hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Pregnancy Best Foods arrow
  • గర్భవతిగా ఉన్నప్పుడు వాల్ నట్స్ తినడం వలన వచ్చే లాభాలు & నష్టాలు (Benefits & Risks of Eating Walnuts in Pregnancy in Telugu) arrow

In this Article

    గర్భవతిగా ఉన్నప్పుడు వాల్ నట్స్ తినడం వలన వచ్చే లాభాలు & నష్టాలు (Benefits & Risks of Eating Walnuts in Pregnancy in Telugu)

    Pregnancy Best Foods

    గర్భవతిగా ఉన్నప్పుడు వాల్ నట్స్ తినడం వలన వచ్చే లాభాలు & నష్టాలు (Benefits & Risks of Eating Walnuts in Pregnancy in Telugu)

    3 November 2023 న నవీకరించబడింది

    ప్రెగ్నెన్సీ సమయంలో మీరు ఏవి పడితే అది అన్నీ తినలేరు. మీకు ఏ కాంప్లికేషన్ ఉన్నా, లేకపోయినా ఏ వంటకంలోని పదార్థాలైనా మీకు లేదా మీ పెరుగుతున్న బిడ్డకి అపాయకరమైతే, మీ డాక్టరు చాలా రకాల పదార్థాలని తినకుండా, తాగకుండా మిమ్మల్ని నియంత్రిస్తారు. ఏ పదార్థం అయినా హానికరం ఎప్పుడు అవుతుంది అంటే అది గర్భస్రావం, భారీగా రక్తస్రావం, కడుపులో నొప్పులు అలాగే ప్రసవం ముందుగానే వచ్చేయడం వంటి కాంప్లికేషన్లకు దారితీసినప్పుడు అనే కోణంలో చెప్పబడతాయి. అందుకని, మీరు కడుపుతో ఉన్నట్టయితే ఏం తింటున్నారో ప్రతిదీ జాగ్రత్తగా ఆలోచించి తినాలి. అలాగే మీ గైనకాలజిస్టు నిషేధించిన ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలి. అలా మనం ఆందోళన చెందే ఆహార పదార్థాలలో ఒకటి : వాల్ నట్స్. ప్రెగ్నెన్సీ సమయంలో వాల్నట్లని తినడం వలన ఎంత సురక్షితం, ఏ ప్రమాదాలు వస్తాయన్న ఆందోళనలతో చాలా గందరగోళం ఏర్పడి వుంది కాబట్టి వాటి గురించి మనం ఈ ఆర్టికల్లో వివరంగా చర్చిస్తాం. వాల్ నట్స్ లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు, చాలా ఇతర పోషకపదార్థాలు ఎక్కువగా ఉంటాయని మనందరికీ తెలుసు. కానీ ప్రెగ్నెన్సీ సమయంలో వాల్ నట్స్ ని ప్రమాదకరం చేసేది ఏంటి, లేకపోతే అది కేవలం ఒక అపోహేనా? ఇక్కడ చర్చిద్దాం.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీ సమయంలో రక్తస్రావం? దీని అర్థం ఏమిటి? మీరు వైద్యుడిని సంప్రదించాలా?

    గర్భవతిగా ఉన్నప్పుడు వాల్ నట్స్ ని తినడం సురక్షితమేనా? (Does Eating Walnuts Safe During Pregnancy in Telugu?)

    వాల్ నట్స్ ని హిందీలో ఆక్రోట్స్ అని కూడా పిలుస్తారు. వీటిని ప్రెగ్నెన్సీ సమయంలో తినడం పూర్తిగా సురక్షితమని పరిగణిస్తారు. ఇందులో ఉండే పోషకాహార భాగం పిండం సరిగ్గా ఎదగడంలో చాలా సహాయపడుతుంది. సాధారణంగా, డాక్టర్లు కడుపుతో ఉన్నవారిని వారి డైట్లో భాగంగా రెండు వాల్నట్లని తినమని సూచిస్తారు. కడుపుతో ఉన్నప్పుడు వాల్నట్లని తినడం తల్లి బిడ్డ ఇద్దరికీ లాభదాయకం అనే చెప్పాలి. అంతేకాక, వాల్నట్లను రకరకాల పద్ధతుల్లో సులభంగా తినవచ్చు. వాటిని పచ్చిగా తినవచ్చు లేదా వాటిని ఉపయోగించి స్మూతీలు, గ్రనోలా బార్లు అలాగే మరెన్నో వంటకాలని ప్రయత్నించవచ్చు.

    ప్రెగ్నెన్సీ సమయంలో వాల్నట్లని తినడం వల్ల వచ్చే పోషక లాభాలు (Benefits of Eating Walnuts During Pregnancy in Telugu)

    వాల్నట్లని మీ ఆహారంలో చేర్చుకునే ముందు, ప్రెగ్నెన్సీ సమయంలో వాల్నట్ల వల్ల వచ్చే లాభాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.

    1. ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే వనరు (Rich Source of Omega Fatty Acids)

    ప్రెగ్నెన్సీ సమయంలో వాల్నట్లు తినడం వల్ల వచ్చే ప్రధానమైన లాభాల్లో ఒకటి, వాటిల్లో ఎక్కువ శాతం ఉండే ఒమేగా-3 అలాగే ఒమేగా-6 ఫ్యాటియాసిడ్లు అందడం. ఇవి కాబోయే తల్లి యొక్క గుండె ఆరోగ్యానికి, ఇంకా పిండం యొక్క నరాల ఎదుగుదలకి చాలా అవసరం. ఉదాహరణగా చెప్పాలంటే వాల్నట్లు పిండం మెదడు యొక్క మెనింజెస్ అభివృద్ధిని ప్రోత్సహించి, నాడీ పెరుగుదలని మెరుగుపరుస్తాయి.

    2. ఖనిజల లవణాలతో నిండి ఉంటుంది (Loaded with Minerals)

    వాల్నట్లలో జింకు, మెగ్నీషియం నుండి రాగి వరకూ చాలా ఖనిజలవణాలు ఉన్నాయి. ఇవి గర్భవతిగా ఉన్న మహిళలకు అలాగే ఎదుగుతున్న పిండానికి లాభదాయకమని నిరూపించబడ్డాయి. ప్రెగ్నెన్సీ సమయంలో వాల్నట్లలో ఉండే ఖనిజలవణాల వల్ల వచ్చే కొన్ని లాభాలు కింద ఇవ్వబడ్డాయి.

    • వాల్నట్లలో ఎక్కువగా రాగి ఉంటుంది, ఇది పిండం యొక్క మెదడు సరిగ్గా అభివృద్ధి చెందడానికి సాయం చేసి, ఎదుగుదలని సులభం చేస్తుంది.
    • ఇందులో ఉండే రాగి పిండంలో ఎర్ర రక్త కణాలు ఏర్పడేలా ప్రోత్సహిస్తుంది.
    • మాంగనీస్ బిడ్డలో ఎముకలు అలాగే కార్టిలేజ్ లేదా మృదులాస్థి సరిగ్గా అభివృద్ధి చెందడానికి ఇంకా బలంగా ఎదగడానికి సాయం చేస్తుంది.
    • జింక్ గర్భవతిగా ఉన్న స్త్రీలలో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. దాని ఫలితంగా, ముఖ్యంగా మూడో ట్రైమిస్టరులో ప్రసవం సమయంకంటే ముందుగానే వచ్చే అవకాశాన్ని నివారించవచ్చు.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో సోంపు గింజలు తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు

    గర్భవతిగా ఉన్నప్పుడు వాల్నట్లు తినటం వల్ల ఆరోగ్యపరంగా వచ్చే లాభాలు (Health Advantages of Eating Walnuts During Pregnancy in Telugu)

    1. ఇందులో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి (High in Antioxidants)

    విటమిన్ E లేదా టోకోఫెరాల్ ఎక్కువ మొత్తంలో ఉన్నందువల్ల ప్రెగ్నెన్సీ సమయంలో వాల్నట్లను తినవచ్చు. విటమిన్ E ని ఎక్కువ ప్రభావంతమైన యాంటీ ఆక్సిడెంట్లలో ఒకటిగా గుర్తిస్తారు. ఇది తల్లీబిడ్డ ఇద్దరిలో కణజాలాలలో ఆక్సీకరణం వల్ల జరిగే నష్టాలని తగ్గిస్తుంది. పిండం ఆరోగ్యకరంగా ఎదిగేలా చూస్తూ, శరీరంలో ఏదైనా మ్యుటేషన్ లేదా క్యాన్సర్ పెరగడాన్ని నివారిస్తుంది.

    2. ఇది ఎక్కువగా పీచు పదార్థం ఉండే వనరు (Rich Source of Fiber)

    కడుపుతో ఉన్న మహిళలు తరచుగా మలబద్ధకం, ఉబ్బరం, పొట్టలో పుండ్లు అలాగే IBS ( ఇరిటేబుల్ బోవెల్ సిండ్రోమ్) లతో బాధపడతారు. అందుకనే చాలామంది డాక్టర్లు ప్రధానంగా రెండవ ట్రైమిస్టరు మధ్య నుండి పీచు పదార్థం ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తారు. అదృష్టవశాత్తూ, వాల్నట్లలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. అందుకనే అవి ఆడవారికి సురక్షితమైనవిగా చెప్పబడతాయి. పీచు పదార్థం పెద్ద పేగులో కదలిక సరిగ్గా ఉండడానికి సాయపడుతుంది అలాగే ఉబ్బరం, మలబద్ధకాలనుండి ఉపశమనం అందిస్తుంది.

    3. రక్తంలో HDL స్థాయిలని పెంచుతుంది (Increases HDL Levels in the Blood)

    వాల్నట్లలో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు మహిళలకు ఎంతో లాభం చేకూరుస్తాయి. అవి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి HDL స్థాయి పెరిగేలా చేస్తాయి. ఫలితంగా, కడుపుతో ఉన్న మహిళల గుండె ఆరోగ్యం సరైన స్థాయిలో చక్కగా ఉంటుంది.

    మీరు గర్భవతిగా ఉన్నప్పుడు తినే ఆహారంలో వాల్నట్లని చేర్చడం (Including Walnuts in Your Pregnancy Diet)

    కడుపుతో ఉన్నప్పుడు ఆహారంలో వాల్నట్లని చేర్చుకోడానికి చాలా మార్గాలు ఉన్నాయి. సప్లిమెంటులాగా ఇంకో పదార్థంతో లేకుండా కేవలం పచ్చిగా వాల్నట్ ని తినడం మీకు ఒకవేళ నచ్చకపోతే, ఈ కింది పద్ధతులు మీరు గర్భవతిగా ఉన్నప్పటి డైట్లో వాల్నట్ను సులభంగా చేర్చుకోడానికి సాయపడవచ్చు.

    • వాల్నట్ పప్పులని చియా సీడ్స్, అరటిపండు, తేనెలతోపాటు స్మూతీని తయారుచేయవచ్చు.
    • ముక్కలుగా తరిగిన వాల్నట్లని ఇంటివద్ద తయారుచేసిన గ్రనోలా బార్లకి జోడించవచ్చు.
    • దీన్ని బీట్రూట్ లేదా గ్రీన్ యోగర్ట్ పుడ్డింగ్ కి చక్కనైన అదనపు పదార్థంగా జతచేయవచ్చు.
    • వాల్నట్ల నుండి పాలని కూడా తీసి బేక్ చేసిన పదార్థాలకి వాడవచ్చు.
    • వంట కోసం వాడే సాధారణమైన కాయగూరల నూనె స్థానంలో వాల్నట్ నూనెని అద్భుతమైన ప్రత్యామ్నాయంగా వాడవచ్చు.

    గర్భవతిగా ఉన్నప్పుడు వాల్నట్లని తినడం వలన వచ్చే రిస్కులు (Risks of Eating Walnuts in Pregnancy in Telugu)

    కడుపుతో ఉన్నప్పుడు వాల్నట్లని తినడం వల్ల ఎలాంటి ముఖ్యమైన రిస్కులు లేవు. ఏది ఎలా ఉన్నా, ఏ పదార్థం అయినా పరిమితి దాటి తినకుండా ఉండడమే మంచిది. అందువల్ల వాల్నట్లను కూడా మితంగానే తినాలి. ఒకవేళ వాల్నట్లతో మీకు అలర్జీ ఉంటే వాటికి దూరంగా ఉండాలి. వాల్నట్లని తినడం వల్ల కడుపునొప్పి, దద్దుర్లు వచ్చినట్టయితే వీలైనంత త్వరగా డాక్టర్ని సంప్రదించడం మంచిది.

    చివరిమాట (Conclusion)

    ఈ ఆర్టికల్ ప్రెగ్నెన్సీ సమయంలో వాల్నట్లను తినడం వల్ల కలిగే లాభాలు ఇంకా అవకాశం ఉన్న రిస్కుల గురించి వివరించింది. కడుపుతో ఉన్నవారికి వాల్నట్లతో ఏ అలర్జీ లేనప్పుడు అవి వారికి ఎటువంటి ప్రమాదాన్ని కలిగించవు. అయితే, తల్లీబిడ్డ ఇద్దరి ఆరోగ్యాలని దృష్టిలో పెట్టుకొని, పోషకాలతో నిండిన ఈ వాల్నట్ను మితంగా తీసుకోవడమే మంచిది. వాల్నట్లలో పిండం సరిగ్గా ఎదగడానికి, ముఖ్యంగా నరాలు చక్కగా పెరగడానికి, తల్లి యొక్క జీర్ణక్రియ అలాగే గుండె ఆరోగ్యం మెరుగుపడడానికి అవసరమైన పోషకాలన్నీ ఉంటాయి.

    Tags:

    Walnuts during pregnancy in telugu, Walnuts benefits during pregnancy in telugu, can pregnants eat Walnuts during pregnancy in telugu, risks of eating Walnuts during pregnancy in telugu, Is Walnut safe during pregnancy in telugu.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Swetha Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.