

Baby Care
11 December 2025 న నవీకరించబడింది
కాపుట్ సక్సెడేనియం అనేది అప్పుడే పుట్టిన చంటి బిడ్డల తలపై ఏర్పడే మెత్తని వాపు. ఇది బిడ్డ తలపై పుట్టిన వెంటనే కనిపిస్తుంది. దానికి సంబంధించిన మరే ఇతర సమస్యలూ లేకుంటే, అది 48 గంటల్లో తగ్గిపోవాలి. పుట్టిన వెంటనే శిశువైద్యులకు చూపించి పరీక్ష చేయించడం చాలా ముఖ్యం. ప్రసవ సమయంలో ఫోర్సెప్స్ ఉపయోగించడం, కాన్పు యొక్క రెండవ దశ ఎక్కువ సేపు ఉంటే ప్రసవ సమయంలో దూకుడుగా నెట్టడం వంటివి దీనికి కారణాలు. ప్రసవ సమయంలోను, తర్వాత చేసే అల్ట్రాసౌండ్ బిడ్డ తలపై వాపు యొక్క సంకేతాలు ఏవైనా ఉంటే చూపిస్తుంది. ప్రసవం యొక్క రెండవ దశలో, గర్భాశయ సంకోచాలు పిండం తలపై చాలా ఒత్తిడిని కలిగిస్తాయి. దీని వల్ల తల పైభాగంలో ద్రవం పేరుకుంటుంది. కాపుట్ సక్సెడేనియం ముందుగానే 31 వారాలకే అల్ట్రాసౌండ్‌లో గుర్తిస్తాము. తలపై మాడుపట్టులో అసహజమైన మెత్తని వాపును అల్ట్రాసౌండ్ నిర్ధారించగలదు.
పుట్టిన కొద్దిసేపటికే, తల మధ్యలో ఉండే మృదువైన మాడు పట్టు దాటితే దానిని కాపుట్ సక్సెడేనియం అంటారు. కాన్పు సమయంలో కలిగే గాయం లేదా ప్రసవ సమయంలో ఒత్తిడి ఈ వాపుకి కారణాలు. సాధారణంగా, ప్రసవ సమయంలో బిడ్డ తల ముందుగా బయటకు వచ్చి ఉంటే, ఆ బిడ్డకు కాపుట్ సక్సెడేనియం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా తల్లులైన వారు బిడ్డ తలపై ద్రవంతో నిండిన మృదువైన వాపును గమనించవచ్చు.
వైద్యులు మాత్రమే కాకుండా తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండటం, పరిస్థితిపై అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. దీనిని గుర్తించడానికి బిడ్డను బాగా క్షుణ్ణంగా పరిశీలించటం, అంచనా వేయటం చాలా ముఖ్యం. మరింక ఏ వైద్య పరీక్షలూ అవసరం లేదు.
కాపుట్ సక్సెడేనియం ఏర్పడటానికి కారణాలు తరచుగా సాధారణ డెలివరీ సమయంలో తలకు గాయం కావటం. ఇది సాధారణంగా ప్రసవంలోని రెండవ దశ ఎక్కువ సమయం పాటు ఉండటం వల్ల, ప్రసవ సమయంలో నెట్టడం వల్ల ఆపకుండా ఏర్పడే ఒత్తిడి వల్ల కలుగుతుంది. వాక్యూమ్ కప్ సహాయం తీసుకొని డెలివరీ చేయటం, ఫోర్సెప్స్ సహాయం తీసుకొని డెలివరీ చేయటం కాపుట్ సక్సెడేనియం ఏర్పడటానికి ఇతర కారణాలు.
కాపుట్ సక్సెడేనియంకు సంబంధించిన ద్రవం మాడుపట్టు చుట్టూ పేరుకొని ఉంటుంది. మాడుపట్టు చుట్టూ కొల్లాజెన్, ద్రవ పదార్థాలు చేరడానికి అనువుగా ఖాళీ ఉంటుంది. కాపుట్ సక్సెడేనియంలోని ద్రవం తరచుగా పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది, మామూలుగా రక్తంతో నిండిన మాడు పట్టులోని ఇతర ప్రదేశాల కంటే భిన్నంగా ఉంటుంది.
ఈ ద్రవం ఉన్న భాగం గాయం అయిన భాగంపై ఆధారపడి ఉంటుంది. అది తల పైభాగంలో లేదా తలకు రెండు వైపులా ఉంటుంది.
ప్రసవం యొక్క మొదటి దశలోనే, అంటే నొప్పులు మొదలయ్యి, తీవ్ర దశలో ఉన్నప్పుడే కాపుట్ సక్సెడేనియం యొక్క లక్షణాలు కనిపిస్తాయి. ద్రవం వల్ల కలిగే వాపు మాడుపట్టు చుట్టూ ఉందో లేదో శిశువైద్యుడు గుర్తించగలగాలి.
వాపును తాకినప్పుడు, ఎత్తుగాను, మృదువుగాను, ద్రవంలా ఉన్నట్టుగాను అనిపించాలి.
గాయం, వాపు, ఎరుపు ఉందేమో చూడవచ్చు. ఈ వాపు తల పైభాగంలో మాడుపట్టు పైన లేదా దానికి రెండు వైపులా మాత్రమే గుర్తించవచ్చు.
ముఖ్యంగా తల్లులు ప్రసవంలో రెండవ దశ చాలా ఎక్కువసేపు తీసుకున్నప్పుడు, ఫోర్సెప్స్ డెలివరీ, వాక్యూమ్ డెలివరీ, సాధారణ డెలివరీ, గర్భం యొక్క చివరి దశలలో గర్భాశయంలో అమ్నియోటిక్ ద్రవం తగ్గడం, పొరలు అకాలంగా చీలడం కారణాలు కావచ్చు.
కాపుట్ సక్సెడేనియంకి చికిత్స వేచి ఉండి చూడవలసి ఉండటమే. మెజారిటీ కేసులు 24 నుండి 48 గంటల్లో వాటంతట అవే తగ్గిపోతాయి. ద్రవం తగ్గుతోందో లేదో పర్యవేక్షించడం, చెక్ చేయడం కీలకం. ద్రవం తగ్గకపోతే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
కాపుట్ సక్సెడేనియం సాధారణంగా ప్రమాదకరం కాదు, అయితే కాపుట్ సక్సెడేనియంతో సంబంధం ఉన్న ఇబ్బందులు:
1. మచ్చలు- ద్రవం ఏర్పడిన తర్వాత, చర్మం అతిగా సాగిపోతుంది, అది తగ్గిన తర్వాత గాయాలు, మచ్చలు ఏర్పడవచ్చు.
2. కామెర్లు - హైపర్-బిలిరుబినిమియా అనబడే కామెర్లు రావచ్చు. అది వచ్చిందేమో పిల్లలను పర్యవేక్షించాలి. ద్రవం తగ్గిన తర్వాత బిలిరుబిన్ తిరిగి శరీరంలోని రక్తప్రసరణలోనికి పీల్చుకోబడుతుంది.
3. హాలో స్కాల్ప్ రింగ్ అలోపేసియా- తలపైన కొంతభాగంలో వెంట్రుకలు లేకపోవడమే అలోపేసియా. మాడుపట్టుపైన ద్రవం చేరుకోవడం వల్ల, తలపై భాగంలో మీద బట్టతలలా ఏర్పడే అవకాశం ఉంటుంది.
4. పొరలు త్వరగా వీడిపోవడం: కాపుట్ సక్సెడేనియంతో ముడిపడి ఉన్న అనారోగ్యాలలో ఒకటి, నీరు త్వరగా వీడిపోవడం, ఎందుకంటే నీరు విచ్ఛిన్నం కావడం వల్ల బిడ్డకు తన చుట్టూ ఏర్పడిన మెత్తని ఆచ్చాదన పోతుంది, ఇది బిడ్డకు ఇంకా ప్రమాదం కావచ్చు.
కాపుట్ సక్సెడేనియం దానంతటదే తగ్గకపోతే, డాక్టర్ సలహా తీసుకోవాలి. కాపుట్ సక్సెడేనియం వల్ల రాబోయే కాలంలో బట్టతల, కామెర్లు, మచ్చలు, ఇన్ఫెక్షన్ కలుగవచ్చు.
బిడ్డకు ఇంకా కాపుట్ సక్సెడేనియం ఉంటే, పుర్రె (సెఫలోహెమటోమా) మీద రక్తం చేరినట్లయితే, ఇన్ఫెక్షన్, కామెర్లు వచ్చే అవకాశం ఉంటుంది.
Yes
No

Written by
Dhanlaxmi Rao
Get baby's diet chart, and growth tips











గర్భధారణ సమయంలో కంకులు(కార్న్) తినడం వల్ల కలిగే ప్రయోజనాలు & సైడ్ ఎఫెక్ట్స్

స్త్రీలలో హార్మోన్ల అసమతుల్యత అంటే ఏమిటి? దీన్ని ఎలా నయం చేయాలి?

గర్భధారణ సమయంలో పచ్ఛళ్లు | ప్రయోజనాలు & ప్రమాదాలు

సెప్సిస్: లక్షణాలు, కారణాలు, చికిత్స మరియు ప్రమాదాలు (Sepsis: Reasons, Symptoms, Treatment and Problems in Telugu)

గర్భధారణ సమయంలో ఇంటి వద్దనే శిశువు హృదయ స్పందనను ఎలా తనిఖీ చేయాలి

గర్భవతులలో బంప్ సైజు పెద్దగా లేదా చిన్నగా ఉండడం గురించి మీకు ఈ విషయాలు తెలుసా? (Everything You Need to Know About Carrying High & Carrying Low in Telugu)