This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భధారణ సమయంలో కొంతమందికి సుద్దను తినాలని ఎందుకనిపిస్తుంది? | Eating Chalk: What You Need to Know About This Unusual Craving in Telugu

Pregnancy
Written by - Kakarla Sirishaచివరిగా నవీకరించబడింది: Dec 21, 2025
గర్భధారణ సమయంలో  కొంతమందికి సుద్దను తినాలని ఎందుకనిపిస్తుంది? | Eating Chalk: What You Need to Know About This Unusual Craving in Telugu
Read time7 min

చాలా మందికి సుద్దను తినాలనే కోరిక లేదా తినాలని అనుకుంటారు. ఇది ఇతరులకు వింతగా అనిపించవచ్చు. సాధారణంగా.. చాలా మందిలో, ఈ సుద్ద తినడం అనేది పోషకాల లోపాన్ని సూచిస్తుంది. కానీ కొంతమందిలో ఇదొక సులభమైన విషయం కాదు. ఎందుకంటే వారు తమ సుద్ద తినాలనే కోరికను అస్సలు నియంత్రించుకోలేరు. సుద్ద వంటి ఆహారం కానటువంటి వస్తువులను తినాలన్న తీవ్రమైన కోరికలు ఉన్న వ్యక్తులు పికా అనే వైద్య పరిస్థితితో బాధపడుతూ ఉండవచ్చు. ఈ పరిస్థితిలో వైద్య సంరక్షణ ఎంతో అవసరం.. అయితే తరచుగా చేసే సరైన దిశానిర్దేశం ఇంకా సప్లిమెంట్ల ద్వారా ఈ సమస్యను దూరం చేయవచ్చు. సుద్ద తినడం వల్ల అనేక దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. ఈ వ్యాసంలో ఈ సమస్య గురించి వివరంగా ప్రస్తావించబడింది.

కొంతమంది ప్రత్యేకంగా సుద్దనే ఎందుకు తింటారు? (How can you tell if eating chalk is harmful in Telugu)

పికా లక్షణాలతో బాధపడుతున్న వారిలో తమ తినాలనే కోరికలను తీర్చుకోవడానికి వివిధ రకాల ఆహారేతర పదార్థాలను తినాలనే కోరికలు తరచుగా కలుగుతాయి. కానీ.. కొంతమంది కేవలం సుద్దను మాత్రమే తింటారు. ఇతర ఆహారాలు కాని వాటిని కోరుకోరు. కొంతమంది సుద్దను మాత్రమే తినడానికి గల కొన్ని కారణాలు:

  • రక్తంలో తక్కువ జింక్ ఇంకా ఐరన్ స్థాయిలు ఉన్నప్పుడూ.
  • అందుబాటులో ఉండని ఆహారం ఇంకా వారి తర్వాతి భోజనం గురించి ఆందోళన ఉన్నప్పుడూ.
  • OCD రోగులు మరియు ఆందోళన సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు సుద్ద తినడం ఓదార్పునిస్తుంది.
  • కొందరికి సుద్ద కనిపించే తీరు ఇంకా దాని రుచి ఉపశమనం కలిగిస్తుంది.

సుద్ద తినడం హానికరం అని ఎలా చెప్పగలరు? (Risks of eating chalk in Telugu)

అరుదుగా సుద్ద తినడమనేది హానికరం కాదు. కానీ, ఎవరైనా ఇది తినాలనే కోరికను నియంత్రించుకోలేకపోతే, వారు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

పికా లక్షణాలతో ఉన్న రోగికి రోగ నిర్ధారణ చేయడంలో ఇవి ఉంటాయి:

  • రోగి ఆహారపు అలవాట్లను ప్రశ్నించడం.
  • సుద్ద తినాలనే కోరికల తరచుదనాన్ని గమనించడం.
  • సుద్ద తినాలనే కోరికను ప్రభావితం చేసే ఇతర కారణాలను తెలుసుకోవడం.

ఈ సమాచారంతో.. రోగి సుద్ద తినే అలవాటులో ఒక ప్రత్యేక తరహా అలవాటును కనుక్కోనేందుకు వైద్యులు ప్రయత్నిస్తారు. అది ఒక ప్రత్యేక తరహా అని తెలిసినప్పుడు, వైద్యులు కొన్నిరకాల రక్త పరీక్షలు చేయించుకోమని చెబుతారు. ఈ పరీక్షలు రక్తహీనత, లెడ్ లాంటి విషపదార్థాల జాడ లేదా ఇతర వైద్య పరిస్థితులను తెలియజేస్తాయి. ఈ స్థాయిలు పెరిగినట్లయితే, రోగికి వైద్య సహాయం అవసరమౌతుంది. అటువంటి రోగుల ఆరోగ్యం ఇంకా క్షీణించకుండా తక్షణమే వైద్య సహాయం పొందాలని సూచిస్తారు.

సుద్ద తినడం వల్ల కలిగే ప్రమాదాలు (Why do some people eat chalk specifically in Telugu)

సుద్ద విషపూరితం కానిది అయినప్పటికీ, తరచుగా తీసుకోవడం వలన తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు ఏర్పడవచ్చు.

సుద్ద తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటంటే:

1. దంతాలకు నష్టం (Dental damage)

చాలా మంది సుద్ద తినే అలవాట్ల వల్ల పుప్పి పళ్ళు ఇంకా దంతక్షయం వంటి దంత సమస్యలను ఎదుర్కొంటారు.

2. జీర్ణక్రియ సమస్యలు మరియు ప్రేగుల్లో అవరోధమేర్పడటం (Digestion issues and bowel obstruction)

సుద్ద ఆహారేతర పదార్థం కాబట్టి, దీనిని శరీరం సులభంగా జీర్ణం చేసుకోలేదు. వీటి అవశేషాలు ప్రేగులలో అవరోధం కలిగించడం మూలాన అది మలబద్ధకాన్ని కలిగించవచ్చు.

3. ఆహారం తినలేకపోవడం (Inability to eat food)

తీవ్రమైన సుద్ద తినే అలవాటు ఉన్న రోగులు కాలక్రమేణా అసలు ఆహార పదార్థాలను తినే సామర్థ్యాన్ని కోల్పోతారు. ఇది రోగిలో తీవ్రమైన పోషకాహార లోపానికి ఇంకా బరువు తగ్గడానికి కారణమవుతుంది.

4. టాక్సిన్స్ (Toxins)

సుద్ద తినడం వల్ల, రోగుల రక్తంలో టాక్సిన్స్(విషపదార్థాలు) ఎక్కువగా ఉంటాయి. వైద్యులకు సాధారణంగా ఇలాంటి రోగుల రక్తంలో సీసం లేదా పరాన్నజీవుల జాడలు కనిపిస్తాయి.

మీకు ఇది కూడా నచ్చుతుంది: 1 వ వారంలో ప్రెగ్నెన్సీ లక్షణాలు

గర్భధారణ సమయంలో సుద్దను తినడం (Eating chalk during pregnancy in Telugu)

కొంతమంది మహిళలకు గర్భధారణ సమయంలో వివిధ ఆహారాలను తినాలనే తీవ్రమైన కోరికలు ఉంటాయి. అందుకే వివిధ ఆహార పదార్థాలను తినేందుకు ప్రయత్నిస్తారు. సాధారణంగా.. సుద్దను తినాలనిపించే గర్భిణీ స్త్రీలు తమ వైద్యుడిని - గర్భధారణ సమయంలో సుద్ద తినవచ్చా? అని అడుగుతారు. అయితే, గర్భిణీ స్త్రీలు సుద్దను తినకూడదని వైద్యులు కరాకండిగా చెబుతున్నారు. ఎందుకంటే, ఇది వారి కడుపులోని బిడ్డకు హాని కలిగిస్తుంది. అంతేకాక, గర్భధారణ సమయంలో సుద్ద తినడం వల్ల అది తల్లి ద్వారా బిడ్డకు అందవలసిన అవసరమైన పోషకాలను అందకుండా చేస్తుంది. ఇది పిండం ఎదుగుదలను ఇంకా శిశువులో వికాసాన్ని ఆలస్యం చేయవచ్చు.

గర్భధారణపు 9వ నెలలో సుద్ద తినడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవని కొందరు మహిళలు పొరబడుతారు. ఈ దశలో శిశువు పూర్తిగా రూపుదిద్దుకొని ఉంటుంది కాబట్టి, దాని వల్ల ఎటువంటి ముప్పు లేదని వారు భావిస్తారు. కానీ ఇది నిజం కాదు; తల్లి సుద్ద తినే అలవాటు వల్ల అది గర్భదారణలో ఏ దశలోనైనా బిడ్డపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 9వ నెలలో కూడా తల్లి సుద్దను తింటున్నట్లయితే.. ఆమె అసలైన ఆహారాన్ని సుద్దతో భర్తీ చేసినట్లవుతుంది. ఇది సరైన పోషకాలను అందకుండా చేస్తుంది. ఇంకా వారిలో ఆకలిని కూడా తగ్గిస్తుంది. దాని వల్ల, శిశువుకు అందాల్సిన పోషకాలు తగినంతగా అందవు, ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. గర్భిణీ స్త్రీలకు సుద్దను తినాలని అనిపిస్తే, వారి ఈ సమస్యను తగ్గించే సప్లిమెంట్లను వాడేందుకు వారి డాక్టరు గారిని సంప్రదించాలి.

సుద్ద తినడమనే అలవాటుకి చికిత్స ఏమిటి? (How is eating chalk treated in Telugu)

సుద్ద తినాలనే కోరిక ఉన్న రోగుల కొరకు రెండు వేర్వేరు రకాల చికిత్సా పద్ధతులు ఉన్నాయి. వైద్యులు రోగిలో ఈ లక్షణాలను నిర్ధారించిన తర్వాత ఇంకా కొన్ని పరీక్షలను జరిపించి, ఆ తర్వాత తగిన చికిత్సా పద్ధతులను ఎంచుకుంటారు. పరీక్ష ఫలితాలు, రోగికి సరైన చికిత్సను గుర్తించడంలో వైద్యులకు సహాయపడతాయి.

1. రోగి పరీక్షా నివేదికలు పోషకాహార లోపాలను చూపిస్తే, విటమిన్లు ఇంకా ఇతర సప్లిమెంట్లు వారికి సూచించబడతాయి. రోగి అటువంటి సప్లిమెంట్లను తీసుకున్న తర్వాత సాధారణంగా వారికి సుద్ద తినాలనే కోరికలు కలగవు.

2. OCD లేదా పికా వంటి వైద్య పరిస్థితులు ఉన్న రోగులు వారి కోరికలను అణుచుకొనేందుకు తగిన సహాయం కోసం థెరపిస్ట్‌లను సంప్రదించాలని సూచిస్తున్నారు.

ముగింపు (Conclusion)

సుద్ద తినడం చాలా అరుదుగా ఉంటే.. అది అంత ఆందోళన కలిగించే విషయం కాదు. కానీ, ఆ కోరికలు చాలా తీవ్రంగా ఇంకా తరచుగా కలుగుతూ ఉంటే.. అలాంటి వారికి తక్షణ వైద్య సహాయం అవసరం కావచ్చు. అంతేకాక, పిల్లలు ఇంకా పెద్దలలో సుద్ద తినే అలవాట్లను ఎలా నియంత్రించాలో, పికా లక్షణాలేమిటో, మరింత వివరంగా తెలుసుకోవడానికి, మైలో యాప్‌ని సందర్శించండి.

References

1. Advani S, Kochhar G, Chachra S, Dhawan P. (2014). Eating everything except food (PICA): A rare case report and review. J Int Soc Prev Community Dent.

2. Bonglaisin JN, Kunsoan NB, Bonny P, Matchawe C, Tata BN, Nkeunen G, Mbofung CM. (2022). Geophagia: Benefits and potential toxicity to human-A review. Front Public Health.

Tags

Why do people eat chalk in Telugu, What are risk of eating chalk in Telugu, Eating chalk during pregnancy in Telugu, Eating Chalk: What You Need to Know About This Unusual Craving in English, What Causes Some People to Want to Eat Chalk in Hindi, What Causes Some People to Want to Eat Chalk in Tamil, ⁠What Causes Some People to Want to Eat Chalk in Bengali

Is this helpful?

thumbs_upYes

thumb_downNo

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Mylo App Banner

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Apple App StoreGoogle Play Store
Apple App StoreGoogle Play Store

Article Posted Under

Helpful Tools & Calculators

undefined icon
Pregnancy Calendar
See baby growth week by week
arrow_right
undefined icon
Mylo Store
Shop for mom & baby
arrow_right
undefined icon
Pregnancy Diet Chart
Trimester & region-wise diet plan
arrow_right
undefined icon
Mamasutra
Safe positions for pregnancy
arrow_right
undefined icon
Save Memories
Store baby's photos & firsts
arrow_right
undefined icon
Weight Tracker
Monitor your weight
arrow_right
undefined icon
Zordar Dadi Ke Nuskhe
Gharelu nushke that work
arrow_right
undefined icon
My Calendar
Predict periods & record symptoms
arrow_right
undefined icon
Ovulation Calendar
Know your monthly cycle
arrow_right
undefined icon
Pill Reminder
Get reminded for medicines
arrow_right
undefined icon
Vaccination Tracker
Never miss a vaccine date
arrow_right
undefined icon
Make Baby Sleep
Play white noise & sleep music
arrow_right
undefined icon
Pregnancy Music
Play calming music for baby
arrow_right
undefined icon
Baby Diet Chart
Age-wise food plans for baby
arrow_right
Kakarla Sirisha
Kakarla Sirisha

Related Articles

Questions about this article

  • Asked by 28 weeks pregnant

    Naku eppudu 7 months baby moments teliyadam ledhu...

  • Asked when 35 weeks pregnant

    Hi I'm 34 weeks 3 days pregnant repu 9th month start avtadi naku eroju mrng milky white discharge iendi problem em undadu kada

  • Asked when 39 weeks pregnant

    Hii all Naku ee month(april19) delivary date echinchindi bt Naku pottalo right side pain vastundi nyt nundi akkuvaga m aina pblm sis chepara konchem urgent plz

  • Asked when 34 weeks pregnant

    Hii 34 weeks how many months

  • Asked when 14 weeks pregnant

    Naku eppudu 4th month raw rice thinalanye vude no problem or problem please tell me

Related Topics

Recently Published Articles

Your body needs extra nutrition this trimester - these can help.

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.