


Cradle Cap
21 January 2026 న నవీకరించబడింది
మీరు మీ శిశువు తల మీద పొడిబారిన పసుపు రంగు పాచ్‌ను గమనించారా? మీరు శిశువు తల మీద కొంత పొడిబారినట్లు కనిపించడంతో జుట్టు కుదుళ్లను పదే పదే కడుగుతున్నారా? అయితే మీ బిడ్డ సెబోరోహెయిక్ డెర్మటిటిస్ (క్రెడిల్ క్యాప్)తో బాధపడుతూ ఉండవచ్చు. వినేందుకు, చూసేందుకు పేరు భయంకరంగా అనిపించినా కానీ శిశువులకు ఈ వ్యాధి సోకితే అంతలా భయపడాల్సిన పని లేదు. మీ శిశువుకు రెండు వారాల వయస్సు వచ్చినపుడు ఇది కనిపిస్తుంది. మీరు నెత్తిమీద పొడిబారడాన్ని గమనిస్తారు. కేవలం నెత్తి మీద మాత్రమే కాకుండా మెడ, చంకలు, మోకాళ్ల కింద కూడా ఉంటుంది.
క్రెడిల్ క్యాప్ అనేది పిల్లలను అపరిశుభ్రంగా ఉంచడం వలన రాదు. అసలు ఇది ఎందువలన వస్తుందో సరైన కారణం ఇప్పటికీ తెలియదు. అధిక సెబమ్ ఉత్పత్తి సెబరోహెయిక్ డెర్మటైటిస్‌కు కారణం అవుతుంది. దీనికి చికిత్స చేయొచ్చు. కొన్ని రోజుల తర్వాత ఇది అదృశ్యం కావడం ప్రారంభిస్తుంది. ఇది ఎక్కడా కనిపించదు. మీరు క్రెడిల్ క్యాప్ డిసీస్ను గమనించినపుడు ఏం చేయాలో తెలుసుకునేందుకు ఇది చదువుదాం...
సెబోరోహెయిక్ డెర్మటిటిస్ అనేది శిశువు పుట్టిన తర్వాత 2 వారాల నుంచి 12 నెలల వరకు సంభవిస్తుంది. క్రెడిల్ క్యాప్ ప్రభావిత ప్రాంతం పసుపు రంగులో ఉండి పొడిబారినట్లు ఉంటుంది. దాని మీద ఎరుపు రంగులో దద్దుర్లు ఉంటాయి. మెడ వెనుక భాగంలో ఎరుపు రంగులో తేమగా అనిపిస్తుంది. తర్వాత పొడిగా మారి పొరలుగా కనిపిస్తుంది. సెబోరోహెయిక్ డెర్మటిటిస్ ఎక్కువగా జుట్టు కుదుళ్లు, మెడ వెనుక భాగంలో, కనుబొమ్మలు, చెవులు మరియు కొన్ని సార్లు చేతుల కింద కూడా ఉంటుంది. ఇది దురదను కలిగించదు. అయినప్పటికీ తరచుగా చర్మం పొడిబారి కనిపిస్తుంది.
శిశువు వయస్సు పెరిగే కొద్దీ క్రెడిల్ క్యాప్ మరియు డెర్మటిటిస్ వాటంతట అవే మాయమవుతాయి. అప్పుడు మీరు చనిపోయి పొలుసులుగా ఉన్న చర్మాన్ని స్ర్కబ్‌తో వాష్ చేయొచ్చు. కానీ మీ శిశువు చర్మం చాలా మృదువుగా, సున్నితంగా ఉంటుందని గుర్తుంచుకోండి. కావున మీరు అవసరమైన దానికంటే ఎక్కువగా ఏదైనా చేస్తే మీ చర్మం దెబ్బతినే అవకాశం ఉంది.
మీరు అతిగా చేయకుండా ఉండేందుకు ఈ కింది స్టెప్స్ ఫాలో కండి.
లక్షణాలు తగ్గినా లేదా పెరిగినా కానీ వైద్యుడిని తరచూ సంప్రదిస్తూ ఉండండి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: కాపుట్ సక్సెడేనియం: కారణాలు, దానివల్ల కలిగే ప్రమాదాలు, చికిత్స
మీరు తరచుగా శిశు వైద్యుడిని సంప్రదిస్తూ ఉంటే అతడు క్రెడిల్ క్యాప్‌ని ధృవీకరిస్తాడు. పొడిబారిన మరియు పసుపు రంగు చర్మం ఉంటే శిశువుకు క్రెడిల్ క్యాప్ ఉందని నిర్దారించవచ్చు.
క్రెడిల్ క్యాప్ చికిత్స కోసం బాగా పని చేసే ఇంటి చిట్కాలు
తల మరియు ఇతర చర్మపు మడతలను శుభ్రంగా ఉంచడం. చర్మంపై తేలికపాటి క్లీనింగ్ ఏజెంట్‌ని మరియు తలపై తేలికపాటి షాంపూని అప్లై చేయడం. మీరు వైద్యుడిని సంప్రదించిన తర్వాత షాంపూ మరియు క్లెన్సర్‌ని ఉపయోగించడం మంచిది.
మీ ఏ ఇద్దరు పిల్లలు ఒకే రకంగా ఉండరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కావున ఒక శిశువుకు పని చేసింది కదా అని ఇతర శిశువులకు ట్రై చేయకూడదు. ఈ వ్యాధి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటే మీరు తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. సెబోరియా డెర్మాటిటిస్ అనేది చికిత్స చేస్తే తగ్గిపోయేది. శరీరంలో అధిక మొత్తంలో సెబమ్ ఉత్పత్తి అనేది కుదుళ్లను అడ్డుకుంటుంది. జుట్టు పెరుగుదలను డ్యామేజ్ చేస్తుంది.
మీ శిశువు తల మీద కానీ ఇతర ఏదేనీ శరీర భాగంలో కానీ ఈ కింది లక్షణాలను గమనిస్తే.. మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Yes
No

Written by
Swetha Rao
Get baby's diet chart, and growth tips







సేబాషియస్ సిస్ట్ (తైలాగ్రంథి తిత్తులు) - కారణాలు, లక్షణాలు మరియు చికిత్స

మీ శిశువు పగటిపూట కునుకు తీయడానికి నిరాకరించినప్పుడు ఏమి చేయాలి? (What to Do If Your Child Refuses to Take a Nap in Telugu?)

సి-సెక్షన్ తర్వాత బరువు తగ్గడం: తక్షణ చిట్కాలు మరియు డైట్ ప్లాన్

కడుపుతో ఉన్నప్పుడు ఉల్లిపాయలు తినడం: ప్రయోజనాలు & దుష్ప్రభావాలు

రొమ్ము వాపు గురించి మరింత తెలుసుకోండి- కారణాలు, చికిత్స, లక్షణాలు (Know More About Breast Engorgement- Causes, Treatment & Symptoms in Telugu)

గర్భధారణ సమయంలో క్యారెట్: ప్రయోజనాలు & నష్టాలు | Carrot During Pregnancy: Benefits & Disadvantages in Telugu