
ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ స్థానంలో వెదురు వాటర్ బాటిల్స్ వస్తే ఏం జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఊహించారా? ప్రపంచ కాలుష్యాన్ని తగ్గించేందుకు చాలామంది తమ వంతు సాయం చేయాలని అనుకుంటున్నారు. ఇందుకు తీసుకోవాల్సిన ప్రధాన చర్య ప్లాస్టిక్ బాటిళ్లను వెదురు బాటిల్స్‌తో భర్తీ చేయడం. ప్లాస్టిక్ స్థానంలో వెదురు బాటిల్స్ ఉంటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో దానివల్ల పర్యావరణానికి కలిగే ప్రయోజనాల గురించి మీరు ఏమని అనుకుంటున్నారో మాకు తెలుసు? అనేక పరిశోధనలు మరియు పరిశీలనల వలన తెలిసిందేంటంటే ప్లాస్టిక్ బాటిల్స్ డీగ్రెడెషన్ వలన భూమి మరియు సముద్ర కాలుష్యం ఎక్కువగా సంభవిస్తుందని గుర్తించబడింది. ప్లాస్టిక్ కాలుష్యం అంటే ప్లాస్టిక్ ఒకేదగ్గర పేరుకుపోవడం, ఇది మనుషులను మరియు వన్యప్రాణులను ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు ప్లాస్టిక్ కాలుష్యం వలన భూములు దెబ్బతిని పంటలు పండవు.
ప్రస్తుత రోజుల్లో అనేక మంది శాస్త్రవేత్తలు ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించేందుకు మరియు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. చాలా ప్రయత్నాల తర్వాత వెదురు బాటిల్స్ రూపంలో కొంత మంది ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. ప్రస్తుత రోజుల్లో వెదురు వాటర్ బాటిల్స్ వాటి ప్రయోజనాల కారణంగా మార్కెట్లో గుర్తింపు పొందుతున్నాయి మరియు ప్రజలు పర్యావరణానికి సంబంధించి మరింత జాగ్రత్తగా ఉంటున్నారు. వెదురు బాటిల్‌ను ఉపయోగించడం వలన ప్రయోజనాలు మరియు ఎందుకు వెదురు బాటిల్ ఎంచుకోవాలి? అది పర్యావరణానికి ఎలా మేలు చేస్తుందనే విషయాలను గురించి ఈ ఆర్టికల్‌లో సమాచారం అందిస్తాం. కాబట్టి మీకు ఉన్న సందేహాలను క్లీయర్ చేసుకునేందుకు వివరంగా తెలుసుకోండి.
వెదురు బాటిల్స్ అధిక నాణ్యత గల వెదురు మొక్కలతో తయారు చేయబడతాయి. వెదురు చెట్లు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి మరియు నీటి పోషకాలను చెక్కుచెదరకుండా ఉంచుతాయి. అవి సాధారణ ప్లాస్టిక్ బాటిల్స్ కంటే ఖరీదైనవి. అయితే వెదురు బాటిల్స్ ప్లాస్టిక్ కంటే ఎక్కువ కాలం మన్నుతాయి. వాటిని మళ్లీమళ్లీ ఉపయోగించవచ్చు. మేము వెదురు టంబ్లర్ (బాటిల్) ప్రయోజనాలను ఆర్టికల్‌లో చర్చిస్తాం. వెదురు బాటిల్స్ గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకునేందుకు చదవడం కొనసాగించండి. ఈ బాటిల్స్ గొప్పతనం ఏమిటంటే వీటిని శుభ్రంచేయడం చాలా సులభం.
చాలా వెదురు వాటర్ బాటిల్స్ భలుకాతో తయారు చేయబడ్డాయి. భలుకా అనేది ఒక వెదురు రకం. ఈ పదార్థంతో వాటర్ బాటిల్ తయారు చేసేందుకు దాదాపు 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. ఒక వెదురు బాటిల్‌ను తయారు చేయాలంటే చాలా టైమ్ పడుతుంది. మరియు అనేక దశలు ఉంటాయి. అందుకే వెదురు బాటిల్స్‌కు ఖరీదు ఎక్కువగా ఉంటుంది. భలుకాను కత్తిరించి దానిని ఉడకబెట్టడం, ఎండబెట్టడం, స్మోకింగ్, వెదురు బాటిల్స్ వివిధ భాగాలను కలపడం, ఆపై దానిని సరిగ్గా పాలిష్ చేయడం వంటి వివిధ దశలు ఉన్నాయి. మరిగే దశ సహాయంతో పదార్థం శుద్ధి చేయబడుతుంది. కనీసం 18 నెలలు ఉపయోగపడేలా పదార్థాన్ని బలపరుస్తుంది. ప్రస్తుత రోజుల్లో వెదురు వాటర్ బాటిల్స్ వాడకం గురించి కొద్ది మందికే తెలుసు. పర్యావరణానికి ఎంతో అనుకూలమైన వెదురు వాటర్ బాటిల్స్ గురించి కొంత మందికే తెలియడంతో వాటికి సరిగ్గా మార్కెట్ లేక తయారీదారులు భారీ నష్టాలను చవిచూస్తున్నారు.
ప్రస్తుత రోజుల్లో కేవలం రూ. 20 లేదా రూ. 30 పెడితే వాటర్ బాటిల్ వస్తున్న తరుణంలో ఒకే బాటిల్ మీద వందల రూపాయలు ఎందుకు ఖర్చు చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరికీ వస్తుంది. ఈ అనుమానాన్ని నివృత్తి చేసుకునేందుకు మీరు అంత పెట్టుబడి పెట్టి కొనుగోలు చేసిన వాటర్ బాటిల్ ప్రయోజనాలను గురించి చూడండి.
ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సహజ వెదురు బాటిల్ ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రయోజనాలను గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. తద్వారా వారి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
వెదురు మరియు సహజ పదార్థాలతో తయారు చేయబడిన ఈ వెదురు బాటిల్లో ఎటువంటి విషపూరిత పదార్థాలు ఉండవు. ఈ బాటిళ్లలో మీకు కావాల్సినంత సేపు నీటిని నిల్వ ఉంచుకోవచ్చు. అందులోని పోషకాలు అలాగే ఉంటాయి.
ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల మెటీరియల్ పాడవడం ప్రారంభం కావడం వలన అవి లోపలి నుంచి మరియు బయటి నుంచి కూడా పాడైపోతాయి. తద్వారా నీటి వినియోగానికి అవి హానికరంగా మారొచ్చు. వెదురు వాటర్ బాటిళ్ల విషయానికి వస్తే మీరు బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వెదురు బాటిల్స్ యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి నీటిని సురక్షితంగా ఉంచుతాయి. అంతే కాకుండా ఈ బాటిల్ వాటర్ తాగిన వ్యక్తి రోగనిరోధక శక్తిని మెరుగుపర్చడంలో కూడా సహాయపడతాయి.
వెదురు బాటిల్స్ తుప్పు లేని సహజపదార్థాలతో తయారు చేయబడతాయి. వెదురు గట్టి పదార్థం కాబట్టి విరిగిపోయే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఈ బాటిల్స్‌కు ఎక్కువ షెల్ఫ్ (ఎంతకాలం వాడొచ్చు అనేది) లైఫ్ ఉంటుంది. కాపర్, ప్లాస్టిక్ బాటిళ్లతో పోలిస్తే వెదురు వాటర్ బాటిల్స్ నాణ్యత మరియు మన్నిక పరంగా మార్కెట్లో ఉత్తమంగా ఉన్నాయి.
వెదురు బాటిల్స్ ఏజింగ్ ప్రాసెస్ (వృద్ధాప్య ప్రక్రియ) ను తగ్గిస్తాయని నమ్ముతారు. ఎందుకంటే ఇందులో యాంటీయాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి సూక్ష్మజీవుల నుంచి నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి. ఇది చర్మం ముడతలు పడడం తగ్గిస్తుంది. అంతే కాకుండా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి జుట్టు పెరుగుదలను పెంచడంలో కూడా సహాయపడుతుంది.
పర్యావరణానికి హానికరమైన ఎటువంటి పదార్థాలను వెదురు వాటర్ బాటిల్స్‌లో ఉపయోగించరు. సహజ పదార్థాలనే ఉపయోగించడం వలన వృథాను కూడా తగ్గిస్తుంది.
ప్లాస్టిక్ బాటిల్స్ Vs వెదురు వాటర్ బాటిల్స్ మీద అనేక పరిశోధనలు, వ్యాసాలు ఉన్నాయి. కొంత మంది వెదురు బాటిళ్ల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. మరికొంత మంది వివిధ కారణాల వల్ల వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇంటర్నెట్లో ఉన్న పరిమిత సమాచారం మరియు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వెదురు వాటికంటే చౌకగా లభించడంతో వెదురు బాటిళ్ల కోసం వెళ్లాలా వద్దా? అనే అయోమయంలో ప్రజలు ఉన్నారు.
మేము ప్లాస్టిక్ మరియు వెదురును పోల్చినట్లయితే మీరు వెదురు కప్స్ ప్రయోజనాలను కనుగొంటారు. అవి పర్యావరణానికి అనుకూలమైనవి మరియు రీన్యూవబుల్ (పునరుత్పాదకత). నిజమే వెదురు వాటర్ బాటిల్స్ ఖరీదైనవే. మేము పైన చెప్పినట్లుగా ఒక వెదురు వాటర్ బాటిల్‌ను తయారు చేయడానికి 6 నుంచి 8 గంటల సమయం పడుతుంది. వెదురు అన్ని యాంటీ బాక్టీరియల్ యాంటీ ఫంగస్ లక్షణాలను కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇవి బయోడిగ్రేడబుల్ కూడా. ప్లాస్టిక్ బాటిల్స్ కంప్లీట్‌గా బయోడిగ్రేడ్(భూమిలో కలిసిపోయేందుకు) కనీసం 1000 సంవత్సరాలు పడుతుంది. వెదురుని గ్రీన్ గోల్డ్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది తక్కువ వ్యర్థాలను కలిగి ఉంటుంది మరియు పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించదు.
వెదురు బాటిల్స్‌కు బదులుగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌ను మీరు కొనుగోలు చేసే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ ఉన్నాయి.
వెదురు వాస్తవాల గురించి మాట్లాడినట్లయితే మేము సేకరించిన సమాచారం ఇక్కడ ఉంది.
వెదురు కప్పులు విషపూరితం కానివి మరియు ఎటువంటి చికాకు కలిగించవు. ఆరోగ్యానికి ఏ విధంగా ప్రమాదకరం కాదు. వెదురు కప్పులను వేడి మరియు శీతల పానీయాల కోసం ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇవి పానీయం రుచిని తగ్గించవు మరియు అందులో ఉండే పోషకాలను కూడా తగ్గించవు.
వెదురు వాటర్ బాటిల్‌ను ఎంచుకునేటపుడు పరిగణలోనికి తీసుకోవాల్సిన అంశాలు ఏమిటి?
మీరు వెదురు బాటిల్‌ను ఎంచుకునేటపుడు పరిగణలోనికి తీసుకోవాల్సిన అనేక ఆంశాలు ఇక్కడ ఉన్నాయి. మీకు మంచి నాణ్యత గల వెదురు బాటిల్ కావాలంటే మీరు ఈ ఆంశాలను పరిగణలోనికి తీసుకోవాలి.
వెదురు వాటర్ బాటిళ్లను ప్లాస్టిక్ బాటిళ్లతో పోలుస్తూ మొత్తం సమాచారాన్ని మేము మీకు అందించాం. పర్యావరణానికి వెదురు బాటిల్స్ మంచివని మేము చెప్పగలం. ప్రజలకు స్ట్రాస్, మరియు ఇతర ప్రొడక్టులతో వెదురు డ్రింక్స్ తాగడం సురక్షితమేనా అనే అనుమానం రావొచ్చు. సమాధానం ఖచ్చితంగా అవును.
వెదురు అనేది సహజసిద్ధ ఉత్పత్తి. ఇది మీ ఆరోగ్యానికి ఎటువంటి హాని కలిగించదు. మీరు బాటిల్లో పోసిన నీటికి కూడా హాని కలిగించదు.
Bamboo Bottles in telugu, Natural Bamboo Bottles for pregnants in telugu, Uses of Bamboo Bottles in telugu, Why Bamboo Bottles are best in telugu, Compare plastic bottles with Bamboo Bottles in telugu.
Yes
No

















Naku eppudu 7 months baby moments teliyadam ledhu...
Hi I'm 34 weeks 3 days pregnant repu 9th month start avtadi naku eroju mrng milky white discharge iendi problem em undadu kada
Hii all Naku ee month(april19) delivary date echinchindi bt Naku pottalo right side pain vastundi nyt nundi akkuvaga m aina pblm sis chepara konchem urgent plz
Hii 34 weeks how many months
Naku eppudu 4th month raw rice thinalanye vude no problem or problem please tell me
Your body needs extra nutrition this trimester - these can help.





This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |