This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భిణీ మహిళల రోజువారీ సమతుల్య ఆహారం: ఏం తినాలి ఇంకా ఏం తినకూడదు

Diet & Nutrition
Written by - Nayana Mukkamalaచివరిగా నవీకరించబడింది: Jan 31, 2026
గర్భిణీ మహిళల రోజువారీ సమతుల్య ఆహారం: ఏం తినాలి ఇంకా ఏం తినకూడదు
Likes69 Likes|
Read time6 min

గర్భం దాల్చడమనేది అనేది స్త్రీ జీవితంలోనే ఒక అత్యంత అపురూపమైన ఘట్టం. ఈ గర్భధారణ సమయంలో కూడా మహిళలు తమ శరీర ఆరోగ్య విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలి. గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన ఇంకా పోషకాలతో ఉన్న ఆహారం గర్భస్థ పిండం చక్కగా పెరిగేందుకు ఇంకా తల్లికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు ఎంతో అవసరం. చాలా మంది మహిళలకు గర్భధారణ సమయాల్లో తాము తీసుకొనే ఆహారంలో ఏది మంచిదో తెలియదు. ఈ కథనం పాఠకులకు గర్భధారణ సమయంలో సమతుల్య ఆహారం యొక్క ప్రాముఖ్యతను ఇంకా ఆ సమయంలో మీరు తినవలసిన మరియు తినకూడని ఆహారాలేమిటో అవగాహన కలిగించేందుకు సహాయపడుతుంది.

సమతుల్య ఆహారం అంటే ఏమిటి?

సమతుల్య ఆహారం అనేది మానవ శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలతో పాటు అన్నిరకాల స్థూల పోషకాలను కలిగి ఉంటుంది. స్థూల పోషకాలలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు ఇంకా కొవ్వులు ఉంటాయి, అయితే సూక్ష్మపోషకాలలో ఖనిజాలు, విటమిన్లు ఇంకా పీచుపదార్థాలు ఉంటాయి. స్థూల పోషకాలు శరీరానికి ఎక్కువ పరిమాణంలో అవసరమవుతాయి మరియు మన ఆహారంలో ఎక్కువ భాగం ఇవే ఉంటాయి. కార్బోహైడ్రేట్లు ఇంకా కొవ్వులు శక్తినిచ్చే ఆహారాలు మరియు అన్ని రకాల కార్యకలాపాలకు మన శరీరానికి శక్తినిచ్చేందుకు ఇవి అవసరం. ప్రొటీన్ అనేది శరీర నిర్మాణంలో పాలుపంచుకొనే ఆహారం. ఇది మన కణాలు ఇంకా కణజాలాలను సరిచేయడానికి మరియు కండరాలు ఇంకా ఎముకలను బలోపేతం అయ్యేందుకు కీలకమైనది. మన శరీరానికి ఖనిజాలు మరియు విటమిన్లు వంటి సూక్ష్మపోషకాలు చాలా తక్కువ పరిమాణంలో అవసరమవుతాయి. మన శరీరం ఇన్ఫెక్షన్‌లతో పోరాడడంలో, హార్మోన్ స్రావాన్ని నియంత్రించడంలో, శరీరంలోని ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రించి, ఎముకలను బలోపేతం చేయడం ఇంకా గాయాలను నయం చేయడం వంటి వాటికి ఇవి చాలా అవసరం. మన ఆహారం జీర్ణం కావడానికి సహాయపడే మరొక సూక్ష్మపోషకం పీచుపదార్థాలు. అందువల్ల, సమతుల్య ఆహారం అనేది శరీరపు సరైన పనితీరు కోసం అవసరమైన అన్ని ఆవశ్యక పోషకాలను సరైన పాళ్లలో కలిగి ఉన్న ఆహారం.

మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భవతిగా ఉన్నప్పుడు ఇంగువని ఆహారంలో తినడం । రిస్కులు, ప్రయోజనాలు

గర్భధారణ సమయంలో తీసుకొనేందుకు సిఫార్సు చేయబడిన ఆహారాలు

ఆరోగ్యకరమైన తల్లి ఇంకా బిడ్డ కోసం గర్భధారణ సమయంలో తీసుకోవలసిందిగా సిఫార్సు చేయబడిన ఆహార పదార్థాలు క్రింద ఇవ్వబడ్డాయి:

పాల ఉత్పత్తులు

పాలు, పనీర్, జున్ను, వెన్న మరియు నెయ్యి వంటి పాల ఉత్పత్తులు అన్ని ఆవశ్యకమైన స్థూల పోషకాలు ఇంకా సూక్ష్మపోషకాలను కలిగి ఉంటాయి. పాలు మరియు పనీర్, ప్రోటీన్ ఇంకా కార్బోహైడ్రేట్లను అందించే మంచి వనరులు. వెన్న ఇంకా నెయ్యి మంచి నాణ్యమైన కొవ్వులను అందిస్తాయి. పాల ఉత్పత్తులలో కాల్షియం కూడా ఉంటుంది, ఇది ఎముకలను బలోపేతం చేయడంలో ఎంతో కీలకమైనది. అందువల్ల, గర్భధారణ సమయంలో పాల ఉత్పత్తులను తీసుకోవడం ముఖ్యమని సిఫార్సు చేయబడింది, ఎందుకంటే ఇది తల్లీబిడ్డల మంచి ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.

బ్రోకోలీ మరియు ఆకు కూరలు

బ్రోకలీ మరియు పాలకూర, మెంతి ఆకులు లాంటి ఆకుకూరలు విటమిన్లు, ఖనిజాలు ఇంకా పీచుపదార్థాలు పుష్కలంగా దొరికే ఆహారాలు. శరీరపు హార్మోన్ల నియంత్రణకి ఇంకా రోగనిరోధక వ్యవస్థ బలోపేతానికి ఇవి ఎంతో అవసరం.

పండ్లు

పండ్లలో ఖనిజాలు మరియు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పుచ్చకాయ వంటి పండ్లు శరీరంలోని నీరు ఇంకా ఖనిజలవణాల సమతుల్యతను కాపాడేందుకు పనికివస్తాయి. అరటిపండ్ల లాంటి ఇతర పండ్లు మంచి శక్తినివ్వడమే కాకుండా పొటాషియం, జింక్, మెగ్నీషియం, ఇనుము ఇంకా కాల్షియం వంటి అనేక ఖనిజాలను అందిస్తాయి, ఇవి శరీరంలోని సాధారణ హార్మోన్ల ఇంకా ఎలక్ట్రోలైట్‌ల సమతుల్యతకు అవసరామౌతాయి.

తక్కువ కొవ్వు గల మాంసాలు మరియు ప్రోటీన్లు

చికెన్ ఇంకా చేపలు వంటి తక్కువ కొవ్వు గల మాంసం మరియు గుడ్లు వంటి ఆహార పదార్థాలు ప్రోటీన్లను అందించే మంచి వనరులు. ప్రోటీన్, పైన తెలిపినట్లుగా, శరీరా నిర్మాణంలో పాలుపంచుకోవడమే కాక శరీరంలోని కణాలు ఇంకా కణజాలాల పునర్నిర్మాణానికి కూడా దోహదపడుతుంది. పిండం ఆరోగ్యంగా ఎదగడంలో ప్రోటీన్ పాత్ర ఎంతో కీలకమైనది. అందువల్ల, గర్భధారణ సమయంలో తక్కువ కొవ్వు గల మాంసాలు ఇంకా గుడ్లు తీసుకోవడం ఎంతో ముఖ్యం.

చిక్కుళ్ళు మరియు పప్పుధాన్యాలు

గింజల వంటి చిక్కుళ్ళు పెద్ద మొత్తంలో ప్రోటీన్‌లను అందిస్తాయి. అంతేకాక గర్భధారణ సమయంలో వీటిని తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి. శాకాహారులకు, చిక్కుళ్ళు మరియు పప్పులు ప్రోటీన్లను అందించే గొప్ప వనరులు. కిడ్నీ బీన్స్, మినప పప్పు, సోయా బీన్స్ ఇంకా మొలకెత్తిన చిక్కుళ్ళు పెద్ద మొత్తంలో ప్రోటీన్‌లను అందిస్తాయి అందువల్ల గర్భధారణ సమయంలో వీటిని తప్పనిసరిగా ఆహారంలో చేర్చాలి.

నట్స్ మరియు డ్రై ఫ్రూట్స్

నట్స్ మరియు డ్రై ఫ్రూట్స్‌(సహజంగా దొరికే గింజలు, బాదం, పిస్తా, ఖర్జూరం, జీడిపప్పు, వాల్‌నట్‌, హాజెల్‌నట్‌లు మరియు ఎండుద్రాక్ష, అంజీర్ లేదా అత్తి పండ్ల ఎండిన రూపం)లో కొవ్వులు ఇంకా కొద్ది మొత్తంలో ప్రోటీన్లు మరియు ఖనిజాలు ఉంటాయి. కొవ్వులు శక్తిని ఇస్తాయి. ఇవి కొద్ది మొత్తంలో ప్రొటీన్‌లు ఇంకా విటమిన్‌లు అందించడం వలన గర్భధారణ సమయంలో గింజలు ఇంకా డ్రై ఫ్రూట్స్ తీసుకోవలసిన మంచి ఆహారాలుగా చెప్పవచ్చు.

నీరు

గర్భధారణ సమయంలో తగినంత నీరు త్రాగటం చాలా ముఖ్యం. ఇది సరైన జీర్ణక్రియకు, ఖనిజలవణాల స్థాయిని సమతుల్య పరచడానికి ఇంకా శరీరంలోని హార్మోన్ల స్రావాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది.

గర్భధారణ సమయంలో ఆవశ్యకమైన విటమిన్ మరియు మినరల్ సప్లిమెంట్లు

కొన్నిసార్లు, మనం తినే ఆహారాల నుండి గర్భధారణకి ఆవశ్యకమైన అన్ని విటమిన్లు మరియు ఖనిజాలు లభించడం జరగదు. అటువంటి సందర్భాలలో, మీరు అవసరమైన విటమిన్లు ఇంకా ఖనిజాలను సప్లిమెంట్ల రూపంలో తీసుకోవచ్చు. అయితే, ఏదైనా సప్లిమెంట్లను తీసుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించాలి.

గర్భధారణ సమయంలో గుర్తుంచుకోవలసిన అంశాలు

పచ్చి చేపలు మరియు గుల్ల చేపలను తీసుకోరాదు

పచ్చి చేపలు మరియు గుల్ల చేపలను తీసుకోవడం పొట్టలో ఇన్ఫెక్షన్‌కు కారణమై అది విరోచనాలకు దారి తీయవచ్చు, దీనివల్ల శరీరం మరిన్ని ఖనిజాలు ఇంకా విటమిన్లను కోల్పోగలదు. అందువల్ల, వీలైనంతగా తాజా చేపలను సరిగ్గా వండిన తర్వాతనే తినాలని సూచిస్తున్నారు.

ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినకూడదు

ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఉండే ప్రాసెస్ చేసిన ఆహారం అది పాడవకుండా రసాయనాలను కలిగివుంటాయి ఇంకా తరచుగా నిల్వ చేసినదై ఉంటుంది. ఇది జీర్ణాశయ ఇన్ఫెక్షన్‌కు కారణమై అది విరోచనాలకు దారి తీయవచ్చు.

ఎక్కువ ఘనీభవించిన మరియు రిఫ్రిజిరేట్ చేసిన మాంసాన్ని తినకూడదు.

మాంసం బ్యాక్టీరియా పెరుగుదలకు అనుకూలమైన ఆహారం. అందుచేత ఇలా నిలువచేయని తాజా మాంసాన్ని మాత్రమే తీసుకోవాలి.

పండ్లు మరియు కూరగాయలను బాగా కడగాలి

పండ్లు మరియు కూరగాయలు తరచుగా ఎరువులు మరియు పురుగుమందులు వేసి పండిస్తారు. ఇలాంటి విష రసాయనాలు పండ్లు తినడం ద్వారా శరీరంలోకి ప్రవేశించకుండా పండ్లు మరియు కూరగాయలను తినేముందు వీలైనంత వరకు శుభ్రంగా కడగాలి.

పాశ్చరైజ్ చేయని ఆహారాన్ని తినకూడదు

పాశ్చరైజేషన్ అంటే పాల ఉత్పత్తులలో సూక్ష్మక్రిములను ఇంకా ఆహారంలో ఏదైనా బ్యాక్టీరియా లేదా వైరస్‌లను చంపే ప్రక్రియ. అందువల్ల, గర్భధారణ సమయంలో పాశ్చరైజ్డ్ పాల ఉత్పత్తులను తీసుకోవడం ఎంతో సురక్షితం.

కెఫిన్‌ని తగ్గించాలి

కెఫిన్ శరీరంలోని హార్మోన్ల స్థాయిల హెచ్చుతగ్గులకు కారణమవుతుంది. అందువల్ల, గర్భధారణ సమయంలో కెఫిన్‌కి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.

మద్యం మరియు పొగాకుకు దూరంగా ఉండాలి

మద్యం మరియు పొగాకు గర్భస్థ పిండం పెరుగుదలపై తీవ్రమైన ప్రభావాలను కలిగిస్తాయి. అవి శిశువు ఎదుగుదలను ఆటంకపరచడమే కాక గర్భ సంబంధ సమస్యలను కలిగిస్తాయి. అందువల్ల, గర్భధారణ సమయంలో మద్యం ఇంకా పొగాకు అలవాట్లను పూర్తిగా వదులుకోవాలి.

Is this helpful?

thumbs_upYes

thumb_downNo

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Mylo App Banner

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Apple App StoreGoogle Play Store
Apple App StoreGoogle Play Store

Article Posted Under

Helpful Tools & Calculators

undefined icon
Pregnancy Calendar
See baby growth week by week
arrow_right
undefined icon
Mylo Store
Shop for mom & baby
arrow_right
undefined icon
Pregnancy Diet Chart
Trimester & region-wise diet plan
arrow_right
undefined icon
Mamasutra
Safe positions for pregnancy
arrow_right
undefined icon
Save Memories
Store baby's photos & firsts
arrow_right
undefined icon
Weight Tracker
Monitor your weight
arrow_right
undefined icon
Zordar Dadi Ke Nuskhe
Gharelu nushke that work
arrow_right
undefined icon
My Calendar
Predict periods & record symptoms
arrow_right
undefined icon
Ovulation Calendar
Know your monthly cycle
arrow_right
undefined icon
Pill Reminder
Get reminded for medicines
arrow_right
undefined icon
Vaccination Tracker
Never miss a vaccine date
arrow_right
undefined icon
Make Baby Sleep
Play white noise & sleep music
arrow_right
undefined icon
Pregnancy Music
Play calming music for baby
arrow_right
undefined icon
Baby Diet Chart
Age-wise food plans for baby
arrow_right
Nayana Mukkamala
Nayana Mukkamala

Related Articles

Questions about this article

  • 12 weeks pregnant

    Nenu 12 week pregnant nenu chicken thinoccha I mean natukodi

Related Topics

Recently Published Articles

Your body needs extra nutrition this trimester - these can help.

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.