hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore

Lowest price Ever for Children's Day! Use Code: FIRST10

ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Pregnancy Journey arrow
  • గర్భధారణ సమయంలో ఎండుద్రాక్ష (కిస్​మిస్​) తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు, ప్రమాదాలు, సైడ్ ఎఫెక్ట్స్ arrow

In this Article

    గర్భధారణ సమయంలో ఎండుద్రాక్ష (కిస్​మిస్​) తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు, ప్రమాదాలు, సైడ్ ఎఫెక్ట్స్

    Pregnancy Journey

    గర్భధారణ సమయంలో ఎండుద్రాక్ష (కిస్​మిస్​) తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు, ప్రమాదాలు, సైడ్ ఎఫెక్ట్స్

    3 November 2023 న నవీకరించబడింది

    గర్భధారణ సమయంలో ఎండుద్రాక్ష (కిస్​మిస్​) తినడం సురక్షితమేనా? అని చాలా మంది గర్భవతులకు సందేహం ఉంటుంది. నిశ్చింతగా గర్భిణీ స్త్రీలు ఎండు ద్రాక్ష (కిస్​మిస్​) తినొచ్చు. వారికి ఇది ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. సరైన పోషణ కోసం మరియు దాని ప్రయోజనాలను అనుభవించేందుకు ఎండు ద్రాక్షను (కిస్​మిస్​) మీరు తీసుకునే ఆహారంలో చేర్చండి. గర్భధారణ సమయంలో ఎండుద్రాక్ష (కిస్​మిస్) తీసుకోవడం సురక్షితం. అయితే దీనిని మితంగా తినడం చాలా అవసరం. ఎండుద్రాక్ష(కిస్​మిస్​) అధికంగా తినడం వల్ల మలబద్దకం లేదా ఇతర జీర్ణాశయాంతర సమస్యలు ఉత్పన్నం అవుతాయి.

    ఎండుద్రాక్ష (కిస్​మిస్​)లో ఉండే పోషకాలు

    ఎండు ద్రాక్ష (కిస్​మిస్​) అనేది మనకు లభించే పండ్లలో అత్యంత పోషకవిలువలు కలిగిన పండు. ఇది ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఈ పండు పోషకాలకు ఎంతో ప్రాచూర్యం పొందింది. ఇవి గర్భవతులకు ఎంతో ఉపయోగం. ఐరన్​కు ఇవి గొప్ప మూలం. రక్తంలో హీమోగ్లోబిన్ ఏర్పడేందుకు ఇవి అవసరం. అంతే కాకుండా దీనిలో ఫైబర్ కూడా అధిక మొత్తంలో ఉంటుంది. ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. అంతే కాకుండా ఎండుద్రాక్ష (కిస్​మిస్​)లో యాంటీఆక్సిడెంట్లు, ఫినోలిక్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి సెల్ డ్యామేజ్ మరియు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. గర్భధారణ సమయంలో ఎండుద్రాక్ష (కిస్​మిస్)​ తినడం ఎంతో ఆరోగ్యకరం. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మీకు ఏవైనా ఇతర సందేహాలుంటే మీ ఆరోగ్యసంరక్షకుడితో మాట్లాడండి.

    గర్భధారణ సమయంలో కిస్​మిస్​ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

    ఎండుద్రాక్ష (కిస్​మిస్​)ను చాలా మంది ఆరోగ్యకరమైన స్నాక్​గా భావిస్తారు. కానీ ఇవి గర్భవతులకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయని మీకు తెలుసా? గర్భధారణ సమయంలో ఎండుద్రాక్ష(కిస్​మిస్​) తీసుకోవడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు:

    • ఎండు ద్రాక్ష (కిస్​మిస్​)లో ఫైబర్​ అధిక మోతాదులో ఉంటుంది. ఐరన్, పొటాషియం వంటి అవసరమైన మినరల్స్ మరియు విటమిన్స్ ఉంటాయి.
    • ఇది యాంటీఆక్సిడెంట్లను కూడా కలిగి ఉంటుంది. కణాల డ్యామేజ్ నుంచి ఇది మీ శరీరాన్ని కాపాడుతుంది.
    • గర్భధారణ సమయంలో నల్ల ఎండుద్రాక్ష (కిస్​మిస్​) తినడం వల్ల ఇది మీ జీర్ణక్రియను రెగ్యులేట్ (సక్రమంగా పని చేసేలా) చేస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. క్రమబద్ధీకరణను ప్రోత్సహిస్తుంది.
    • ఎండుద్రాక్ష (కిస్​మిస్​) కూడా మీకు మంచి శక్తిని అందిస్తుంది. కావున గర్భధారణ సమయంలో తలెత్తే అలసటను నివారించడంలో ఇవి మీకు సహాయపడతాయి.
    • మీరు తినే ఆహారంలో ఎండుద్రాక్ష (కిస్​మిస్​) చేర్చుకోవడం వల్ల మీకు ఎక్కువ మోతాదులో అవసరం అయ్యే ఐరన్ మరియు ఇతర పోషకాలను ఇది సమకూరుస్తుంది.

    గర్భంతో ఉన్నపుడు ఎండుద్రాక్ష (కిస్​మిస్​) తినడం వల్ల కలిగే ప్రమాదాలు

    గర్భవతిగా ఉన్నపుడు ఎండుద్రాక్ష (కిస్​మిస్​) తీసుకునేటపుడు మహిళలు జాగ్రత్తగా ఉండాలి. సాధారణ సమయంలో ఎండుద్రాక్ష (కిస్​మిస్​) తినడం సురక్షితం అయినప్పటికీ గర్భధారణ సమయంలో దానిని తినడం వల్ల కొన్ని ప్రమాదాలు సంభవిస్తాయి. గర్భధారణ సమయంలో ఎండుద్రాక్ష (కిస్​మిస్​) లేదా డ్రైడ్ గ్రేప్స్ అనేవి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు. ఇవి గర్భవతుల్లో ఎనిమియా (రక్తహీనత)ను నివారించడంలో సహాయం చేస్తాయి. అయినప్పటికీ వీటిలో అధిక మొత్తంలో కేలరీలు మరియు చక్కెర కూడా ఉంటాయి. ఎండుద్రాక్ష (కిస్​మిస్​) ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశంతో పాటుగా గర్భధారణ మధుమేహం వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఎండుద్రాక్ష(కిస్​మిస్​) పిండంలో టైప్​ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా కలగజేస్తుంది. ఎండుద్రాక్ష (కిస్​మిస్​)లో చిన్న మొత్తంలో పెస్టిసైడ్స్ (పురుగుమందు అవశేషాలు), కెమికల్స్ కూడా ఉంటాయి. ఈ రసాయనాల వల్ల పెద్దలకు ఎటువంటి ప్రమాదం లేకపోయినప్పటికీ అప్పుడే అభివృద్ధి చెందుతున్న పిండానికి ఇవి హాని కలుగజేస్తాయి. గర్భవతులు రోజుకు 1/2 కప్పు కంటే ఎక్కువ ఎండుద్రాక్ష(కిస్​మిస్​) తీసుకోకూడదు.

    గర్భంతో ఉన్నపుడు ఎండుద్రాక్ష (కిస్​మిస్​) తినడం వల్ల కలిగే ప్రభావాలు

    గర్భధారణ సమయంలో ఎండుద్రాక్ష (కిస్​మిస్) మరియు డ్రై గ్రేప్స్ తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎండుద్రాక్ష (కిస్​మిస్​) ఐరన్​కు మంచి ప్రత్యామ్నాయం. ఐరన్ అనేది గర్భవతులకు చాలా అవసరం. అంతే కాకుండా వీటిల్లో ఫైబర్ కూడా అధిక మోతాదులో ఉంటుంది. ఇది మలబద్దకాన్ని నివారించడంలో సహాయం చేస్తుంది. అంతే కాకుండా ఎండుద్రాక్ష (కిస్​మిస్​)లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఇతర ఆహారాల వలే దీనిని కూడా తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. అధిక మోతాదులో తీసుకోవడం వలన తల్లి మరియు బిడ్డ ఇద్దరికి ప్రమాదం సంభవించే అవకాశం ఉంది.

    గర్భిణీ స్త్రీలు ఎండుద్రాక్షను (కిస్​మిస్​) ఎంతకాలం తీసుకోవచ్చు?

    గర్భవతులు ప్రతి రోజు అరకప్పు లేదా పిడికిలి కంటే ఎక్కువ ఎండు ద్రాక్ష (కిస్​మిస్​) మరియు డ్రై బ్లాక్ గ్రేప్స్ తీసుకోకూడదని సిఫారసు చేస్తారు. ఎందుకంటే జీర్ణసమస్యలు మరియు గర్భధారణ మధుమేహం వచ్చే ప్రమాదాన్ని ఇది పెంచుతుంది. ఎండుద్రాక్ష (కిస్​మిస్​)ను సాధారణంగా గర్భధారణ సమయంలో స్నాక్​గా తీసుకోవచ్చు. అయితే త్వరలో తల్లికాబోతున్న మహిళకి గర్భధారణ మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నట్లయితే వైద్యుడిని సంప్రదించాలి.

    గర్భధారణ మధుమేహంతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీలు ఎండుద్రాక్ష(కిస్​మిస్​) తినొచ్చా?

    ఎండుద్రాక్ష (కిస్​మిస్​)లో చక్కెర కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది మీ గర్భధారణ సమయంలో రక్తంలో అధిక చక్కెరను తయారు చేస్తుంది. ఇది మంచిది కాదు. అందువల్ల గర్భధారణ మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్న గర్భిణీ స్త్రీలు గర్భవతిగా ఉన్నపుడు ఎండు ద్రాక్ష(కిస్​మిస్​) తీసుకోవడం గురించి వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

    ఎండుద్రాక్ష (కిస్​మిస్​) & డ్రై గ్రేప్స్​ను గర్భవతిగా ఉన్నపుడు తినడం సురక్షితమేనా?

    అవును. గర్భధారణ సమయంలో ఎండు ద్రాక్ష (కిస్​మిస్​) మరియు డ్రై బ్లాక్ గ్రేప్స్ తీసుకోవడం సురక్షితమే. వీటిల్లో కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా లభిస్తుంది. గర్భధారణ మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్న స్త్రీలు గర్భవతులుగా ఉన్నపుడు ఎండుద్రాక్ష(కిస్​మిస్​) తక్కువ మోతాదులో తీసుకోవాలి.

    ఎండుద్రాక్ష (కిస్​మిస్​) నుంచి ఎవరు దూరంగా ఉండాలి?

    గర్భధారణ సమయంలో నలుపు ఎండుద్రాక్ష (కిస్​మిస్​) తినడం వల్ల తల్లి మరియు బిడ్డకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకు ఎండుద్రాక్ష (కిస్​మిస్​)లో ఫుడ్ పాయిజన్​కు కారణం అయ్యే హానికర బ్యాక్టీరియా ఉండవచ్చు. అంతే కాకుండా గర్భిణీ స్త్రీలు ఎక్కువ మొత్తంలో ఎండుద్రాక్ష(కిస్​మిస్​) తినొద్దు. ఎందుకంటే వాటిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. అది గర్భధారణ మధుమేహానికి దారి తీయొచ్చు. గర్భధారణ సమయంలో ఎక్కువగా నలుపు ఎండు ద్రాక్ష (కిస్​మిస్​) తినడం వలన ఇతర జీర్ణాశయ సమస్యలు రావచ్చు. మహిళలు గర్భధారణ సమయంలో ఎండుద్రాక్ష (కిస్​మిస్​) తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలని సిఫారసు చేయబడింది.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Kakarla Sirisha

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.