


Growth & Development
2 January 2026 న నవీకరించబడింది
పిల్లలు ఎదుగుతున్న సమయంలో కొద్దిగా అసౌకర్యానికి గురవుతుంటారు. దానికి గ్రోయింగ్ పెయిన్ కూడా కారణం కావచ్చు. మూడేళ్ల నుంచి పన్నెండేళ్ల లోపు పిల్లలకు సాధారణంగా ఇలాంటి నొప్పి వస్తుంటుంది. అయితే ఇది ఎక్కువ కాలం ఉండదు. రోజులు గడుస్తున్నకొద్దీ నొప్పి తగ్గిపోతుంది.
పిల్లలు పెరుగుతున్న సమయంలో వారి కాళ్లల్లో నొప్పులు రావడం, దడపుట్టినట్టు అనిపించడాన్నే గ్రోయింగ్ పెయిన్స్ అంటారు. ఈ నొప్పి ప్రధానంగా తొడలు, పిక్కలు, మోకాళ్లలో నొప్పులు వస్తుంగి. పిల్లల్లో కాళ్ల నొప్పులు సాధారణంగా రాత్రి సమయంలో వస్తాయి. ఈ నొప్పితో ఒక్కోసారి వాళ్లు నిద్ర నుంచి కూడా లేవొచ్చు. అయితే పిల్లల్లో ప్రతీ ఒక్కరికీ ఇలాంటి నొప్పి ఉండదు. కొందరికి మాత్రమే ఈ నొప్పులు వస్తుంటాయి. దీనికి మానసిక సమస్యలతో సంబంధం ఉందని కొందరు వైద్యులు అభిప్రాయపడుతుంటారు. అయితే ఇతర నొప్పుల్ని కూడా గ్రోయింగ్ పెయిన్స్ అనుకొని తల్లిదండ్రులు అయోమయానికి గురవుతుంటారు. అందుకే గ్రోయింగ్ పెయిన్ అంటే ఏంటీ, లక్షణాలు ఎలా ఉంటాయి అని తెలుసుకోవడం అవసరం.
గ్రోయింగ్ పెయిన్స్ అంటే ఏంటీ, మిగతా నొప్పుల కన్నా భిన్నంగా ఎలా ఉంటాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే లక్షణాలను గుర్తించాలి. లక్షణాలు తెలుసుకుంటే గ్రోయింగ్ పెయిన్స్‌ని చాలా సులువుగా గుర్తించవచ్చు. గ్రోయింగ్ పెయిన్స్ లక్షణాలు ప్రధానంగా ఇలా ఉంటాయి:
పిల్లల్లో గ్రోయింగ్ పెయిన్స్ రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఇది వారి కౌమార దశ మొత్తం కొనసాగుతుంది. ఈ నొప్పికి సరైన కారణం తెలియదు. అయితే ఈ కింది కారణాల వల్ల గ్రోయింగ్ పెయిన్స్ రావొచ్చు.
1. కండరాల అలసట
పగటివేళలో ఎక్కువగా శారీరక శ్రమ చేయడం పిల్లల్లో గ్రోయింగ్ పెయిన్‌కు దారితీయవచ్చు. అయితే రోజంతా పనిచేసిన పిల్లల్లందరికీ ఈ నొప్పి రాకపోవచ్చు. కొందరు వీటి నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఇంకొందరికి రాత్రి సమయంలో కూడా నొప్పులు ఉండొచ్చు.
2. భంగిమ సరిగ్గా లేకపోవడం
తప్పుడు భంగిమలో కూర్చోవడం, నడవడం, నిలబడటం వల్ల పిల్లల శరీరంపై తీవ్రమైన ఒత్తిడి కలుగుతుంది. పాదం చదునుగా ఉన్న పిల్లల్లో ఎక్కువగా గ్రోయింగ్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంది.
3. మానసికంగా కలత చెందడం
మానసికంగా కలత చెందే పిల్లలు, ఒత్తిడికి గురయ్యేవారు త్వరగా ఈ నొప్పుల బారినపడతారు. అలాగని నొప్పిని అనుభవిస్తున్న పిల్లలందరికీ ఇలా ఉంటుందని కాదు.
కౌమార దశలోని పిల్లల్లో సాధారణంగా గ్రోయింగ్ పెయిన్స్ ఉంటాయి. ఈ వయస్సులోని పిల్లలందరు చాలా యాక్టీవ్‌గా ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కువ అలసిపోకుండా చూసుకోవాలి. వారిలో గ్రోయింగ్ పెయిన్స్ ఉన్నట్టైతే సరైన విశ్రాంతి లభించేలా చూడాలి. పగటివేళలో పరుగెత్తడం, ఎగరడం, క్లైంబింగ్ లాంటివి చేసే పిల్లల్లో రాత్రి సమయంలో కండరాల నొప్పులు వస్తుంటాయి.
గ్రోయింగ్ పెయిన్స్ గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు లేవు. వైద్యులు లక్షణాల ఆధారంగా గ్రోయింగ్ పెయిన్స్‌ని గుర్తిస్తారు. గ్రోయింగ్ పెయిన్ కాకుండా.. కండరాల నొప్పులకు కారణమయ్యే ఇతర ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకొని గ్రోయింగ్ పెయిన్‌ను నిర్థారిస్తారు. వైద్యులు సాధారణంగా పరిగణించే అంశాలు ఇవే.
ఇలాంటి నొప్పి ఉన్నప్పుడు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. పిల్లల కాళ్లల్లో గ్రోయింగ్ పెయిన్స్ తగ్గించడానికి ఏం చేయాలి అన్న విషయాన్ని వైద్యులు తల్లిదండ్రులకు వివరిస్తారు. వైద్యుల సూచనలు ఈ కింది విధంగా ఉంటాయి.
ప్రతీ కండరాల నొప్పి గ్రోయింగ్ పెయిన్‌గా భావించకూడదు. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎప్పుడు ఆస్పత్రికి తీసుకెళ్లాలో తెలుసుకోవాలి. పిల్లల్లో నొప్పి ఈ కింది విధంగా ఉంటే వైద్యుల్ని సంప్రదించాలి:
Yes
No

Written by
Nayana Mukkamala
Get baby's diet chart, and growth tips











ప్రీనేటల్ మసాజ్: అర్థం, ప్రయోజనాలు

గర్భధారణలో పైనాపిల్: ప్రయోజనాలు & ప్రమాదాలు

ప్రెగ్నెన్సీ సమయంలో రొమ్ము పాలు కారకుండా ఎలా ఆపాలి (How To Prevent Breast Milk Leakage During Pregnancy in Telugu)?

గర్భధారణ సమయంలో పనసపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాలు & సైడ్ ఎఫెక్టులు (Jackfruit in Pregnancy | Benefits, Risks & Side Effects in Telugu)

గర్భధారణ ప్రారంభంలో మలబద్ధకం

ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu