
గర్భవతులు తమ ఆహారం విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే వారు తినే ఆహారం కేవలం వారి ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా వారికి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. విటమిన్లు, మరియు మినరల్స్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని గర్భధారణ సమయంలో తీసుకోవాలి. అటువంటి ఆహారంలో మఖాన లేదా తామరగింజలు కూడా ఉంటాయి. ఇవి గర్భవతుల ఆహార జాబితాలో తప్పకుండా ఉండాలి. గర్భధారణ సమయంలో మఖాన (తామర గింజలు) తినడం ఎంతో మంచిది ఎందుకంటే ఇందులో అధిక పోషక విలువలు ఉంటాయి. పిండం ఆరోగ్యకరమైన పెరుగుదలకు ఇది తోడ్పడుతుంది.
మఖాన (తామర గింజలు) ను అనేక పేర్లతో పిలుస్తారు. తామర గింజ లేదా ఫాక్స్ నట్ అనే పేర్లు దీనికి ఉన్నాయి. చాలా రకాల ఆఫ్రికన్ మరియు అమెరికన్ వంటకాలలో దీనిని ప్రధాన పదార్థంగా వాడుతారు. ఈ ఆహారాన్ని అనేక వైద్య పరిస్థితులకు చికిత్స కోసం ఉపయోగిస్తారు. ఇది పచ్చిదైనా లేదా వండినదైనా తినొచ్చు. “గర్భధారణ సమయంలో మనం మఖాన (తామరగింజలు) తినవచ్చా” అనే సందేహం ఎవరికైనా వస్తే అవుననే సమాధానమే వినిపిస్తోంది. గర్భవతులు దీనిని సాయంత్రం స్నాక్‌గా తినవచ్చు. లేదా కూరలు, సైడ్ డిషెస్, లేదా డిసర్ట్ (తీపి పదార్థం) లోనైనా చల్లుకోవచ్చు.
అధిక పోషకాలు ఉన్నందున గర్భధారణ సమయంలో మఖాన (తామరగింజలు) తినమని చాలా మంది స్త్రీలకు సిఫారసు చేస్తారు. గర్భవతులు తప్పకుండా తీసుకోవాల్సిన అత్యంత ఆరోగ్యకరమైన ఆహారంలో ఇది కూడా ఉంది. అధిక పోషకవిలువల వల్లే ఇది సాధ్యపడింది.
ప్రతి 100 గ్రాముల మఖాన (తామర గింజలు) లో ఉండే పోషకాలు ఈ కింది విధంగా ఉంటాయి.
|
పోషకాల గురించిన సమాచారం |
100 గ్రాములకు |
|
ప్రొటీన్ |
9.7 గ్రాములు |
|
కొవ్వులు |
0.1 గ్రాములు |
|
కేలరీలు |
347 కేలరీలు |
|
లిపిడ్స్ |
0.1 గ్రాములు |
|
పిండి పదార్థాలు |
76.9 గ్రాములు |
|
ఫైబర్ |
14.5 గ్రాములు |
|
కాల్షియం |
60 మిల్లీగ్రాములు |
|
ఐరన్ |
1.4 మిల్లీగ్రాములు |
ఈ పోషకాలు మాత్రమే కాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, మాంగనీస్, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, అమైనో ఆమ్లాలు మరియు విటమిన్ B కాంప్లెక్స్ కూడా ఉన్నాయి.
పైన ఉన్న పోషక విలువల పట్టిక ప్రకారం చూస్తే గర్భవతులు అడిగే సాధారణ ప్రశ్న “గర్భధారణ సమయంలో మఖాన (తామరగింజలు ) మంచిదేనా” అనే దానికి అవుననే సమాధానం స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి గర్భవతులు పచ్చిగా ఉన్న మఖాన (తామరగింజలు) కాకుండా ఉడికించిన మఖాన (తామరగింజలు) తినాలని అనుకుంటే.. మఖాన (తామరగింజలు) ఖీర్ లేదా మఖాన (తామర గింజలు) లడ్డూలు వంటి వాటిని చేసుకోవచ్చు. మఖాన (తామరగింజలు)తో వివిధ రకాల వంటకాలను ఎలా తయారు చేయొచ్చో ఇక్కడ ఉంది.
మఖానను (తామర గింజలు) రైస్ పుడ్డింగ్ అని పిలువబడే ఖీర్‌లో కూడా యాడ్ చేయొచ్చు. ఇది పోషక విలువను మరింత పెంచుతుంది. మఖాన (తామర గింజలు) ఖీర్‌లో వేసేందుకు వేయించి మెత్తగా పొడి చేయాలి. ఖీర్ చేసే సమయంలో పౌడర్లా మారిన మఖాన (తామర గింజలు)ను మీద చల్లుతారు. ఇది దాని మందాన్ని పెంచుతుంది. మరియు కొత్త రుచిని దానికి జోడిస్తుంది.
త్వరలో తల్లి కాబోయే వారు పాప్‌కార్న్ లేదా ఏదైనా స్నాక్‌కు బదులు మఖాన (తామర గింజలు) తినొచ్చు. దీనిని వెన్న లేదా నెయ్యితో లో/మీడియం/హై మంట మీద కాల్చాలి. వేయించిన తర్వాత మఖాన స్నాక్ మీద కావాలనుకుంటే ఉప్పు కానీ కారం కానీ చల్లుకోవచ్చు. లేదా ఒరేగానో కూడా చల్లుకోవచ్చు.
మఖాన (తామర గింజలు) నుంచి లడ్డూలను తయారు చేయడం చాలా సులభమైన ప్రక్రియ. దీన్ని తయారు చేసేందుకు మఖాన (తామర గింజలు) వేయించి గ్రైండ్ చేసుకొని ఒక పౌడర్లా సిద్ధం చేసుకోవాలి. ఈ పౌడర్‌ను పాలు మరియు డ్రై ఫ్రూట్స్ వంటి ఇతర పదార్థాలతో కలిపి లడ్డూల తయారీ కోసం మిశ్రమాన్ని తయారు చేస్తారు. ఈ మిశ్రమాన్ని గుండ్రగా చేసేందుకు చేతులతో చుడతారు. లడ్డూలు మంచి ఆకృతిలో వచ్చేందుకు వాటిని తయారు చేసేటపుడు చేతులకు నెయ్యి రాయాలి.
గర్భధారణ సమయంలో మఖాన (తామర గింజలు) వల్ల కలిగే కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు
ప్రతి గర్భిణీ స్త్రీ ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి నిద్రలేమి. ఇది సాధారణంగా ఒత్తిడి మరియు ఆహారపు అలవాట్లలో మార్పులు హార్మోన్ల మార్పుల వల్ల సంభవిస్తుంది. మఖాన (తామర గింజలు)లో క్వినోలిన్ ఆల్కలాయిడ్స్‌తో పాటుగా అవసరమైన విటమిన్లు మరియు యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇవి శరీరానికి విశ్రాంతిని అందించి నిద్రను ప్రేరేపిస్తాయి. అందువల్ల గర్భధారణ సమయంలో మఖాన (తామర గింజలు) తీసుకోవడం మీలో చాలా వరకు నిద్రలేమిని తొలగించడంలో సహాయపడుతుంది.
గర్భధారణ సమయంలో ప్రతిరోజు మఖాన (తామర గింజలు) తినడం వల్ల గర్భధారణ సమయంలో హెచ్చుతగ్గులకు లోనయ్యే బీపీ కంట్రోల్ అవుతుంది. మఖాన (తామర గింజలు) లో అధిక మొత్తంలో మెగ్నీషియం మరియు సోడియం ఉండడం వలన రక్తపోటు సరిగ్గా ఉంటుంది. సాధారణ బీపీని మెయింటేన్ చేసేందుకు ఇది చాలా ముఖ్యమైనది.
గర్భధారణ సమయంలో హార్మోన్ల అసమతుల్యత వలన డయేరియా (విరోచనాలు) వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే తామర గింజ లేదా మఖాన గర్భధారణ సమయంలో విరోచనాలకు ఉత్తమ నివారణ మార్గం అని నమ్ముతారు. ఇది బలమైన జీర్ణవ్యవస్థకు హామీ ఇస్తుంది. డయేరియా మరియు ఇతర జీర్ణసమస్యలు రాకుండా ఉండేందుకు గర్భవతులు గర్భం దాల్చిన మొదట్లో ప్రతి రోజు మఖాన (తామరగింజలు) తినాలి.
చాలా మంది మహిళలు గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల చిగుళ్ల సమస్యను ఎదుర్కొంటారు. ఇది చిగుళ్లలో మంటకు దారి తీస్తుంది. మఖాన (తామర గింజలు)లో ఉండే B కాంప్లెక్స్ విటమిన్ స్త్రీకి చిగుళ్ల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాకుండా మఖాన (తామర గింజలు)లో ఉండే జింక్ దంతాలు మరియు చిగుళ్లను ఆరోగ్యంగా బలంగా ఉంచడంలో సహాయపడుతుంది.
గర్భిణీ స్త్రీలు గర్భధారణ సమయంలో బరువు పెరుగుతారు. ఈ సమయంలో పెరిగిన ఆకలితో బరువు పెరకుండా మేనేజ్ చేయడం చాలా కష్టం అవుతుంది. గర్భధారణ సమయంలో మఖాన (తామరగింజలు) ఎంతో గొప్ప ఆరోగ్యకరమైన స్నాక్. ఇది తక్కువ గ్లెసెమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటుంది. ఒక చిన్న గిన్నెడు మఖాన (తామర గింజలు) తింటే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అతిగా తినాలనే కోరికను ఇది అణచి వేస్తుంది.
మఖాన (తామర గింజలు) గురించి మరియు గర్భధారణ సమయంలో మఖాన (తామరగింజలు) ప్రయోజనాల గురించి స్త్రీలు తెలుసుకోవాల్సిన ప్రతీది ఇక్కడ ఉంది. కాబట్టి నెక్ట్స్ టైం గర్భవతులు స్నాక్స్ కోసం షాపింగ్ చేసినపుడు వారి షాపింగ్ లిస్టులో మఖాన (తామర గింజలు) తప్పనిసరిగా చేర్చాలి.
Yes
No


















makhana thinatam manchidena
Your body needs extra nutrition this trimester - these can help.





This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |