
మెటా డెస్క్రిప్షన్: ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్ (IUI) అనేది ఒక కామన్ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్. గర్భధారణ కోసం దీన్ని చేస్తారు. ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్ (IUI) గురించి మరింత అర్థం చేసుకునేందుకు ఈ ఆర్టికల్‌ను చదవండి.
ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్ (IUI) అనేది గర్భం దాల్చేందుకు ఉపయోగపడే సంతానోత్పత్తి చికిత్స. ఇది ఒక రకమైన కృతిమ గర్భధారణ. ఈ పద్ధతిలో నేరుగా గర్భాశయంలో స్పెర్మ్‌ను ప్రవేశపెడతారు.
IUI అనేది సాధారణంగా ఇతర సంతానోత్పత్తి చికిత్సల కంటే చాలా సమర్ధవంతంగా ఉంటుంది. సాంప్రదాయ పద్ధతిలో గర్భం దాల్చని జంటలకు ఈ పద్ధతి మొదట సిఫారసు చేయబడుతుంది. IUI పద్ధతి ద్వారా ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ అది వివిధ కారణాలపై ఆధారపడి ఉంటుంది.
● వయసు: IUI విజయవంతమయ్యే అవకాశం పెద్ద వారి కంటే యువతలో ఎక్కువ ఉంటుంది. యువకుల నుంచి వచ్చే స్పెర్మ్ అండాన్ని (గుడ్డును) ఫలదీకరణం చేసేందుకు ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
● మునుపటి గర్భాలు: గతంలో విజయవంతమైన గర్భాలు IUI ద్వారా ప్రెగ్నెన్సీ పూర్తి సమయం ఉండేందుకు సహాయపడుతుంది.
● మగవారి సంతానోత్పత్తి: స్పెర్మ్ యొక్క చలన శక్తి తక్కువగా ఉన్న సందర్భాల్లో IUI విజయవంతమైన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ట్యూబ్స్ నిరోధించబడినా లేదా ఇతర సంతానోత్పత్తి సమస్యలు ఉన్నా కాని IUI విజయవంతమవడంపై ప్రభావం చూపుతాయి.
IUI ద్వారా గర్భధారణ అవకాశాలను చాలా అంశాలు ప్రభావితం చేస్తున్నప్పటికీ, కొన్ని మార్గదర్శకాలు పాటించడం మరియు వైద్యుడి సహాయం తీసుకోవడం ద్వారా చికిత్స సమయంలో తలెత్తే సమస్యలను అధిగమించొచ్చు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ఇంట్రాయుటరైన్ ఇన్సెప్షన్ (IUI) పద్ధతి కోసం స్పెర్మ్ ఎలా పొందాలి?
IUI మరియు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) రెండూ కూడా జంటలు గర్భం దాల్చేందుకు ఉపయోగపడతాయి. అయినప్పటికీ, ఈ రెండు పద్ధతుల మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. అవేంటనేది ఇప్పుడు చూద్దాం..
1. ధర: IVF సైకిల్ IUI సైకిల్ కంటే చాలా ఖరీదైనది.
2. విజయావకాశాల శాతం: IVF విజయాల శాతం IUI విజయాల శాతం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది.
3. పద్ధతి: IVF పద్ధతి అనేది IUI పద్ధతి కంటే చాలా క్లిష్టంగా ఉంటుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: IUI(ఇంట్రా యుటెరైన్ సెమినేషన్)తో గర్భవతి కావడానికి ఎంత సమయం పడుతుంది
ఓవ్యూలేషన్ (అండోత్సర్గము) ఇండక్షన్, లేదా సహకారక సంతానోత్పత్తి పద్ధతుల ద్వారా ప్రెగ్నెంట్ కాని వారికి IUI పద్ధతి చాలా సమర్థవంతంగా పని చేస్తుంది. IUI పద్ధతిని వివరించలేని ఇన్ఫెర్టిలిటీ, మేల్ ఇన్ఫెర్టిలిటీ, లేదా ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీ సమస్యలు ఉన్న జంటలు ఉపయోగిస్తారు.
IUI అనేది నేరుగా గర్భాశయంలోకి స్పెర్మ్‌ను ఇంజెక్ట్ చేసే సంతానోత్పత్తి చికిత్స. ఏ జంటలలో అయితే స్పెర్మ్ అనేది స్త్రీ గర్భాశయ ముఖద్వారం ద్వారా ఇంకా గర్భాశయంలో నుండి వెళ్ళి అండాన్ని ఫలదీకణం చెందించలేకపోతోందో వారికి ఈ చికిత్సను ఉపయోగిస్తారు.
IUI ద్వారా కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. స్పెర్మ్ ఇంజెక్షన్ సమయంలో (నొప్పి రావడం, స్రావం, లేదా రక్త స్రావం) వంటివి జరుగుతాయి. ఫెర్టిలిటీ సమస్యలు (తక్కువ అండాల ఉత్పత్తి) ఇంకా గర్భస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
IUI విజయాల శాతం అనేది వివిధ కారకాల మీద ఆధారపడి ఉంటుంది. జంట యొక్క రోగ నిర్ధారణ అనేది IUI విజయంలో కీలకపాత్ర పోషిస్తుంది.
● వివరించలేని ఫెర్టిలిటీ కేసుల విషయంలో IUI విజయాల శాతం సైకిల్‌కు 7% and 10% మధ్య ఉంటుంది.
● మేల్ ఇన్ఫెర్టిలిటీ కేసుల విషయంలో IUI విజయాల శాతం 16.9% గా ఉంది.
● సింగిల్ ఓపెన్ ఫెర్టిలిటీ ట్యూబ్ కేసులలో (అంటే ఒక ఫాలోపియన్ ట్యూబ్ నిరోధించబడితే) IUI విజయవంతమయ్యే అవకాశం 11.7 and 38.1% శాతం మధ్య ఉంటుంది. ట్యూబ్ ఎక్కడ నిరోధించబడిందో దానిపై ఆధారపడి ఉంటుంది..
ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్ (IUI) కి ఎంత ధర అవుతుంది?
IUIకి ఒకే విధమైన ఫీజు ఉండదు. ధర అనేది వివిధ కారణాలపై ఆధారపడి ఉంటుంది. ఇన్సూరెన్స్ కవరేజ్, క్లీనిక్ ఉన్న ఏరియాను బట్టి దాని ధర ఉంటుంది.
ఒక IUI సైకిల్ ధర సుమారుగా INR 6,000 వరకు ఉంటుంది. చికిత్స ముందు ఇచ్చే మందులు మరియు చికిత్స తరువాత ఇచ్చే మందుల ధర సుమారుగా INR 4,000 to INR 5,000 వరకు ఉంటుంది. అందుకోసం, ఒక్క సైకిల్ IUI కి సుమారు INR 12,000 to INR 17,000 వరకు ఖర్చవుతుంది. (మందులతో కలుపుకుని) ఓవ్యూలేషన్ పర్యవేక్షణ మరియు ఇతర అవసరమైన పద్ధతులు ఇంకా మందులను కలిగి ఉంటుంది.
IUI చికిత్స సమయంలో, వైద్యుడు యోనిలోకి స్పెక్యులమ్ను చొప్పిస్తాడు. స్పెర్మ్ ని ఒక సౌకర్యవంతమైన ట్యూబ్ నమూనా ద్వారా గర్భాశయం యోనిలోకి, మరియు గర్భాశయ ముఖద్వారం నుండి గర్భాశయంలోకి చొప్పించబడుతుంది. ఇందుకోసం ఒక ట్యూబ్‌ను ఉపయోగిస్తారు. స్పెర్మ్ ని ఆ ట్యూబ్ నుండి నేరుగా గర్భాశయంలోకి పంపించాడుతుంది. ఇది అండం ఫలదీకరణం చెందేందుకు సహాయపడుతుంది. తర్వాత ట్యూబ్ మరియు స్పెక్యులమ్లు తొలగించడబడుతాయి.
ఈ మొత్తం ప్రక్రియకు దాదాపు 20 నిమిషాల 20 minutes సమయం పడుతుంది. ధృవీకరించిన డాక్టర్ క్లీనిక్‌లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తాడు. ట్యూబ్ చొప్పించే సమయంలో కొంత మంది పేషంట్స్ అసౌకర్యానికి గురవుతారు.
కొంత మందికి చికిత్స సమయంలో నొప్పి, ఉత్సర్గ (స్రావం), లేదా రక్తస్రావం వంటి చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. ఏదేమైనా ఇవి తేలికపాటివి మరియు చికిత్స తర్వాత కొన్ని రోజులకు పరిష్కరించబడతాయి.
గర్భం దాల్చేందుకు ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్ (IUI) సురక్షితమైన పద్ధతి అయినప్పటికీ, సరైన ఫలితాలు వచ్చేందుకు సరైన మందులు వాడుతూ.. సరైన పద్ధతులు అనుసరించడం చాలా ముఖ్యం. ఈ ప్రక్రియ మొదలుపెట్టే ముందు మీ మెడికల్ హిస్టరీని అర్థం చేసుకునే నమ్మకమైన వైద్యుడిని కలవండి.
Tags
IUI in telugu, What is IUI in telugu, Can I conceive through IUI in telugu, Babies born through IUI are normal in telugu, benefits of IUI in telugu, IUI treatment in telugu
Yes
No


















Influenza and boostrix injection kisiko laga hai kya 8 month pregnancy me and q lagta hai ye plz reply me
Hai.... My last period was in feb 24. I tested in 40 th day morning 3:30 .. That is faint line .. I conculed mylo thz app also.... And I asked tha dr wait for 3 to 5 days ... Im also waiting ... Then I test today 4:15 test is sooooo faint ... And I feel in ma body no pregnancy symptoms. What can I do .
Baby kicks KB Marta hai Plz tell mi
PCOD kya hota hai
How to detect pcos
Your body needs extra nutrition this trimester - these can help.





This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |