

Pregnancy
1 January 2026 న నవీకరించబడింది
బిడ్డ పొందడం గొప్పవరం మరియు మీ బిడ్డకు తల్లిపాలు పట్టే అవకాశం లభించడం గొప్ప ఆశీర్వాదం. తల్లి పాలివ్వడం వల్ల తల్లికి బిడ్డతో గొప్ప అనుబంధం ఏర్పడుతుంది. ఇది ఎవరికీ సాధ్యం కాదు. అయితే కొన్నిసార్లు మీ రొమ్ములు (స్తనాలు) నిండినట్టు అనిపించి లీక్ అయ్యే సందర్భాలు ఉంటాయి.
తల్లి పాలివ్వడం యొక్క సైడ్ ఎఫెక్ట్ కింద తరుచుగా రొమ్ము పాలు కారడం, అసౌకర్యంగా ఉండటం జరుగుతుంది. ముందు మీ రొమ్ములోకి పాలు రావడం ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఏ సమయంలో అయినా మీ రొమ్ముల నుంచి కారడం లేదా చిమ్మడం జరుగుతుంది.
మీకు అప్పుడే బిడ్డ పుట్టినట్టయితే, మీ రొమ్ము లీక్ అవుతున్నట్లు కూడా మీరు గమనించకపోవచ్చు. ఉత్పత్తి అయిన రొమ్ము పాలను బిడ్డ అవసరాలకు పట్టినట్టయితే, లీకేజీ తగ్గొచ్చు లేదా ఆగిపోవచ్చు.
పాలిచ్చే సమయంలో మీ రొమ్ములు ఎందుకు లీక్ అవుతున్నాయని ఆలోచిస్తున్నట్లయితే, ఆందోళనకు సంకేతమా కాదా అనుకుంటే చింతించకండి. తల్లిపాలు ఇచ్చే సమయంలో రొమ్ముల నుంచి పాలు కారడం చాలా సాధారణం. పాల లీకేజీ కారణంగా తరచుగా మీ నర్సింగ్ బ్రా తడి కావడం గమనించవచ్చు. అయితే ఇక్కడ ఇచ్చిన కొన్ని కారణాల గురించి తెలుసుకుంటే పాలు ఎందుకు లీక్ అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు:
మీ బిడ్డ ఏడుపు వినడం లేదా చూడటం, మీ పిల్లల ఫొటోలు లేదా వీడియో చూడటం లేదా మీ బిడ్డ గురించి ఆలోచించినప్పుడు పాల విడుదలకు సంబంధించిన హార్మోన్ల ప్రతిస్పందన ప్రభావితం వల్ల ఇలా జరగొచ్చు. కొంతమంది స్త్రీలు పాలు బయటకు రాకముందే జలదరింపు లేదా 'జింగింగ్'ను అనుభవిస్తారు. దాన్నే లెట్-డౌన్ లేదా మిల్క్ ఎజెక్షన్ రిఫ్లెక్స్ అంటారు.
చాలామంది తల్లులు ఓ సమయం ప్రకారం బిడ్దలకు పాలిస్తుంటారు. అయితే ఇందుకు విరుద్ధంగా కొందరు బిడ్డకు ఆకలైనప్పుడే ఇస్తుంటారు. ఇది సాధారణంగా రొమ్ములు లీక్ అవడానికి అత్యంత సాధారణ కారణాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: పసిపిల్లలకు పాలు తాగిన తరువాత బర్పింగ్ ఎలా చేయాలి?
మీ శరీరంలో అధిక మొత్తంలో పాలను ఉత్పత్తి చేస్తుందనుకుందాం. అప్పుడు మీ రొమ్ములు మరీ తరచుగా లీక్ అయ్యే అవకాశం ఉంది. ఇది తల్లి పాలిచ్చే రోజుల్లో మంచి నాణ్యత గల నర్సింగ్ మెటర్నిటీ బ్రాను ఉపయోగించాల్సి వస్తుంది. మంచి నాణ్యమైన బ్రా మీ రొమ్ములు సౌకర్యవంతంగా మరియు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
చిన్న రొమ్ముల్లో తక్కువ పరిమాణంలో పాలను నిల్వ చేసే సామర్థ్యం ఉంటుంది. రొమ్ములు ఓ డబ్బా అనుకున్నట్లయితే చిన్న పాత్రలో పాలు తక్కువగా పడుతాయి కదా. అందుకే చిన్న రొమ్ములు ఉన్న స్త్రీలు తమ బిడ్డలకు తరచుగా పాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వారు తక్కువ పరిమాణంలో పాలు ఉత్పత్తి చేస్తారని కాదు. మీరు పాలు పట్టడానికి మధ్య ఎక్కువసేపు వేచి చూస్తే తల్లి పాల 'కంటైనర్' లీక్ అవుతుంది.
కొంతమంది తల్లులు తమ బిడ్డకు ఒక రొమ్ము నుంచి పాలు ఇస్తున్నప్పుడు మరో రొమ్ము నుంచి లీక్ కావడం గమనించొచ్చు.
తల్లిపాలు పట్టడం ప్రారంభించిన మొదటి కొన్ని నెలల్లో మీ జీవితమంతా మీ చిన్నారికి పాలు పట్టడంతోనే సరిపోయిందని అనిపించినా, మీ బిడ్డ కొంచెం పెరిగాక, ఫీడింగ్ కాస్త తగ్గుతుంది. కాబట్టి మీరు ప్రస్తుతం మీ బిడ్డకు ప్రతి రెండు గంటలకోసారి ఫీడింగ్ చేస్తూ ఉంటే, మీ బిడ్డ పెద్దయ్యాక బిడ్డకు ప్రతి 6 గంటలకోసారి ఫీడింగ్ చేస్తే సరిపోతుంది. మీరు మొదట్లో మీ బిడ్డ పాలిచ్చే సమయంలో లీక్ అవ్వడం మొదలవుతుంది. అయితే దీనికి గురించి మీరు బాధ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ శరీరం కొత్త షెడ్యూల్‌కు అలవాటు పడిపోయి పాలు కారడం తగ్గుతుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: బిడ్డకు పాలు ఇస్తున్న దశలో నిప్పల్ బటర్ క్రీమ్ వాడటం సురక్షితమేనా
ఎలాంటి అడ్డంకి లేకుండా రొమ్ములను క్రమం తప్పకుండా బిడ్డకు అందివ్వాలి. ఇలా చేస్తే అదనంగా వచ్చే పాలను తొలగించడంలో సాయపడుతుంది. ఫీడింగ్ (పాలివ్వడం) తప్పకూడదు. అలాగే ఫీడింగ్ ఎక్కువసార్లు చేయాలి. ఇలా చేస్తే చనుమొన కండరాల చుట్టూ ఉన్న స్పింక్టర్‌కు ఓ సరైన ఆకారం వచ్చి భవిష్యత్తులో పాలు కారకుండా ఉంటుంది.
మీరు మీ శిశువుకు దూరంగా ఉన్నప్పుడు, మీ రొమ్మును సున్నితంగా నొక్కడం ద్వారా పాలు కారడాన్ని ఆపొచ్చు. మీ ఛాతీపై మీ చేతులను ఉంచి మీ ముంజేతులతో తేలికగా నొక్కడం ఒక అద్భుతమైన మార్గం. అలా చేస్తూ ఉంటే పాలు కారడం తగ్గి, శరీరం ఉత్పత్తి చేసే పాల పరిమాణాన్ని అదుపులో ఉంచుతుంది.
బ్రెస్ట్ ప్యాడ్స్ చుక్కలను పీల్చుకుని రొమ్మును పొడిగా ఉంచుతాయి. కాబట్టి రొమ్ములు కారే వాళ్లు వీటిని ఉపయోగించవచ్చు. అయితే చనుమొనల చుట్టూ చికాకు, తేమ రాకుండా చూసేందుకు వాటిని మారుస్తూ ఉండాలి.
రొమ్ము కారడాన్ని కింది మార్గాల ద్వారా నిరోధించవచ్చు:
ప్రతి స్త్రీకి తల్లిపాలిచ్చే అనుభవం చాలా ప్రత్యేకమైనది. మొదటిసారి తల్లులైన వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మాట్లాడగలిగితే మరింత తేలికగా ఉండొచ్చు. కొత్త తల్లి తన బిడ్డకు అత్యుత్తమ జీవితాన్ని అందించాలనే కోరికను మొదటి కొన్ని నెలల్లో పాలు కారడం వల్ల సందేహం లేదా అవమానంతో దెబ్బతినకూడదు.
breast pads for new moms in telugu, breast leakage in new moms in telugu, How to prevent breast leakage in telugu, tips to prevent breast leakage in telugu.
Also Read In:
English: How To Prevent Breast Milk Leakage During Pregnancy in English
Yes
No

Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips


గర్భధారణ సమయంలో పనసపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాలు & సైడ్ ఎఫెక్టులు (Jackfruit in Pregnancy | Benefits, Risks & Side Effects in Telugu)

గర్భధారణ ప్రారంభంలో మలబద్ధకం

ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu

ప్రెగ్నెన్సీ సమయంలో బ్రెస్ట్‌లో గడ్డ.. ఎప్పుడు సీరియస్‌గా తీసుకుని వైద్యుడిని సంప్రదించాలి? (Breast Lump During Pregnancy - When to Meet Doctor in Telugu?)

డైపర్ సైజు మరియు బరువుల చార్ట్ గైడ్ | Diaper Size and Weight Chart Guide in Telegu

గర్భవతిగా ఉన్న మహిళ రొయ్యలు తినవచ్చా?