
స్ట్రెచ్ మార్క్స్ ఉండటం సర్వసాధారణం! దాదాపు అందరు మహిళలు గర్భధారణ సమయంలో స్ట్రెచ్ మార్క్స్ పొందుతారు. ఈ చర్మం చిట్లిన గుర్తులు హాని చేయనివి. కొ౦తమ౦ది స్త్రీలు వాటిని గౌరవానికి చిహ్నంగా భావిస్తారు. అవి తాము గర్భం ధరించడం ద్వారా తమ శరీరాలు ఎలా మారిపోయాయో సూచిస్తాయి. మరికొ౦త మ౦దికి అవి వికారంగా ఉ౦డవచ్చు. ఈ ఆర్టికల్‌లో స్ట్రెచ్ మార్క్స్‌కు కారణాలు ఏమిటి? గర్భధారణలో స్ట్రెచ్ మార్క్స్, నొప్పి, దురదను తగ్గించడానికి ఉత్తమ పద్ధతులు, అలాగే టిప్స్ ఏమిటో మీరు తెలుసుకుంటారు.
|
విషయసూచిక పట్టిక 1. స్ట్రెచ్ మార్క్స్: కనిపించడం, కారణాలు 2. ప్రెగ్నెన్సీ స్ట్రెచ్ మార్క్స్ గురించి 7 వాస్తవాలు 3. ప్రెగ్నెన్సీ స్ట్రెచ్ మార్క్స్ వల్ల కలిగే నొప్పి, దురదను ఎలా తగ్గించాలి 4. స్ట్రెచ్ మార్క్స్ ను మీరు ఎలా వదిలించుకోవచ్చు? 5. స్ట్రెచ్ మార్క్స్ లైటనింగ్ క్రీమ్ కోసం ఏ సహజ ఉత్పత్తులను చూడాలి? 6. స్ట్రెచ్ మార్క్స్ చికిత్సకు సరైన సమయం మరియు సరైన మార్గం ఏమిటి? 7. గర్భధారణ సమయంలో స్ట్రెచ్ మార్క్స్‌ని నిరోధించడానికి మరియు చికిత్స చేయడానికి ప్రయత్నించేటప్పుడు పాటించాల్సిన టాప్ 11 టిప్స్ 8. ముగింపు |
ఆకస్మిక పెరుగుదల, బరువు తగ్గడం లేదా బరువు పెరగడం సంభవించే ఏదైనా శరీర భాగంలో స్ట్రెచ్ మార్క్స్ కనిపిస్తాయి. స్ట్రెచ్ మార్క్స్ ఒక సాధారణ సమస్య. పురుషులు, మహిళలు లేదా టీనేజర్లతో సహా ఎవరైనా దీనిని ఎదుర్కోవచ్చు. గర్భధారణ సమయంలో చర్మం ఎదుగుతున్న గర్భాశయంతో సర్దుబాటు చేసుకోలేనప్పుడు మరియు అదే స్థాయిలో సాగదీతకు గురైనప్పుడు స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి. దీని వల్ల చర్మంలోని కణజాలం, కొలాజెన్ చిరిగిపోయి స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి. ఇంకా గర్భధారణ హార్మోన్లు చర్మంలోని ఫైబర్‌ను బలహీనపరుస్తాయి. ఇది స్ట్రెచ్ మార్క్స్ రావడానికి కారణమవుతుంది.
స్ట్రెచ్ మార్ప్స్ సాధారణంగా చేతులు, మొండెం, రొమ్ములు, కడుపు, పిరుదులు మరియు తొడలపై ఎరుపు, తెలుపు లేదా ఊదారంగు చారల నెట్‌వర్క్ మాదిరి కనిపిస్తాయి.

గర్భధారణ యొక్క 13 మరియు 21 వారాల మధ్య ఇవి కనిపించడం ప్రారంభిస్తాయి. ఫెయిర్ స్కిన్ ఉన్న మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అవి జన్యుపరంగా కూడా ఉండవచ్చు. అంటే మీ తల్లికి అవి ఉంటే మీకు కూడా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
స్ట్రెచ్ మార్క్స్ విభిన్న వ్యక్తులకు విభిన్నంగా ఉండవచ్చు. స్ట్రెచ్ మార్క్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని వాస్తవాలు ఇక్కడ పొందుపరిచాం.
ప్రభావం చూపించే నివారణలు మరియు ఉత్పత్తులతో గర్భధారణ సమయంలో స్ట్రెచ్ మార్క్స్ కనిపించకుండా మీరు నిరోధించవచ్చు. మయిలో స్టోర్‌లో స్ట్రెచ్ మార్క్స్ రిమూవల్ ప్రొడక్ట్‌ల యొక్క ప్రత్యేక శ్రేణి ఉంది.
స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్ అప్లై చేస్తూ ప్రభావిత ప్రాంతంలో మీరు దానిని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే సహాయపడుతుంది. మయిలో కేర్ స్ట్రెచ్ మార్క్స్ డే & నైట్ కిట్ స్ట్రెచ్ మార్క్స్ ని పోగొట్టడానికి ఒక గొప్ప ఎంపిక. ఈ ప్రత్యేకమైన శ్రేణి ఉత్పత్తులు షియా బటర్, సీ బక్‌థార్న్ ఆయిల్, ఎసెన్షియల్ బటర్ మరియు ఆయిల్స్‌తో కూడి ఉంటాయి. వీటి వల్ల పొడి చర్మం తేమగా ఉండడానికి, దురద నుండి ఉపశమనం కలగడానికి, స్ట్రెచ్ మార్క్స్ నివారించడానికి మరియు వాటిని పోగొట్టడానికి వీలవుతుంది.
ప్రెగ్నెన్సీ స్ట్రెచ్ మార్క్స్ వల్ల కలిగే నొప్పి, దురదను మీరు ఎలా తగ్గించవచ్చో చూద్దాం..

స్ట్రెచ్ మార్క్స్ హానికరం కానప్పటికీ, అలాగే నొప్పిని కలిగించనప్పటికీ.. ప్రభావిత ప్రాంతం పొడిగా మారుతుంది. గీతలు కూడా పడతాయి. మీకు సహాయపడటం కోసం స్ట్రెచ్ మార్క్స్ చుట్టూ దురద మరియు నొప్పిని నిరోధించే కొన్ని నివారణలను మేం పొందుపరిచాం:
ఓట్ మీల్ బాత్ మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అలాగే మీ చర్మం యొక్క సహజ నూనెలు పునరుద్ధరించబడేలా చేస్తుంది. అవి దురద నుండి ఉపశమనం ఇస్తాయి. మీ చర్మాన్ని మృదువుగా, హైడ్రేటెడ్‌గా మారుస్తాయి. అలాగే స్నానం చేసేటప్పుడు ఓట్ మీల్ మీ చర్మానికి పోషణను అందిస్తుంది.
ఆయుర్వేద మరియు నేచురల్ నూనెలతో ప్రభావిత ప్రాంతాన్ని మసాజ్ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. దాని చుట్టూ ఉన్న దురద పోవడానికి, పొడిబారకుండా ఉండటానికి స్ట్రెచ్ మార్క్స్‌ను మసాజ్ చేయడానికి కొబ్బరి నూనెను ఉపయోగించండి. కొబ్బరినూనె చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడానికి బాగా ప్రసిద్ధి చెందింది.
పొడిబారడం కూడా నొప్పిని ప్రేరేపిస్తుంది. కొబ్బరి నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి దురదను తగ్గించడంలో సహాయపడతాయి. మయిలో కేర్ స్ట్రెచ్ మార్క్స్ ఆయిల్ అనేది కొబ్బరి నూనె, సీ బక్‌థార్న్ ఆయిల్, అర్గన్ ఆయిల్ మరియు అనేక ఇతర పోషకాలతో సమృద్ధంగా ఉంటుంది. ఇది మీ చర్మం సాగదీయకుండా మరియు దురదకు కారణం కాకుండా నిరోధిస్తుంది.
స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్ స్ట్రెచ్ మార్క్స్ యొక్క రూపాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మీ చర్మ కణజాలాలను నయం చేయడానికి, పోషణనివ్వడానికి మరియు మరమ్మత్తు చేయడానికి కూడా సహాయపడుతుంది. స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్‌ను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మం స్థితిస్థాపకత (ఎలాస్టిసిటి)ని మెరుగుపరుస్తుంది. అలాగే చర్మం యొక్క మెరుపును ప్రమోట్ చేయడంలో సహాయపడుతుంది.
మయిలో నుంచి మీరు స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్‌ని పొందవచ్చు, ఎందుకంటే ఇది 100% సహజమైనది మరియు సమర్థవంతమైనది. ఇది శక్తివంతమైన మరియు సమర్థవంతమైన ఫార్ములాతో సుసంపన్నమై ఉంది. ఇది గర్భధారణ సమయంలో మరియు మీ బిడ్డ పుట్టిన తరువాత కూడా ఉపయోగించడానికి పూర్తిగా సురక్షితం. అయితే ఫలితాలు రావాలంటే మీరు స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్‌ని క్రమం తప్పకుండా వాడుతూ ఉండాలి!
గర్భధారణ సమయంలో, మరీ ముఖ్యంగా మీ స్ట్రెచ్ మార్క్స్‌పై మీ చర్మాన్ని శుభ్రం చేయడం కోసం తేలికపాటి మరియు సున్నితమైన క్లెన్సర్‌ని ఉపయోగించండి. కఠినమైన క్లెన్సర్ మీ స్ట్రెచ్ మార్క్స్‌ని పొడిగా చేస్తుంది. పొడిబారడం వల్ల నొప్పి మరియు దురద వస్తుంది.
స్ట్రెచ్ మార్క్స్ నుండి ఉపశమనం పొందడానికి మీరు ఏ నివారణి ప్రయత్నించినా, దానినే చేస్తూ ఉండండి. ఉత్తమ ఫలితాలను పొందడానికి, స్ట్రెచ్ మార్క్ దురద మరియు నొప్పి నుండి తొందరగా ఉపశమనం పొందడానికి సాధ్యమైనంత తరచుగా ఉపయోగించండి.
స్ట్రెచ్ మార్క్స్ అదృశ్యం కావు, కానీ సరైన సురక్షిత మరియు సహజ ఉత్పత్తి సహాయంతో కాలక్రమేణా తేలికపడతాయి. మయిలో స్టోర్‌లో ఉన్న క్రీమ్ లాంటి సమర్థవంతమైన స్ట్రెచ్ మార్క్స్ అండ్ స్కార్ లైటనింగ్ క్రీమ్ చర్మానికి పోషణను అందిస్తుంది. అలాగే నయం చేస్తుంది. మరియు రిపేర్ చేస్తుంది. దాని స్థితిస్థాపకత (ఎలాస్టిసిటి)ని మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా ఉపయోగించడం ద్వారా పొడి, దురద చర్మం నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే స్ట్రెచ్ మార్క్స్ క్రమంగా తేలికై అస్పష్టమవడం గమనించవచ్చు.
ఎఫెక్టివ్ స్ట్రెచ్ మార్క్స్ లైటనింగ్ క్రీమ్ అన్ని లేదా కొబ్బరి నూనె వంటి సహజ పదార్ధాల కలయికతో తయారవుతుంది. ఇది చర్మంపై చారల గుర్తులను క్లియర్ చేయడానికి సహాయపడుతుంది. యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉన్న షియా బటర్, ఇది చర్మ మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది. మరియు కోకుమ్ యొక్క సహజ సారం కొలాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. మరియు ఈ ప్రక్రియలో దానిని నయం చేస్తుంది. మీ చర్మం మచ్చలు, స్ట్రెచ్ మార్క్స్ మరియు దురదను ఎదుర్కోవడంలో సహాయపడటం కోసం కోకుమ్, షియా బటర్, కొబ్బరి నూనె మరియు ఇతర ముఖ్యమైన పోషకాల యొక్క సుగుణాలతో సమృద్ధమైన మయిలో స్టోర్‌లో మయిలో కేర్ స్ట్రెచ్ మార్క్స్ అండ్ స్కార్ లైటనింగ్ క్రీమ్‌ని కొనుగోలు చేయండి.

ఇతర విషయాల మాదిరిగానే, స్ట్రెచ్ మార్క్స్ కూడా జీవిత చక్రాన్ని కలిగి ఉంటాయి. అవి కనిపించడం ప్రారంభమైనప్పుడే చికిత్స చేయడం సులభం. కాబట్టి మీరు వాటిని గమనించిన వెంటనే చికిత్స చేయడం చాలా అవసరం. సాధ్యమైనంత వరకు వాటిని నివారించడానికి గర్భధారణ యొక్క 13 వ వారం నుండి స్ట్రెచ్ మార్క్స్ లైటనింగ్ క్రీమ్‌ను అప్లై చేయాలి. స్ట్రెచ్ మార్క్స్ కనిపించే ప్రాంతంపై మీ కోసం మీరు ఎంచుకున్న స్ట్రెచ్ మార్క్స్ లైటనింగ్ క్రీమ్‌ని కావాల్సినంత రోజుకు రెండుసార్లు అప్లై చేయండి. ఇది చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే ఆ గుర్తులు కనిపించకుండా నిరోధిస్తుంది.
గర్భధారణ సమయంలో స్ట్రెచ్ మార్క్స్‌ని నిరోధించడానికి, చికిత్స చేయడానికి ప్రయత్నించేటప్పుడు పాటించాల్సిన టాప్ 11 టిప్స్
ఇప్పుడు స్ట్రెచ్ మార్క్స్‌కు ఎలా మరియు ఎప్పుడు చికిత్స చేయాలో మీకు తెలిసినప్పుడు, స్ట్రెచ్ మార్క్స్‌ని నివారించడం మరియు చికిత్స చేయడంలో సహాయపడటానికి గర్భధారణ సమయంలో ఫాలో అవ్వాల్సిన ఈ 11 టిప్స్‌ని నోట్ చేసుకోండి:
1. గర్భధారణ సమయంలో స్ట్రెచ్ మార్క్స్ నివారించడంలో సహాయపడటం కోసం ప్రతిరోజూ మయిలో కేర్ స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్ అప్లై చేయండి. దీనిలో షియా బటర్, కుంకుమపువ్వు, కొబ్బరి నూనె, కోకుమ్ ఉన్నాయి. ఇవి చర్మానికి పోషణ అందించడం, నయం చేయడం, మరమ్మత్తు చేయడం చేస్తాయి. స్ట్రెచ్ మార్క్స్‌ని తగ్గించడానికి సహాయపడతాయి.
2. ధన్వంతరం ఆయిల్ మసాజ్ కూడా స్ట్రెచ్ మార్క్స్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది నువ్వులు, చందనం, ఉసిరికాయ, ఆవు పాలు మరియు అశ్వగంధను కలిగి ఉంటుంది. ఇవి మీ చర్మానికి సురక్షితమైనవి మరియు అద్భుతమైనవి.
3. అలోవెరా జెల్‌ని క్రమం తప్పకుండా అప్లై చేయడం.. మీ శరీరంలోని ప్రభావిత ప్రాంతాన్ని ఉపశమనం చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే స్ట్రెచ్ మార్క్స్‌కు పోషణ అందించడంలో, పొడిబారడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
4. స్ట్రెచ్ మార్క్స్ రూపాన్ని తగ్గించడానికి విటమిన్ సి అధికంగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తినండి.
5. చక్కెర మరియు నిమ్మరసం స్క్రబ్ కూడా స్ట్రెచ్ మార్క్స్‌ను తగ్గిస్తాయి. అలాగే మీ చర్మాన్ని సమం చేస్తాయి.
6. గర్భధారణ సమయంలో హైడ్రేటెడ్‌గా ఉండటం అనేది మీ చర్మం ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడంలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.
7. మీ బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల గర్భధారణ సమయంలో మీరు స్ట్రెచ్ మార్క్స్‌ని పొందకుండా చూసుకుంటారు.
8. సహజ పదార్థాలతో తయారు చేసిన సున్నితమైన మరియు తేలికపాటి మాయిశ్చరైజర్‌తో ప్రతిరోజూ మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయండి.
9. స్ట్రెచ్ మార్క్స్ రూపాన్ని తేలికపరచడానికి ప్రభావిత ప్రాంతంలో కాఫీ స్క్రబ్ ఉపయోగించండి.
10. జింక్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోండి. ఎందుకంటే అవి చర్మం హీల్ అవడాన్ని పెంచుతాయి. అలాగే మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
11. బంగాళాదుంప రసాన్ని అప్లై చేయడం వల్ల గర్భధారణ సమయంలో చర్మంపై మార్క్స్ మరియు మచ్చలను తేలికపరచవచ్చు.
గర్భధారణ సమయంలో స్ట్రెచ్ మార్క్స్ సాధారణం. మీరు వాటిని సులభంగా వదిలించుకోవచ్చు. ఈ నివారణలను క్రమం తప్పకుండా అనుసరిస్తే మీరు స్ట్రెచ్ మార్క్స్‌కి గుడ్ బై చెప్పవచ్చు.
అన్ని రకాల స్ట్రెచ్ మార్క్స్ రిమూవల్ క్రీమ్‌లు, ఆయిల్స్, బటర్ మరియు కాంబోల కొరకు మయిలో స్టోర్‌లో చూడండి.
Tags:
What are stretch marks in telugu, stretch marks cream in telugu, Treatment for stretch marks in telugu, Stretchmarks during pregnancy in telugu, Get rid off stretch marks in telugu, Pregnancy stretch marks in telugu.
Yes
No


















Influenza and boostrix injection kisiko laga hai kya 8 month pregnancy me and q lagta hai ye plz reply me
Hai.... My last period was in feb 24. I tested in 40 th day morning 3:30 .. That is faint line .. I conculed mylo thz app also.... And I asked tha dr wait for 3 to 5 days ... Im also waiting ... Then I test today 4:15 test is sooooo faint ... And I feel in ma body no pregnancy symptoms. What can I do .
Baby kicks KB Marta hai Plz tell mi
PCOD kya hota hai
How to detect pcos
Your body needs extra nutrition this trimester - these can help.





This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |