


Implantation Bleeding
13 December 2025 న నవీకరించబడింది
మీరు గర్భవతి కావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పుడు, ఓవులేషన్ (అండోత్సర్గం)కు ఇంట్లో నిర్వహించే ప్రెగ్నెన్సీ పరీక్ష (లేదా మీ పీరియడ్) కు మధ్య ఉండే రెండు వారాల సమయం ఎప్పటికీ ముగియనిదిలా అనిపిస్తుంది. అందరు మహిళల్లాగే మీరు కూడా ప్రతి నొప్పిని, మెలికను, శరీరంలో జరిగే ప్రతి చర్యను గమనిస్తూ అది ప్రెగ్నెన్సీ మొదటి సంకేతమేమో అని ఆశ్చర్యపోతూ ఉంటారు.
ప్రెగ్నెన్సీ వచ్చిందని కచ్చితంగా చెప్పే ఒక లక్షణమే బ్లీడింగ్ (రక్తస్రావం). మీరు కొంచెం బ్లీడింగ్ గుర్తిస్తే దాని అర్థం ఏమిటి ? అది చెప్పడానికి కొంచెం కష్టమైందే. ఆరోగ్యకరమైన, సాధారణ ప్రెగ్నెన్సీ పొందాలనుకునే చాలా మంది మహిళలు ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ గమనిస్తారు. అది గర్భాశయంలోకి పిండం ప్రవేశించే సమయంలో జరిగేది.
ఓవులేషన్ (అండోత్సర్గం - అండం విడుదల అవడం) జరిగిన తర్వాత, అండం శుక్ర కణాలతో కలిసి ఫలదీకరణ చెందినప్పుడు పిండం విభాజితమవుతూ పెరుగుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీకి సిద్ధం కావాల్సిందిగా స్త్రీ శరీరానికి అది సంకేతాలు పంపుతూ ఉంటుంది. అదే సమయంలో ఎండోమెట్రియం (గర్భకోశపు /గర్భాశయం పొర) అని పిలిచే గర్భాశయ గోడల వద్ద మార్పు మొదలవుతుంది. అప్పటికే రుతుచక్రం వల్ల మందంగా మారిన ఆ గోడలు మరింత ఎదగాల్సి ఉంటుంది. పిండానికి తొమ్మిది నెలలకు సరిపడా రక్షణను అందించేలా మారాల్సి ఉంటుంది.
ఫలదీకరణ జరిగిన 6 నుంచి 12 రోజుల మధ్య, వేగంగా పెరిగిన పిండం ఫాలోపియన్ నాళాల ద్వారా గర్భకోశంలోకి చేరుతుంది. దానికి మరిన్ని పోషకాలు అవసరం. పిండానికి సరిపడే పోషకాలను ఎండోమెట్రియం కలిగి ఉంటుంది. ఈ దశలో పిండం దానికై అదే ఎండోమెట్రియంకు అంటిపెట్టుకొని ఉంటుంది. పోషకాలు, ఆక్సిజన్ కోసం అది తొలిసారిగా తల్లి శరీరం మీద అక్కడి నుంచే ఆధారపడుతుంది. అయితే పిండం గర్భకోశంలోకి ప్రవేశించే సమయంలో ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ జరుగుతుంది. ఆ సమయంలో అది కొన్ని రక్తనాళాలు పగిలిపోవడానికి కారణమవుతుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో రక్తస్రావాన్ని ఎలా ఆపాలి?
గర్భకోశ లైనింగ్‌లోకి పిండం ప్రవేశించినప్పుడు, ఆ రంధ్రాలను పూడ్చే క్రమంలో భాగంగా చిన్న రక్త నాళాలు కొన్ని పగిలిపోతాయి. అయితే ఇది పెద్ద సమస్యలను కలిగించదు (తర్వాత ఎండోమెట్రియం కోలుకుంటుంది). అయితే కొందరు మహిళలు ఈ సమయంలో కొంచెం బ్లీడింగ్‌ను ఎదుర్కొంటారు. అది గులాబీ, ఎరుపు, గోధుమ డిశ్చార్జ్ రూపంలో ఉండొచ్చు.
సాధారణంగా నెలసరి వచ్చే సమయానికి ముందే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది (సాధారణంగా గర్భం దాల్చిన 5 నుంచి 10 రోజుల తర్వాత).
ప్రెగ్నెన్సీ టెస్టులో పాజిటివ్ వచ్చే ముందు కనిపించే లక్షణమే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్. అయితే ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అనేది ఆ కొంచెం బ్లీడింగ్ వల్ల కచ్చితంగా తెలుసుకోలేం. అది పీరియడ్‌కు దారి తీసే సహజ బ్లీడింగ్ కూడా అయ్యే అవకాశం ఉంది. దురదృష్టవశాత్తూ అది కనుక్కోవడానికి కచ్చితమైన మార్గమేదీ లేదు.
మీరు ప్రెగ్నెంటో కాదో తెలుసుకోవడానికి ఉత్తమమైన మార్గం ఏమిటంటే మరి కొద్ది రోజులు ఆగి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడమే. మీరు చివరిసారిగా సెక్స్ చేసిన సమయం కూడా దాన్ని గుర్తించడానికి అవకాశం కల్పిస్తుంది. ఒకవేళ అది జరిగి రెండు వారాలు దాటి ఉంటే, అది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఏమాత్రం లేదు.
ఇంప్లాటేషన్ బ్లీడింగ్ పొందిన మహిళల్లో మూడో వంతు వారు చెప్పినదేంటంటే సాధారణంగా బ్లీడింగ్ కు ముందు అయ్యే బ్లీడింగ్ కంటే అది భిన్నంగా ఉంటుంది. సహజంగా వచ్చే పీరియడ్ లో కనిపించే రక్తం రంగు కంటే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ లో రక్తం రంగు మరింత ముదురుగా ఉంటుంది. మరికొందరికి ఆ సమయంలో కొంత తిమ్మిరిగా కూడా ఉండవచ్చు. కానీ ఎక్కువ మంది మహిళలకు రెండు బ్లీడింగ్‌లకు మధ్య తేడా ఏమీ ఉండదు. అందుకే మిస్ అయిన పీరియడ్ కు, ఇంప్లాంటేషన్ బ్లీడింగ్‌కు మధ్య తేడాను చెప్పడం చాలా కష్టమైన విషయం. ఇలా జరిగేది మీ ఒక్కరికే కాదు. కొందరికి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ వచ్చినట్లు అనిపించిన కొద్ది రోజులకు పీరియడ్ రావచ్చు లేదా ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ సాధారణంగా కనిపించినప్పటికీ చివరకు ప్రెగ్నెంట్ అవ్వచ్చు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: 8 వారాల ప్రెగ్నెన్సీలో రక్తస్రావం - మీరు వైద్యుడిని సంప్రదించాలా?
ఇతర ఇంప్లాంటేషన్ కాకుండా ప్రెగ్నెన్సీ సమయంలో కొంత బ్లీడింగ్ జరగడం సాధారణమే. కటి పరీక్ష (పెల్విక్ ఎగ్జామ్) తరువాత గర్భాశయ ముఖద్వారం వద్ద చికాకు, సెక్స్ లేదా యోని ఇన్ఫెక్షన్ లాంటి విషయాలు కారణాలుగా ఉండవచ్చు.అయితే కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ వచ్చే ముందు బ్లీడింగ్ జరగవచ్చు. అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మోలార్ ప్రెగ్నెన్సీ లేదా గర్భస్రావానికి( మిస్ క్యారేజ్) సూచన కావచ్చు. ఆయా లక్షణాలతో పాటు ఇతర లక్షణాలను కూడా వివరిస్తూ మీరు మీ వైద్యుడిని సంప్రదించవచ్చు. ఎక్కువగా చింతించకండి. బ్లీడింగ్ కొంచెమే ఉండి, ఎక్కువ కాలం కొనసాగకపోతే అంతా బాగున్నట్లే.
Yes
No

Written by
Sarada Ayyala
Get baby's diet chart, and growth tips











మీ బేబీ కి వింటర్ ఫ్యాషన్ కోసం మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు!

వెసెక్టమీ రివర్సల్ అంటే ఏమిటి? దీని వలన ఉపయోగాలు ఏమిటి? ఇది చేయడం వలన ఎదురయ్యే రిస్క్స్ ఎలా ఉంటాయి?

శిశువు కడుపు మీద నిద్రపోవడం వలన వచ్చే ప్రమాదాలు ఏ విధంగా ఉంటాయి? ఈ విషయంలో ఎటువంటి సలహాలు పాటించాలి?

కాపుట్ సక్సెడేనియం: కారణాలు, దానివల్ల కలిగే ప్రమాదాలు, చికిత్స

గర్భధారణ సమయంలో కంకులు(కార్న్) తినడం వల్ల కలిగే ప్రయోజనాలు & సైడ్ ఎఫెక్ట్స్

స్త్రీలలో హార్మోన్ల అసమతుల్యత అంటే ఏమిటి? దీన్ని ఎలా నయం చేయాలి?