


Diet & Nutrition
3 November 2023 న నవీకరించబడింది
మీరు ప్రెగ్నెన్సీలో 4వ నెలకి చేరుకుంటున్నారా? అయితే మీరు రెండవ త్రైమాసికం గర్భవతుల డైట్ ఛార్ట్ ని పాటించే దశలోకి ప్రవేశిస్తున్నారు.
గర్భవతిగా ఉన్నప్పుడు 2వ త్రైమాసికం 1వ, అలాగే ఆఖరి త్రైమాసికం కన్నా మెరుగ్గా ఉంటుంది. కానీ మీ బిడ్డ ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండటానికి మీ ఆహార పానీయ అలవాట్లని అదుపులో పెట్టుకుని వ్యవహరించాల్సి ఉంటుంది.
ఇక్కడ మనం పాపాయి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి అలాగే వారికి సమృద్ధిగా పోషకాలు అందించడటానికి మీరు శ్రద్ధ వహించాల్సిన వేర్వేరు ఆహార ముడిపదార్థాల గురించి మాట్లాడబోతున్నాం. మీరు ప్రెగ్నెన్సీ రెండవ త్రైమాసికానికి కావాల్సిన ఆహార పదార్థాలతో డైట్ ఛార్ట్ ని కూడా తయారుచేసుకోవచ్చు. సరే అయితే మనం చర్చని మొదలుపెడదాం.
గర్భవతిగా ఉన్నప్పుడు నాలుగవ నెల తల్లికి చాలా ఇబ్బందికరమైన సమయం, ఎందుకంటే ఆ సమయంలో తల్లి వికారం, తలనొప్పులు, పొద్దునపూట అనారోగ్యం వంటి ప్రభావాలని ఎదుర్కొంటుంది. అందుకని రెండవ త్రైమాసికం డైట్ ఛార్ట్ ద్వారా మీ శరీరంలో ఈ సమయంలో వచ్చే సమస్యలైన రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ స్థాయిలు, కేలరీ కౌంట్ మొదలైనవాటిని గొప్పగా నియంత్రించవచ్చు.
ఒక బిడ్డకి జన్మనివ్వటం అనేది చాలా కష్టమైన ప్రక్రియ, ఎందుకంటే ఈ సమయంలో తల్లి శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. అదేవిధంగా ఈ త్రైమాసికంలో బిడ్డ సైజు పైకి కన్పించే విధంగా పెరుగుతుంది కాబట్టి సంపూర్ణ పోషణ ఉండే డైట్ ను తీసుకోవడం తప్పనిసరి.
గర్భవతులైన మహిళలందరూ వారి రోజువారీ డైట్ లో జోడించాల్సిన కొన్ని ఆహారపు అలవాట్లని మనం చర్చిద్దాం.
మీ 2వ త్రైమాసికం డైట్ ఛార్టుని తయారు చేస్తున్నప్పుడు మీరు పాటించదగ్గ కొన్ని ఆహారపు అలవాట్లు కింద ఇవ్వబడ్డాయి:
పసిబిడ్డకి ఈ సమయంలో కణాల ఉత్పత్తికి ప్రోటీన్ ఒక తప్పనిసరి ప్రాథమిక వనరు. మీరు ఎక్కువ చికెన్ అలాగే చేపలని తినాలి. శాకాహారులకి, వీగన్లకి టోఫు, కినోవాలు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు.
బ్రెడ్, బ్రౌన్ రైస్ అలాగే పాస్తా వంటి పీచుపదార్థాలని మీ డైట్లో జోడించటం వలన మలబద్ధకం, హెమరాయిడ్ల వంటి జీర్ణ సమస్యలని దూరంగా ఉంచవచ్చు. ఆ విధంగా ఇవి గొప్ప పీచు పదార్థ ప్రత్యామ్నాయాలని చెప్పవచ్చు.
పండ్లు యాంటీ ఆక్సిడెంట్లు, వాపు-వ్యతిరేక లక్షణాలు అలాగే అత్యవసరమైన విటమిన్లు ఇంకా ఖనిజ లవణాలు ఉండే గొప్ప వనరులు. వీటిల్లో ఎక్కువ నీటి మొత్తం ఇంకా పీచుపదార్థాలు కూడా ఉంటాయి.
ఇవి పిండం సరైన ఎముక ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి.
ఐరన్, కాల్షియం వంటి ఖనిజ లవణాలు, అత్యవసర ఫ్యాటి యాసిడ్లు, అలాగే ప్రొటీన్లు నట్లలో ఉంటాయి. పిస్తాలు, వాల్నట్లు, ఫాక్స్ నట్లు, కిస్మిస్లు అలాగే ఖర్జూరాలు మంచి రకమైన నట్లు.
ముఖ్యమైన విటమిన్లు అయిన విటమిస్ సి వంటివి యాంటీ ఆక్సిడెంట్ల లక్షణాలు ఉండే కాయగూరలలో పుష్కలంగా ఉంటాయి. ఇది పసిబిడ్డ అభివృద్ధికి చాలా ముఖ్యం.
ఇవి ప్రోటీన్లు అలాగే ముఖ్యమైన అమైనో యాసిడ్ల మంచి వనరు.
మాంసం కూడా మంచి ప్రీటీన్ ప్రత్యామ్నాయమే కానీ నియంత్రిత మొత్తాలలో మాత్రమే తినాలి.
చేపలలో శిశువుల మెదడు అభివృద్ధి చెందటానికి ఉపయోగపడే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ డి, మరియు ప్రొటీన్లు ఉంటాయి. మెదడు అభివృద్ధికి, చేపలలో దొరికే DHA తప్పనిసరి. కానీ, పచ్చి చేపలు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లని కలిగించవచ్చు కాబట్టి పచ్చిగా కాకుండా వండిన రూపంలోనే చేపలు తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
కొన్ని ఆహార ముడిపదార్థాలకి దూరంగా ఉండటం మీకు మంచి చేయవచ్చు. అందుకని 2వ త్రైమాసికంలో డైట్ ఛార్ట్ లో తొలగించాల్సిన పదార్థాలు కింద ఇవ్వబడ్డాయి:
వండని పచ్చి మాంసం ఎవరికీ మంచి ప్రత్యామ్నాయం కాదు, అందుకని దీనికి ఎట్టి పరిస్థితులలో దూరంగా ఉండాలి.
ఇవి పసిబిడ్డ యొక్క ప్లేసెంటాకి (మాయ లేదా మావి) తీవ్రమైన హాని కలిగించవచ్చు.
గుడ్డు యొక్క సొనభాగంలో బ్యాక్టీరియా లేదా సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంటుంది. ఇది పసిబిడ్డకి అపాయకరమైనది, అందుకని తప్పకుండా దీనికి దూరంగా ఉండాలి.
స్వోర్డ్ ఫిష్ లేదా షార్కు చేపలో పాదరసం నిండి ఉంటుంది. ఇది తల్లి అలాగే బిడ్డ ఇద్దరికీ ప్రాణాంతకం కావచ్చు.
లేదా బయటి ఆహారం అధికంగా ప్రాసెస్ చేయబడుతుంది, అడిటివ్స్ లేదా ప్రిజర్వేటివ్లతో నిండి ఉంటుంది. ఈ పదార్థాలు కృత్రిమమైనవి అలాగే అవి మీ పసిబిడ్డ యొక్క శరీరాభివృద్ధిలో సమస్యలు తీసుకురావచ్చు.
కొన్ని చీజ్ లలో ఫెర్మెంట్ చేసే (కిణ్వన ప్రక్రియ) ఫంగస్ ఉంటుంది, ఇది శిశువు అభివృద్ధి సంబంధించిన హానికరమైన సమస్యలు తెస్తుంది. పసిబిడ్డలు పుట్టాకనే యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయి, అందుకని వైరస్లు, బ్యాక్టీరియాలు రోగనిరోధకత పెరిగేలోగా ప్రాణాంతక సమస్యలు తీసుకువస్తాయి.
ఇవి కేవలం మీ శరీరానికి కేలరీలని జత చేయడం తప్ప మరొకటి చేయవు. అందుకని వీటికి దూరంగా ఉండటం చాలా ముఖ్యం.
క్యాండీలు లేదా కుకీల వంటి ఎక్కువ చక్కెర స్థాయి ఉన్న పదార్థాలు తల్లితో పాటు బిడ్డలో కూడా మధుమేహం లక్షణాలను కలిగేలా చేస్తాయి.
ఇది పుట్టుక సమయంలో పసిబిడ్డ తక్కువ బరువుతో పుట్టగలిగే రిస్కుని అధికం చేస్తుంది. ఎక్కువ కెఫిన్ గర్భస్రావానికి దారి తీయవచ్చు.
ఆల్కహాల్ బిడ్డకి ఎలా ప్రాసెస్ చేయాలో తెలియదు కాబట్టి బేబీకి ఆల్కహాల్ చెడ్డదని విడిగా చెప్పక్కర్లేదు. ఇది ఎదుగుదల సమస్యలని కూడా దారితీయవచ్చు.
ఇవి కేవలం మలబద్ధకాన్ని మాత్రమే కలిగించవు. ఊబకాయం, కొన్నిసార్లు హెమరాయిడ్లని కూడా కలిగిస్తాయి.
ఇప్పుడు, మనం మీరు ప్రతిరోజూ ఆరోగ్యకరమైన, పోషణ ఉండే భోజనం చేయడానికి మీ రోజువారీ డైట్ లో ఏయే వంటకాలు, ఆహార పదార్థాలు చేర్చుకోవచ్చో చూద్దాం.
ఈ డైట్ మీ బిడ్డకి చాలా ఆరోగ్యకరమైనది అలాగే పోషణనిచ్చేది ఎందుకంటే దీనిలో దాదాపు మీరు రోజువారీ తినే ప్రాథమిక ముడిపదార్థాలే ఉన్నాయి. వీటిని మీ చుట్టుపక్కల సులువుగా, తక్కువ, సరసమైన ధరలలో కొనుక్కొని ఈ డైట్ సులభంగా పాటించవచ్చు.
Yes
No

Written by
Swetha Rao
Get baby's diet chart, and growth tips


డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)