This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

గర్భవతిగా ఉన్నప్పుడు ఆహారంలో చిరుధాన్యాలని తినడం వలన వచ్చే లాభాలు | Benefits of Millet During Pregnancy in Telugu

Written by - Kakarla SirishaLast updated: Nov 3, 2023
గర్భవతిగా ఉన్నప్పుడు ఆహారంలో చిరుధాన్యాలని తినడం వలన వచ్చే లాభాలు | Benefits of Millet During Pregnancy in Telugu
Likes1 Likes|
Read time7 min

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళల డైట్ సమతుల్యంగా, పోషకాలతో నిండి ఉండాలి.గర్భవతిగా ఉన్న మహిళల ఆహారంలో చిరుధాన్యాలని కూడా చేర్చడం చాలా ముఖ్యం. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ B6 అలాగే ఇతర అవసరమైన విటమిన్లు ఎక్కువగా ఉండే చిరుధాన్యాలు, కడుపుతో ఉన్న సమయంలో, అది కూడా ఆరోగ్యం పట్ల ఎక్కువ ధ్యాస ఉండే మహిళలలో ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వలన వీటిని డయాబెటిస్ ఉన్నవారు కూడా తినవచ్చు.ఈ బ్లాగు పోస్టు ప్రెగ్నెన్సీ సమయంలో చిరుధాన్యాలని తినటం వలన వచ్చే లాభాలను, అలాగే మీ రోజువారీ భోజనంలో వాటిని సహజంగా ఎలా జత చేయవచ్చో తెలుపుతుంది.

చిరుధాన్యాలు అంటే ఏమిటి? ( What is Millet in Telugu)

చిరుధాన్యాలు అంటే చిన్నగా, గుండ్రంగా ఉండే ధాన్యం గింజలు, ఇవి చాలా ఆఫ్రికా ఇంకా ఆసియా దేశాలలో ప్రాచుర్యం పొందాయి. వీటిల్లో విటమిన్లు అలాగే ఖనిజలవణాలు, పీచుపదార్థం ఎక్కువగా ఉంటాయి. చిరుధాన్యాలలో కొవ్వు పదార్థం ఇంకా కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి, వీటి కారణంగా గర్భవతి మహిళలకి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.

గర్భవతి మహిళలకి ఒంట్లో సాధారణంగా ఫోలిక్ యాసిడ్ స్థాయిని నిర్దేశించిన విధంగా నిలబెట్టుకోవాలని సలహా ఇస్తూ ఉంటారు. ఫోలిక్ యాసిడ్ మెదడు ఇంకా వెన్నెముకకి సంబంధించి పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడంలో సాయపడుతుంది. ఐరన్ కూడా గర్భవతి మహిళలకి ముఖ్యం ఎందుకంటే అది రక్తహీనతను నివారించడంలో సాయపడుతుంది. ఒకవేళ రక్తహీనత వస్తే అది ప్రెగ్నెన్సీని మరింత కష్టతరం చేయవచ్చు అలాగే ప్రసవం సమయంలో సమస్యలకు కూడా దారితీసేలా చేయవచ్చు. ఫోలిక్ యాసిడ్ ఇంకా ఐరన్ రెండూ ఎక్కువగా ఉండే చిరుధాన్యాలని వండుకోవడం కూడా సులభమే. వీటిని సూప్లు, పులుసులు లేదా కాసెరోల్స్ కి జతచేయవచ్చు. వీటిని పోరిడ్జ్ లేదా పిలాఫ్ గా కూడా తినవచ్చు. చిరుధాన్యాలని చాలా రకాలుగా తినవచ్చు, అందుకని ప్రెగ్నెన్సీ సమయంలో ఆరోగ్యకర డైట్లో భాగంగా రకరకాల వంటకాలలో ఆస్వాదించవచ్చు.

చిరుధాన్యాల యొక్క పోషక విలువ (Nutritional Value of Millet in Telugu)

  • ప్రెగ్నెన్సీ సమయంలో చిరుధాన్యాలని తినడం వలన పోషకాల యొక్క పవర్ హౌస్ ని మీ వద్ద నిర్మించుకున్నట్టే. ఇవి చాలా ఆరోగ్య లాభాలని అందిస్తాయి. వీటిల్లో పీచుపదార్థం, విటమిన్లు, ఖనిజలవణాలు ఇంకా యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. చిరుధాన్యాలు అందించే పోషకవిలువలు అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో వాటి ద్వారా రాగలిగే ఆరోగ్య లాభాల గురించి ఇక్కడ చదవండి:
  • పీచుపదార్థం: చిరుధాన్యాలు పీచుపదార్థానికి మంచి వనరు అని చెప్పవచ్చు. అది జీర్ణక్రియ క్రమబద్ధీకరణని ప్రోత్సహించడంలో సాయపడుతుంది అలాగే మలబద్దకాన్ని కూడా నివారిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడానికి కూడా ఇవి చాలా ముఖ్యం.
  • విటమిన్లు: చిరుధాన్యాలలో థయామిన్, రిబోఫ్లేవిన్, నియాసిన్ అలాగే ఫోలిక్ యాసిడ్ వంటి అవసరమైన విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ విటమిన్లు గర్భవతిగా ఉన్న మహిళల శరీరాలలో ముఖ్యమైన పాత్రని పోషిస్తాయి, శక్తిని ఉత్పత్తి చేస్తాయి, కణాల ఎదుగుదలకి సపోర్టుని ఇస్తాయి.
  • ఖనిజ లవణాలు: చిరుధాన్యాలలో ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం వంటి ఖనిజలవణాలు ఎక్కువగా లభిస్తాయి. ఈ ఖనిజలవణాలు రక్తం ఉత్పత్తి కావటం, శక్తి ఉత్పత్తి కావటం, అలాగే కండరాల సంకోచ వ్యాకోచాలతో సహా శరీరంలో జరిగే వివిధ ప్రక్రియలలో పాల్గొంటాయి.
  • యాంటీఆక్సిడెంట్లు: చిరుధాన్యాలలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్ వలన ఒంటికి కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో సాయపడతాయి. ప్రెగ్నెన్సీ సమయంలో శరీరం ఎక్కువగా ఒత్తిడికి గురైనప్పుడు ఈ పని జరగటం చాలా ముఖ్యం.
  • మొత్తం మీద, చిరుధాన్యాలు గర్భవతిగా ఉన్న మహిళలకి పోషకాలకి సంబంధించిన గొప్ప వనరుగా చెప్పవచ్చు. పిండం ఆరోగ్యంగా ఎదగటానికి అవసరమయ్యే ముఖ్యమైన విటమిన్లు ఇంకా ఖనిజలవణాలని ఇవి అందిస్తాయి. వీటిలో పీచుపదార్థం అలాగే యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి, ఇవి ఆరోగ్యం మొత్తంమీద నిలకడగా ఉండటానికి సాయం చేస్తాయి.

చిరుధాన్యాలు మరియు ప్రెగ్నెన్సీ (Millets and Pregnancy in Telugu)

ప్రెగ్నెన్సీ అనేది తల్లీబిడ్డలు ఇద్దరికీ చాలా ముఖ్యమైన సమయం, ఇందులో ఆహారం అనేది ఇద్దరి యొక్క ఎదుగుదలలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. చిరుధాన్యాలు ఎక్కువ పోషక విలువలు ఉండే, గ్లూటెన్ లేని ధాన్యపు గింజలని చెప్పవచ్చు, ఇవి ప్రెగ్నెన్సీ సమయంలో చాలా లాభాలని అందిస్తాయి. వీటిల్లో విటమిన్లు, ఖనిజలవణాలు అలాగే యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి, ఇవి గర్భం దాల్చిన మహిళకి, తనలో ఎదుగుతున్న బిడ్డ ఇద్దరి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా, చిరుధాన్యాలు పీచుపదార్థానికి కూడా మంచి మూలం. ఇవి ప్రెగ్నెన్సీ సమయంలో మలబద్ధకం ఇంకా ఇతర అజీర్ణ సమస్యలని నివారించటంలో సాయం చేస్తాయి. ప్రెగ్నెన్సీ సమయంలో మీ ఆహారంలో చిరుధాన్యాలను జత చేయడం వల్ల మీకు అలాగే మీ బిడ్డకి ఈ దశలో కావలసిన పోషకాలను పొందుతున్నారని నిర్థారించుకోవచ్చు. కడుపుతో ఉన్నప్పుడు మీ ఆహారంలో చిరుధాన్యాలను చేర్చడం గురించి మీరు మీ డాక్టరుతో మాట్లాడవచ్చు.

గర్భవతిగా ఉన్నప్పుడు సజ్జలు (పెర్ల్ మిల్లెట్) తినడం (Pearl millet during pregnancy in Telugu)

గర్భవతిగా ఉన్నప్పుడు సజ్జలు తినటం వలన చాలా లాభాలు ఉంటాయి. చిరుధాన్యాలలో చాలా విరివిగా పండించే రకమైన సజ్జలు (పెర్ల్ మిల్లెట్) ఫోలిక్ యాసిడ్ కి గొప్ప వనరు అని చెప్పవచ్చు. ఇది పుట్టబోయే బిడ్డలో న్యూరల్ ట్యూబ్ పెరగటానికి ముఖ్యమైనది. అలాగే సజ్జలలో హెమోగ్లోబిన్ ఉత్పత్తికి ముఖ్యమైన ఐరన్ కూడా ఎక్కువగా లభిస్తుంది. గర్భవతిగా ఉన్నప్పుడు సజ్జలు మెగ్నీషియం అందించే గొప్ప మూలం అని చెప్పవచ్చు, ఇది కండరాలు విశ్రాంత స్థితిలోకి రావటానికి ముఖ్యం.

గర్భవతిగా ఉన్న మహిళల ఆరోగ్యానికి చిరుధాన్యాల వలన కలిగే లాభాలు (Millet benefits for pregnant women's health in Telugu)

చిరుధాన్యాలు ఎక్కువ పోషకాలు ఉండే ధాన్యం, ఇవి గర్భవతిగా ఉన్న మహిళలకి చాలా లాభాలని అందిస్తాయి. ఇవి ఫోలిక్ యాసిడ్ దొరికే మంచి ఆహార పదార్థం, ఫోలిక్ యాసిడ్ న్యూరల్ ట్యూబ్ అభివృద్ధికి అవసరమైనది. చిరుధాన్యాలలో ఎక్కువ స్థాయిలో మెగ్నీషియం కూడా ఉంటుంది, అది కండరాలు ఇంకా నరాలు సరిగ్గా పనిచేయడానికి అవసరం. అంతేకాకుండా, చిరుధాన్యాలలో ఐరన్, విటమిన్ B కూడా ఎక్కువగా లభిస్తాయి, ఇవి శక్తిని ఉత్పత్తి చేయడానికి అలాగే ఎర్ర రక్త కణాల నిర్మాణానికి ముఖ్యమైనవి.

గర్భవతిగా ఉన్నప్పుడు చిరుధాన్యాలు తినడం వలన వచ్చే సైడ్ ఎఫెక్టులు (Side Effects of Millet During Pregnancy in Telugu)

ప్రెగ్నెన్సీ సమయంలో చిరుధాన్యాల వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్టులు ఉండవు. ఈ పోషకాలు ఎక్కువగా ఉండే ధాన్యం ఐరన్ ఇంకా విటమిన్ B6తో సహా ఇతర ముఖ్యమైన పోషకాలకు మంచి మూలం. చిరుధాన్యాలలో పీచుపదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది ఇంకా కేలరీలు తక్కువగా ఉంటాయి, అందుకని ఇవి గర్భవతిగా ఉన్న మహిళలకి ఆరోగ్యకరమైన ఆహార ప్రత్యామ్నాయం. ఏది ఎలా ఉన్నా, అన్ని ఆహార గ్రూపులలాగానే, చిరుధాన్యాలను మితంగా తినడం అలాగే మీ డైట్లో వాటిని చేర్చుకునేముందు డాక్టరుని సంప్రదించడం చాలా ముఖ్యం.

చివరిమాట (Conclusion)

చివరగా, ప్రెగ్నెన్సీ సమయంలో చాలా పోషకాలు ఉండే తృణధాన్యాలు అయిన చిరుధాన్యాలు తినడం, గర్భవతిగా ఉన్న మహిళల ఆహారంలో గొప్ప భాగంగా ఉంటుంది. వాటిల్లో ఉండే ఎక్కువ పీచుపదార్థం ఇంకా పోషకాలు జీర్ణక్రియ ఆరోగ్యంగా జరగటాన్ని ప్రోత్సహించడానికి, పిండం ఎదుగుదలకి సపోర్టు అందించడానికి అలాగే కొన్ని ప్రెగ్నెన్సీ సంబంధిత సమస్యలను నివారించడంలో సాయపడటానికి అద్భుతమైన ప్రత్యామ్నాయంగా పనికొస్తాయి. కాబట్టి మీరు మీ ప్రెగ్నెన్సీ ప్రయాణంలో ఆరోగ్యకరమైన అలాగే పోషకాలతో నిండిన స్నాక్స్ గురించి మరింత సమాచారం కోసం వెతుకుతున్నట్లయితే, ఇలాంటి మరిన్ని సమాచార సంబంధిత బ్లాగుల కోసం మైలోఫ్యామిలీ సైట్ ను సందర్శించండి.

1. Huybregts, L. F., Roberfroid, D. A., Kolsteren, P. W., & Van Camp, J. H. (2009). Dietary behaviour, food and nutrient intake of pregnant women in a rural community in Burkina Faso. Maternal & Child Nutrition

2. Nguyen, P. H., Kachwaha, S., Tran, L. M., Sanghvi, T., Ghosh, S., Kulkarni, B., Beesabathuni, K., Menon, P., & Sethi, V. (2021). Maternal Diets in India: Gaps, Barriers, and Opportunities. Nutrient

Tags

What is Millet in Telugu, What are the nutritional value of Millet in Telugu, Millet Benefits during pregnancy in Telugu, Side effects of Millet during pregnancy in Telugu, Benefits of Millet During Pregnancy in English, Benefits of Millet During Pregnancy in Hindi, Benefits of Millet During Pregnancy in Tamil, Benefits of Millet During Pregnancy in Bengali

Is this helpful?

thumbs_upYes

thumb_downNo

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Mylo App Banner

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Apple App StoreGoogle Play Store
Apple App StoreGoogle Play Store

Helpful Tools & Calculators

undefined icon
Make Baby Sleep
Play white noise & sleep music
arrow_right
undefined icon
Mylo Store
Shop for mom & baby
arrow_right
undefined icon
Baby Diet Chart
Age-wise food plans for baby
arrow_right
undefined icon
My Calendar
Predict periods & record symptoms
arrow_right
undefined icon
Vaccination Tracker
Never miss a vaccine date
arrow_right
undefined icon
Zordar Dadi Ke Nuskhe
Gharelu nushke that work
arrow_right
undefined icon
Feeding Tracker
Baby's feeding schedule made easy
arrow_right
undefined icon
Baby Names
Search names with meanings
arrow_right
undefined icon
Save Memories
Store baby's photos & firsts
arrow_right
undefined icon
Pregnancy Calendar
See baby growth week by week
arrow_right
undefined icon
Mamasutra
Safe positions for pregnancy
arrow_right
undefined icon
Pregnancy Diet Chart
Trimester & region-wise diet plan
arrow_right
undefined icon
Weight Tracker
Monitor your weight
arrow_right
undefined icon
Pill Reminder
Get reminded for medicines
arrow_right
undefined icon
Ovulation Calendar
Know your monthly cycle
arrow_right
Kakarla Sirisha
Kakarla Sirisha

Related Articles

Questions about this article

  • Asked by 28 weeks pregnant

    Naku eppudu 7 months baby moments teliyadam ledhu...

  • Asked when 35 weeks pregnant

    Hi I'm 34 weeks 3 days pregnant repu 9th month start avtadi naku eroju mrng milky white discharge iendi problem em undadu kada

  • Asked when 39 weeks pregnant

    Hii all Naku ee month(april19) delivary date echinchindi bt Naku pottalo right side pain vastundi nyt nundi akkuvaga m aina pblm sis chepara konchem urgent plz

  • Asked when 34 weeks pregnant

    Hii 34 weeks how many months

  • Asked when 14 weeks pregnant

    Naku eppudu 4th month raw rice thinalanye vude no problem or problem please tell me

Related Topics

Recently Published Articles

Your body needs extra nutrition this trimester - these can help.

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.