

Pregnancy
7 December 2023 న నవీకరించబడింది
మెలలేయుకా ఆల్టర్నిఫోలియా అనేది టీ ట్రీ శాస్త్రీయ నామం. ఈ చెట్టు ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. చర్మ సమస్యలను తగ్గించేందుకు ఈ నూనెను వాడతారు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. దీనిని ఇంటిని శుభ్రం చేసేందుకు మరియు చుండ్రును నివారించేందుకు కూడా వాడుతారు. ఈ ఆయిల్ తక్కువ ధరలో లభిస్తుంది. సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది.
టాపికల్ (చర్మం పైన చేసే చికిత్సలు) ట్రీట్మెంట్లు చేసే బదులు మీరు టీ ట్రీ ఆయిల్ ఉపయోగించొచ్చు. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ అని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది జెర్మ్స్, వైరస్‌లను తొలగిస్తుంది. టీ ట్రీ ఆయిల్‌ను స్వీయ సంరక్షణ కోసం ఆయుర్వేద పద్ధతిలో కూడా ఉపయోగించొచ్చు. టీ ట్రీ ఆయిల్ ముఖం, చర్మం, జుట్టు కోసం అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
1. చుండ్రు జుట్టు రాలడాన్ని టీ ట్రీ ఆయిల్ తగ్గిస్తుంది
చుండ్రు ఉన్నా జుట్టు రాలినా కానీ ఒక రకమైన ఇబ్బందిగా ఉంటుంది. యాంటీ ఫ్లేకింగ్, యాంటీ ఫంగల్ స్టెయిన్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల వలన టీ ట్రీ కిట్ డాండ్రఫ్‌ను తగ్గించి జుట్టు రాలే సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. టీ ట్రీ ఆయిల్ అనేది అనేక ఆయుర్వేద ఉత్పత్తులు, కాస్మొటిక్ ప్రొడక్ట్స్‌లో ఒక మెయిన్ ఇంగ్రిడియెంట్ (తయారీకి వాడే పదార్థం). ఇది డ్రై స్కిన్‌ను రిపేర్ చేయడంలో, చుండ్రును తగ్గించడంలో, జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో సహాయపడుతుంది. టీ ట్రీ ఆయిల్ 4 వారాల ట్రయల్‌లో 41 శాతం చుండ్రు ఉపశమనాన్ని పెంచింది. జుట్టు రాలడం, దురదగా ఉండడం వంటి లక్షణాలను కూడా తగ్గిస్తుంది.
2. టీ ఆయిల్ వలన చర్మ ప్రయోజనాలు
టీ ట్రీ ఆయిల్ చర్మ సంరక్షణ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. టీ ట్రీ ఫేసియల్ కిట్‌తో మొటిమలకు చికిత్స చేయొచ్చు. ఎందుకంటే ఇది క్లాగ్స్‌ను తొలగిస్తుంది. ఇరిటేషన్ను తగ్గిస్తుంది. ఎరుపును కూడా తగ్గిస్తుంది. ఒక పరిశోధన ప్రకారం.. టీ ట్రీ ఆయిల్ ఉపయోగించిన వారి ముఖాల మీద తక్కువ జిడ్డు మరియు పెద్ద రంద్రాలు(చెమటను శోషించుకునేవి) కనిపిస్తాయి. టీ ట్రీ ఫేస్ కేర్ కిట్‌లోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మీ చర్మాన్ని తెల్లగా, ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడతాయి. మీ చర్మాన్ని తేమగా చేసేందుకు, మంటను, చికాకును తగ్గించేందుకు మీ సబ్బులు మరియు లోషన్లలో టీ ట్రీ స్కిన్ ఫ్యూరిఫయింగ్ కిట్‌ను ఉపయోగించండి. రింగ్ వార్మ్ చికిత్స వేగవంతం చేసేందుకు టీ ట్రీ ఆయిల్ యాంటీఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది.
3. మీరు చేతులను క్రిమి రహితంగా ఉంచుకోవాలనుకుంటే ఈ ఆయిల్ వాడండి
కమర్షియల్ ప్రొడక్టులకు బదులుగా టీ ట్రీ ఆయిల్‌తో తయారైన హ్యాండ్ సానిటైజర్లను ఉపయోగించొచ్చు. టీ ట్రీ ఆయిల్‌ను ఉపయోగించడం వలన చర్మం మీద ఉన్న సూక్ష్మక్రిములు చంపబడతాయి. ఆయిల్లో ఉండే యాంటీసెప్టిక్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల ఇది సంభవిస్తుంది. ఇలా చేయడం ద్వారా మీరు వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చు. టీ ట్రీ ఆయిల్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో పాటుగా యాంటీ వైరల్ లక్షణాలు కూడా ఉన్నాయని తేలింది. టీ ట్రీ ఆయిల్‌ను హ్యాండ్ వాష్‌కు జతచేయడం వలన దాని సామర్థ్యాన్ని పెంచొచ్చు.
4. టీ ట్రీ ఆయిల్ యొక్క కీటకాలను నాశనం చేసే లక్షణం
టీ ట్రీ ఆయిల్‌కు ఉన్న అనేక లక్షణాలలో కీటకాలను నాశనం చేయడం ఒకటి. దీని విలక్షణమైన వాసన కారణంగా మరియు కెమికల్ మేకప్ వల్ల ఇది అద్భుతమైన కీటకనాశినిగా పని చేస్తుంది. DEET (కీటకనాశనుల్లో ఉపయోగించే ప్రధాన పదార్థం) ను ఉపయోగించడం కంటే టీ ట్రీ ఆయిల్‌ను ఉపయోగించడం వలన దోమలు ఎక్కువగా ఫెండెడ్ ఆఫ్ (లొంగిపోవడం) అవుతాయి.
5. నాచురల్ డియోడ్రెంట్‌గా(సెంట్) టీ ట్రీ ఆయిల్ ఎఫెక్టివ్‌గా ఉండొచ్చు
మీ చెమటకు ఎటువంటి వాసన లేదని మీరు గ్రహించారా? చెమట గ్రంధులపై ఉండే సూక్ష్మజీవుల వలన చర్మం దుర్వాసన వస్తోంది. టీ ట్రీ ఆయిల్‌లోని యాంటీ మైక్రోబయాల్ లక్షణాల వలన న్యాచురల్ డియోడ్రంట్గా ఉపయోగించొచ్చు. ఇది కమర్షియల్ యాంటీ పెర్స్పిరెంట్లు మరియు డియోడ్రంట్లకు ప్రత్యామ్నాయంగా పని చేస్తుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది : మీ చర్మం మీద మొటిమలను వదిలించుకునేందుకు టాప్ 5 సహజ మార్గాలు
టీ ట్రీ ఆయిల్‌ను ఉపయోగించడం మంచిది. కానీ కొంత మంది సున్నితమైన చర్మం ఉన్న వారు కొన్ని ప్రతికూల ప్రభావాలను కలిగి ఉండొచ్చు. గాయాల దగ్గర, దద్దుర్లు ఉన్నచోట, చికాకు కలిగించే చర్మం దగ్గర దీనిని అప్లై చేసేటపుడు జాగ్రత్తగా ఉపయోగించండి. మొటిమలతో బాధపడే వారు డ్రైనెస్, మంట, లేదా ఎరుపుగా కావడం వంటి వాటిని అనుభూతి చెందితే టీ ట్రీ ఆయిల్‌ను ఉపయోగించకుండా ఉండాలి. మీరు మొదటిసారి నూనెను ఉపయోగిస్తుంటే దానిని టెస్ట్ చేయాలి. ఎటువంటి ఎలర్జీలు రాకుండా కాపాడుకోవచ్చు. మీరు మీ ముఖానికి నూనెను రాసుకుంటే.. మీ కళ్లకు దూరంగా ఉంచండి. ఇది దద్దుర్లు, దిక్కుతోచని స్థితి, అస్థిరతను కలిగించవచ్చు. ఇది విషంగా మారొచ్చు. ఈ ప్రొడక్టును తీసుకునే ముందు మీరు గర్భవతిగా ఉన్నారా? లేదా ఏవైనా వైద్యపరమైన సమస్యలు ఉన్నాయా అని మీ వైద్యుడిని సంప్రదించాలి.
Tags
Five excellent tea tree benefits for your skin in Tamil
Yes
No

Written by
Sarada Ayyala
Get baby's diet chart, and growth tips










మీ చిన్నారితో కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? మీ బిడ్డతో ఆనందించే సెలవుల కోసం 5 అత్యంత ఉపయోగకరమైన టిప్స్|Planning a Trip with Your Little One? Here are 5 Extremely Useful Tips for an Enjoyable Holiday with Your Baby in Telegu

బేబీ గర్ల్ బెల్లీ Vs బేబీ బాయ్ బెల్లీ: మీ పొట్ట ఆకారం లేదా పరిమాణం మీరు అబ్బాయిని కలిగి ఉన్నారని చెప్పగలరా? | Baby Girl Belly Vs Baby Boy Belly in Telugu

మీ చిన్నారులకు పాటీ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు చేయాల్సినవి, చేయకూడనివి ( Do’s and don’ts when Potty Training Your Newborn in Telugu?)

ర్మల్ డెలివరీ లేదా సిజేరియన్ డెలివరీలలో ఏది మంచిది? ఎందుకు మంచిది? | Which Is Better Normal Or Cesarean in Telugu

ప్రసవానంతర బరువు తగ్గించే ప్రణాళికను తీసుకునే ముందు మీ గైనకాలజిస్ట్‌ని అడగడం అవసరమా? |Is It Necessary To Ask Your Gynecologist Before Taking Up A Postpartum Weight Loss Plan?

గైనకాలజీలో లాపరోస్కోపీ|Laparoscopy In Gynaecology in Telegu