


Pregnancy Best Foods
3 November 2023 న నవీకరించబడింది
గర్భం అనేది శారీరక మరియు మానసిక ఆరోగ్యాలు చాలా సున్నితంగా ఉండే సమయం. ఈ సమయంలో కోరికలు, ఆహారం విషయంలో పరిమితులు ఉండడం సహజం. తినేందుకు ఎటువంటి ఆహారం సురక్షితమో తెలుసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. అటువంటి ఆహారాలలో ఒకటి పానీపూరీ. ఇది ఇండియాలో లభించే సుప్రసిద్ధ స్ట్రీట్ ఫుడ్ (వీధుల్లో లభించేది). దీనిని రెస్టారెంట్లలో, ఇంటిలో కూడా తయారు చేస్తారు. అయితే దానిలో ఉండే మసాలా అనేది గర్భవతులకు ప్రమాదకరంగా ఉంటుందా? అనేది ఈ బ్లాగ్‌లో మేము మీకు వివరిస్తాం. గర్భవతిగా ఉన్నపుడు మేము పానీపూరీని తినొచ్చా? మేము ఈ వంటకంలోని పోషక విలువలను గురించి వివరిస్తాం. అంతే కాకుండా గర్భవతి కావాలని ఆశించేటపుడు దీనిని తినడం వలన ఏవైనా ప్రమాదాలు ఉన్నాయా? అనే దాని గురించి కూడా మేము చర్చిస్తాం.
అవును. మీరు గర్భధారణ సమయంలో పానీపూరీని నిశ్చింతగా తినొచ్చు. కానీ అందులో వాడే పదార్థాల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. పానీపూరీ అనేది ఎంతో ప్రసిద్ధిగాంచిన ఇండియన్ ఫుడ్. దీనిని నీరు, చింతపండు రసం, వివిధ రకాల మసాలాలతో తయారు చేస్తారు. అంతే కాకుండా బాగా ఫ్రై చేసిన ఆలూ, బఠానీల మిశ్రమాన్ని వాడుతారు.
పానీపూరీని గర్భధారణ సమయంలో తినడం సురక్షితమే. కానీ తినే ముందు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి.
గర్భవతిగా ఉన్నపుడు మీరు తినే ఆహారం మరియు తాగే నీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భధారణ సమయంలో ఏది సురక్షితమనే విషయంలో అనేక మూఢనమ్మకాలు, అపోహలు ఉన్నాయి. పానీపూరీ అనేది ఎక్కువగా ఈ అపోహలలో ఉంటుంది. తినొచ్చా, తినరాదా అనే విషయం గురించి చర్చోపచర్చలు జరుగుతాయి. ర్భవతిగా ఉన్నపుడు పానీపూరీ తినడం సురక్షితమేనా? దీనికి సమాధానం అవును. గర్భిణీ స్త్రీలు పానీపూరీ తినడం సాధారణంగా సురక్షితమే. కానీ మీరు గర్భవతిగా ఉన్నపుడు పానీపూరీని తింటుంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. మొదటగా.. మీరు తినాలని అనుకుంటున్న పానీపూరీ తాజాదేనా? అది సరిగ్గా తయారు చేయబడిందా అనేది తెలుసుకోండి. వీధుల్లో ఉండే బండ్ల వద్ద పానీపూరీని తినడం మానుకోండి. ఎక్కడైతే పరిశుభ్రత అనేది మీకు సందేహాస్పదంగా ఉంటుందో అక్కడ తినకుండా ఉండండి.
తర్వాత.. పానీ (నీరు) మరియు పూరీ (బ్రెడ్)లో వాడే పదార్థాల గురించి పూర్తిగా తెలుసుకోండి. పానీలో వాడే నీటిని ఉపయోగించే ముందు కాచి చల్లార్చారని, పూరీలను కుక్డ్ ఫ్లోర్ (పిండి)తో తయారు చేశారని నిర్దారించుకోండి చివరగా.. మీ శరీరం మాట వినండి. మీకు సౌకర్యంగా ఉండేంత వరకు మాత్రమే తినండి. గర్భధారణ వల్ల కొంత మంది స్త్రీలలో అజీర్ణం మరియు గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. కావున ఏదైనా ఒకే ఆహార పదార్థాన్ని అతిగా తినకూడదు. గర్భధారణ సమయంలో పానీపూరీ తిన్న తర్వాత మీకు అసౌకర్యంగా అనిపిస్తే తినడం ఆపేయండి. కొన్ని రోజుల వరకు వేచి చూడండి.
గర్భం మరియు ఆహారం విషయానికి వస్తే అనేక రకాల మూఢనమ్మకాలు, పాత కథలు, పనికి రాని కహానీలు మనం వింటూ ఉంటాం. కాబట్టి గర్భధారణ సమయంలో చాట్ తినడం సురక్షితమేనా అని మీరు ఆశ్చర్యపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదు. మీరు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నపుడు గర్భవతులకు చాట్ అనేది సురక్షితమైన మరియు రుచికరమైన చిరుతిండిగా మారుతుంది.
గర్భవతిగా ఉన్నపుడు సురక్షితమైన చాట్ ఎలా చేయాలో తెలిపేందుకు ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.
మొత్తానికి పానీపూరీ అనేది గర్భిణీ స్త్రీలు రుచికరంగా తినేందుకు ఉన్న ఆరోగ్యకరమైన చిరుతిండి. మీరు దీనిని తినేటపుడు అందులో వేసిన పదార్థాలు సరైన విధంగా శుభ్రపరిచి వండారని నిర్దారించుకోవాలి. ఈ పాపులర్ స్ట్రీట్ ఫుడ్‌ను గర్భధారణ సమయంలో తినడం వలన ఎటువంటి ప్రమాదాలు ఉండవు. ఏదేమైనా గర్భధారణ సమయంలో పానీపూరీని తినేటపుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఎందుకంటే దాని తయారీలో వాడే కొన్ని రకాల పదార్థాలు జీర్ణవ్యవస్థలో అసౌకర్యం కలిగించవచ్చు లేదా తల్లి ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. గర్భధారణ సమయంలో కొత్త ఆహారాలను తినేటపుడు మీ శరీరానికి అవి పడతాయో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు దానికి తగిన విధంగా నిర్ణయం తీసుకుంటారు. మీకు మరియు మీ శిశువు భద్రతకు ఏది ఉత్తమమో తెలుసుకునేందుకు మైలో ఫ్యామిలీని సందర్శించండి.
Yes
No

Written by
Swetha Rao
Get baby's diet chart, and growth tips











డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)