
పెరుగు లేదా యోగర్ట్ అని పిలవబడే పెరుగు, భారతీయ వంటకాలలో వాడే ఒక సాధారణ పాల పదార్ధం. చర్మరక్షణకు లేదా సంపూర్ణ శారీరక ఆరోగ్యం కోసం, పాలు పులియబెట్టడంతో తయారయ్యే పెరుగుతో పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చల్లనిపెరుగు లేదా చల్ల తాగడం వల్ల, అది శరీర వేడిని చల్లబరుస్తుంది ఇంకా ముఖ్యంగా వేసవిలో చల్లదనాన్ని ఇచ్చేదిగా ఇది ఎంతో ప్రసిద్ధి చెందింది.
పాలు ఆరోగ్యానికి మేలు చేస్తుంది మరియు పాలు ప్రోటీన్ ఇంకా కాల్షియం అందించే అద్భుతమైన వనరు. ఈ పాలను పులియబెట్టడం(తోడుపెట్టడం) ద్వారా పెరుగుగా మారినపుడు కూడా ఇది అధిక పోషక విలువలను కలిగి ఉంటుంది. పాలలో లాక్టోస్ ఉండటం వల్ల, పాలు తాగినపుడు అజీర్ణం ఏర్పడవచ్చు. అయితే, పెరుగును పాలతో తయారు చేసినప్పటికీ, పాలను పెరుగుగా మార్చే కిణ్వ ప్రక్రియలో పాలలోని లాక్టోస్ చాలా వరకు విచ్ఛిన్నం అవుతుంది, తద్వారా జీర్ణక్రియకి ఇది సహాయపడుతుంది. ఇది ప్రేగు కదలికలను కూడా నియంత్రిస్తుంది- పెరుగు తీసుకోవడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది ఇంకా విరేచనాలను కొంతవరకు నియంత్రిస్తుంది.
పెరుగులో లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా ఉండటం వల్ల యోనిలో ఈస్ట్ ఇన్ఫెక్షన్ పెరుగుదలను అది నిరోధిస్తుంది. ఇది వ్యాధిని కలిగించే సూక్ష్మక్రిములను నాశనం చేస్తుంది ఇంకా రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. పెరుగులో సంతృప్త మరియు ట్రాన్స్ ఫ్యాట్స్(చెడు క్రొవ్వులు) లేకపోవడం మరియు పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఇంకా సోడియంలు అంధికంగా ఉండడం వల్ల ఇది గర్భవతుల ఆహారంలో చేర్చడానికి అనువైనది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో నెయ్యి మంచిదేనా?
గర్భధారణ సమయంలో పెరుగు తినడం వల్ల జీర్ణశక్తి, రోగనిరోధక శక్తి మెరుగుపడటమే కాకుండా, శరీర వేడికి ఉపశమనంతో పాటు రక్తపోటు సమతుల్యతను కాపాడటం వంటి ప్రయోజనాలు కలుగుతాయి. పెరుగు ప్రేగుల ఆరోగ్యానికి మంచి చేస్తుంది ఇంకా లాక్టోస్ పడనివారికి ఇది ఉత్తమమైనది. గర్భధారణ సమయంలో జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉంచుకొంటే, అది ఆవశ్యకమైన పోషకాలను గ్రహించగలుగుతుంది. ఈ సమయంలో, శరీరం వేడి చేస్తుంది, అప్పుడు పెరుగును కూరగాయలు లేదా పండ్లతో కలిపి రోజూ తీసుకోవడం వల్ల వేడి నుండి ఉపశమనం దొరుకుతుంది. గర్భధారణ సమయంలో, మలబద్ధకం ఒక ప్రధాన సమస్య అని అంటూ ఉంటారు. పెరుగులోని ప్రోబయోటిక్ గుణం వల్ల, అది ప్రేగు కదలికలను సాఫీగా జరిగేలా చేస్తుంది, ఇంకా తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. గర్భిణీ స్త్రీలు సాధారణంగా తీపి ఇంకా కారంగా ఉండే పదార్థాలను తినాలనే కోరికలను కలిగి ఉంటారు, అయితే వాటితో పాటు పెరుగును తీసుకోవడం వల్ల అధిక మసాలాలు ఉన్న చిరుతిండ్ల వల్ల వచ్చే గుండెల్లో మంటను అది తగ్గిస్తుంది. ఒక గ్లాసు స్మూతీ లేదా తీపి పెరుగుతో కలిపిన పండ్ల గిన్నెతో, వారి తీపి తినాలనే కోరికలను కూడా తీర్చుకోవచ్చు.
పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది, గర్భధారణ సమయంలో పెరుగు తీసుకొంటే, అది స్త్రీల ఎముకల ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుతుంది. అంతేకాక, ప్రసవం తర్వాత అలా ఆరోగ్యంగా ఉండటం ఎంతో అవసరం. పెరుగు తీసుకోవడం వల్ల శిశువు ఎముకలు ఇంకా దంతాలు కూడా బలపడతాయి. గర్భధారణ సమయంలో పెరుగు తీసుకోవడం వల్ల అది శరీరంలో ఇంకా చర్మంలో తెమను నిలిపి ఉంచుతుంది, తద్వారా గర్భధారణ సమయంలో పొడి బారిన చర్మం చికాకు నుండి తప్పించుకోవచ్చు. గర్భధారణ సమయంలో పెరిగే రక్తపోటు వల్ల తల్లీ బిడ్డలిద్దరికీ ప్రమాదం. గర్భధారణ సమయంలో పెరుగు తినడం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది, దీని ఫలితంగా ప్రసవం సురక్షితంగా జరుగుతుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో అజీర్ణానికి గల 5 కారణాలు
గర్భధారణలో పెరుగు తినడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. పాశ్చరైజ్డ్ పాలతో పెరుగు చేసుకున్నంత కాలం అది సురక్షితమే. అయితే, మధుమేహం ఉన్నవారు తియ్యని పెరుగును తరచుగా తీసుకోవడం వల్ల సమస్యలు రావచ్చు. ఇంకా చెప్పాలంటే, పెరుగుతో పాటుగా కొన్ని ఆహారపదార్థాలను కూడా తినకుండా జాగ్రత్త వహించాలి; అవి పాలు, చేపలు లేదా ఆమ్లాలున్న పండ్లు లాంటివి తిన్నప్పుడు, అవి కడుపు నొప్పిని కలిగిస్తాయి. ఈ విషయంలో ఏవైనా సందేహాలుంటే, వైద్యుడిని సంప్రదించాలి. గర్భధారణ సమయంలో పగటి వేళల్లో పెరుగు తీసుకోవడం ఉత్తమం.
సాధారణ పాశ్చరైజ్డ్ చేసిన గ్రీకు పెరుగు(మామూలు పెరుగులో కన్నా తక్కువ తీపి ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి) ఉత్తమమైనది, ఎందుకంటే దీనిని వడకట్టడం వలన ఇది తక్కువ లాక్టోస్ సారాన్ని కలిగి ఉంటుంది. తియ్యని గ్రీక్ పెరుగులో గ్లూకోజ్ సారం ఉండదు ఇంకా గర్భధారణలో కనిపించే మధుమేహం ఉన్న గర్భవతులకు ఇది సురక్షితమైనది. సహజంగా తియ్యనైన ఫ్రూట్ యోగర్ట్ వంటి పెరుగు కూడా గర్భధారణ సమయంలో తినడం సురక్షితం.
గర్భధారణ సమయంలో పెరుగు తినేటప్పుడు తీసుకోవలసిన ఏకైక ముందు జాగ్రత్త ఏమిటంటే, పెరుగు పచ్చి పాల నుండి కాకుండా పాశ్చరైజ్డ్ పాలను తోడు బెట్టడం ద్వారా తయారు చేయబడిందని తెలుసుకోవడం. ఎక్స్‌పైరీ డేట్‌తోపాటు చక్కెర శాతాన్ని కూడా తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి.
తల్లి ఏమి తింటుందో, అది బిడ్డకు అందుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ గర్భధారణ సమయంలో తల్లి పెరుగు తింటే, పుట్టబోయే బిడ్డ మంచి రంగుతో ఉంటుందనే భావన నిజం కాదు. ప్రతిరోజూ పెరుగు తీసుకొంటే, అది చర్మ నాణ్యతను మెరుగుపరుస్తుంది, ఇది చర్మాన్ని తేమగా ఇంకా మృదువుగా చేస్తుంది. పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యకరంగా ఉంటే, అది చర్మంపై ప్రతిబింబిస్తుంది.
అనేక మంచి యోగర్ట్ స్మూతీలు, శీతల పరచిన బెర్రీలు ఇంకా గింజలతో తయారు చేయబడతాయి మరియు అవి మృదుత్వం నచ్చేవారికి ఇష్టమైనవి. జీర్ణక్రియ ఇంకా ప్రేగు కదలికలకు సహాయపడే చక్కని స్మూతీని చేయడానికి బాగా పండిన పండ్లను ఉపయోగించాలి. కొన్ని పప్పులను(బాదం, జీడిపప్పు లాంటివి) లేదా గింజలను చేర్చడం వల్ల అది అద్భుతంగా ఉండటమే కాక ఆరోగ్యకరమైనది కూడా అవుతుంది. ఆరోగ్యకరమైన పెరుగు స్మూతీ కోసం ఒక చవులూరించే విధానం ఈ క్రింద ఇవ్వబడింది;
కావలసినవి:
పండిన ,ఫ్రొజెన్ అరటిపండ్లు - కొన్ని
పండిన , శీతలపరచిన ఆపిల్ పండ్లు - కొన్ని
వెనీలా ఎసెన్స్ - 1 టీస్పూన్
మీకు నచ్చిన పప్పులు(బాదం, జీడిపప్పు లాంటివి) లేదా విత్తనాలు - 1 టేబుల్ స్పూన్
ఐస్ క్యూబులు - 2-3
తియ్యని పెరుగు - 1 కప్పు
పద్ధతి:
బ్లెండర్‌లో శీతలపరచిన పండ్లు ఇంకా ఐస్ క్యూబులు మరియు వెనీలా ఎసెన్స్ వేసి బాగా బ్లెండ్ చేయాలి. దీనిని పెరుగులో పోసి, అవసరమైతే మరోసారి బ్లెండ్ చేయాలి. అవసరమైతే, ఒక టీస్పూన్ చక్కెరను చేర్చుకోవాలి. సర్వింగ్ గ్లాస్‌లో పోయాలి. పప్పులు(బాదం, జీడిపప్పు లాంటివి) పొడిగా చేసి స్మూతీపై పైన పరచాలి. అన్నింటినీ బాగా కలిపి ఆనందంగా ఆ రుచిని ఆస్వాదించాలి.
References
1. He A, Chin J, Lomiguen CM. (2020). Benefits of Probiotic Yogurt Consumption on Maternal Health and Pregnancy Outcomes: A Systematic Review. Cureus.
2. Kriss JL, Ramakrishnan U, Beauregard JL, Phadke VK, Stein AD, Rivera JA, Omer SB. (2018). Yogurt consumption during pregnancy and preterm delivery in Mexican women: A prospective analysis of interaction with maternal overweight status. Matern Child Nutr.
Curd During Pregnancy in Telugu, What is nurtitional value of curd in Telugu, Can I eat Curd During Pregnancy in Telugu, What are benefits of eating Curd During Pregnancy in Telugu, What are the side-effects of eating Curd During Pregnancy in Telugu, Curd During Pregnancy in English, Curd During Pregnancy in Hindi, Curd During Pregnancy in Tamil, Curd During Pregnancy in Bengali
Yes
No

















Naku eppudu 7 months baby moments teliyadam ledhu...
Hi I'm 34 weeks 3 days pregnant repu 9th month start avtadi naku eroju mrng milky white discharge iendi problem em undadu kada
Hii all Naku ee month(april19) delivary date echinchindi bt Naku pottalo right side pain vastundi nyt nundi akkuvaga m aina pblm sis chepara konchem urgent plz
Hii 34 weeks how many months
Naku eppudu 4th month raw rice thinalanye vude no problem or problem please tell me
Your body needs extra nutrition this trimester - these can help.





This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |