
గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీలు తరచూ వెన్ను నొప్పిపై ఫిర్యాదు చేస్తారు. ప్రెగ్నెన్సీ సమయంలో తీవ్రమైన వెన్నునొప్పి సర్వసాధారణం. మీరు మీ గర్భధారణలో వెన్నునొప్పి ఎదుర్కొనబోవచ్చు. లేదా ఏ దశలోనైనా ఎదుర్కొని ఉంటారు. అయితే ఎక్కువగా గర్భధారణ చివరి దశల్లో శిశువు పెరుగుతున్న కొద్ది వెన్నునొప్పి ఎదురవ్వొచ్చు. గర్భం తరువాతి దశల్లో వెన్నునొప్పి సంకేతాలు, లక్షణాలను గుర్తించడం చాలా సులభం. కానీ మీ ప్రెగ్నెన్సీ తొలి త్రైమాసికంలో వచ్చే తీవ్రమైన వెన్నునొప్పి వెనకున్న కారణం ఏమిటి? మనం ఇక్కడ తెలుసుకుందాం.
ఆ వెన్నునొప్పితో మీరు గందరగోళ పడకండి. దాని గురించి చింతిచకండి. ప్రెగ్నెన్సీ సమయంలో తీవ్రమైన వెన్ను నొప్పి అనేది కేవలం మీకు మాత్రమే రావడం లేదు. నివేదికల ప్రకారం 50 నుంచి 70 శాతం మంది గర్భిణీ మహిళల్లో ఈ నొప్పి సాధారణంగా వస్తుంది. మీరు నమ్మరు కానీ.. వెన్నునొప్పి అనేది కొంత మంది మహిళలకు గర్భధారణ సంకేతం. గర్భం దాల్చిన మొదటి త్రైమాసికంలో వెన్నునొప్పి అనేది బరువు పెరగడం, ఒబెసిటీ, కూర్చునే భంగిమలో మార్పులు, వ్యాయామాలు చేయకపోవడం, గర్భధారణ సమయంలో సంకోచాల వల్ల కావొచ్చు. అసాధారణ గర్భధారణలో ఇది భాగం కూడా కావొచ్చు. అందువల్ల ప్రెగ్నెన్సీ అనేది ఎక్కువ ప్రమాదకరం కాదన్న నిర్ణయానికి మీరు రావాలి. పైన పేర్కొన్న కారణాల వల్ల మీకు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.
ప్రెగ్నెన్సీ తొలి దశలో వెన్నునొప్పి అనేది ప్రధానంగా వెన్నుముక మధ్య ప్రాంతంలో వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ నొప్పి దిగువ భాగంలో, అలాగే అన్ని వైపులా కూడా ఉండవచ్చు. ఏ నరం అయితే ప్రభావితం అయిందో దానిని బట్టి నొప్పి వచ్చే ప్రాంతం మారుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ తొలి దశలో వచ్చే నడుము నొప్పిని విశ్రాంతి తీసుకోవడం వల్ల తగ్గించుకోవచ్చు. తరుచూ ఎక్కువ గంటలు కూర్చోవడం నరాలపై ఒత్తిడికి కారణం అవుతుంది. ప్రెగ్నెన్సీ తొలి దశలో వెన్నునొప్పి రోజు మొత్తంలో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియకుండా వస్తుంటుంది. తిమ్మిరి, మంట, కండరాల నొప్పితో కూడి ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో దిగువ వెన్ను భాగంలో వచ్చే వెన్నునొప్పి ప్రధానంగా మీ శరీరం ఒకవైపును మాత్రమే ప్రభావితం చేస్తుంది. గర్భంలోని పిండం యొక్క స్థానం నొప్పి స్థానాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇతర సందర్భాల్లో నొప్పి అనేది ప్రెగ్నెన్సీ 5 లేదా 7 వ నెలల మధ్య ప్రారంభం అవుతుంది. కొన్ని అరుదైన సందర్భాల్లో మాత్రమే గర్భం దాల్చిన కొద్ది సేపట్లోనే దిగువ వెన్నుభాగంలో వెన్నునొప్పి ప్రారంభమవుతుంది.
ఇప్పుడు మీరు ఆశ్చర్యపోవచ్చు.. ప్రెగ్నెన్సీ తొలి దశలో వెన్ను దిగువ భాగంలో వెన్ను నొప్పి సాధారణమా? అప్పుడప్పుడూ కండరాల నొప్పి, వెన్నునొప్పి ప్రెగ్నెన్సీ తొలి త్రైమాసికంలో వస్తుంది. ఇది సహజమే. అందుకు వివిధ రకాల కారణాలు ఉన్నాయి. కానీ నొప్పి అనేది తీవ్రంగా ఉంటే మాత్రం మీరు మీ వైద్యుడిని సంప్రదించాలి. ఫైనల్‌గా గైనకాలజిస్ట్ టెస్ట్ చేస్తే మాత్రమే ఆ నొప్పి ప్రెగ్నెన్సీ వలన వచ్చేదా? లేక వేరే ఏదైనా నొప్పా అనే విషయం తెలుస్తుంది. ఏదైనా చికిత్స అవసరమైతే చేయించుకోవచ్చు. మీకు వెన్నునొప్పి రావడానికి గల కారణాలను గురించి కూడా తెలుసుకోవాలి.
ఇప్పుడు ప్రెగ్నెన్సీ సమయంలో వెన్నునొప్పికి గల వివిధ కారణాలను గురించి తెలుసుకుందాం. బ్యాక్ స్ట్రెయిన్‌ను పెంచే, నరాల మూలాల మీద ప్రభావం చూపే ఆ వెన్నునొప్పి గురించి తెలుసుకుందాం.
ప్రెగ్నెన్సీ సమయంలో గురుత్వాకర్షణ కేంద్రం మారుతుంది. ఇది భంగిమలో మార్పులు, లోయర్ బ్యాక్ (వీపు దిగువ భాగం)లో నొప్పిని కలిగిస్తుంది.
ప్రెగ్నెన్సీ సమయంలో బాడీ రిలాక్సిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రసవానికి ముందు పెల్విస్ (తుంటి)లో ఉన్న లిగమెంట్స్ (బోన్స్ని కలిపే ప్రాంతం) రిలాక్స్ అయ్యేలా ఇది ప్రేరేపిస్తుంది. అందువల్ల ఈ హార్మోన్ వెన్నుముక లిగమెంట్స్ను వదులుచేస్తుంది. ఇది వెన్నుముకలో అస్థిరతకు దారి తీస్తుంది. ఈ కారణం చేతే మీకు గర్భధారణ సమయంలో తరుచుగా వెన్నునొప్పి వస్తుంటుంది.
ప్రెగ్నెన్సీకి ముందు స్త్రీలకు డిస్క్ ప్రొటూషన్ లేదా డీజెనరేటివ్ డిస్క్ మార్పులు ఉంటే ఇవి హెర్నియేట్ అయి ప్రెగ్నెన్సీ సమయంలో వెన్నుముక దిగువ భాగంలో వెన్ను నొప్పికి దారి తీస్తాయి.
ప్రెగ్నెన్సీ సమయంలో మీ లిగమెంట్స్ (రెండు బోన్స్ని కలిపేది) చాలా మృదువుగా ఉంటాయి. ప్రసవానికి మిమ్మల్ని సిద్ధం చేయడం కోసం ఇవి గరిష్టంగా సాగి ఉంటాయి. ఇది మీ దిగువ వెన్నుముక, పెల్విక్ (తుంటి భాగం) జాయింట్స్‌లో ఒత్తిడిని కలిగిస్తుంది.
ప్రెగ్నెన్సీ సమయంలో మీ వెన్ను నొప్పికి మరో ప్రధాన కారణం ఒత్తిడి. ఒత్తిడి అనేది సాధారణంగా బలహీనంగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటుంది. కండరాల నొప్పులకు ఇది దారి తీస్తుంది. తద్వారా వెన్నునొప్పికి కారణం అవుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో మీరు ఒత్తిడిలో ఉన్నపుడు అధికంగా వెన్నుముక నొప్పిని అనుభవించే ఆస్కారం ఉంటుంది.
మీ గర్భం పెరుగుతున్నపుడు గర్భం యొక్క తర్వాతి దశలు కూడా వెన్ను నొప్పికి కారణం అవుతాయి.
పైన పేర్కొన్న కారకాలు మీరు మొదటి త్రైమాసికం ప్రెగ్నెన్సీలో ఉన్నపుడు వెన్ను నొప్పిని తీవ్రతరం చేస్తాయి. ప్రెగ్నెన్సీ సమయంలో వెన్నుముక దిగువ భాగంలో వెన్నునొప్పి తీవ్రంగా ఉంటుంది. ఇది మీ రోజూ వారి కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుంది. ఇది మీ రాత్రి నిద్రకు కూడా భంగం కలిగించవచ్చు. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ నొప్పిని భరిస్తుంటే మీ వైద్యుడితో మాట్లాడడం మంచిది. వారు మీకు అనేక చిట్కాలను అందిస్తారు. మీకు ఈ సమయంలో నడుము నొప్పి ఎందుకు వస్తుందో దానిని ఎలా భరించాలో వివరిస్తారు.
Yes
No














Urin lo Manta unte em cheyali
Your body needs extra nutrition this trimester - these can help.





This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |