


Preparing For Delivery
3 November 2023 న నవీకరించబడింది
డెలివరీకి వెళ్లే ముందు జననాంగంపై ఉండే వెంట్రుకల్ని షేవ్ చేయాలని భారతదేశంలోని చాలా ఆస్పత్రులు సూచిస్తుంటాయి. పిల్లల్ని కనబోయే తల్లులు ప్రారంభ దశ నుంచే షేవ్ చేస్తూ ఉండటం తప్పనిసరి. ప్యూబిక్ హెయిర్ అంటే జననాంగంపై ఉండే వెంట్రుకల్ని షేవ్ చేయడం వల్ల నార్మల్ డెలివరీతో పాటు సీ-సెక్షన్ సమయంలో ఉపయోగకరంగా ఉంటుంది.
ఒకవేళ డెలివరీ సమయంలో మీ జననాంగంపై ఉండే వెంట్రుకల్ని మీరు అలాగే ఉంచాలనుకుంటే ఓసారి డాక్టర్‌తో మాట్లాడాలి. వెంట్రుకలు అలాగే ఉంచడం వల్ల ఇబ్బందేమీ లేకపోయినా, క్లీన్‌గా షేవ్ చేయాలనే వైద్యులు సూచిస్తుంటారు. ఫలితంగా, డెలివరీ సమయంలో శుభ్రంగా ఉండటంతో పాటు అనుకూలంగా ఉంటుంది.
ప్రసవానికి వెళ్లే ముందు జననాంగం దగ్గర షేవ్ చేస్తే ఇన్ఫెక్షన్లు నివారించవచ్చని భావిస్తారు. ఇది కాకుండా, ప్రసవం సమయంలో ఆ ప్రక్రియ శుభ్రంగా జరగాలన్న ఆలోచనతో షేవ్ చేస్తారు. అయితే, ఇవి అభిప్రాయాలు మాత్రమే. దీనిపై ఎలాంటి పరిశోధనలు లేవు.
రెగ్యులర్ డెలివరీకి జననాంగం దగ్గర షేవ్ చేయడం అంత తప్పనిసరి కాదు. కానీ సిజేరియన్ సెక్షన్‌కు వెళ్లాలంటే మాత్రం షేవింగ్ అవసరం అవుతుంది. నిజానికి, సీ-సెక్షన్‌కు వెళ్తే కడుపు ప్రాంతం కూడా షేవ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఆస్పత్రిలోనే షేవింగ్ చేయాలనుకుంటే వైద్యులు యాంటీసెప్టిక్ షేవింగ్ క్రీమ్ ఉపయోగించమని సూచిస్తారు.
చాలా మంది తల్లులు ఆస్పత్రిలో డాక్టర్ లేదా నర్సుతో షేవింగ్ చేయించుకోవడం అసౌకర్యంగా భావిస్తారు. జననాంగంపై ఉన్న వెంట్రుకల్ని ఎలా షేవ్ చేయాలి అన్న విషయం మీకు తెలియకపోయినా, ఇబ్బందిగా ఉన్నా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పొత్తికడుపు దగ్గర రేజర్ ఉపయోగించడం మీకు భయంగా ఉంటే ఇతర మార్గాల ద్వారా ఈపని చేయొచ్చు.
తొలి డెలివరీ కోసం ఆస్పత్రిలో ఉండే తల్లులు గైనకాలజిస్ట్‌తో షేవింగ్ చేయించుకోవడాన్ని అసౌకర్యంగా భావించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో గైనకాలజిస్ట్ లేదా నర్సుతో చర్చించడం మంచి ఆలోచన. వీలైతే, మీ వైద్యులు రొటీన్‌గా కాకుండా మీ సౌలభ్యం కోసం కొన్ని మార్పులు చేయొచ్చు.
అది కాకుండా, గతంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న మీ స్నేహితులతో మీరు మాట్లాడొచ్చు. నిజానికి, మీ స్నేహితులు ఇచ్చే సలహాలు మీరు ఈ ప్రక్రియను ఎలాంటి టెన్షన్ లేకుండా చేయడానికి ఉపయోగపడతాయి. షేవింగ్ అనేది చాలా చిన్న పని మాత్రమేనని గుర్తుంచుకోండి.
కావాలనుకుంటే మీరే ముందుగా మీ జననాంగంపై ఉన్న వెంట్రుకల్ని షేవ్ చేయొచ్చు. మీ ఇంట్లోనే షేవ్ చేసుకొని, ఆ తర్వాత ఆస్పత్రికి వెళ్లొచ్చు. ఒకవేళ షేవింగ్ చేయడం కష్టంగా ఉన్నట్టైతే మీ తల్లి లేదా భర్త సాయం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఓ విషయం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. జననాంగం దగ్గర చర్మం కోసుకుపోతే ఇన్ఫెక్షన్లకు దారితీసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
మీ జననాంగ ప్రాంతం షేవ్ చేయడం లేదా ట్రిమ్ చేయడం కన్నా ముందు ఓసారి గైనకాలజిస్టుతో మాట్లాడటం మంచిది. హెయిర్ రిమూవల్ క్రీమ్ లేదా వ్యాక్సింగ్ పద్ధతి ద్వారా వెంట్రుకలు తొలగించవచ్చు. వెంట్రుకలు తొలగించే ఈ పద్ధతులు సురక్షితమైనవిగా పరిగణిస్తారు. అయినా సరే, మీరు ఆస్పత్రిలోనే ప్రతీ దశలో మెడికల్ టీమ్ పర్యవేక్షణలో మీ జననాంగ ప్రాంతం షేవ్ చేయించుకోవడం మంచిది.
ఆస్పత్రిలో డాక్టర్ లేదా నర్స్ మొదట యాంటీసెప్టిక్ ఆయింట్‌మెంట్‌తో మీ జననాంగ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేస్తారు. ఆ తర్వాత వెంట్రుకల్ని తొలగించడానికి స్టెరిలైజ్డ్ రేజర్ ఉపయోగిస్తారు. ఆ తర్వాత చర్మం కోసుకోకుండా యాంటీసెప్టిక్ జెల్ లేదా షేవింగ్ క్రీమ్ అప్లై చేస్తారు. ఇలా షేవ్ చేయడం వల్ల ఎలాంటి నొప్పి ఉండదు. అయితే జననాంగ ప్రాంతంలో వెంట్రుకలు నెమ్మదిగా పెరగడం కారణంగా కాస్త దురదగా, అసౌకర్యంగా అనిపించవచ్చు.
భారతదేశంలో చాలా ప్రాంతాల్లో జననాంగం దగ్గర ఉన్న వెంట్రుకల్ని షేవ్ చేయాలనే టాపిక్ చాలా సున్నితమైనదిగా భావిస్తుంటారు. లేబర్‌కు వెళ్లడం కన్నా ముందు నుంచే వెంట్రుకల్ని ట్రిమ్‌గా ఉంచాలని కూడా చాలామంది చెబుతుంటారు. దీనిపై మీ గైనకాలజిస్టుతో మాట్లాడి, షేవింగ్ విషయంలో ఎలా చేయాలన్నదానిపై చర్చిస్తే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా త్వరలోనే తల్లులు కాబోయేవారు, తల్లికావాలనుకునేవారు ఇది గుర్తుంచుకోవాలి.
జననాంగ ప్రాంతంలో వెంట్రుకల్ని తొలగించడానికి ప్రస్తుతం చాలా టెక్నిక్స్ ఉన్నాయి. వాటిలో షుగరింగ్, వ్యాక్సింగ్, హెయిర్ రిమూవల్ క్రీమ్స్ లాంటివి ట్రై చేయొచ్చు. ఈ హెయిర్ రిమూవల్ టెక్నిక్స్ జననాంగ ప్రాంతంలో కూడా ఉపయోగించవచ్చు. పలు రకాల ఆర్టికల్స్ చదివి అవగాహన పెంచుకుంటే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విధంగా మీరు ఆందోళన నుంచి ఉపశమనం పొందవచ్చు.
Yes
No

Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips







డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)