అసలు ప్రధాన మంత్రి మాతృ వందన యోజన అంటే ఏమిటి?
ప్రధాన మంత్రి మాతృ యోజన అనేది దేశం మొత్తం అమలవుతున్న ఒక పథకం. ఈ పథకం ద్వారా ప్రభుత్వం పాలిచ్చే తల్లులు మరియు గర్భిణీ స్త్రీలకు రూ.6000 సహాయం చేస్తుంది. తద్వారా వారు తమ గురించి తమ పిల్లల గురించి మరింత జాగ్రత్త తీసుకోవచ్చు. ఈ పథకం 2010లో ఇందిరా గాంధీ మాతృ సహయోగ్ యోజనగా ప్రారంభించబడింది. BJP ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకానికి 2014లో మాతృసహజ్ యోజనగా పేరు మార్చింది. కానీ ఇది కేంద్రప్రభుత్వ ప్రాయోజిత (స్పాన్సర్డ్) పథకంగానే దేశం మొత్తం ప్రారంభించబడింది. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY)గా ఇది మరోసారి తన పేరును మార్చుకుంది. ఈ పథకాన్ని అంగన్వాడీ వ్యవస్థల ద్వారా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ అమలు చేస్తోందని మీరు తప్పక తెలుసుకోవాలి.
ప్రధాన మంత్రి మాతృవందన యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం
- గర్భం, ప్రసవం, రొమ్ముపాలివ్వడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి స్త్రీలకు అవగాహన కల్పించడం.
- గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు సరైన విధంగా విశ్రాంతి తీసుకునేలా ప్రోత్సహించడం, వారు ఎటువంటి కఠిన శ్రమ చేయకుండా నివారించడం. వారి మరియు వారి శిశువు యొక్క పోషకాల కోసం అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడం కూడా ఈ పథకం లక్ష్యం.
- తల్లి-శిశు సంరక్షణను ప్రోత్సహించడం.
PMMVY (ప్రధాన మంత్రి మాతృవందన యోజన) పథకం ద్వారా ఎవరు ప్రయోజనం పొందొచ్చు?
ప్రధాన మంత్రి మాతృవందన యోజన పథకం ద్వారా కింద పేర్కొన్న వ్యక్తులు ప్రయోజనం పొందొచ్చు.
- గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులందరూ.
- 19 సంవత్సరాలు ఆ పైన వయసున్న గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు ఈ పథకం ద్వారా ప్రయోజనాలను పొందొచ్చు.
- కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ లేదా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగి లేదా ఈ పథకం మాదిరిగానే ఉన్న ఏ ఇతర పథకం ద్వారానైనా ప్రయోజనం పొందుతున్న వారు ఈ పథకానికి అప్లై చేసుకునేందుకు అనర్హులు.
PMMVY (ప్రధాన మంత్రి మాతృవందన యోజన) పథకం ప్రయోజనాలు
ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకం యొక్క ప్రయోజనాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
- ఈ పథకం కింద నగదు రూపంలో మూడు వాయిదాల్లో రూ. 6000 చెల్లించబడతాయి.
- గర్భం నమోదు సమయంలో మొదటి విడతగా రూ. 1000 రిలీజ్ చేయబడతాయి.
- రెండో విడత రూ. 2000 గర్భం దాల్చిన ఆరునెలలకు మరియు డెలివరీకి ముందు పంపిణీ చేయబడతాయి.
- మూడో విడత రూ. 2000 శిశువు పుట్టి శిశువు రిజిస్ట్రేషన్ మరియు శిశువు మొదటి విడత టీకాలు తీసుకున్న తర్వాత రిలీజ్ చేయబడతాయి.
- మిగిలిన రూ. 1000 జననీ సురక్ష యోజన (JSY) కింద సంస్థాగత డెలివరీ తర్వాత అందించబడుతుంది.
రిజిస్ట్రేషన్ కోసం అవసరమయ్యే డాక్యుమెంట్లు
ప్రధాన మంత్రి మాతృ వందన యోజన కింద రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు మీకు ఈ కింది డాక్యుమెంట్లు అవసరం అవుతాయి.
- ఆధార్ కార్డు లేకుంటే ఐడెంటిటీ ప్రూఫ్ యొక్క కాపీ.
- దరఖాస్తుదారు మరియు ఆమె భాగస్వామి సంతకం చేసిన అంగీకార పత్రం.
- 1 A అప్లికేషన్ ఫారం.
- PHC లేదా ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా విడుదలయిన MCP కార్డ్ కాపీ.
PMMVY (ప్రధాన మంత్రి మాతృవందన యోజన) పథకం ప్రయోజనాలను పొందేందుకు ఆఫ్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని ప్రధాన మంత్రి మాతృ వందన యోజన ప్రయోజనాలు పొందేందుకు ఏం చేయాలో ఇక్కడ ఉంది:
- PMMVY(ప్రధాన మంత్రి మాతృ వందన యోజన) ప్రయోజనాలు పొందాలని అనుకునే అర్హత గల గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులు తమను తాము అంగన్వాడీ కేంద్రంలో కానీ ప్రభుత్వం ఆమోదించిన ఏదైనా ఆరోగ్య కేంద్రంలో కానీ ముందుగా నమోదు చేసుకోవాలి. వారు LMP(చివరి పీరియడ్) సంభవించిన 150 రోజుల్లోపు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి.
- అంగన్వాడీ కేంద్రం లేదా ప్రభుత్వం ఆమోదించిన ఆరోగ్య కేంద్రం నుంచి రిజిస్ట్రేషన్ ఫారంను ఉచితంగా పొందొచ్చు. ఇదే ఫారంను మహిళా మరియు శిశు సంక్షమాభివృద్ధి వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయించుకుని వారు తప్పనిసరిగా రశీదును పొందాలి.
- గర్భం దాల్చిన ఆరు నెలల తర్వాత రెండో ఇన్‌స్టాల్‌మెంట్‌ను క్లెయిమ్ చేసుకునేందుకు వారు ఫారం 1Bని సరిగ్గా నింపి అంగన్వాడీ కేంద్రం లేదా ప్రభుత్వం ఆమోదించిన ఆరోగ్య కేంద్రంలో సమర్పించాలి. ఫారం 1A యొక్క రశీదు మరియు MCP కార్డ్ కాపీని సమర్పించాలి. గర్భందాల్చిన 180 రోజుల తర్వాత రెండో విడతను క్లెయిమ్ చేసుకోవచ్చు.
- మూడో విడతను పొందేందుకు వారు సరిగ్గా నింపిన ఫారం 1C, చైల్డ్ బర్త్ రిజిస్ట్రేషన్ కాపీ, MCP కార్డ్ కాపీని సమర్పించాలి. ఎక్కడైతే వారి శిశువు DPT, OPV, CG, హెపటైటిస్ B వ్యాక్సిన్లను పొందిందని ఉంటుందో అది. అంతే కాకుండా వారు ఫారం 1A మరియు ఫారం 1B యొక్క రసీదు కాపీని కూడా సమర్పించాల్సి ఉంటుంది. జమ్ము & కాశ్మీర్, అస్సాం, మరియు మేఘాలయ రాష్ట్రాల వారు కాకుండా మిగతా రాష్ట్రాల వారు ఈ దశలో తప్పనిసరిగా వారి ఆధార్ కార్డ్ కాపీని సమర్పించాల్సి ఉంటుంది.
PMMVY (ప్రధాన మంత్రి మాతృవందన యోజన) పథకం ప్రయోజనాలను పొందేందుకు ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు మీరు అనుసరించాల్సిన స్టెప్స్ ఇక్కడ ఉన్నాయి.
- https://pmmvy.nic.in/Account/Login పై క్లిక్ చేసి స్కీమ్ ఫెసిలిటేటర్ సాయంతో PMMVY పోర్టల్‌లోకి ప్రవేశించండి.
- ఫారం 1A అడిగిన అన్ని వివరాలు సక్రమంగా నమోదు చేసి తర్వాత.. ‘న్యూ బెనిఫిషియరీ’ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. ఫారం నింపేటపుడు PMMVY CAS యూజర్ మాన్యువల్‌లో సూచించిన అన్ని మార్గదర్శకాలను అనుసరించండి.
- 6 నెలల గర్భం పూర్తయిన తర్వాత మరోసారి PMMVY CAS పోర్టల్‌లోకి లాగిన్ కండి. ‘సెకండ్ ఇన్స్టాల్మెంట్’ ట్యాబ్ మీద క్లిక్ చేసి యూజర్ మాన్యువల్‌లో తెలిపిన ప్రకారం 1B ఫారం నింపండి.
- థర్డ్ ఇన్స్టాల్మెంట్ కొరకు బర్త్ రిజిస్ట్రేషన్ మరియు ఇమ్యూనైజేషన్ మొదటి సైకిల్ పూర్తయిన తర్వాత మరోసారి PMMVY CAS కి లాగిన్ కండి. ఇన్స్టాల్మెంట్ ట్యాబ్ మీద క్లిక్ చేసి ఫారం 1C ని పూరించండి.
గర్భస్రావం విషయంలో నిబంధనలు ఏమిటి?
అటువంటి సందర్భాలలో లబ్ధిదారులు మొదటి ఇన్స్టాల్మెంట్ ప్రయోజనం పొందినట్లయితే.. భవిష్యత్‌లో ఆమె మరలా గర్భం దాల్చినపుడు రెండు, మూడు ఇన్స్టాల్మెంట్ల డబ్బుల కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఒక వేళ శిశు మరణం సంభవిస్తే తదుపరి ప్రక్రియ ఏమిటి?
PMMVY (ప్రధాన మంత్రి మాతృ వందన యోజన) పథకం కింద అన్ని రకాల మెటర్నటీ ప్రయోజనాలను ఇప్పటికే పొందినట్లయితే ఒక వేళ శిశువు మరణిస్తే తదుపరి ప్రయోజనాలను పొందేందుకు ఆమెకు ఎటువంటి అర్హత ఉండదు.
గమనిక: మీరు ఈ పథకం గురించి ఏదైనా ఫిర్యాదు చేయాలనుకున్నా లేదా మీకు ఈ పథకం గురించి ఏదైనా సందేహం ఉన్నా లేక మీ దగ్గర్లో ఆరోగ్య కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకోవాలని అనుకున్నా లేదా ఈ స్కీమ్‌ను కనుగొనేందుకు మీకు సహాయం కావాలని అనుకుంటే మీరు PMMVY హెల్ప్‌లైన్ నెంబర్ 011-23382393 కి కాల్ చేయొచ్చు.