hamburgerIcon

Orders

login

Profile

STORE
Skin CareHair CarePreg & MomsBaby CareDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • చనుమొనలపై తెల్లటి మచ్చలు: లక్షణాలు, కారణాలు & చికిత్స | White Spots on Nipple: Causes, Symptoms, and Treatments in Telugu arrow

In this Article

    చనుమొనలపై తెల్లటి మచ్చలు: లక్షణాలు, కారణాలు & చికిత్స | White Spots on Nipple: Causes, Symptoms, and Treatments in Telugu

    చనుమొనలపై తెల్లటి మచ్చలు: లక్షణాలు, కారణాలు & చికిత్స | White Spots on Nipple: Causes, Symptoms, and Treatments in Telugu

    Updated on 3 November 2023

    చనుమొనలు ఇంకా వాటి చుట్టూ ఉన్న ముదురురంగు ప్రదేశాలు, వీటిని ఏరియోలాస్ అని పిలుస్తారు. ఎరియోలాస్ ఇంకా చనుమొనలపై తెల్లటి మచ్చలు కనిపించినప్పుడు, అదృష్టవశాత్తూ, ఈ తెల్లటి మచ్చలు అరుదుగానే సమస్యలను కలిగిస్తాయి.

    చనుమొనల రంధ్రాల మూసుకుపోవడం వల్ల లేదా హార్మోన్ స్థాయిలలో అసమానతలకు సహజ ప్రతిస్పందన కారణంగా పాలిచ్చే తల్లుల చనుమొనలపై తెల్లటి మచ్చలు కనిపిస్తాయి.

    ఈ కథనంలో.. చనుమొనలు ఇంకా ఏరియోలాలపై తెల్లటి మచ్చలు ఏర్పడటానికి ఈ క్రింది సంభావ్య కారణాలను మనం చర్చిస్తాము:

    గర్భధారణ సమయంలో హార్మోన్లలో మార్పులు (Hormone changes throughout pregnancy in Telugu)

    గర్భధారణ సమయంలో, హార్మోన్ల మార్పులు చనుమొనలపై తెల్లటి మచ్చలను ఎక్కువగా కలిగిస్తాయి. వీటిలో ఎక్కువ భాగం మోంట్‌గోమెరీ గ్రంథులై ఉంటాయి.

    మోంట్‌గోమేరీ గ్రంధులు తెల్లటి చనుమొనలు ఇంకా వాటి చుట్టుపక్కల ఉన్న ఏరియోలాపై కనిపిస్తాయి. చనుమొనలను మెత్తగా ఇంకా మృదువుగా ఉంచేలా చేసే తైల పదార్ధం వాటిలో ఉంటుంది.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: ఎర్లీ ప్రెగ్నెన్సీ సమయంలో చనుమొనలు ఎలా కనిపిస్తాయి?

    • సంకేతాలు (Indications)

    చనుమొన ఇంకా ఎరియోలాపై మోంట్‌గోమెరీ గ్రంధుల పరిమాణం ఇంకా సంఖ్యలో మార్పు జరగడం, చనుమొనలపై తెల్లటి మచ్చల కనిపించడం అనేది గర్భధారణ సంకేతాలకు సంబంధించిన ప్రారంభ సూచికలలో ఒకటి. మార్నింగ్ సిక్నెస్ లేదా ఇతర గర్భధారణ లక్షణాలకు ముందు కనిపించే ఒక సాధారణ మార్పు ఇది.

    మోంట్‌గోమెరీ గ్రంధులలో జిగురులాంటి తైలపదార్థం పేరుకుపోవడం వలన గ్రంధి వైట్ హెడ్ లేదా ఎల్లో హెడ్(తెల్లని లేదా పసుపు రంగు) మొటిమలా కనిపిస్తుంది. మోంట్‌గోమెరీ ట్యూబర్‌కిల్స్ అని సాధారణంగా వీటిని పేర్కొంటారు.

    గర్భధారణలో లేదా పాలు పడుతున్న మహిళలలో ఇది కనిపించవచ్చు. మహిళల్లో ఇతర హార్మోన్ల మార్పుల కారణంగా, వాటికి చూపే ప్రతిచర్యగా ఇవి సంభవించవచ్చు. అనేక అంశాలు స్త్రీ హార్మోన్ స్థాయిలలో మార్పుకు దారి తీయవచ్చు, వీటిలో:

    • ఋతు చక్రం
    • గర్భనిరోధక మాత్రలు
    • మెనోపాజ్
    • ఇతర రుగ్మతలు

    చనుమొన రంధ్రాలు ఇంకా నాళాలలో అవరోధమేర్పడటం (Blocked nipple pores and ducts in Telugu)

    వక్షోజాలలోని క్షీర గ్రంధులలో పాలు నిల్వ చేయబడతాయి. ఇంకా చనుమొనలపై ఉన్న రంధ్రాలు ఈ నాళాలకు ప్రవేశ ద్వారాలు.

    పాలిచ్చే తల్లికి చనుమొనల నాళాలు లేదా రంధ్రాలు పాలతో మూసుకుపోయినట్లయితే, పాలు నిలిచిపోతాయి. ఎంతకాలం ఇలా అవరోధం ఉంటుందనే దానిపై ఈ పరిస్తితి ఆధారపడి ఉంటుంది. అంతేకాక ఇతర లక్షణాలు కూడా పొడచూపుతాయి ఇంకా వాటికి చికిత్స చేసే అవసరం రావొచ్చు.

    1. మూసుకుపోయిన రంధ్రాలు (Blocked pore)

    చనుమొనలపై రంధ్రాలు మూసుకుపోవడం వల్ల తరచుగా చనుమొనలపై తెల్లటి మచ్చలు ఏర్పడుతాయి. వీటిని బ్లేబ్ అని కూడా అంటారు.

    ఈ రంధ్రాలలో అవరోధం వల్ల అసౌకర్యం కలిగినప్పటికీ.. తరువాత పాలు పట్టే సమయంలో శిశువు చూషణతో అవి సులభంగా తొలగించబడతాయి.

    2. పాల పొక్కులు (Milk blister)

    మూసుకుపోయిన చనుమొన రంధ్ర ద్వారం పై చర్మం ఏర్పడినప్పుడు పాల పొక్కులు ఏర్పడతాయి. అనేక సందర్భాల్లో.. తెల్లటి పొక్కుల చుట్టుపక్కల ప్రాంతం ఎరుపుగా మారి నొప్పిని ఇంకా చికాకుని కలిగిస్తుంది.

    3. క్షీరవాహికలలో అవరోధమేర్పడటం (Blocked duct)

    చనుమొనలలోని రంధ్రాలలో అవరోధమేర్పడినపుడు క్షీరగంధుల నుండి పాల వాహిక వైపు వాపు ఇంకా అందులో అడ్డంకి ఏర్పడవచ్చు. చనుమొన రంధ్రం మూసుకుపోయినప్పుడు, దాని కింద ఒక గడ్డలా మారి వాపు ఏర్పడవచ్చు. అందువల్ల నొప్పి లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. దీనితో తల్లి పాలు పట్టడం కాస్తా కష్టతరంగా మారుతుంది. మూసుకుపోయిన ఈ నాళాలకు తక్షణమే చికిత్స చేయకపోతే, అది మాస్టిటిస్ ఇంకా రొమ్ము గడ్డల వంటి సమస్యలను కలిగిస్తుంది.

    చనుమొనలపై తెల్లటి మచ్చలను కలిగించే ఇన్ఫెక్షన్ (Infection that causes white spots on the nipples in Telugu)

    చనుమొనలపై తెల్లటి మచ్చలు కనిపించడం సాధరణంగా తక్కువ సార్లు ఉంటుంది. అయితే ఇది ఇన్ఫెక్షన్ వల్ల సంభవించవచ్చు. బాక్టీరియా, వైరస్లు లేదా శిలీంధ్రాలు ఇలాంటి ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు. చనుమొన ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఎవరికైనా ఉన్నప్పటికీ, పాలిచ్చే తల్లులు ఇంకా వ్యాధినిరోధక శక్తి లోపించన వారు దీనివల్ల ప్రమాదపు బారిన పడే అవకాశం ఎక్కువ. హెర్పెస్, సబ్ఏయోలార్ అబ్సెసెస్ ఇంకా థ్రష్‌తో(బొబ్బలు) సహా కొన్ని ఇన్ఫెక్షన్‌లు చనుమొనలపై తెల్లటి మచ్చలకు కారణమవుతాయి.

    1. హెర్పెస్ (Herpes)

    హెర్పెస్ ఇన్ఫెక్షన్ హెర్పెస్ సింప్లెక్స్ అనే వైరస్ వల్ల వస్తుంది. బిడ్డకు తల్లి జనన మార్గము నుండి హెర్పెస్‌ సంక్రమణ జరుగుతుంది. అది శిశువు పెదవులు ఇంకా కళ్ళకు వ్యాపిస్తుంది. ఫలితంగా.. బిడ్డకు పాలు పట్టడం వల్ల తిరిగి తల్లికి సోకే ప్రమాదం ఉంది. హెర్పెస్ లక్షణాలలో ఇవి ద్రవంతో నిండిన బొబ్బలుగా కనబడి ఇంకా అవి పగిలిన తర్వాత చీము పొక్కులుగా మారుతాయి.

    2. సబ్ఏరియోలార్ అబ్సెసెస్ (Subareolar abscesse)

    సబ్ఏరియోలార్ అబ్సెస్‌లు అనేది బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ల వల్ల రొమ్ము కణజాలంలో చీము చేరే వ్యాధి. అవి అసాధారణమైనవి మరియు తరచుగా సరిగ్గా చికిత్స చేయని మాస్టిటిస్‌గా తిరగబడే అవకాశముంది.

    మొటిమలు లేదా చనుమొనలపై కుట్టడానికి ఛిద్రం చేసినపుడు అయిన గాయం ద్వారా రొమ్ము కణజాలంలోకి ప్రవేశించే సూక్ష్మజీవుల వల్ల ఈ గడ్డలు ఏర్పడుతాయి. అయితే ఇవి సాధారణంగా తల్లిపాలు పట్టే దానితో సంబంధం కలిగి ఉండవు. సబ్‌ఏరియోలార్ చీము గడ్డ వల్ల చర్మం రంగు మారి ఇంకా వాపు కలిగిన బాధ కలిగించే గడ్డ ఏర్పడుతుంది.

    3. త్రష్(బొబ్బలు లేదా పొక్కులు) (Thrush)

    ఫంగల్ ఇన్ఫెక్షన్ యోనిపై పొక్కులు ఏర్పడేందుకు కారణమవుతుంది. దీనిని సాధారణంగా ఈస్ట్ ఇన్ఫెక్షన్ అని పిలుస్తారు. నోటిలో ఇలాంటి పొక్కులు ఉన్న పిల్లలు పుట్టిన వెంటనే తల్లిపాలు తాగితే వారి తల్లుల చనుమొనలకు ఈ సంక్రమణ వ్యాప్తి చెందుతుంది.

    థ్రష్ లక్షణాలలో తెల్లటి దద్దుర్లు ఇంకా చనుమొనలపై బాధాకరమైన మరియు ఎర్రబడి వాచిన చర్మం ఉంటాయి.

    చనుమొనలపై తెల్లటి మచ్చలు ఏర్పడే అరుదైన కారణాలు (Rare causes of white spots on the nipples in Telugu)

    చనుమొనలపై తెల్లటి మచ్చలను అరుదుగా కలిగించే సాధారణ కారణాలు ఇలా ఉంటాయి, అవి:

    1. బొల్లి (Vitiligo)

    శరీర చర్మంలోని వర్ణద్రవ్యం కలిగిన కణాలను నశింపజేసే స్వయం ప్రతిరక్షక(ఆటోఇమ్యూన్) వ్యాధి.

    2. పాగెట్స్ వ్యాధి (Paget's disease)

    రొమ్ము క్యాన్సర్లలో ఇది అరుదైన రకం, ఇది ఏరియోల ఇంకా చనుమొనలలో మొదలవుతుంది ఇంకా తామర వంటి లక్షణాలను కలిగిస్తుంది.

    డాక్టరు గారిని ఎప్పుడు సంప్రదించాలి (When to visit the doctor in Telugu)

    పాలిచ్చే తల్లులకు చనుమొనలపై తెల్లటి మచ్చలు ఉండవచ్చు. అయినప్పటికీ.. ఇవి సాధారణంగా బిడ్డకు పాలుపట్టేందుకు సంబంధించినవి ఇంకా బిడ్డకు పాలు పట్టిన తర్వాత కనబడకుండా పోతాయి. ఈ సమస్య అలాగే కొనసాగితే, శిశువుకు తరచుగా పాలు పట్టడం లేదా వారు స్నానం చేసేటప్పుడు శుభ్రమైన తడి బట్టతో చనుమొనలపై మసాజ్ చేయడం వంటి కొన్ని ఇంట్లో చేయగలిగే చికిత్సలను ప్రయత్నించవచ్చు.

    • ఒక వారంపాటు ఆ మచ్చలు అలాగే ఉన్నా లేదా పాలిచ్చే తల్లి నొప్పితో బాధపడుతూ ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. పాలిచ్చే తల్లికి ఇలా అనిపిస్తే కూడా వైద్యుడిని సంప్రదించాలి:
    • చనుమొనల నుండి పాలు కాకుండా ఇంకేవైన స్రావాలు ఉన్నప్పుడు
    • చదునుగా ఉన్న లేదా లోపలికి ముడుచుకొని ఉన్న చనుమొనలున్నప్పుడు
    • రొమ్ములో గడ్డలా తగులుతున్నప్పుడు
    • జ్వరంతో అనారోగ్యం కలిగినప్పుడు
    • చనుమొనపై పొలుసులు/పొక్కులు కనిపించినప్పుడు

    ముగింపు (Conclusion)

    ఏరియోలా ఇంకా చనుమొనలపై తెల్లటి మచ్చలు గర్భధారణలో ఇంకా పాలు పట్టేటప్పుడు సాధారణం. అయినప్పటికీ.. కొన్ని మచ్చలు ఇన్ఫెక్షన్ వంటి తీవ్రమైన రుగ్మతలను సూచించేవి కావచ్చు. ఏరియోలా లేదా చనుమొనలలో మార్పుల వల్ల ఆందోళన చెందుతున్న వారు డాక్టరుగారిని సంప్రదించడం ఎంతో మంచిది.

    References

    1. Berens, P., & Brodribb, W. (2016). Engorgement. Breastfeeding Medicine

    2. Doucet, S., Soussignan, R., Sagot, P., & Schaal, B. (2009). The secretion of areolar (Montgomery's) glands from lactating women elicits selective, unconditional responses in neonates. PLOS

    3. Zucca-Matthes, G., Urban, C., & Vallejo, A. (2016). Anatomy of the nipple and breast ducts. Gland Surgery

    Tags

    What is White Spots on Nipple in Telugu, What are the causes of White Spot on Nipple in Telugu, What are the symptoms of White Spots on Nipple in Telugu, Treatment of White Spots on Nipple in Telugu, White Spots on Nipple: Causes, Symptoms, and Treatments in English, White Spots on Nipple: Causes, Symptoms, and Treatments in Hindi, White Spots on Nipple: Causes, Symptoms, and Treatments in Tamil, ⁠White Spots on Nipple: Causes, Symptoms, and Treatment in Bengali

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Swetha Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.