


Pregnancy
3 November 2023 న నవీకరించబడింది
గర్భంతో ఉన్న వారి విషయానికి వస్తే.. వారు తినాల్సిన పదార్థాల గురించి చాలా మంది చాలా రకాలుగా చెబుతారు. ఇటువంటివి తినడం వలన పోషకాలు బాగా అందుతాయని కూడా చెబుతారు. పోషకాలు అనేవి తల్లి మరియు బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి అవసరం. పోషకాల కోసం సమతుల ఆహారం తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలకు తరచూ సిఫారసు చేసే ఒక కూరగాయ కాలిఫ్లవర్. గర్భవతులు క్యాలీఫ్లవర్ తినొచ్చా? అని మీరు ఆశ్చర్యపోతుంటే మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ ఉన్నాయి. గర్భధారణ సమయంలో క్యాలీఫ్లవర్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాల గురించి గర్భందాల్చాలని చూస్తున్న మహిళల మనసులో ఉన్న ప్రశ్నలకు ఈ బ్లాగ్ సమాధానాలను అందిస్తుంది.
క్యాలీఫ్లవర్‌లో విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇందులో విటమిన్ C, ఫోలేట్, పొటాషియం వంటి మూలకాలు అధిక మోతాదులో ఉంటాయి. ఇందులో యాంటీయాక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ వంటివి ఉంటాయి. ఇవి అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయని నమ్ముతారు. గర్భధారణ సమయంలో క్యాలీఫ్లవర్ తినడం వల్ల కలిగే నిర్దిష్ట ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
గర్భవతిగా ఉన్నపుడు క్యాలీఫ్లవర్ తినడం సురక్షితమేనా అని గర్భవతి కావాలని ఆశించే వారు ఎల్లప్పుడూ ఆశ్చర్యపోతారు. కానీ గర్భధారణలో క్యాలీఫ్లవర్ తినడం మంచిదే. ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ కూరగాయను వారు తినే ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్యాలీఫ్లవర్‌ను ఏ ఆహారానికి జోడించినా అది ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది. గర్భవతులు పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి.
క్యాలీఫ్లవర్ అనేది గర్భధారణకు మంచిది. అంతే కాకుండా చాలా మంది గర్భిణీ స్త్రీలు ఎటువంటి సమస్యలు లేకుండా సురక్షితంగా క్యాలీఫ్లవర్‌ను తినవచ్చు. ఏదేమైనా ఇది తినాలని అనుకుంటున్న గర్భవతులకు ఫుడ్ ఎలర్జీ ఉంటే వారు కేవలం క్యాలీఫ్లవర్ అనే కాకుండా ఏదైనా కొత్త ఆహారాన్ని తీసుకునే ముందు వారి వైద్యుడిని సంప్రదించాలి. అదీకాక క్యాలీఫ్లవర్‌ను అధికంగా తినడం వల్ల గ్యాస్ మరియు ఉబ్బరం సమస్య ఏర్పడుతుంది.
అతిగా క్యాలీఫ్లవర్‌ను తినడం వల్ల కలిగే దుష్ప్రయోజనాలు:
క్యాలీఫ్లవర్ అనేది మీకు ఆరోగ్యాన్ని ప్రసాదించే ఒక కూరగాయ. ఇది గర్భిణీ స్త్రీలకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అయినప్పటికీ అధిక మోతాదులో క్యాలీఫ్లవర్‌ను తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ఎందుకంటే క్యాలీఫ్లవర్ అనేది క్రూసిఫరస్ కుటుంబానికి చెందినది. కాబట్టి ఇందులో సల్ఫర్‌కు సంబంధించిన సమ్మేళనాలు ఉంటాయి. దీనిని అతిగా తినడం వల్ల గ్యాస్ మరియు ఉబ్బరం సమస్యలు వస్తాయి. ఇది కోలిక్(పదునైన నొప్పి) నొప్పులకు కూడా దారితీస్తుంది.
అంతే కాకుండా కిడ్నీస్టోన్స్, గౌట్ వచ్చే ప్రమాదం ఉన్న గర్భిణీ స్త్రీలు క్యాలీఫ్లవర్ తినకూడదు. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో ప్యూరిన్లు ఉంటాయి. మూడో త్రైమాసికం చివర్లో ఉన్న గర్భవతులు క్యాలీఫ్లవర్ తినడం వల్ల వచ్చే గ్యాస్ నొప్పిని పురిటినొప్పులు అనుకొని పొరబడతారు. అందుకోసమే గర్భిణీ స్త్రీలు అధిక మోతాదులో క్యాలీఫ్లవర్ తినకూడదు.
క్యాలీఫ్లవర్‌ను వండేందుకు సిద్ధం చేసేటపుడు నీటిలో బాగా కడగాలి. దాని కాండం మరియు ఆకులను పూర్తిగా కత్తిరించాలి. అలాగే దాని తలను(పువ్వు ఉండే ప్రదేశం) చిన్న చిన్న భాగాలుగా చేయాలి. ఆ కత్తిరించిన తల భాగాలను వేడి నీటిలో 5-10 వరకు మరిగించాలి. ఇలా చేయడం వల్ల దానిలో ఉన్న మలినాలు క్లీన్ అవుతాయి.
గర్భవతులు ఉడకబెట్టిన క్యాలీఫ్లవర్‌ను తాము తినే ఆహారంలో సైడ్ డిష్‌గా ఉపయోగించొచ్చు. అంతే కాకుండా ఉడికించిన క్యాలీఫ్లవర్ నుంచి రుచికరమైన క్రీమ్ సూప్‌ను కూడా వారు తయారు చేసుకోవచ్చు. ఇది చప్పగా ఉండే క్యాలీఫ్లవర్ ఆవిరితో చేసిన దానిలా కాకుండా భలే టేస్ట్‌గా ఉంటుంది. కాలిఫ్లవర్‌ను చిన్నముక్కలుగా చేసి ఆపై రైస్‌తో రుచికరమైన సైడ్ డిష్ చేయొచ్చు. అంతే కాకుండా క్యాలీఫ్లవర్‌ను తయారు చేసేందుకు ఎన్నో ఆధునిక మార్గాలు ఉన్నాయి.
Yes
No

Written by
Swetha Rao
Get baby's diet chart, and growth tips











డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)