


Getting Pregnant
3 November 2023 న నవీకరించబడింది
బాడీ పాలిషింగ్ ఎపిడెర్మల్ ఔట్‌లుక్‌ను మెరుగుపరచడంలో సహాయపడి, చర్మాన్ని కాంతివంతంగా చేసి స్క్రబ్బింగ్ తో మెరుగు పరుస్తుంది. ఇది ఒక అద్భుతమైన చర్మ సంరక్షణ చికిత్స.
ఇప్పటివరకు, బాడీ పాలిషింగ్ కోసం ప్రొఫెషనల్ సెలూన్ కి వెళ్ళవలసి వచ్చేది. అయితే, అది గతం. బాడీ పాలిషింగ్ కోసం ఇప్పుడు ఎవరూ ప్రొఫెషనల్ సెలూన్ లేదా స్పా సెంటర్‌కు వెళ్ళే పని లేదు, ఎందుకంటే మీరు ఇంట్లోనే కొన్ని మామూలు వస్తువులతో బాడీ పాలిషింగ్ చేసుకోవచ్చు.
ఇంటిలోనే బాడీ పాలిషింగ్ చేయడానికి ఏమి కావాలో, ఏమి తెలుసుకోవాలో ఇక్కడ చూడండి.
బాడీ పాలిషింగ్‌కు ఉప్పు, చక్కెర లేదా రవ్వతో తయారు చేసిన తేలికపాటి స్క్రబ్ క్రీమ్ అవసరం, ఇది సున్నితమైన రాపిడితో చర్మంపై ఉన్న మృత కణాలను శుభ్రం చేస్తుంది. ఈ ట్రీట్‌మెంట్ కి క్రీమ్ బేస్ స్కిన్ మాయిశ్చరైజేషన్, సున్నితంగా మసాజ్ చేయడం రెండూ అవసరం, ఇవి మృదువైన చర్మానికి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
కేవలం ఈ క్రింది ముఖ్యమైన వస్తువులతో ఇంట్లోనే మృదువైన బాడీ పాలిషింగ్ ట్రీట్‌మెంట్ చేసుకోవచ్చు:
ఈ పదార్ధాలను తీసుకున్న తర్వాత, ఇంటి వద్దనే బాడీ పాలిషింగ్ చేయడానికి స్టెప్స్ ఇవి:
1. ముందుగా చర్మాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రపరచాలి. దీనివల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. దీనివల్ల బాడీ పాలిషింగ్ ప్రభావవంతంగా పనిచేస్తుంది.
2. తడి చర్మాన్ని తుడిచి ఆరబెట్టి, ఆపై లోతైన మాయిశ్చరైజేషన్ కోసం ఏడు నుండి పది నిమిషాల వరకు గోరువెచ్చని ఆలివ్ నూనెతో పూర్తిగా మసాజ్ చేయాలి.
3. తర్వాత ఇంట్లో తయారు చేసిన బాడీ పాలిష్‌ని చర్మంపై ఒకేలా వ్యాపించేలా సున్నితంగా మసాజ్ చేయాలి. లోతైన చర్మాన్ని శుభ్రపరచడం కోసం 15 నిమిషాల వరకు మసాజ్ చేయడం కొనసాగించాలి. లూఫా ఉపయోగించి గుండ్రంగా తిప్పుతూ చర్మాన్ని మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
4. మోచేతులు, మోకాళ్ళు, మడమలు వంటి చర్మం దళసరిగా ఉన్న చోట ఎక్స్‌ఫోయిలేషన్ చేయడానికి ప్యూమిక్ స్టోన్ ఉపయోగించడం చాలా మంచిది. చర్మం సున్నితంగా ఉంటుంది కాబట్టి రాపిడి అవకుండా ఉండటానికి ప్యూమిక్ స్టోన్‌తో సున్నితంగా రాయాలి.
5. శరీరాన్ని పూర్తిగా స్క్రబ్ చేసిన తర్వాత, స్నానం చేయడం ఈ అప్లికేషన్ పూర్తిగా పోవడానికి సహాయపడుతుంది. బాడీ పాలిష్ తొలగించిన తర్వాత, రిఫ్రెష్ షవర్ చేయాలి.
సులువుగా దొరికే ఈ కింది పదార్థాలతో ఇంట్లో బాడీ పాలిషింగ్ ఎంతో సులువుగా తయారు చేసుకోవచ్చు. మృదువైన పాలిష్‌ను ఆస్వాదించడానికి కింది ఆయిల్ బేస్‌లలో ఒకదాన్ని ఎంచుకోవాలి:
జిడ్డుగల చర్మం కలవాళ్ళు, నూనెను వాడటం ఇష్టం లేకపోతే ప్రత్యామ్నాయంగా తేనెను ఉపయోగించవచ్చు.
తరువాత, ఈ క్రింది జాబితా నుండి మీ చర్మానికి సరిగ్గా సరిపోయే ఎక్స్‌ఫోయిలెంట్‌ను ఎంపిక చేసుకోండి:
ఇలాంటి వాటిని జోడించడం ద్వారా శరీరానికి పోషకాలు అధికంగా అందేలా చేయవచ్చు:
ఈ పదార్ధాలను ఎన్నుకునేటప్పుడు, చర్మం ఏ రకమో తెలుసుకొని చక్కనిది, ఎక్కువసేపు పట్టే బాడీ పాలిషింగ్ ట్రీట్‌మెంట్ చేసుకోవాలి.
ఇంట్లో బాడీ పాలిషింగ్ ట్రీట్‌మెంట్ చేసుకునేటప్పుడు కొన్ని పనులు అస్సలు చేయకూడదు.
ఇంట్లో బాడీ పాలిషింగ్ చేసుకునే ముందు, ఇంట్లో చేసిన పాలిష్‌ని కొంతమేర రాసి పరీక్షించడం మంచిది. దీనివల్ల ఇబ్బందులు లేవని నిర్దారణ చేసుకోవచ్చు. ఉపయోగించిన పదార్థాలను బట్టి, ఒకటి, రెండు వారాల పాటు బాడీ పాలిష్‌ను నిల్వ చేయవచ్చు. మెరిసే మృదువైన చర్మాన్ని నిలుపుకోవడానికి ఈ ట్రీట్‌మెంట్ తరచుగా చేసుకుంటూ ఉండాలి.
మైలో బ్లాగ్ లో , ప్రెగ్నెన్సీ, మదర్‌కేర్ బేబీకేర్ చిట్కాలతో పాటు సొంతంగా చేసుకొనే ఇలాంటి ఎన్నో స్కిన్ కేర్, పర్సనల్ కేర్ చిట్కాలను తెలుసుకోవచ్చు.
Yes
No

Written by
Sarada Ayyala
Get baby's diet chart, and growth tips







డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)