


Travel & Holidays
26 January 2026 న నవీకరించబడింది
మీ నవజాత శిశువుని కనిపెట్టుకొని ఉండటం ఇంకా జాగ్రత్తగా చూసుకోవడం అవసరం, కాబట్టి మొదటి కొన్ని వారాలు మీరు ఇంట్లోనే ఉండి, విశ్రాంతి తీసుకొని కోలుకోవడం ఎంతో ముఖ్యం. పాలుపట్టే సమయాల మధ్య, మీ కొత్త బిడ్డకు డైపర్ మార్చల్సి రావడం లాంటి విషయాలను పట్టించుకోవడం వలన మీరు అలసటకు లోనవుతారు. ఇలాంటి తీరిక లేని సమయాల్లో మీకు ప్రయాణం చేయాలనే ఎలాంటి కోరిక ఉండకపోవడమే కాక మీపై ఇంకా మీ బిడ్డపై దృష్టి కేంద్రీకరించి ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది.
కానీ అనుకోకుండా మీకలాంటి పరిస్థితి రావచ్చు, కొన్నిసార్లు అన్ని పరిస్థితులు పూర్తిగా మన అదుపులో ఉండవు కదా. ఎప్పుడో ఒకప్పుడు మీరు మీ నవజాత శిశువుతో ప్రయాణించవలసి రావచ్చు, అటువంటి పరిస్థితులకు సిద్ధపడి ఉండేందుకు మీరు నిదానంగా ఇలా చేయడం మొదలుపెట్టాలి. మీ బిడ్డను దగ్గరలోని పార్కులు ఇంకా కాలిబాటలు వంటి దగ్గరి ప్రదేశాలకు నడుచుకుంటూ తీసుకెళ్లడం ప్రారంభించాలి. మీ శిశువుకి వ్యాధులను ఎదుర్కొనే శక్తి తక్కువ ఉండటం వల్ల బయట ఉండే అన్ని రకాల వ్యాధి క్రిములను ఎదుర్కోలేదు. అందుకే మీరు రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి.
నెమ్మదిగా ఇంకా కొద్దికొద్దిగా మొదలుపెట్టి, ఆపై దాన్ని పెంచుకుంటూ పోవాలి. మీ శిశువు ఒకేసారి చాలా ఎక్కువ సేపు ప్రయాణిస్తే తను ఎన్నో అనుభవాలను ఒకేసారి పొందుతుంది. మీరు అవన్నీ ఒకేసారి కలిగేలా చేయకూడదు. ఇంకా ఇలా చేసి వారి పసి బుర్ర అయోమయానికి లోనుకాకుండా చేయడం మంచిది. చిన్నపాటి నడకలు, ఇంకా విహారయాత్రలు, సమీపంలోని కాలిబాటల వెంబడి ఇంకా కిరాణా సామాగ్రి కోసం వెళ్ళడం లాంటి వాటినుండి మొదలుపెట్టి కారు ప్రయాణం వరకు కొనసాగించాలి. ఇంకా చివరికి దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. నిదానమే ప్రధానము అనేది ఈ ఆట పేరు.
మేము ఈ విషయాన్ని గట్టిగా చెప్పలేము. మీరు కనీసం 3 నెలల వరకు వేచి ఉండాలి. ఎందుకంటే అంతవరకు వారి వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా వృద్ధి చెందదు. 3వ నెల దాటిన తర్వాత కూడా మీకు కోవిడ్ మహమ్మారి వల్ల కలిగిన అనుభవంతో ఫేస్ మాస్క్ వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఫేస్ మాస్క్ కోవిడ్-19ని మాత్రమే కాకుండా కాలానుగుణంగా వచ్చే ఫ్లూని కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటుందనే విషయం మనకు కోవిడ్ వల్ల అర్థమైంది.
ఉదయం పూట, ఇంకా సాయంత్రం పూట ఎక్కువ రద్దీ ఉండకపోవడమే కాక హానికరమైన అతినీలలోహిత కిరణాలను కూడా తప్పించుకోవచ్చు. శిశువుకి బాగా పాలను పట్టించిన తరువాత బయట తిప్పేందుకు తీసుకెళ్తే వారు హాయిగా మీకు సౌకర్యవంతంగా ఉండేలా ఎక్కువ అల్లరి చేయకుండా ఉంటారు.
స్టైల్ కన్నా సౌకర్యం ముఖ్యం. మంచి స్టైల్ గా ఉండే దుస్తుల కంటే వాతావరణానికి అనుగుణంగా దుస్తులు వేయడం చాలా ముఖ్యం. వాతావరణం ఇంకా మీ శిశువు అలవాట్లను బట్టి, మీ బిడ్డకు తగిన దుస్తులు తొడగాలి.
మీ శిశువు మలం ఎక్కువ దుర్వాసన వేస్తోందా? మీరు షాపింగ్‌లో ఉన్నారనుకోండి మరియు మీ బిడ్డకు 3 బ్లాక్‌ల దూరంలో ఉన్న వ్యక్తులను కూడా ఈ దుర్వాసన బాధించగలదు. మీరప్పుడు ఏం చేస్తారు? మీ శిశువు డైపర్‌ను మార్చడానికి తగిన ప్రదేశం ముందే తెలిసి పెట్టుకోవడం వలన అలాంటి అనుకోని సంఘటన జరిగినా అందుకు సిద్ధంగా ఉండాలి. మాల్స్ లేదా రెస్టారెంట్లలోని బాత్‌రూమ్‌లే కాక మీ స్వంత కారు చాటు కూడా డైపర్ మార్చుకొనేందుకు మంచి ప్రదేశాలు.
Travelling suggestions with kids in telugu, Tips to travel with kids in telugu, Travelling Suggestions That You Can Keep in Mind While Traveling with Kids in English, Travelling Suggestions That You Can Keep in Mind While Traveling with Kids in Hindi, Travelling Suggestions That You Can Keep in Mind While Traveling with Kids in Tamil, Travelling Suggestions That You Can Keep in Mind While Traveling with Kids in Bengali.
Yes
No

Written by
Nayana Mukkamala
Get baby's diet chart, and growth tips











గర్భధారణ సమయంలో తాటి ముంజలు: ప్రయోజనాలు ఇంకా ప్రమాదాలు | Ice Apple During Pregnancy in Telugu

10 వారాల గర్భం ఎన్నవ నెల అవుతుంది ఇంకా మీకు ఆ సమయంలో కనిపించే లక్షణాలు ఏమిటి?

పసిపిల్లలకు చలికాలపు దుస్తులు కొనేటప్పుడు ఎలాంటి బట్టలను పరిగణనలోకి తీసుకోవాలి?

మీరు మీ బిడ్డకు ఆవు పాలను ఎప్పుడు ఇవ్వవచ్చు? (When Can You Give Cow's Milk to Your Baby in Telugu?)

ఎల్ఎంపీ, అల్ట్రాసౌండ్ స్కాన్ మధ్య తేడాలు

గర్భధారణ సమయంలో ఎకోస్ప్రిన్-150 తీసుకోవడం సురక్షితమేనా? (Is It Safe To Take Ecosprin 150 In Pregnancy in Telugu?)