు సహాయం చేయగలిగినా, మీరు ప్రీనేటల్ మసాజ్ ఎవాయిడ్ చేయాలి. గర్భస్థ మావి విచ్ఛిన్నం అయ్యే రిస్క్ మీకు ఉన్నట్టైతే ప్రీనేటల్ మసాజ్ చేయించుకోకూడదు. ప్రినేటల్ మసాజ్ వల్ల అనేక ప్రయోజనాలను చూడవచ్చు. అలాగని, పైన చర్చించినట్లుగా, ఈ మసాజ్ ప్రతీ గర్భవతికి తగినది కాదన్న విషయం గుర్తుంచుకోండి. అందుకే మహిళలు ప్రీనేటల్ మసాజ్ చేయించుకోవాలనుకుంటే, ముందుగా వైద్యులతో మాట్లాడాలి.
Yes
No

Naku eppudu 7 months baby moments teliyadam ledhu...
Hi I'm 34 weeks 3 days pregnant repu 9th month start avtadi naku eroju mrng milky white discharge iendi problem em undadu kada
Hii all Naku ee month(april19) delivary date echinchindi bt Naku pottalo right side pain vastundi nyt nundi akkuvaga m aina pblm sis chepara konchem urgent plz
Hii 34 weeks how many months
Naku eppudu 4th month raw rice thinalanye vude no problem or problem please tell me
Your body needs extra nutrition this trimester - these can help.

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |