


Conception
3 November 2023 న నవీకరించబడింది
ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్ (IUI) అనేది ఇన్ఫెర్టిలిటీ (వ్యంధత్వం) కి చేసే చికిత్స. ఈ ప్రక్రియలో స్త్రీ అండాశయం ఫలదీకణం చెంది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గుడ్లను విడుదల చేసే సమయంలో వీర్యాన్ని నేరుగా.. గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్ (IUI) ఫలితం ఏమిటంటే.. వీర్యం ఫెలోపియన్ ట్యూబ్‌లోకి వెళ్లి అండాన్ని ఫలదీకరణం చేస్తుంది. తత్ఫలితంగా గర్భం వస్తుంది. ఈ రకమైన కృతిమ గర్భధారణ కింది సమస్యలను కలిగి ఉన్న జంటలకు ఉపయోగిస్తారు.
వివరించలేని వంధ్యత్వానికి చికిత్సగా దీనిని నిర్వహిస్తారు.
ఎండోమెట్రియాసిస్ వంధ్యత్వానికి మందులతో పాటుగా IUI కూడా మొదటి చికిత్సగా ఉంది.
వీర్యం విశ్లేషణ సగటు వీర్యం స్థాయి కంటే తక్కువసంఖ్యలో ఉండడం, బలహీన కదలిక లేదా వీర్యకణాల ఆకారం, పరిమాణంలో అసాధారణతను చూపుతుంది. IUI ఇటువంటి సమస్యలను పరిష్కరిస్తుంది. ఇది వీర్యం నుంచి తక్కువ క్వాలిటీ వీర్యాన్ని వేరు చేస్తుంది.
ఎవరైతే స్త్రీలు ఒవొల్యూషన్ (అండోత్సర్గము) సమస్యలు లేదా అండాల సంఖ్య తగ్గుదలతో బాధపడుతున్నారో వారికి IUI చేయవచ్చు.
ఒవొల్యూషన్ (అండోత్సర్గము) సమయంలో స్త్రీ గర్భం శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది వీర్యం యోని నుంచి ఫెలోపియన్ ట్యూబ్‌లకు ప్రయాణించేందుకు సహాయం చేస్తుంది. కానీ గర్భాశయ శ్లేష్మం చాలా మందంగా ఉన్నపుడు అది వీర్య ప్రయాణాన్ని ప్రభావితం చేస్తుంది. అండాన్ని చేరకుండా నిరోధిస్తుంది.
IUI అనేది నాన్ ఇన్వాసివ్ మరియు తక్కువ ఖరీదైన సంతానోత్పత్తి చికిత్స. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్తో పోలిస్తే ఇది తక్కువ ఖర్చుతో పూర్తవుతుంది. అయితే కింది సందర్భాలలో IUI చికిత్స అనేది ప్రభావవంతంగా ఉండదు.
IUI చికిత్స అసలు ప్రక్రియ మొదలయ్యే ముందు కింది వాటిని కలిగి ఉంటుంది. వీర్య నమూనా తీసుకోవడం: వీర్య నమూనాను మహిళ భాగస్వామి నుంచి తీసుకుంటారు. వీర్యంలోని నాన్ స్పెర్మ్ ఎలిమెంట్స్ మహిళ ఫలదీకణానికి ఆటంకం కలిగించే చర్యలను కలిగి ఉంటాయి. తక్కువ నాణ్యత గల వీర్యకణాలు లేకుండా కేవలం అధిక నాణ్యత ఉన్న వీర్యకణాలు మాత్రమే ఉండేలా వీర్యాన్ని శుభ్ర పరుస్తారు. గర్భం సాధించే అవకాశాన్ని ఇది మెరుగుపరుస్తుంది. ఒవొల్యూషన్ (అండోత్సర్గము) గుర్తించేందుకు సంకేతాలు: IUI చేసేందుకు ఒవొల్యూషన్ సమయం చాలా ముఖ్యం కాబట్టి.. మీరు హోమ్ యూరిన్ ఒవొల్యూషన్ కిట్ ఉపయోగించి.. లుటినైజింగ్ హార్మోన్ విడుదలను గుర్తించాలి. ఈ కిట్ లుటినైజింగ్ హార్మోన్‌ను గుర్తిస్తుంది. సమయాన్ని నిర్ణయించండి: చాలా IUIలు ఒవొల్యూషన్ (అండోత్సర్గము) వచ్చిన ఒకటి లేదా రెండు రోజుల తర్వాత చేస్తారు.
ఇంట్లో గర్భధారణ పరీక్ష చేసుకోవడానికి రెండు వారాల సమయం అవసరం కావొచ్చు. త్వరగా పరీక్ష చేసుకోవడం వలన తప్పుడు ఫలితం వచ్చే అవకాశం ఉంది. గర్భధారణ హార్మోన్లు ఇంకా కొలవదగిన స్థాయిలో లేకపోతే నెగటివ్ రిజల్ట్ వస్తుంది. లేదా ఒవల్యూషన్ను ప్రేరేపించే మెడిసిన్ గర్భాన్ని సూచించే తప్పుడు పాజిటివ్‌కు దారి తీయొచ్చు. మీరు రెండు వారాల తర్వాత ఇంటి వద్ద గర్భనిర్ధారణ పరీక్ష చేసుకున్నాక కూడా గర్భవతి అని తేలకపోతే మీరు వేరే సంతానోత్పత్తి చికిత్సలను ప్రయత్నించవచ్చు. లేకపోతే మూడు నుంచి ఆరునెలల విరామం ఇచ్చి అదే చికిత్సను మరలా ప్రయత్నించవచ్చు.
Yes
No

Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips











డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)