
పబ్లిక్ రెస్ట్ రూంను ఉపయోగించినపుడు అంటు వ్యాధుల బారిన పడకుండా కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ సొంతంగా జాగ్రత్తలను పాటిస్తారు. కొంత మంది టాయిలెట్ సీట్ కవర్లను ఉపయోగిస్తారు. మరికొంత మంది టాయిలెట్ సీట్ మీద పూర్తిగా కూర్చోకుండానే టాయిలెట్‌ను ఉపయోగించుకుంటారు. కానీ పబ్లిక్ టాయిలెట్‌ను ఉపయోగించినపుడు అనారోగ్యాల బారిన పడకుండా ఉండేందుకు ఉత్తమ మార్గం ఏమిటి?
టాయిలెట్ సీట్లు సాధారణంగా ఇన్ఫెక్షన్లను కలిగించే బ్యాక్టీరియాలతో ఉంటాయి. వాటిని మనం చూడలేనప్పటికీ ఇటువంటి బ్యాక్టీరియాలు టాయిలెట్ సీటుతో పాటు ప్రతి చోట ఉంటాయి.
చాలా సందర్భాల్లో ఈ బ్యాక్టీరియా ఎటువంటి హాని కలిగించదు. కానీ కొన్ని సార్లు మాత్రం ఈ బ్యాక్టీరియా కొన్ని ఇన్ఫెక్షన్లను కలిగిస్తుంది. ఈ బ్యాక్టీరియాల నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఒక మార్గం డిస్పోజబుల్ పేపర్ టాయిలెట్ సీట్ కవర్లు.
ఇవి నిజంగా ప్రయోజనకరంగా ఉంటాయా?
పేపర్ టాయిలెట్ సీట్ కవర్లు అంటువ్యాధులను నివారించడంలో ఎలా సహాయపడతాయో ఇక్కడ చూద్దాం.
పేపర్ టాయిలెట్ సీట్ కవర్లు పలుచగా ఉండే పేపర్ షీట్స్. ఇవి రీసైకిల్ చేసిన కాగితంతో తయారు చేస్తారు. దాని అర్ధం మీరు వాటిని ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలి. పేపర్ టాయిలెట్ సీట్ కవర్లు టాయిలెట్ సీటు మీద ఉండే బ్యాక్టీరియాలకు మరియు మానవచర్మానికి మధ్య అవరోధంగా ఉంటాయి. ప్రజలు వాటిని పరిశుభ్రత, సౌకర్యం, మనశ్శాంతి కోసం ఉపయోగిస్తారు.
పేపర్ టాయిలెట్ సీటు కవర్లు ఇన్ఫెక్షన్లు మరియు బ్యాక్టీరియా వ్యాప్తిని తగ్గించడంలో సహాయపడతాయి. టాయిలెట్ సీటు కవర్లు మానవశరీరం మరియు టాయిలెట్ సీటు మధ్య అవరోధంలా ఉండి.. బ్యాక్టీరియా శరీరానికి తగలకుండా చేస్తా యి. ఈ కవర్లను వాడిన వ్యక్తికి బ్యాక్టీరియాతో ఎక్కువగా సమస్యలు రావు. పేపర్ టాయిలెట్ సీట్ కవర్‌ను ఉపయోగించడం వలన టాయిలెట్ సీట్ క్లీన్‌గా ఉండడంతో పాటుగా బ్యాక్టీరియా రహితంగా ఉంటుంది.
పేపర్ టాయిలెట్ సీట్ కవర్ల నుంచి ఎక్కువ ప్రయోజనం పొందడం కోసం వాటిని ఎలా వాడాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. పేపర్ టాయిలెట్ సీట్ కవర్లను ఎలా ఉపయోగించాలో ఇక్కడ దశల వారీగా ఉంది.
1. కూర్చోవడానికి ముందు టాయిలెట్ సీట్‌ను ఓ సారి చూడండి. అది శుభ్రంగా లేకపోతే పేపర్ టవల్ లేదా టాయిలెట్ సీట్ క్లీనర్‌తో దానిని తుడవండి.
2. ప్యాకేజ్ నుంచి పేపర్ టాయిలెట్ సీట్ కవర్ని బయటకు తీసి మడత విప్పండి.
3. కాగితాన్ని టాయిలెట్ సీటుపై ఉంచండి. మధ్యలో ఉన్న రంధ్రం టాయిలెట్ బౌల్‌తో సమానంగా ఉండేలా చూసుకోండి.
4. ఒకసారి పూర్తయిన తర్వాత టాయిలెట్ సీట్ కవర్‌ను టాయిలెట్లో ఫ్లష్ చేయండి.
5. సబ్బు మరియు నీటితో చేతులను శుభ్రంగా కడుక్కోండి.
పేపర్ టాయిలెట్ సీట్ కవర్లను ఉపయోగించేందుకు ఇదే అత్యంత ప్రభావవంతమైన మార్గం. రెస్ట్ రూం వాడిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరి అని గుర్తుంచుకోండి.
పేపర్ టాయిలెట్ సీట్ కవర్లు ఉపయోగించడం సురక్షితం. మరియు వీటి వలన ఒకరి ఆరోగ్యానికి ఎటువంటి ముప్పు ఉండదు. ఇవి బ్యాక్టీరియా మరియు ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. అనేక పేపర్ టాయిలెట్ సీట్ కవర్లు రీసైక్లింగ్ పేపర్‌తో తయారు చేస్తారు. ఇలా చేయడం వలన అవి పర్యావరణ హితంగా ఉంటాయి.
పేపర్ టాయిలెట్ సీట్ కవర్లను ఉపయోగించేందుకు ప్రత్యేకంగా కొన్ని పరిస్థితులు ఉన్నాయి. వాటిల్లో కొన్ని:
• టాయిలెట్ సీట్ మురికిగా ఉంటే: ఈ సందర్భాల్లో ఎక్కువ మంది పేపర్ టాయిలెట్ సీట్ ‘కవర్లను ఉపయోగిస్తారు. ఇది తరచూ కనిపించే పరిస్థితి. టాయిలెట్ సీట్ అపరిశుభ్రంగా మరియు మురికిగా ఉంటే అధిక రక్షణ కోసం పేపర్ టాయిలెట్ సీట్ కవర్‌ను ఉపయోగించడం చాలా మంచి ఆలోచన.
• టాయిలెట్ సీట్ తడిగా ఉంటే: ఇటువంటి సందర్భాల్లో తేమతో బ్యాక్టీరియా మీకు సోకకుండా ఉండేందుకు పేపర్ టాయిలెట్ సీట్ కవర్‌ను ఉపయోగించడం అత్యుత్తమం.
• పబ్లిక్ రెస్ట్ రూం ఉపయోగించుకున్నపుడు: పేపర్ టాయిలెట్ సీట్ కవర్లు తప్పకుండా అవసరమయ్యే ప్రాంతం పబ్లిక్ రెస్ట్ రూం. ఎందుకంటే చాలా మంది పబ్లిక్ రెస్ట్ రూంలను ఉపయోగించుకోవడం వలన అవి కలుషితంగా తయారవుతాయి.
• వ్యక్తికి తక్కువ రోగనిరోధక శక్తి ఉంటే: వ్యక్తికి తక్కువ రోగ నిరోధక శక్తి ఉంటే అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో పేపర్ టాయిలెట్ సీట్ కవర్లను ఉపయోగించడం వలన బ్యాక్టీరియాల నుంచి తమని తాము రక్షించుకోవచ్చు.
పేపర్ టాయిలెట్ సీట్ కవర్ల వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని ఒక్కసారి పరిశీలిస్తే:
• ఇన్ఫెక్షన్ ప్రమాదాలను తగ్గిస్తుంది: మైలో కేర్ టాయిలెట్ పేపర్ సీట్ కవర్లు ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది ఒక అతి ముఖ్యమైన ప్రయోజనం.
• పరిశుభ్రత: పేపర్ టాయిలెట్ సీట్ కవర్లు కూడా పరిశుభ్రతను పెంచడంలో సహాయపడతాయి. ఇవి టాయిలెట్ సీట్‌ను శుభ్రంగా మరియు బ్యాక్టీరియా లేకుండా ఉంచడం వలన సూక్ష్మక్రిముల వ్యాప్తిని అరికడతాయి.
• సౌకర్యం: పేపర్ టాయిలెట్ సీట్ కవర్లు మీకు సౌకర్యాన్ని అందజేస్తాయి. పబ్లిక్ రెస్ట్ రూమ్స్‌లో టాయిలెట్ సీట్లు గట్టిగా ఇంకా అసౌకర్యంగా ఉన్న చోట ఇవి సౌకర్యాన్ని అందిస్తాయి.
• ప్రయాణ భద్రత: ప్రయాణాలు చేసేటపుడు సురక్షితంగా ఉండేందుకు ట్రావెల్ టాయిలెట్ సీట్ కవర్స్ గొప్ప మార్గం. మైలో కేర్ టాయిలెట్ పేపర్ సీట్ కవర్లను మీరు ఉపయోగించడం వల్ల విదేశాల్లో ఎక్కువగా ఉండే బ్యాక్టీరియా, ఇతర వైరస్ల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.
చివరగా చెప్పేదేంటంటే.. పేపర్ టాయిలెట్ సీట్ కవర్లు ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో గొప్పగా సహాయపడతాయి. ఇవి పరిశుభ్రతను మెరుగుపరుస్తాయి. ఎక్కువ ప్రయోజనాలు పొందేందుకు వాటిని సరిగ్గా ఉపయోగించడం చాలా అవసరం. మీరు పేపర్ టాయిలెట్ సీట్ కవర్ని ఉపయోగించినా లేకపోయినా రెస్ట్ రూంని ఉపయోగించిన తరువాత చేతులను శుభ్రంగా కడుక్కోవడం చాలా అవసరం.
Yes
No


















These seat covers are user-friendly and make using public restrooms much more comfortable. I highly recommend them to everyone!

Perfect for every public toilet, easy to use. It covers the toilet lid easily.

Who are having UTI issues should always carry these Toilet Seat Covers. It will always help you to fight with infection

Influenza and boostrix injection kisiko laga hai kya 8 month pregnancy me and q lagta hai ye plz reply me
Hai.... My last period was in feb 24. I tested in 40 th day morning 3:30 .. That is faint line .. I conculed mylo thz app also.... And I asked tha dr wait for 3 to 5 days ... Im also waiting ... Then I test today 4:15 test is sooooo faint ... And I feel in ma body no pregnancy symptoms. What can I do .
Baby kicks KB Marta hai Plz tell mi
PCOD kya hota hai
How to detect pcos
Your body needs extra nutrition this trimester - these can help.





This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |