Lowest price this festive season! Code: FIRST10
Hair Problems
23 September 2024 న నవీకరించబడింది
గర్భదాల్చడం అనేది మిమ్మల్ని ఎన్నో భావోద్వేగాలకు గురి చేస్తుంది. ఆ ఎమోషన్స్‌ను ఎవరూ కంట్రోల్ చేయలేరు. ఈ జర్నీ అనేది కొన్ని భయాలు మరియు సంతోష క్షణాలతో నిండి ఉంటుంది. మీ ఆనందానికి కారణమైన వ్యక్తిని మీ చేతుల్లోకి తీసుకుని చూసేందుకు మీరు వేచి ఉండాల్సి వస్తుంది. గర్భం యొక్క ముగింపు విలువైనదే అయినప్పటికీ ఈ జర్నీలో మీకు కొన్ని షాక్స్ తగులుతాయి. వాటిని అధిగమించడం చాలెంజింగ్‌గా ఉంటుంది. గర్భవతుల శరీరాల్లో హార్మోన్స్ మార్పుల వల్ల ఇవి సంభవిస్తాయి. ఈ మార్పులు అనేవి మీ కంట్రోల్లో ఉండవు. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుంటే చాలా బెటర్‌గా ఉంటుంది.
మీరు తల్లి కాబోతున్నపుడు మీ బంప్‌ను చూసి చుట్టాలు, వెల్‌విషర్స్, స్నేహితులు, ఇంకా చెప్పాలంటే అనామకులు కూడా మీకు చిట్కాలు చెబుతారు. ఈ గర్భధారణ ప్రయాణంలో ఈ చిట్కాలు మీకు తప్పనిసరిగా ఉపయోగపడతాయి. కానీ ప్రతి ఒక్కరి గర్భధారణ అనుభూతులు వేర్వేరుగా ఉంటాయి. గర్భవతుల్లో అనేక లక్షణాలు, పరిస్థితులు ఒకేలా ఉంటాయి. కానీ అందుకు గల కారణాలు, చికిత్స విధానాలు ఒకరి నుంచి మరొకరికి వేర్వేరుగా ఉంటాయి. గర్భధారణ సమయంలో అనేక మంది గర్భవతులను భయపెట్టే ఆంశం.. గర్భధారణ సమయంలో వారి జుట్టు ఆరోగ్యపరిస్థితి.
గర్భవతులందరూ అనుభవించే అనుభూతులు ఉన్నాయి.. కానీ జుట్టు రాలడం అనేది కొంత మందిలో కనిపిస్తుంది.. కొందరిలో కనిపించదు. జుట్టు రాలడం అనేది మీరు అనుకున్నంత సాధారణం కాదు. ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్న గర్భవతుల నిష్పత్తిని ట్రాక్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇలా జరుగుతుందని తెలుసుకునేందుకు వంద అంశాలు ఉన్నాయి. కానీ గణాంకాలను పరిశీలిస్తే 40 నుంచి 50 శాతం మంది గర్భవతులు జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారని అర్థం అవుతోంది. మీరు వారిలో ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. గర్భవతిగా ఉన్నపుడు ఖచ్చితంగా జుట్టు రాలుతోందని చెప్పడం సాధ్యం కాదు.
గర్భవతులుగా ఉన్నపుడు జుట్టు రాలే 40-50 శాతం మంది మహిళల్లో మీరు కూడా భాగమైతే అది మరింత భయానకంగా ఉంటుంది. మీరు ఇంతవరకూ జుట్టు రాలే సమస్యను చూసి ఉండకపోతే ఇది కొత్తగా ఉంటుంది. జుట్టు రాలడం అనేది మీ హార్మోన్ల మార్పులపై ఆధారపడి ఉంటుంది. అంటే గర్భధారణ యొక్క ఏ దశలో ఈ సమస్య వస్తుందో మీరు ఖచ్చితంగా గుర్తించలేరు. మీకు ఇప్పటికే గరిష్టంగా సమస్యలు ఉంటే తప్పా జుట్టు రాలే సమస్య గర్భం ప్రారంభంలో వచ్చే అవకాశం లేదు. మీరు గర్భవతిగా ఉన్న 9 నెలల సమయంలో 3 నుంచి 4 నెలల కాలం నుంచి మీకు విపరీతంగా జుట్టు రాలడం ప్రారంభం కావొచ్చు. అయినప్పటికీ అందరికీ ఇలాగే జరుగుతుందని చెప్పలేం. గర్భం దాల్చిన తర్వాత ఎప్పుడైనా ఈ సమస్య రావొచ్చు. డెలివరీ తర్వాత కొన్ని రోజుల వరకు కూడా అధికంగా జుట్టు రాలడాన్ని మీరు గమనించొచ్చు. చాలా మంది విషయంలో ఇది జరుగుతుంది.
ఈ సమయంలో జుట్టు రాలడం సాధారణమా? అనే విషయంలో మీరు గందరగోళంగా ఉన్నారా? గర్భధారణ సమయంలో హార్మోన్లు స్కాల్ప్ యొక్క గ్రోత్ సైకిల్‌తో గందరగోళానికి గురికావడం వల్ల జుట్టు రాలడం అనేది జరుగుతుంది. ఈ ప్రత్యేక పరిస్థితిని టెలోజెన్ ఎఫ్లూవియం అని పిలుస్తారు. టెలోజెన్ అనేది కొత్త జుట్టు పెరుగుదలను ఆపే విశ్రాంతి దశను సూచిస్తుంది. మీ శరీరంలోని హార్మోన్లు ఎక్కువ రోజులు విశ్రాంతి దశలో ఉండేందుకు కారణం అవుతాయి. ఇందువల్లే మీకు అధికంగా జుట్టు రాలుతూ ఉంటుంది. అంతే కాకుండా జుట్టు పెరుగుదల అనేది లేకపోవడం వల్ల మీ హెయిర్ పలచబడుతుంది. ఒత్తిడి, భయం, షాక్ వంటి భావోద్వేగాలు ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తాయి.
జుట్టు రాలుతోందని చిన్న గుర్తులను మీరు గమనించినపుడు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. మీ దువ్వెను తనిఖీ చేసి రోజూ మీకు ఎంత జుట్టు రాలుతుందో గమనించండి. మీరు నిర్దిష్ట విలువను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. యావరేజ్ విలువను గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ విలువ ప్రతి రోజు పెరుగుతూ పోతుంటే మీరు యాక్షన్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలుసుకోవాలి. జుట్టు పలచబడడం, మందం తగ్గడం, మచ్చలు, స్కాల్ప్ చుట్టూ ప్యాచెస్ వంటివి కూడా మీ జుట్టు రాలుతోందని తెలియజేస్తాయి.
మీరు కనుక కొంత మందిని ఇదే ప్రశ్న అడిగితే వారు మిమ్మల్ని ఎక్కువ తికమకపడతారు. ప్రతి వ్యక్తి మీకు ఒక కొత్త పరిష్కారాన్ని చెబుతారు. మీరు ప్రతి ఒక్కరూ చెప్పింది ప్రయత్నిస్తూ ఉంటారు. వీటిలో కొన్ని నిర్దిష్ట జుట్టు రకాలు లేదా నిర్దిష్ట జీవనశైలిని అవలంభించే వారికి మాత్రమే సూట్ అవుతాయి. మీ జుట్టు రాలే సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. చాలా ప్రయోగాలు చేయడం వలన మీ జుట్టు మరింత పేలవంగా కనిపిస్తుంది. ఇలా జుట్టు రాలడాన్ని ఒక నిర్దిష్ట సహజమైన నూనె వాడడం వలన తగ్గించవచ్చు. గర్భధారణ సమయంలో అధికంగా జుట్టు రాలే సమస్యకు ఆనియన్ (ఉల్లిపాయ) జుట్టు సంరక్షణ సీరం చక్కటి పరిష్కారం
గత కొన్ని సంవత్సరాలుగా ఆనియన్ హెయిర్ ఆయిల్ అనేది అత్యంత విలువైన ఉత్పత్తిగా నిరూపితం అయింది. ఈ ప్రక్రియలో ఇది సాంప్రదాయ హెయిర్ ఆయిల్స్‌ను కూడా అధిగమించింది. గర్భధారణ సమయంలో జుట్టు రాలిపోతుంటే నివారణకు ఆనియన్ ఆయిల్ చక్కగా పని చేస్తుంది. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి గర్భధారణ సమయంలో జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ఈ పోషకాలు హార్మోన్ల మార్పులను సమతుల్యం చేసేందుకు మరియు మీ జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చూసేందుకు సహాయపడతాయి. ఎలాగో ఇక్కడ వివరంగా ఉంది. ఈ నూనెలో యాంటీయాక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి మీ జుట్టు పెరుగుదలకు సాయం చేస్తాయి. జుట్టు పెరుగుదల కోసం ఆనియన్ ఆయిల్‌ను వాడినపుడు మీ రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. మీ జుట్టు మందంగా తయారవుతుంది.
జుట్టు సంరక్షణకు ఆనియన్ హెయిర్ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో సల్ఫర్ మూలకాలు ఉండడం వలన ఇది మీ జుట్టు బలహీనంగా కాకుండా చేస్తుంది. ఈ ఆయిల్‌ను వాడడం వలన మీరు చుండ్రు, జుట్టు నెరిసిపోవడం, చిక్కులు, జుట్టు రాలడం వంటి వివిధ సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు. ఆనియన్ ఆయిల్ హెయిర్ కేర్ కిట్ ను ఉపయోగిస్తే ఈ నూనె మీకు ఉత్తమ పోషణను అందిస్తుంది. అన్ని రకాల డ్యామేజెస్ నుంచి ఇది మీ జుట్టును కాపాడుతుంది. తక్కువగా జుట్టు రాలడం నుంచి బట్టతల మచ్చల వరకు అన్ని సమస్యల నుంచి ఇది మిమ్మల్ని కాపాడుతుంది. మీ జుట్టుకు అవసరమైన చికిత్స మేరకు మీరు కేవలం ఆనియన్ ఆయిల్ హెయిర్ కేర్ కాంబో లేదా కిట్‌ను ఎంచుకుంటే సరిపోతుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: జుట్టు రాలడాన్ని నివారించడానికి మరియు జుట్టును బలంగా చేయడానికి సులవైన చిట్కాలు
ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది కేవలం తాత్కాలికం మాత్రమే. గర్భధారణ సమయంలో వచ్చే జుట్టు సమస్యలు పెద్ద విషయం కావు. మీరు శిశువుకు జన్మనిచ్చిన తర్వాత ఈ సమస్య పరిష్కారం అవుతుంది. మీ అందమైన జుట్టు అప్పుడు మరలా తిరిగి వస్తుంది. మిమ్మల్ని మీరు కాంప్లిమెంట్స్‌తో ముంచెత్తుకోండి. మా నుంచి కొన్ని పొగడ్తలను కూడా యాడ్ చేయండి.
Anti Hair Fall Onion Shampoo - 200 ml
Strengthens Roots | Softens Hair
₹ 329
4.2
(2169)3249 Users bought
Yes
No
Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips
మహిళల్లో సంతానోత్పత్తిని ఎలా పెంచాలి? అందుకు ఆయుర్వేద మూలికలు ఎలా సాయం చేస్తాయి? | How to Increase Fertility in Women Ayurvedic Herbs in Telugu
స్త్రీ సంతానోత్పత్తి & మగ సంతానోత్పత్తికి అశ్వగంధ ప్రయోజనాలు: ఇది గర్భం దాల్చడానికి ఎలా సహాయపడుతుంది? | Ashwagandha Benefits for Female Fertility & Male Fertility in Telugu
లేట్ ఓవులేషన్: ఇది మీ సంతానోత్పత్తి మరియు గర్భధారణ అవకాశాలను ఎలా ప్రభావితం చేస్తుంది | Late Ovulation in Telugu
చాస్స్ట్ బెర్రీ ప్రయోజనాలు: వంధ్యత్వం, హార్మోన్ల అసమతుల్యత మరియు PMS కోసం మీకు అవసరమైన సహజ నివారణ | Chasteberry Benefits: The Natural Remedy in Telugu
గర్భం ధరించడానికి టాప్ 10 సెక్స్ పొజిషన్లు: గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్న జంటల కోసం అల్టిమేట్ గైడ్ | Top 10 Sex Positions to Get Pregnant in Telugu
ప్రసవ బరువు తగ్గడానికి ఎంత సమయం పడుతుంది| How Long Does It Take To Drop The Baby Weight in Telegu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |