

Pregnancy
12 January 2026 న నవీకరించబడింది
ఎపిథీలియల్ కణాలు అనేవి మీ శరీరాన్ని లోపలి నుంచి మరియు బయటి నుంచి కప్పి ఉంచుతాయి. వివిధ రకాల వైరస్ల నుంచి మీ శరీరాన్ని కాపాడుతాయి. ఎపిథీలియల్ కణాలు చర్మం, జీర్ణవ్యవస్థ, రక్తనాళాలు, మూత్ర నాళాలు మొదలయిన అవయవాలలో కనిపిస్తాయి. మూత్రనాళాల్లో పరిమిత సంఖ్యలో ఎపిథీలియల్ కణాలు ఉండడం సహజం. కానీ ఎక్కువ సంఖ్యలో ఎపిథీలియల్ కణాలు మూత్రనాళాల ఇన్ఫెక్షన్, కిడ్నీ వ్యాధులు లేదా ఇతర అనారోగ్య పరిస్థితికి కారణం.
మూత్రంలో కొన్ని ఎపిథీలియల్ కణాలు ఉండడం పూర్తి సాధారణం. ఏదేమైనా మూత్రంలో సాధారణం కంటే అధిక మోతాదులో ఎపిథీలియల్ కణాలు ఉండడం ఏదైనా మూత్ర ఇన్ఫెక్షన్, మూత్రపిండాల వ్యాధి లేదా ఇతర ఏదైనా వ్యాధికి సంకేతం కావొచ్చు. అటువంటి పరిస్థితుల్లో మూత్రపరీక్ష చేయమని డాక్టర్ సిఫారసు చేస్తారు. ఎపిథీలియల్ కణాలు సాధారణ స్థితిలోనే ఉన్నాయా? లేదా? అని కణాలు తనిఖీ చేయబడతాయి.
కొన్ని సార్లు శుభ్రపరచని కప్పులో మీ మూత్ర నమూనా సేకరించడం ద్వారా అది కలుషితం అవుతుంది. కొన్ని సందర్భాలలో మూత్రంలో ఎపిథీలియల్ కణాలు శుభ్రం చేయని జననాంగాల కారణంగా కూడా ఉంటాయి. ఇటువంటి సందర్భంలో మూత్ర నమూనా కలుషితమైతే ఖచ్చితమైన ఫలితాన్ని పొందేందుకు మరోసారి పరీక్ష చేయించుకోండి.
ఎక్కువ సార్లు మూత్రంలో అధిక ఎపిథీలియల్ కణాలు ఉన్నట్లయితే అది మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల(యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్) వల్ల వస్తుంది. కొన్ని సార్లు సూక్ష్మజీవుల ఉనికి కూడా ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో శ్లేష్మ తీగలు కూడా ఉంటాయి.
ఏవైనా మూత్రపిండ సమస్యలు ఉంటే.. మూత్రం నమూనాలో ఎపిథీలియల్ కణాల గొట్టపు లేదా స్తంభ ఆకారాలు గమనించబడతాయి. స్తంభాలు, గొట్టపు ఆకారంలో ఉండే కణాలు మూత్రపిండాలలో సాధారణంగా కనిపిస్తాయి. మూత్రపిండాల పనితీరు మీద ప్రభావం చూపెట్టే తీవ్రమైన వ్యాధికి సంకేతం కావొచ్చు.
మూత్రంలో మూడు రకాల ఎపిథీలియల్ కణాలు ఉంటాయి. అవి పొలుసుల ఎపిథీలియల్ కణాలు: ఈ కణాలు చాలా పెద్దవిగా ఉంటాయి. ఇవి సాధారణంగా యోని, మూత్రనాళంలో కనిపిస్తాయి. ఇవి సాధారణంగా కాలుష్యం కారణంగా కనిపిస్తాయి. మూత్రపిండ గొట్టపు కణాలు: ఈ కణాల పరిమాణంలో కనుక పెరుగుదల ఉంటే అది మూత్రపిండాల రుగ్మతను సూచిస్తుంది. ట్రాన్సిషనల్ (పరివర్తన) ఎపిథీలియల్ కణాలు: ఈ కణాలు మగవారి మూత్రాశయం, మూత్రపిండ పెల్విక్ (కటి) నుంచి వస్తాయి. కొన్ని సార్లు వృద్ధుల మూత్రాశయంలో కనిపిస్తాయి. ఈ కణాలు అధిక పరిమాణంలో ఉండడం UTI(యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్–– మూత్రవ్యవస్థలోని ఏదైనా భాగం చెడిపోవడం)కి సంకేతం కావొచ్చు.
రొటీన్ చెకప్‌లో భాగంగా యూరిన్ ఎపిథీలియల్ పరీక్ష నిర్వహిస్తారు. ఒక వ్యక్తికి యూరినరీ ఇన్ఫెక్షన్, కిడ్నీలు పని చేయకపోవడం వంటి సమస్యలు ఉంటే ఈ పరీక్ష చేయించుకోమని డాక్టర్ రికమెండ్ చేస్తారు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీలో వెన్నునొప్పి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?
ఫలితాలు ఎక్కువగా అధిక స్థాయిల్లో ఉన్నట్లు గుర్తించబడతాయి.
సహజంగా ఎపిథీలియల్ కణాలు శరీరం నుంచి తొలగించబడతాయి. మూత్రంలో కొన్ని పొలుసుల (చేపల పొలుసుల వలే ఉండే కణాలు) కణాలు ఉండడం సహజం. కానీ మూత్రంలో అధిక మోతాదులో ఎపిథీలియల్ కణాలు (HPF కు 15 కంటే ఎక్కువ టూబులర్ కణాలు) ఈ కింది వాటిని సూచిస్తాయి.
పరీక్ష ఫలితాలు సాధారణ పరిస్థితిలో లేకుంటే చికిత్స అవసరమయ్యే పరిస్థితి ఉందని అర్థం. ఇంకా కొన్ని పరీక్షలు చేయించుకుంటే సరైన రోగనిర్ధారణ వస్తుంది. ఫలితాల వివరణ కోసం వైద్యుడిని సంప్రదించండి.
మూత్రంలో ఎపిథీలియల్ కణాల సాధారణ స్థాయి అధిక శక్తి కేంద్రానికి (HPF) 15 నుంచి 20 కంటే తక్కువగా ఉంటుంది.
ఒక వ్యక్తి తన మూత్రంలో అధిక సంఖ్యలో ఎపిథీలియల్ కణాలను కలిగి ఉంటే.. వారు కింది అనారోగ్య ప్రమాదాలను కలిగి ఉండే అవకాశం ఉంది.
చికిత్స అనేది మన మూత్రంలో ఉన్న ఎపిథీలియల్ కణాల స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. మూత్రంలో అధిక స్థాయిలో ఎపిథీలియల్ కణాలు ఉండేందుకు ఒక కారణం UTI(యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్–– మూత్రవ్యవస్థలోని ఏదైనా భాగం చెడిపోవడం). UTI చికిత్సలో యాంటీబయాటిక్స్, యాంటీవైరల్ మందులు ఉంటాయి. మూత్రపిండాల వ్యాధికి మూలకారణాన్ని బట్టి వివిధ రకాల చికిత్సలు ఉన్నాయి. జీవనశైలిలో మార్పులు, బరువు తగ్గడం, ప్రతి రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటివి సిఫారసు చేయబడ్డాయి.
అధిక స్థాయి ఎపిథీలియల్ కణాలకు కారణమయ్యే పరిస్థితులను నివారించేందుకు హైడ్రేటెడ్‌గా ఉండడం చాలా ముఖ్యం. రోజుకు అనేక గ్లాసుల నీటిని తాగడం ఉపయోగకరంగా ఉంటుంది. క్రాన్బెర్రీ (బెర్రీలలో ఒక రకమైనవి) జ్యూస్‌లో అనేక యాంటీ యాక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి మూత్రపిండాల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. UTI(యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్–– మూత్రవ్యవస్థలోని ఏదైనా భాగం చెడిపోవడం) తగ్గించుకునేందుకోసం వీటిని చాలా మంది ఇంటి నివారణలుగా (హోమ్ రెమిడీస్) ఉపయోగిస్తారు.
మూత్ర పరీక్ష చేసినపుడు మూత్రంలో ఎపిథీలియల్ కణాలను చూపిస్తే అది కలుషితమైన నమూనా కావొచ్చు. మూత్రంలో ఎపిథీలియల్ కణాల పెరుగుదల UTI(యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్–– మూత్రవ్యవస్థలోని ఏదైనా భాగం చెడిపోవడం) లేదా కిడ్నీ సమస్యలకు సంకేతం. UTI లక్షణాలు లేదా ఏవైనా కిడ్నీ సమస్యలు ఉంటే పూర్తి వివరాల కోసం వైద్యుడిని సంప్రదించాలి. కేవలం వైద్యుడు మాత్రమే ఫలితాలను అర్థం చేసుకుని.. తదుపరి చికిత్సను నిర్ణయించగలడు. రోగనిర్ధారణ ఎంత త్వరగా జరిగితే... లక్షణాలను తగ్గించేందుకు చికిత్స అంత వేగంగా ఉంటుంది
Tags
Epithelial Cells in Urine in English, Epithelial Cells in Urine in Hindi, Epithelial Cells in Urine in Bengali, Epithelial Cells in Urine in Tamil
Yes
No

Written by
Dhanlaxmi Rao
Get baby's diet chart, and growth tips











శిశువులు ఎప్పుడు కంటిచూపుని కలుపుతారు (When Do Infants Make Eye Contact in Telugu)?

సర్వైకల్ మ్యూకస్ మెథడ్ (గర్భాశయ శ్లేష్మం పద్ధతి) అంటే ఏమిటి & ఎలా తనిఖీ చేయాలి?

త్రైమాసికాల(ట్రైమిస్టర్) వారీగా గర్భధారణ వ్యాయామం

మెలితిరిగిన చనుమొనలు- ఒక పరిశీలన|Inverted Nipples: Causes, Treatment and More in Telegu

గర్భధారణ సమయంలో జుట్టు రాలడం: కారణాలు మరియు చికిత్స

గర్భధారణ సమయంలో పీచ్ (మకరంద పండ్లు) తినడం వలన కలిగే ప్రయోజనాలు, ప్రభావాలు (Peach In Pregnancy Benefits & Effects in Telugu)