
ఐస్ యాపిల్(తాటి ముంజలు) అనే పేరు, ఈ పండు గురించి తెలియని వారిలో ఉత్సుకతను రేకెత్తిస్తుంది. పామ్ ఫ్రూట్ అని కూడా పిలువబడే ఈ తాటి ముంజలను వేసవిలో ఎక్కువగా వినియోగిస్తారు ఇంకా ఇది గర్భిణీ స్త్రీలకు కూడా సిఫార్సు చేయబడింది. అయితే గర్భధారణ సమయంలో తాటి ముంజలు తీసుకోవడం సురక్షితమేనా? ఈ కథనం గర్భిణీ స్త్రీలకు అద్భుతమైన ఈ వేసవి పండు వల్ల కలిగే ప్రయోజనాలు ఇంకా దుష్ప్రభావాలను గురించి చర్చిస్తుంది.
ఐస్ యాపిల్ లేదా తాటి ముంజలు, వీటిని సాధారణంగా 'నుంగు' లేదా 'నొంగు' అని పిలుస్తారు, ఎక్కువగా ఆగ్నేయాసియా ఇంకా దక్షిణ భారతదేశంలో కనిపిస్తుంది. తాటి ముంజలు అమ్మేవారు వీధుల్లో కనిపించడం తమిళనాడులో మామూలే. బోరాసస్ ఫ్లెబెల్లిఫెర్ అని పిలువబడే తాటి చెట్లపై, ఈ పండ్లు గుత్తులుగా పెరుగుతాయి. పరిపక్వానికి వచ్చిన తాటి పండు పరిమాణం కొబ్బరికాయంత ఉంటుంది ఇంకా ఇది బయటివైపు నల్లని చిప్పను కలిగి ఉంటుంది. తాటిముంజల రంగులేని పారదర్శకమైన జెల్లీ లాంటి రూపం, దీనికి ఐస్ యాపిల్ అనే పేరును తెచ్చింది. తాటి ముంజలు మంచినీళ్లతో నిండి ఉండి కొబ్బరినీళ్లలాగా శక్తినిస్తుంది. అందుకే గర్భధారణ సమయంలో తాటి ముంజలను తీసుకోవడం మంచిది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో మామిడిపండు
తాటి పండు దాని ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. ఇది జీర్ణ సంబంధ వ్యాధులకు మంచిది మరియు ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది. తాటి ముంజలలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల వేసవిలో ఇది ప్రసిద్ధి చెందింది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి మరియు ఇది కాల్షియం ఇంకా ఫైటోన్యూట్రియెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. ఐస్ యాపిల్‌లో విటమిన్ ఎ, ఇ మరియు బి7 ఉన్నాయి, ఇవి చర్మం మరియు జుట్టుకు చక్కగా ఉపయోగపడతాయి. అతిసారం మరియు వాంతులు ఉన్న రోగులలో డీహైడ్రేషన్ నివారించడానికి దీనిని మితమైన మొత్తంలో తీసుకోవడం మంచిది. అందువల్ల, గర్భధారణ సమయంలో వచ్చే అలసట నుండి ఉపశమనం పొందేందుకు గర్భధారణ సమయంలో తాటి ముంజలు తీసుకోవడం కూడా మంచిది.
ఇప్పుడు, గర్భధారణ సమయంలో తాటి ముంజలు తీసుకోవడం సురక్షితమేనా కాదా అని తెలుసుకుందాం. గర్భధారణ సమయంలో తాటి ముంజలు తినడం సురక్షితం ఎందుకంటే ఈ పండు సహజంగా పెరుగుతుంది ఇంకా ఫోలేట్, విటమిన్లను మరియు శక్తినందించే మంచి వనరు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం ఎప్పటికీ మంచిదే. తాటి ముంజలు కొనే ముందు, వాటిపై రసాయనాలు స్ప్రే చేయలేదని నిర్ధారించుకోవాలి. తాటి ముంజలు త్వరగా పాడైపోతాయి కాబట్టి, దుకాణాల్లో కొనేవి లేదా రోడ్డు పక్కన దొరికేవి తాజాగా ఉండేలా చూసుకోవాలి. అయితే, గర్భధారణ సమయంలో ఆహారంలో ఏదైనా కొత్త పదార్థాలు చేర్చే ముందు, గైనకాలజిస్ట్‌ని సంప్రదించడం ఎల్లప్పుడూ మంచిది.
గర్భధారణలో వేవిళ్లతో ఎన్నో అలసట పుట్టించే ఉదయాలుంటాయి. వాంతుల కోసం లెక్కలేనన్ని సార్లు బాత్రూముకు వెళ్ళి రావడం ఎలా మర్చిపోగలరు. మాటిమాటికయ్యే ఈ వాంతులు వారిని అలసిపోయేలా చేయడమే కాకుండా వారికి అసీడిటిని కలిగిస్తాయి. గర్భవతులు తాటి ముంజలు తీసుకోవడం వల్ల ఇలాంటి ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. గర్భధారణలో సాధారణంగా కలిగే తినాలనే కోరికలను ఆ మహిళలు, పుష్కలమైన పోషకాలు తక్కువ కేలరీలు అందించే తాటి ముంజలను పరిమితంగా తీసుకోవడం ద్వారా తీర్చుకోవచ్చు. తాటి ముంజలు, తల్లి పాల ఉత్పత్తిని మెరుగుపరచడమే కాకుండా పోషక విలువలను జోడిస్తుంది. తల్లిపాలు తాగే పిల్లలకు చక్కని రోగనిరోధక శక్తి ఉంటుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో ఐస్ క్రీమ్: ప్రమాదాలు, దుష్ప్రభావాలు
గర్భధారణ సమయంలో తాటి ముంజలను తీసుకోవడం వల్ల ఎలాంటి హాని జరగకపోగా, ఈ సమయంలో తాటి ముంజలు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే, వీటిలో గ్లూకోజ్ సారం ఉంటుంది కనుక వీటిని మితంగా తీసుకోవాలి. గర్భధారణ సమయంలో తాటి ముంజలు తీసుకునే ముందు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. జీర్ణక్రియ సమస్యలు ఇంకా కడుపు నొప్పి రాకుండా ఉండేందుకు పండిన పండ్లను కొనాలనేది గుర్తుంచుకోవలసిన విషయం.
తాజా తాటి ముంజలను కొన్న వెంటనే తినేయాలని గుర్తుంచుకోవాలి. ముంజలను కత్తితో కోసి, దానిలోని నీటితో పాటు ఒక గిన్నెలో వేసుకొని తినవచ్చు. వీటిని తినేటప్పుడు వాటి రుచిని ఆస్వాదించాలనుకుంటే, సాంప్రదాయ పద్ధతిలో తినాలి, ఇది ఇంకాస్త సరదాగా ఉంటుంది. తొక్కును తీసివేసి, లోపల చక్కెర కలిపిన నీటిని పోసి ముంజలను మింగే ముందు చక్కగా నమలాలి. కారం నచ్చిన వారు ముంజలలో చిటికెడు కారం పొడి ఇంకా ఉప్పు చల్లుకోవచ్చు. కొన్నిసార్లు గర్భవతులు తీపి పదార్థాలు కోరుకుంటారు, అంతేకాక ఈ అద్భుతమైన పండుతో నంగు ఖీర్ లేదా మిల్క్ షేక్ కూడా చేసుకోవచ్చు.
తాటి ముంజలు సులభంగా పాడైపోతాయి కాబట్టి, వాటిని ఎల్లప్పుడూ ఫ్రిజ్‌లోనే నిల్వచేయాలి. పండ్ల తొక్కుని తీసేసి, గాలి తగలకుండా డబ్బాలలో వేసి గట్టిగా మూత వేసి నిల్వ చేయాలి, లేకపోతే ఆక్సీకరణ కారణంగా ఇవి వాటి రుచి ఇంకా రంగును కోల్పోతుంది అలాగే చెడిపోవచ్చు కూడా. ఎల్లప్పుడూ తాజా తాటి ముంజలనే కొనాలని గుర్తుంచుకోవాలి. ఇది తాజాగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక పద్ధతి ఏమిటంటే, తాటిపండును బయటి ముదురురంగు పెంకు ముడతలతో వాడినట్లు ఉందా అని చూడాలి. ఇది చాలా కాలం క్రితమే కోసినవి అయితే, అవి వడలిపోయి ముడతలు పడినట్లుగా కనిపిస్తాయి.
References
1. Sundram K, Sambanthamurthi R, Tan YA. (2003). Palm fruit chemistry and nutrition. Asia Pac J Clin Nutr
What is Ice Apple in Bengali, What are the benefits of Ice Apple in Bengali, What are the risks of Ice Apple in Bengali, Ice Apple During Pregnancy: Benefits And Risks in English, Ice Apple During Pregnancy: Benefits & Risks in Hindi, Ice Apple During Pregnancy: Benefits & Risks in Tamil, Ice Apple During Pregnancy: Benefits And Risks in Bengali
Yes
No














Influenza and boostrix injection kisiko laga hai kya 8 month pregnancy me and q lagta hai ye plz reply me
Hai.... My last period was in feb 24. I tested in 40 th day morning 3:30 .. That is faint line .. I conculed mylo thz app also.... And I asked tha dr wait for 3 to 5 days ... Im also waiting ... Then I test today 4:15 test is sooooo faint ... And I feel in ma body no pregnancy symptoms. What can I do .
Baby kicks KB Marta hai Plz tell mi
PCOD kya hota hai
How to detect pcos
Your body needs extra nutrition this trimester - these can help.





This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |