

Baby Care
3 November 2023 న నవీకరించబడింది
మీ చిన్నారి బిడ్డ తన జీవితంలో ప్రారంభ సంవత్సరాలని పసిపిల్లల మంచంలో గడుపుతుంది, అందుకని మీరు డబ్బులు పెట్టి కొనే పసిపిల్లల మంచం ఆ పెట్టుబడికి తగ్గదని, చాలాకాలం మన్నుతుందని నిర్థారించుకోండి.
కొంతమంది తల్లిదండ్రులు పూర్తి సైజు పసిపిల్లల మంచం కంటే తక్కువ స్థలంలో పడుతుందనే ఉద్దేశ్యంతో మినీ చెక్క పసిపిల్లల మంచంపై మొగ్గుచూపుతారు. కానీ తల్లిదండ్రులు ఆఖరికి పెద్ద పసిపిల్లల మంచంపైనే ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు.
అసలు పసిపిల్లల మంచం అనేది బాలింతగా ఉన్న మహిళలు తమ పిల్లలతో కలిసి ఒకే మంచంపై పడుకుని వారిపై పొరబాటున దొర్లకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో కనిపెట్టారు. చెక్క మంచాలకి ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది, ఎందుకంటే పెయింట్ చేసిన మంచాలపై హానికరమైన లెడ్-ఆధారిత పెయింట్లు వేసి వుంటాయి, ఇవి మొదటికే మోసాన్ని తీసుకొస్తాయి.
సురక్షితమైన పసిపిల్లల మంచం కొనేముందు చూడవలసిన కొన్ని తప్పనిసరి విషయాలు కింద ఇవ్వబడ్డాయి:
1. పరుపు సైజు ముఖ్యం, ఎందుకంటే పరుపుకి మంచం అంచుకి మధ్య ఖాళీ ఉండకూడదు. పసిపిల్లల మంచంతోపాటు వచ్చిన పరుపునే ఉపయోగించండి, ఎప్పుడూ అదనంగా వేరేది లేదా చిన్న బొంతలలాంటివి వాడవద్దు.
2. బిడ్డ యొక్క బరువు కారణంగా పరుపు సాగకూడదు, కుంగిపోకూడదు అలాగే పిల్లల బరువుని సపోర్టు చేసేంత ధృఢంగా ఉండాలి. పరుపు పక్కవైపుల ఏ ఖాళీలు వదలకుండా మంచం అంచుల వరకూ చేరుకోవాలి.
3.పరుపు పైన 26 అంగుళాల ఎత్తులో రెయిలింగ్ ఉన్న మంచం కోసం వెతకండి, మీ బిడ్డ ఎదిగేకొద్దీ మీరు పరుపు రెయిలింగ్ ఎత్తుని తగ్గించవలసి ఉంటుంది
4. మీరు కదిలిస్తే మంచం ఊగకుండా ఉండాలి, కానీ బేబీని పడిపోకుండా ఉండేలా ఉందేమో గమనించండి. ఒకవేళ అది ఊగితే అది సరిగ్గా బిగించబడి వుండదు.
5.పసిపిల్లల మంచంపై ఏవైనా మేకులు, స్క్రూలు లేదా జిగురు పదార్థాలు బయటకి వచ్చి ఉన్నాయేమో చూడండి. ఒకవేళ ఆ మంచం పెయింట్ చేయబడి ఉంటే పెయింట్ పొట్టులా లేదా ముక్కలుగా ఊడి రాకూడదు.
6. భారీ సైజులో మధ్యలో ఖాళీలతో ఉన్న క్రిబ్ మంచాన్ని కొనవద్దు, ఎందుకంటే మళ్ళీ చెపుతున్నాము, మీ బిడ్డ తల లేదా కాళ్ళు చేతులు ఏవైనా వాటిల్లో ఇరుక్కుపోవచ్చు.
7.అన్ని స్క్రూలు, బోల్టులు, నట్లు మరియు ఇతర హార్డ్‌వేర్ పరికరాలని ఒక పెట్టెలో ఉంచండి. అలాగే అసలైన పరికరాలను మాత్రమే ఉపయోగించండి, ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న చౌక రీప్లేస్‌మెంట్‌ల కోసం ప్రయత్నించకండి.
భద్రత: మంచం సరైన భద్రత అందిస్తోందో లేదో గమనించండి. పరుపు పై భాగం నుండి కింద అంచువైపు మధ్య కనీసం 50 సెంటీమీటర్ల దూరం ఉండాలి. ఎలాంటి పర్యవేక్షణ లేకుండా పిల్లలు మంచం నుండి దిగేలాగా ఏ మెట్టు వంటి భాగం ఉండకూడదు.
చిక్కుకుపోయే పరిస్థితి: మంచం మధ్యలో పెద్ద ఖాళీలు ఉంటే మీ బిడ్డ వాటి మధ్యలో ఇరుక్కుపోవటమో లేదా ఆ ఖాళీల నుండి పడిపోవటమో జరుగుతుంది. అదే చిన్న ఖాళీలు ఉంటే పాపాయి కాళ్ళు చేతులలో ఏదో ఒకటి ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది.
వాడకంలో సౌలభ్యత: ఇది చాలా ముఖ్యం అలాగే ప్రత్యేకించి నిద్ర సరిగ్గా పట్టని వారికి పెద్ద తలనొప్పిగా మారే విషయం కూడా. పెద్దవారికి కూడా ఒకచేత్తో కూడా సులభంగా ఆపరేట్ చేసే విధంగా ఉండాలి.
Yes
No

Written by
Nayana Mukkamala
Get baby's diet chart, and growth tips











డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)