
గర్భం దాల్చిన తరువాత ప్రతి అమ్మాయి తనకి పుట్టబోయే బిడ్డ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రెగ్నన్సీ సమయంలో ఎన్నో త్యాగాలు చేసి జాగ్రత్తగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా జన్మిస్తుంది. బిడ్డ గర్భంలో ఉండగానే, తన క్షేమం కోసం సంస్కారాలు ఉన్నాయి. అలాగే.. బిడ్డ పుట్టిన తరువాత కూడా తల్లి తండ్రులు ఆ బిడ్డకు కొన్ని సంస్కారాలు చేయవలసి ఉంటుంది. వాటిల్లో "అన్నప్రాశన" కూడా ఒకటి.
పసి పిల్లలు పాలు, నిద్ర, మరియు స్నానం పైనే ఆధార పడతారు. వారికి ఈ మూడే బలాన్ని చేకూరుస్తాయి. పుట్టిన తరువాత నుంచి పిల్లలు ఎక్కువ కాలం పాల పైనే ఆధారపడతారు. పాలనే ఆహారంగా తీసుకుంటారు. అయితే.. వారికి ఘన పదార్ధాలను కూడా ఆహారంగా పరిచయం చేయాల్సి ఉంటుంది. మొదటిసారిగా శిశువుకు అన్నం తినిపించడాన్ని ఓ చిన్న వేడుకలా జరుపుకుంటారు. ఈ వేడుకని అన్న ప్రాసన అంటారు. ఇందుకు మంచిరోజును నిర్ణయిస్తారు.
సాధారణంగా పుట్టిన బిడ్డకు ఆరవ నెల ఆరవ రోజున ఎటువంటి ముహూర్తం చూడకపోయినా అన్నప్రాశన చేయవచ్చని చెబుతుంటారు. లేదా.. బిడ్డ జాతకం ఆధారంగా మంచి రోజు చూసి ఓ ముహుర్తాన్ని నిర్ణయించుకుని.. ఆ రోజున అన్నప్రాశన వేడుక జరిపిస్తారు. హిందూ కుటుంబాలలో ఈ వేడుకని ఓ పెద్ద పండగలా జరుపుకుంటారు. మంచి రోజు చూసి ఈ వేడుక జరిపించిన తరువాత బిడ్డకి ఘన పదార్ధాలను ఆహారంగా అందించడం అలవాటు చేస్తారు. ఇలా చేయడం వలన బిడ్డకి ఆయుష్షు, తేజస్సు, ఆరోగ్యం లభిస్తాయని విశ్వసిస్తారు.
ఆరవ నెల వచ్చిన పిల్లలకు అన్నప్రాశన వేడుక చేస్తుంటారు. ఈ వేడుకని మగ పిల్లలకు సరి నెలలోను, ఆడపిల్లలకు బేసి నెలలోను చేయడం కొందరికి ఆనవాయితీగా వస్తోంది. అయితే.. ఈ వేడుకని పూర్ణాహామందు మాత్రమే చేయవలెను. ఆరోజు తల్లి తండ్రులు తూర్పు ముఖంగా చాపపై కూర్చోవలెను.
బిడ్డని తల్లి ఒడిలో కూర్చోపెట్టుకుని ముందుగా విఘ్నేశ్వర పూజ చేయాలి. ఒక బంగారు గిన్నె లేదా వెండి గిన్నె లేదా ఒక గిన్నెలో పాయసం, తేనే, పెరుగు కలిపిన మిశ్రమాన్ని తీసుకోవాలి. అన్నప్రాశన చేసుకునే బిడ్డ తండ్రి అందులో ఉంగరాన్ని ముంచి శిశువుకు తినిపించాలి. మూడు సార్లు ఉంగరంతో తినిపించి, ఆపై చేతితో పెట్టాలి. అన్నప్రాశన చేసిన రోజునే బిడ్డకు జీవికా పరీక్షా నిర్వహిస్తారు.
అన్నప్రాశన చేసిన తరువాత బిడ్డను దైవ సన్నిధికి తీసుకువచ్చి అక్కడ నగలు, డబ్బు, పుస్తకాలూ, కలము, ఆయుధాలు, పూలు వంటి వస్తువులను ఉంచుతారు. శిశువు వాటి దగ్గర వదిలివేస్తారు. శిశువు పారాడుతూ వచ్చి ఆ వస్తువులలో దేనిని పట్టుకుంటాడో గమనిస్తారు. ఏ వస్తువును పట్టుకుంటే.. ఆ వస్తువుతో ఆ బిడ్డ జీవనోపాధి ఉంటుందని నమ్ముతారు.
పుట్టిన పిల్లలకు అన్నాన్ని పరిచయం చేయడమే అన్నప్రాశన వేడుక ముఖ్య ఉద్దేశ్యం. ఈ వేడుక జరిపిన తరువాత నుంచి పిల్లలకు అన్నాన్ని భోజనంలో భాగంగా చేసుకోవడం అలవాటు చేస్తారు. అలాగే, ఈ కార్యక్రమాన్ని ఆరు నుంచి పన్నెండు నెలలలో ఎప్పుడైనా చేయవచ్చు. అయితే.. శుక్ల పక్ష కాలంలో శుక్రుడు ఆకాశంలో పరిశుద్ధుడై ప్రకాశిస్తున్న సమయంలో చేయిస్తే మంచిదని పెద్దల వాక్కు.
Yes
No



















Anni nelalu milk estey baby ki manchidi antaru
Your body needs extra nutrition this trimester - these can help.





This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |